1948 నాటి పోలీస్ యాక్షన్
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Thursday, 28 September 2023
1948 Police Action - Afsar Book intro
ఇండో-అమెరికన్ రచయిత అఫ్సర్
ముహమ్మద్ 1948 నాటి పోలీస్ యాక్షన్ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను
నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దంపాటు విస్తృత
పరిశోధనలు చేసి ఇప్పుడు “Remaking History -1948 Police Action and the muslims of
Hyderabad” శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్ ను ప్రచురించాడు.
సెప్టెంబరు 26 రాత్రి
హైదరాబాద్ లా మకాన్ లో జూమ్ మీటింగ్ ద్వార ఈ పుస్తక పరిచయ సభ జరిగింది. ఈ పుస్తకం
రాయాల్సిన అవసరాన్నీ, తన అనుభవాల్నీ రచయిత చాలా ఉద్వేగంగా వివరించాడు.
రెండు తరాల ముందు
నుండే వాళ్లది ఖమ్మం జిల్లాలో సాంప్రదాయ ముస్లిం ప్లస్ కమ్యూనిస్టు కుటుంబం. తనకు
నాణేనికి రెండు పక్కలా తెలుసు. ఇప్పుడైతే తను తెలుగు కవిగా, కథకునిగా
ప్రముఖుడయ్యాడుగానీ, పర్షియన్ భాషా వాతావరణంలో పుట్టి పెరుగుతున్న పిల్లోడు తెలుగు
నేర్చుకోవడానికి పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను వివరిస్తుంటే ప్రేక్షకుల్లో కొందరి
కళ్ళైనా చెమర్చి వుంటాయి. (నాది కూడ సేమ్ టు సేమ్ స్టోరీ. నన్నెందుకో మానాన్న
చినబాల శిక్ష నేర్పమని అగ్నిహోత్రావధాన్లు అనే ఒక కఠోర మాస్టారి దగ్గర పడేశారు.
నోటితోకన్నా పేక బెత్తంతో నేర్పితేనే తెలుగు బాగా వస్తుందని వారు గాఠిగా నమ్మేవారు).
2002 గుజరాత్ అల్లర్ల
తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో
వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్ యాక్షన్
బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి
సిధ్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంధం. అతని పుస్తకం ఇంకా ఇండియాకు రాలేదు.
అంచేత ఇది పుస్తక సమీక్ష కాదు; రచయిత జూమ్ ప్రసంగం సందర్భంగా నాలో చెలరేగిన భావాలు మాత్రమే.
డానీ
సమాజవిశ్లేషకులు, సీనియర్
జర్నలిస్టు
1948 Police Action - 1948 పోలీస్ యాక్షన్ - మరోకోణం!
మిత్రమా!
ఈ వ్యాసాన్ని ఇప్పుడే రాశాను.
దీనిని మరెక్కడా ప్రచురించలేదు
సాక్షి ఎడిట్ పేజీలో ప్రచురణకు
పరిశీలించ గలరు.
సౌలభ్యం కోసం మూడు టైటిల్ ఆప్షన్స్
ఇచ్చాను.
అవసరాన్నిబట్టి టైటిల్ ను, ఆర్టీకల్
సైజును మార్చుకునే స్వేఛ్ఛ మీకు ఎలాగూ వుంటుంది.
ప్రచురణకు ఎన్నిక కాకుంటే వెంటనే తెలుప
గలరు.
వేరే పత్రిక్కి పంపుకుంటాను.
- డానీ
తెలంగాణ
రైతాంగ సాయుధపోరాటానికి మరోకోణం!
తెలంగాణ
మీద పోలీస్ యాక్షన్ కు మరోకోణం !
1948 పోలీస్ యాక్షన్ - మరోకోణం!
తెలంగాణ సాయుధ రైతాంగ
పోరాటం, అది సృష్టించిన సాహిత్యం మన రాజకీయాల్లో, సాహిత్యంలో చివరకు మన జీవితాల్లోనూ
విడదీయరాని భాగం. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు రెండు తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో
ఒక్క ప్రతినిధి కూడ లేడు. అయినప్పటికీ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వామపక్ష
భావజాలమే ఇప్పటికీ చాలా బలంగా వుంది. తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం ‘సామ్యవాద వాస్తవికత’ ప్రభావంలోనే వుందటే అతిశయోక్తికాదు.
భాషా ప్రయుక్త
రాష్ట్రాల విధానం వచ్చాక 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి
ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారు. నిజాం సంస్థానం చాలా పెద్దది. అందులోని ఐదు ప్రధాన
ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలోని నల్గొండ, వరంగల్ రెండు జిల్లాల్లో
ప్రధానంగానూ, మరో ఒకటి రెండు జిల్లాల్లో స్వల్పంగానూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం
సాగింది. ఆనాటి చారిత్రక సంఘటనల మీద తమ అనుభవాలను గ్రంధస్తం చేసిన ఆ పోరాట
అగ్రనాయకులు అందరూ తెలంగాణకు పరిమితమయ్యారు. తమ పుస్తకాలకు నిజాయితీగా ‘తెలంగాణ’
అనే శీర్షికలే పెట్టారు. మిగిలిన నిజాం సంస్థానాన్ని వదిలేశారు. దానికి రెండు
కారణాలు మొదటిది; ఉర్దూ భాషా సమస్య, రెండోది; ముస్లిం మత సమస్య.
తెలంగాణేతర నిజాం
సంస్థానంలోనేకాక, కమ్యూనిస్టుల ప్రభావం లేని తెలంగాణ జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో
ప్రజాస్వామికవాదులు, భారత జాతీయవాదులు, కమ్యూనిస్టులు వున్నారు. వీరిలో ముస్లింలు
కూడ పెద్ద సంఖ్యలో వున్నారు. వీరి గురించి
బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు.
నిజాం పాలన గురించి
మనకు, ముఖ్యంగా, తెలుగు పాఠకులకు తెలిసింది చాలా తక్కువ. నిజాం సంస్థానంలో
పెట్టుబడీదారీ అభివృధ్ధి గురించి పరిశోధనలు చేసిన ప్రొఫెషనల్స్ కొందరు లేకపోలేదు.
వారిలో ఒకడైన సివి సుబ్బారావు నాకు మంచి మిత్రుడు. ఆ రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ వాగ్దానం
చేస్తుండిన ఇండియాకన్నా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోని నిజాం సంస్థానంలో కొనసాగుతున్న
అభివృధ్ధి మెరుగ్గా వుందనే నిర్ధారణకు వచ్చాడు తను.
ఇంతకీ తెలంగాణ సాయుధ
పోరాటం ద్వార భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమీటీ? వాదన కోసం; నిజాం రాచరిక
పాలననో, జాగీర్దార్ల భూస్వామ్యాన్నో వాళ్ళు అంతం చేసేశారు అనుకుందాము. భూస్వామ్య వ్యవస్థను అంతం చేశాక పెట్టుబడీదారీ
వ్యవస్థ ఏర్పడుతుందని సాక్షాత్తు ‘కమ్యూనిస్టు
పార్టి ప్రణాళిక’లో కార్ల్ మార్క్స్ – ఫ్రెడరిక్ ఏంగిల్స్ చెప్పారు.
పెట్టుబడీదారీ వ్యవస్థ
ఆవిర్భవించి, అందులో పారిశ్రామిక ఉత్పత్తి సంపూర్ణ, గరిష్ట స్థాయిలకు పెరిగి,
ఒకవైపు; సమస్త సంపదను హస్తగతం చేసుకున్న పెట్టుబడీదారులు, మరోవైపు; ఎలాంటి సంపదాలేని
శ్రామికులుగా సమాజం బరి గీసి విడిపోయినప్పుడు ఆ (పెట్టుబడీదారీ) వ్యవస్థను
కూల్చితే సమసమాజ స్థాపన సాధ్యం అవుతుందని వాళ్ళు చెప్పారు. ‘ప్రణాళిక’లో ఇది కీలక
అంశం మాత్రమేకాదు అదే దాని ప్రాణం. భూస్వామ్య
వ్యవస్థను కూల్చేస్తే సమసమాజం వస్తుందనో, కమ్యూనిస్టు రాజ్యం వస్తుందనో, కనీసం “రైతు-కూలీ
రాజ్యం” వస్తుందనో వాళ్ళెక్కడా చెప్పలేదు.
తెలంగాణలో కమ్యూనిస్టు
పార్టి రాచరిక – భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన తరువాత అక్కడ అత్యంత సహజంగానే
పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృధ్ధి చెందడాన్ని మనందరం చూస్తున్నాం. మరోమాటల్లో
చెప్పాలంటే; తెలంగాణలో పెట్టుబడీదారీ వ్యవస్థ పుట్టి పెరగడానికి కమ్యూనిస్టు పార్టీలు తమ వంతు శ్రమదానం,
ప్రాణదానం కూడ చేశాయి!!. ఓ 35 యేళ్ళ తరువాతి కాలంలో కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం
జిల్లాల్లో నక్సలైట్ పార్టీలు చేసిందీ అదే; భూస్వాముల్ని పెట్టుబడీదారులుగా
మార్చడం!!.
1940ల చివర్లో ఉమ్మడి
కమ్యూనిస్టు పార్టీగానీ, 1980ల మొదట్లో నక్సలైట్ పార్టీలుగానీ వుద్దేశ్యపూర్వకంగా ప్రణాళిక
బధ్ధంగా పెట్టుబడీదారీ వ్యవస్థను పెంచిపోషించాయని చెప్పడం సరికాదు. సమాజానికి తనదైన
ఒక రోడ్ మ్యాప్ వుంటుంది. ఒకరు అనుకున్నా అనుకోకపోయినా అదలా సాగిపోతుందంతే. అయితే,
ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించినవాళ్ళకు ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ సరిగ్గా అర్ధం
కాలేదని మాత్రం చెప్పవచ్చు. పెట్టుబడీదారీ వ్యవస్థ పరిపక్వం కాకముందే, పారిశ్రామిక
ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరక ముందే జరిపే సోషలిస్టు విప్లవాలు నిలదొక్కుకోలేవని
రష్యా, చైనా అనుభవాలు చెపుతున్నాయి.
ఛత్తీస్ గడ్ లోని దంతేవాడ,
బీజాపూర్, నారాయణ్ పూర్ జిల్లాల పరిధిలోని కొండలు-అడవులతో అబుజ్ మడ్ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసులతో తామొక ‘నమూనా సామ్యవాద
సమాజం’ను స్థాపించినట్టు కొన్ని కమ్యూనిస్టు పార్టీలు చెపుతుంటాయి. కొండలు, ఆడవులు
సమిష్టి సంపదగావుండే ఆదివాసి తెగల్లో ఆర్ధిక సామాజిక సమానత్వం (ఆర్గానిక్ సోషలిజం)
సహజంగానే వుంటుంది. 4 వేల సంవత్సరాల క్రితమే ‘ఆదిమ కమ్యూనిస్టు సమాజం’ వుండిందని
మార్క్స్ – ఏంగిల్స్ కూడా చెప్పివున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లోని కొండలు అడవుల్లో నివశించే సమూహాల్లో ‘సహజ సామ్యవాద
సమాజం’ను ఇప్పటికీ చూడవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తి గరిష్టస్థాయిలో పెరగనిచోట సోషలిస్టు
రాజ్యాన్ని సాధించామని ఎవరయినా చెపితే వాళ్లకు చారిత్రక భౌతికవాదం బొత్తిగా
తెలీదని అర్ధం.
ఒక కఠోర చారిత్రక
వాస్తవం ఏమంటే ప్రపంచంలో ఇప్పటి వరకు పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృధ్ది చెందిన ఏ
దేశంలోనూ సోషలిస్టు విప్లవం విజయవంతం కాలేదు. భారత కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం
వహించినవారు భూస్వాములకన్నా తెలివైనవారేతప్ప పెట్టుబడీదార్లుల్ని ఎదుర్కోలేరు. పెట్టుబడీదారీ
వ్యవస్థల్లో సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేయగల సిధ్ధాంత బలం, వ్యూహాలు,
ఎత్తుగడలు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ వ్యవస్థ, ప్రజల మద్దతు మన దేశంలో ఏ
కమ్యూనిస్టు పార్టీకీ లేదు. వాటికున్న బలాలు మూడు; పాలక పార్టీల విధానాల మీద పటిష్టమైన
విమర్శను ప్రకటించగలవు; పెద్ద ఎత్తున ప్రచారాందోళనను సాగించగలవు; ‘సామ్యవాద వాస్తవికత’ వాదంతో విస్తృతంగా సాహిత్యాన్ని సృష్టించగలవు.
1948 నాటి పోలీస్
యాక్షన్ తమ కోసమే జరిగిందనీ, అందులో దాదాపు 3 వేలమంది కమ్యూనిస్టు కార్యకర్తలు
చనిపోయారని కమ్యూనిస్టు పార్టీల నాయకులు తరచూ చెపుతుంటారు. అది నిజం కూడ. అందులో ఏమాత్రం
అతిశయోక్తి లేదు. ఆ చనిపోయిన వారిలో ముస్లిం-కమ్యూనిస్టులు కూడా వున్నారని విడిగా
చెప్పాల్సిన పనిలేదు.
కమ్యూనిస్టు నాయకులు చెప్పని
ఇంకో పెద్ద నిజం కూడా వుంది. జే.ఎన్.
చౌధరి నాయకత్వంలోని ‘పోలీసు యాక్షన్’ కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలకు
చేరుకోవడానికి ముందే నిజాం సంస్థానంలో 3 వేలకు ఓ పది రెట్లకు పైగా ముస్లింలను అతి క్రూరంగా చంపేశారు. వాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు, వాళ్ల
ఆడవాళ్లను ----- చేశారు. దీనిపైన నెహ్రు వేసిన సుందర్ లాల్ బహుగుణ కమిటి
మాత్రమేకాక, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టికి అప్పటి పార్లమెంటరీ రాజకీయాల
వేదికగావున్న పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్
(పిడిఎఫ్) నాయకులు కూడ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు. సుందర్ లాల్ బహుగుణ నివేదికను జాతీయభద్రత
కారణంగా చాలాకాలం దాచిపెట్టారుగానీ ఇప్పుడు అది అందుబాటులో వుంది.
సుందర్ లాల్ బహుగుణ
నివేదిక బయటికి రాకపోయినా ఆ జాతిహననాన్ని అనుభవించినవారు దాన్నెలా మరచిపోతారూ? అవి
వాళ్ల జ్ఞాపకాల్లో పీడకలలుగా కొనసాగుతూనే వుంటాయి. 1984 ఢిల్లీ అల్లర్లు 1992లో
బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత భారతీయ సాహిత్యంలో అత్యంత సహజంగానే, ఒక చారిత్రక
అవసరంగానే మైనారిటివాదం అనే ఒక కొత్త ధోరణి ఆరంభమయింది. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత ఇది వేగాన్ని పుంజుకుంది.
2014 తరువాత దీనికి ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు మణిపూర్ అల్లర్ల తరువాత దీని
ఆవశ్యకత మరీ పెరిగింది. మైనారిటీవాదాన్ని కొందరు అతిఉత్సాహంగా ‘ముస్లివాదం’,
‘ఇస్లాంవాదం’ అంటున్నారుగానీ అవి తెలిసో తెలియకో ‘హిందూవాదం’కు ఆమోదాంశాన్ని
కలిగిస్తాయి.
ఇండో-అమెరికన్ రచయిత అఫ్సర్
ముహమ్మద్ 1948 నాటి పోలీస్ యాక్షన్ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను
నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దంపాటు విస్తృత
పరిశోధనలు చేసి ఇప్పుడు “Remaking History -1948 Police Action and the muslims of
Hyderabad” శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్ ను ప్రచురించాడు.
సెప్టెంబరు 26 రాత్రి
హైదరాబాద్ లా మకాన్ లో జూమ్ మీటింగ్ ద్వార ఈ పుస్తక పరిచయ సభ జరిగింది. ఈ పుస్తకం
రాయాల్సిన అవసరాన్నీ, తన అనుభవాల్నీ రచయిత చాలా ఉద్వేగంగా వివరించాడు.
2002 గుజరాత్ అల్లర్ల
తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో
వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్ యాక్షన్
బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి
సిధ్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంధం. అతని పుస్తకం ఇంకా ఇండియాకు రాలేదు.
మనలో దాదాపు అందరికీ
ఒక సెలెక్టివ్ ఆసక్తి వుంటుంది. మనకు కనిపించేదే, మనకు చెందినదే, మనకు ఇష్టమైనదే
ప్రపంచం అనుకుంటాము. ప్రపంచం అనేది చాలా పెద్దది. అందులో మనకు తెలిసింది చాలా
తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ అనే స్పృహ చాలామందికి వుండదు. ప్రపంచం మొత్తం
తెలియకపోయినా మనదేశం గురించి, మన రాష్ట్రం గురించయినా తెలియాలి. హీనపక్షం మనతో
వందల సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సమూహాల మనోభావాలనైనా తెలుసుకోవాలిగా.
దానికి ఈ పుస్తకం
తోడ్పడుతుందని ఆశిస్తాను.
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
9010757776
Tuesday, 26 September 2023
Nenu Nenenaa? - Danny Story
నేను
నేనేనా?!
ఉషా
ఎస్ డానీ
రాత్రి పార్టిలో ఇద్దరమ్మాయిలు పరిచయం అయ్యారు.
మొదటమ్మాయి పేరు రేష్మి; న్యూరో సర్జన్.
రెండో అమ్మాయి పేరు ఈషా; ఏదో ఇంగ్లీషు న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తోంది. జ్యోతిష్యం ఆమె హాబీ.
మంచి కాంబినేషన్. లోకంలో డాక్టర్లు
జ్యోతిష్కులుగా ప్రవర్తిస్తుంటారు. జ్యోతిష్కులు డాక్టర్లుగా ప్రవ్ర్తిస్తుంటారు.
లోకంలో ప్రతి వృత్తిలోనూ ఓ జబ్బు వుంటుంది. జర్నలిస్టులకూ ఓ జబ్బు వుంటుంది. రాకెట్ సైంటిస్టు ఎదురైనాసరే ఆ సైన్సు తమకు తెలుసు అన్నట్టు ఓ ప్రశ్న వేసేస్తుంటారు. తాము ఏదో ఒకటి అడిగేస్తే వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తే తాము ఏదో ఒకటి రాసేస్తే ఆ రోజుకు ఎక్స్ క్లూసివ్ స్టోరీ అయిపోతుందని వాళ్ళ నమ్మకం.
సోల్జర్స్ అండ్ జర్నలిస్ట్స్ నెవ్వర్ రిటైర్ అనే సామెత ఒకటుంది. నేను రిటైర్ అయిపోయినా నాలో జర్నలిస్టు రిటైర్మెంట్ తీసుకోలేదు.
“బయో కెమిస్ట్రీకీ న్యూరో సర్జరీకీ సంబంధం వుందంటారా?” అంటూ ఓ దిక్కుమాలిన ప్రశ్న సంధించాను.
దేనినయినా దేనితో అయినా సంబంధాన్ని అంటగట్టేయడం జర్నలిస్టుల వృత్తి ధర్మము. మందు పార్టీలో వున్నా జర్నలిస్టు జర్నలిస్టేగా.
రేష్మీ గొంతు పెంచి ‘యస్” అంది.
ఆమె అక్కడితో ఆగలేదు. ఏకంగా నన్ను ‘గినీ పిగ్’గా మార్చేసి నామీద ఒక అనాలిసిస్ ప్రెజెంట్ చేసేసింది.
లాబ్ లో ప్రయోగాలకు గిన్నీ పిగ్ అంటే మా మనోభావాలు దెబ్బతింటాయి. సుబ్బరంగా గిన్నీ ఫిష్ అనుకోవచ్చుగా?
నేను మాట్లాడే తీరు, నన్ను నేను ప్రెజెంట్ చేసుకునే విధానం, నా నవ్వు, నా ఇష్టాఇష్టాలు అవేవీ నావి కావంది రష్మీ.
“డోపమైన్, సెరోటొనిన్, రైన్స్ వగయిరా ఎంజైములు,
హార్మోన్లు మనుషుల
ఆలోచనల్ని,
భావోద్వేగాలను నియంత్రిస్తాయి”
అంది.
“మీవి నక్సలైట్ భావాలు కదా?” అని అడిగింది.
“భలే కనిపెట్టేశారే” అని కొంచెం ఇబ్బందిగా
నవ్వాను.
“మీకో విషయం తెలుసా? మీ భావాలు మీవికావు.
అవి మావోవి” అని ఒక ప్రకటన చేసింది.
“ అవును. నేను మావో జెడాంగ్ అభిమానిని”
అన్నాను.
“ఆ మావో వేరు. నాను చెప్పే మావో వేరు.
మోనో అమినె ఆక్సిడాసె. షార్ట్ గా ఎంఏవో; మావో” అంది.
నాకు కొంచెం మైండ్ బ్లాక్ అయినట్టయింది.
నక్సలైట్లు మావో ఆలోచనా విధానం వర్ధిల్లాలి అంటుంటారు. అసలు విషయం అది కాదట. మావో అనే ఎంజైము మనలో విప్లవ భావాలను కలిగిస్తుందట.
“అన్నీ అవే చేసేస్తే మరి నేనెవర్నీ? హూ యామై? కోహం? “ అని అడిగాను రావిశాస్త్రిగారి పిపీలకంలా.
“మిమ్మల్ని మీ మెదడు నియంత్రిస్తుంది; మీ మెదడును ఈ ఎంజైమ్స్ నియంత్రిస్తాయి” అంది కూల్ గా.
ఆమె నన్ను నేను కాకుండా చేసేస్తోందని భయం వేసింది. అప్పటికి తాగిందంతా దిగిపోయింది. గ్లాసులోవున్నది
గటగటా తాగేశాను.
“ఆ మధ్య ఒకామె నన్ను మీరంటే ఆసక్తి, అభిమానము, ఇష్టము, ఆప్యాయత, ప్రేమ, భక్తి ఇలా ఇంకేవో మాటలు అంది. ఇవన్నీ ఎంజైముల ప్రభావమేనా?” అని అడిగా.
“యా” అంది రేష్మీ.
ఆ ఒకామె ఈ వయసులోనూ నన్ను ప్రేమించేస్తున్నదనే ఆనందంలో కొన్నాళ్ళుగా గాల్లో తెలుతున్నాను. రేష్మీ “యా” తో నా కుర్చీ కింద నేల కుంగిపోతున్నట్టూ, నేను వెనక్కి తూలి పడిపోతున్నట్టూ అనిపించింది.
అక్షరాలతో తలపడేటప్పుడు శత్రువు బలంగావున్న చోట దాడి చేయాలనీ; ఆయుధాలతో తలపడేటప్పుడు శత్రువు బలహీనంగావున్న చోట దాడి చేయాలని చైనా మావో చెప్పాడు.
ఈ ఈషా అనే అమ్మాయి మావోను చదివిందని నాకు గట్టి అనుమానం. సరిగ్గా నేను తూలి పడిపోతున్న సమయంలోనే నామీద దాడి మొదలెట్టింది ఆ జ్యోతిషురాలు.
“ఆర్ యూ విర్గో?” అని
నిలదీసింది.
“నో. నేను విర్గోనుకాదు” అంటూ నా పేరు చెప్పాను అమాయికంగా.
ఆమెది హర్యాణ. ఆమెకు తెలుగు రాదు. నాకు ఆమెతో మాట్లాడేంత ఇంగ్లీషురాదు.
“మీ పేరుతో పని లేదు. నేను మాట్లాడేది మిమ్మల్ని నడిపే గ్రహారాశుల గురించి. యూ ఆర్ ఏ విర్గో. దట్స్ ఇట్” అంది ఇంకోసారి.
“తుఛ్ఛ మానవుడా! నువ్వంటే నువ్వు కాదురా; నీలోని ఆత్మరా” అనేస్తుందేమోనని చాలా భయపడ్డా.
“చూడ్డానికి బాగుండడం, మొఖమాటం లేకుండా మాట్లాడడం, తీపి మాటలతో ఎదుటివారిని మానుపులేట్ చేయాలని అనుకోకపోవడం ఇవన్నీ విర్గో లక్షణాలు” అని ఇంగ్లీషులో ఒక క్లాసు పీకింది.
ఆమె చెప్పినవన్నీ బాగున్నాయి. మొత్తం మెచ్చుకోలే వుంది. ఇందులో అభ్యంతరం చెప్పాల్సిందేమీ నాకు కనిపించలేదు. కానీ, ఇన్నాళ్ళూ నా గొప్పలుగా నమ్మూతూ బతికేస్తున్న వాటి మీద కాపీ రైట్స్ మొత్తం విర్గోవి అంటే మాత్రం చాలా బాధేసింది.
నాదేశం నాది కాదంటే ఎలావుంటుందో అలా అయిపోయింది నా పరిస్థితి.
అమ్మాయిల ముందు ఏడిస్తే బాగుండదని బాధను ఇంకోసారి గ్లాసుతో దిగమింగాను. నా బాధ ఆమెకు కనిపించకుండ చాలా జాగ్రత్త పడ్డాను. ఆ విషయం పైకి చెపితే “బాధను దాచుకోవడం కూడ విర్గో లక్షణం” అంటుందని భయం వేసింది.
నా గుణగణాలు ఎంజైములవి
అని ఒకమ్మాయి,
విర్గోవి అని ఇంకో అమ్మాయి క్లయిమ్ చేసుకుంటుంటే నేనేం కానూ అనే సందేహం నన్ను చట్టుముట్టింది.
సమాధానం దొరక్క నేను కుర్చీలో నిశ్చేష్టుడిగా వుండిపోయాను.
అప్పటికి నాలుగు పెగ్గులుగా లోపలికి దిగిన ఆ బ్లాక్ లేబుల్ జానీవాకర్ గాడు ఇక వీడి శరీరంలో వుండడం పరమ వేస్టు అనుకుంటూ వెళ్ళిపోయాడు.
మొత్తం దిగిపోయింది.
నన్ను ఆ అమ్మాయిలిద్దరూ నమిలి మింగేశారు;
ఇంకేమీ మిగలేదు.
హైదరాబాద్
26-sept – 2023
Dopamine, Serotonin, Rines
Mono Amine Oxidase (MAO)
Am I Even Myself?
By Usha S. Dani
It was at a late-night party that two young women were introduced to each other.The first, Reshmi, was a neurosurgeon. The second, Isha, was an anchor for an English news channel, with astrology as her chosen hobby.
A rather fitting combination, I mused. In this world, doctors often assume the role of astrologers, and astrologers, in turn, take it upon themselves to act as doctors. Every profession, as far as I had seen, was afflicted with some manner of ailment, and journalism was no exception. A journalist, even when face-to-face with a rocket scientist, could not resist the urge to ask an insipid question, their conviction unwavering that the mere act of posing a query, receiving a reply, and jotting it down transformed it into an exclusive story.
There is a saying—soldiers and journalists never retire. Though I had long since retired from my professional duties, the journalist within me remained steadfastly active.
And so, quite predictably, I posed a question that was, at best, absurd.
“Is there any conceivable link between biochemistry and neurosurgery?”
A journalist’s sacred duty is to forge connections between the most unrelated of things. Even amidst a drinking party, a journalist is bound by their nature.
Reshmi, raising her voice with an air of certainty, declared, “Yes!”She did not stop there. Without so much as a second’s hesitation, she turned me into a mere ‘guinea pig’ and proceeded to deliver an elaborate analysis of my being.
To be likened to a guinea pig in a laboratory was rather disconcerting. Surely, ‘guinea fish’ would be a more dignified comparison.
According to Reshmi, nothing about me—my manner of speaking, my self-presentation, my laughter, my likes and dislikes—was truly my own.
“Dopamine, serotonin, MAO… enzymes and hormones such as these control human thoughts and emotions,” she proclaimed.
Then, eyeing me keenly, she asked, “You harbour Naxalite ideologies, do you not?”
Her astuteness caught me slightly off guard. “Quite the deduction,” I responded with an uneasy chuckle.
“Would you care to know something rather astonishing?” she continued. “Your thoughts, they do not belong to you. They belong to MAO.”
I blinked, perplexed. “Indeed, I am a great admirer of Mao Zedong,” I admitted.
“Oh, I speak not of that Mao,” she clarified, her lips curving into a knowing smile. “I refer to monoamine oxidase—abbreviated as MAO.”
A fog settled over my mind.
For years, I had heard Naxalites speak of Maoist thought thriving in revolutionaries. And yet, here I was, learning that it was not ideology at all, but rather an enzyme, dictating radical tendencies within men.
The notion sent a chill through me.
“If all of this is predetermined… then what of myself? Who am I? What is my identity?” I inquired, much in the spirit of Ravishastri’s Pipilakam.
“Your brain governs you, and these enzymes govern your brain,” she replied coolly.
A creeping unease settled over me. The alcohol in my system seemed to have utterly dissipated. Instinctively, I picked up my glass and downed its remaining contents in one swift gulp.
Only a few days prior, a certain lady had professed her admiration for me—her fondness, her affection, her regard, even her love. Were all these, too, mere effects of biochemical influences?
I turned to Reshmi once more. “Tell me,” I demanded, “are even emotions such as love, devotion, and passion dictated by these enzymes?”
“Why, yes,” she said simply.
For weeks, I had been floating upon the blissful realisation that, even at this stage of my life, someone had found it in their heart to love me. But with that single ‘yes,’ Reshmi shattered my illusions, and I felt the ground beneath my chair give way, the earth tilting backward as though I might fall into an abyss.
Mao himself had once declared that when waging war with words, one must strike where the enemy is strongest, and when waging war with weapons, one must strike where the enemy is weakest.
I could not shake the feeling that this Isha woman had studied Mao well.
For just as I teetered at the edge of existential despair, she launched her own assault upon me.
“Are you a Virgo?” she demanded.
“No,” I replied instinctively, before stating my name.
She, from Haryana, spoke not a word of Telugu. And I, in turn, could not speak English fluently enough to engage in deep conversation with her.
“Your name is of no consequence. I speak of the planetary forces that shape you. You are a Virgo. That is final.”
I shuddered. Would she next proclaim, ‘Foolish man! You are not yourself, but your soul!’?
She launched into a lecture. “Being well-groomed, speaking candidly, refusing to manipulate others with sweet words—these are all hallmark traits of a Virgo.”
There was nothing in her assessment that I could dispute. Everything she listed was commendable. But the thought that all the qualities I had taken pride in my entire life belonged not to me, but to Virgo, left me wounded.
I was overcome with the same despair one might feel upon learning that one’s homeland is no longer one’s own.
It would not do to cry before these women. And so, once more, I drowned my distress in my glass. I took great care to ensure she did not perceive my sorrow, lest she remark, ‘Suppressing emotions? Ah, yet another Virgo trait!’
One woman laid claim to my nature in the name of enzymes; another, in the name of the stars. Left adrift between the two, I wondered—what, then, remained of me? Was I even myself?
I could find no answer. And so, in silence, I slumped into my chair, utterly resigned.
By then, the four pegs of Black Label whisky had fully settled into my bloodstream. And the weary Johnny Walker, finding no further purpose in my body, took his leave.
All was consumed. Nothing remained.
Anil - Birthday 20230926
హ్యాప్పీ బర్త్ డే అనిల్ !
Anil Aqthar Khan Chowdary
వాడెలా చేస్తాడో
తెలీదుగానీ కుటుంబంలో ఆర్ధిక సమస్య వచ్చినప్పుడు దాన్నుండి గట్టెక్కించేస్తాడు. నిజానికి
అజితే ఇంట్లో ఆర్ధిక వ్యవహారాల్ని చక్కబెట్టేస్తుంది. ఆమె స్థాయికి మించిన సమస్య
వచ్చినపుడు మా చిన్నోడు ముందుకు వస్తాడు.
కరోనా సెకండ్ వేవ్ లో
ముందు అజితను తాకింది. తను డిశ్చార్చ్ అయ్యే నాటికి నన్నూ సోకింది. బతికే కేసు
కాదని హైదరాబాద్ డాక్టర్లు ప్రకటించేశారు. కొన్ని రోజులు నేను స్పృహలో లేను. తల్లి
కొడుకు ఏం చేశారోగానీ నన్ను బతికించేశారు. డిశ్చార్జ్ అయ్యాక “ఎంతయిందిరా?” అని
అడిగితే “ఇప్పుడు అది అవసరమా?” అని ఎదురు ప్రశ్న వేశాడు. మా కుటుంబం తట్టుకోలేనంత
పెద్ద బిల్లు అయిందని తరువాత తెలిసింది.
మేమిద్దరమే కలిసి
వున్నప్పుడు చాలా చిత్రమైన ప్రపోజల్స్ పెడుతుంటాడు.
“అసలే పరిమిత ఆదాయం. మమ్మల్నేకాక
నీ తల్లిదండ్రుల భారాన్నీ మోశావు. ఆపైన నిరంతరం ఉద్యమ జీవితాన్ని కొనసాగించావు. మాకోసం
చాలా సౌఖ్యాలనీ, అనేక ఆనందాలనీ వదులుకొని వుంటావు. బడ్జెట్ లేక గర్ల్ ఫ్రెండ్స్ ను
కూడ పక్కన పెట్టేసి వుంటావుగా. ఇప్పుడు ఆ కోరికలన్నీ
తీర్చుకో. నేను స్పాన్సర్ చేస్తాను” అంటుంటాడు.
మనలో చాలా మందికి 2BHK,
3 BHK ఫ్లాట్లే వుంటాయి. మాస్టర్ బెడ్ రూమ్,
చిల్డ్రన్స్ రూం, గెస్ట్ రూంలు వుంటాయి. అనేక ఇళ్ళలో పేరెంట్స్ రూం వుండదు. వాడు
వాడి ఫ్లాట్ లో మాస్టర్ బెడ్ రూమ్ ను పేరెంట్స్ రూం చేశాడు.
చిన్నప్పుడు మా అమ్మీ
నన్ను ప్రెజంటబుల్ గా వుంచేది. నాకు ఆదాయం రావడం మొదలయ్యాక పీటర్ ఇంగ్లండ్ నుండి
మొదలయ్యి లూయీ ఫిలిప్స్ మీదుగా అల్లెన్ సోలీ వరకు చేరాను. బాటా నుండి మొదలయ్యి
లిబర్టి మీదుగా నైక్ వరకు నడిచాను. వాడు నా మేకోవర్ ను ఇంకో మెట్టుకు తీసుకుని పోవాలనుకుంటాడు.
నన్ను పబ్బుకు తీసుకుని పోవడం వాడికో సరదా. “కమ్యూనిస్టులు సెలెక్టివ్ వరల్డ్ లో
బతుకుతుంటారు. నీకు తెలియని కొత్త ప్రపంచం వుంది. దాన్ని కూడ చూడు” అంటాడు. వాడిమాటల్లో
కొన్ని నాకు నచ్చవు. కొన్ని సందర్భాల్లో వారిస్తానుగానీ వాడు అలా నా గురించి శ్రధ్ధ
తీసుకోవడం చాలా నచ్చుతుంది.
హ్యాప్పీ బర్త్ డే
అనిల్ !
Monday, 25 September 2023
Manipur - దేశమంతా మండేదాకా మేలుకోరా?
దేశమంతా మండేదాకా మేలుకోరా?
ABN , First Publish Date - 2023-08-01T03:54:21+05:30 IST
సంఘపరివారపు సామాజిక దృక్పథం, భారతీయ జనతా పార్టీ రాజకీయార్థిక విధానాలు దేశాన్ని ఎంతటి ప్రమాదకర స్థితికి తీసుకుని వెళ్ళగలవో ఇప్పుడు మణిపూర్ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. మణిపూర్ మంటల్లో ఒక్కొక్కరు ఒక్కో పార్శ్వాన్ని మాత్రమే చూస్తున్నారు. వివాదంలో కుకీ తెగవారు ఉన్నారు కాబట్టి దీనిని ఆదివాసీ, గిరిజన సమస్యగా కొందరు చూస్తున్నారు. కుకీలు కొండల్లోను, మైతీలు లోయల్లోను నివసిస్తున్నారు కనుక దీనిని కొండవాసులు, లోయ వాసుల సమస్యగా కొందరు చూస్తున్నారు. కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కనుక దీనిని మైనారిటీ మత సమస్యగా కొందరు చూస్తున్నారు. మైతీలు మెజారిటీ, కుకీలు మైనారిటీ కనుక దీన్ని మైనారిటీల మీద మెజారిటీల వేధింపు చర్యలుగా ఇంకొందరు చూస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అపారంగావున్న ఖనిజ నిక్షేపాలను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసమే కుకీల మీద జాతిహననం సాగిస్తున్నారనే వాదనా వుంది. విభిన్నమైన సాంస్కృతిక జీవనంగల కుకీలను వేధించడానికీ, అడవులు, కొండల మీద వాళ్లకున్న ప్రత్యేక హక్కుల్ని రద్దు చేయడంకోసమే ఉమ్మడి పౌరస్మృతిని రూపొందిస్తున్నారనే మాటా వినిపిస్తున్నది. ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మైతీలను కుకీల మీదికి ఉసిగొల్పాడనే ఆరోపణలున్నాయి. మణిపూర్ తూర్పు సరిహద్దుల్లో పొరుగుదేశం మైన్మార్‌కు చెందిన రెండు రాష్ట్రాలుంటాయి. ఆపైన మైన్మార్, లావోస్, థాయిలాండ్ కలిసే గోల్డెన్ ట్రయాంగిల్ (Golden Triangle) వుంటుంది. అది డ్రగ్స్ ట్రాపికింగ్‌కు అంతర్జాతీయ కూడలి. అంచేత మణిపూర్ మంటల్లో అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ప్రయోజనాలు కూడ ముడిపడివున్నయనే వాదనా వుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం ఎదుర్కొంటున్న సమస్త సమస్యలు మణిపూర్‌లో వున్నాయి. మణిపూర్ ఇప్పుడు మినీ ఇండియా. అంటే ఇప్పుడు మణిపూర్‌లో జరుగుతున్నది రేపు మొత్తం భారతదేశంలో జరుగబోతున్నదని అర్థం.
దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని నాలుగేళ్ల క్రితం ఎవరయినా అంటే చాలామంది అంగీకరించేవారు కాదు. ఇవ్వాళ దేశంలో ఫాసిస్టు పాలన (ఫాసీవాద్) కొనసాగుతోందని మణిపూర్ ఆదివాసీ మహిళలు కూడ గొంతెత్తి అరుస్తున్నారు. కుకీ గిరిజన మహిళ డాక్టర్ ముడూసా వీడియోను ఇప్పుడు ప్రపంచమంతా వీక్షీస్తోంది.
1984 చివర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరువాత ఢిల్లీ పరిసరాల్లో సిక్కుల మీద ఊచకోత సాగింది. ఆ తరువాత జరిగిన లోక్‍సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రికార్డు స్థాయిలో మెజారిటీ దక్కింది. ఒక మైనారిటీ సమూహాన్ని వేధిస్తుంటే మెజారిటీ ఓటు బ్యాంకు ధ్రువీకరణ జరుగుతుందనే ఒక కొత్త పోల్ మేనేజ్‌మెంట్ సూత్రం ముందుకు వచ్చింది. సిక్కులు పంజాబ్, ఢిల్లీ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయిన మైనారిటీలు. దేశం మొత్తంగా విస్తరించివున్న మత మైనారిటీలు ముస్లింలు. వాళ్లను లక్ష్యంగా చేసుకుని మన దేశంలో విద్వేష రాజకీయాలు రూపుదిద్దుకున్నాయి.
గత నియంతలు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసమైనా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు తలపెట్టేవారు. అంతవరకు టాటా బిర్లాలను ఔటర్‍లో వుంచేవారు. ఇప్పటి నియంతలు వేరు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసైనాసరే కార్పొరేట్ల సేవలో తరించాలనుకుంటున్నారు.
ఇప్పుడు మణిపూర్ మంటల్లో కార్పొరేట్ ప్రయోజనాల్ని చూద్దాము. భాగవతంలో భూమిని చాపలా చుట్టి సముద్రంలోనికి తీసుకుపోయిన హిరణ్యాక్షుని కథ ఒకటి వుంటుంది. మన మెగా కార్పొరేట్లు ఆ అంశలో పుట్టినవారు. ఇప్పటికే వాళ్ళు సముద్రాన్ని, ఆకాశాన్నీ మింగేశారు. దేశంలోని 16 షిప్ యార్డులు, 8 ఎయిర్ పోర్టులు ఆదానీ గ్రూపువే.
ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజిజం మైనార్టి మత సమూహాలను వేధించాయని మాత్రమే మనకు తెలుసు. కానీ అక్కడ కూడ మెజారిటీలయిన క్రైస్తవుల్లోని కొందరు కార్పొరేట్లు మాత్రమే బాగుపడ్డారుగానీ సామాన్య క్రైస్తవులు అనేక అగచాట్ల పాలయ్యారు. ఇప్పుడు మనదేశంలోనూ అంతే. హిందూ సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు.
మోదీ ప్రధాని పదవిని చేపట్టాక గత ఏడాది చివరి వరకు రూ.4 లక్షల కోట్లు విలువ చేసే పబ్లిక్ రంగ సంస్థల్ని అమ్మేశారు. గడిచిన 8 నెలల్లో అమ్మినవి దీనికి అదనం. మన దేశ జనాభాలో ముస్లింలు 15శాతం. ప్రభుత్వరంగ సంస్థల్లో వాళ్ళు 5శాతం కూడా ఉండరు. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తుంటే ఆ 5 శాతం ముస్లింలు నష్టపోయేమాట నిజమేగానీ, మిగిలిన 95 శాతం హిందువులు కూడ నష్టపోతున్నారన్నది అంతకన్నా వాస్తవం.
సముద్రం ఆకాశం రెండింటినీ మింగేశాక మన అస్మదీయ కార్పొరేట్లకు ఇప్పుడు లోయలు కొండలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అడవి మీద విరుచుకు పడ్డారు. మణిపూర్‌ని మండించారు. ఇదొక అత్యాధునిక ఖాండవ దహనం. మైదానంలో వాడుతున్న మెజారిటీ మైనారిటీ ఫార్మూలానే వాళ్లు అడవిలోనూ అమలు చేస్తున్నారు. మణిపూర్‌లో మెజారిటీ మెయితీ తెగను మైనారిటీ కుకీ తెగల మీదికి ఎగదోస్తున్నారు. మణిపూర్‌లో జాతి నిర్మూలన (Ethnic Cleansing) జరుగుతున్నదనీ, ముఖ్యమంత్రి బైరేన్ సింగ్ కుకీలకు బద్ధవ్యతిరేకి అనీ, పోలీసులు ప్రభుత్వాధికారులు బాహాటంగా మెయితీ అల్లరి మూకలకు సహకరిస్తున్నారని సాక్షాత్తు బీజేపీ శాసనసభ్యుడు పావోలియన్ లాల్ హావ్ కిప్ బాహాటంగా ఆరోపిస్తున్నారు.
కార్పొరేట్ల అటవీ ప్రాంత ఆక్రమణ మణిపూర్‌తో ఆగదని దేశంలోని ఆదివాసీ సంఘాలకు అర్థం అయింది. నాగాలండ్ మొత్తం కుకీలకు సంఘీభావాన్ని తెలుపుతోంది. ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా ఝార్ఖండ్ ఆదివాసీ సమూహాల్లో ఒక ఉద్యమం ఆరంభమయ్యి క్రమంగా అటు ఈశాన్య రాష్ట్రాలకు, ఇటు ఛతీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.
మణిపూర్‌లో మే 4 నుంచి ఇంటర్నెట్ సదుపాయాలను రద్దు చేశారు. సుప్రీంకోర్టు జోక్యం తరువాత ఇంటర్నెట్ సదుపాయాలను పాక్షికంగా పునరుద్ధరించారు. ఆ తరువాత మాత్రమే మే 4న మణిపూర్‌లో జరిగిన ఒక బీభత్స వికృత సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోనికి వచ్చింది. బయటికి వచ్చింది ఒక్క వీడియోనే. ఇలాంటి కొన్ని వందల అత్యాచారాలు అక్కడ జరిగినట్టు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. అనేకమంది బాధిత స్త్రీలు ఆ ఘోరాలను ఇప్పుడు బయటి ప్రపంచంతో పంచుకుంటున్నారు. మైనారిటీలను వేధిస్తుంటే మెజారిటీలు ఎన్నికల్లో తమను గెలిపిస్తారనే వికృత సిద్ధాంతానికి మణిపూర్ పరాకాష్ఠ.
ఇప్పుడు మణిపూర్ మంటల సెగ పార్లమెంటుకు తాకింది. గత రెండున్నర నెలలుగా మణిపూర్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే వుంది. కనుక అక్కడ జరుగుతున్న జాతి హననానికి నేరుగా దానిదే బాధ్యత. కేంద్ర ప్రభుత్వం అంటే హోంమంత్రి, ప్రధానమంత్రులే అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
రాజకీయ సామాజిక ప్రత్యర్థుల మీద నైతిక దాడి చేయడానికి సంఘపరివారం దగ్గర ఒక పురాతన ఫార్ములా వుంది. ముస్లింల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మీద విదేశీయులు, చొరబాటుదార్లు, టెర్రరిస్టులు, పొరుగుదేశాల భక్తులు, వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు, భారత వ్యతిరేకులు వంటి నిందల్ని వేసేవారు. ఇప్పుడు సరిగ్గా అవే నిందల్ని కుకీల మీద వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక తేడా వచ్చింది. దేశప్రజలు నరేంద్ర మోదీ, అమిత్ షాల మాటల్ని గతంలోలా ఇప్పుడు నమ్మడంలేదు.
మణిపూర్‌లో మెజారిటీ సమూహమైన మెయితీలను లూటీలు, దొమ్మీలు, గృహదహనాలు హత్యలు, అత్యాచారాలు చేసే మూకోన్మాదుల జాతిగా ప్రపంచమంతా గుర్తిస్తున్నది. ఇంతటి అపఖ్యాతిని భరించడం మెయితీ జాతిలోని సహృదయులకు సాధ్యం కావడం లేదు. వాళ్లలో ఒక మార్పు వచ్చింది. ‘మమ్మల్ని మీరు తల్లి, సోదరీ అనీ పిలవకండ్రా. మీరు మానవత్వాన్ని కోల్పోయారు. మా పరువు తీసేశారు. మాపై అతిక్రూరమైన జాతిగా ముద్రవేసి ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టారు. మీరూ మిమ్మల్ని పెంచిపోషిస్తున్నవారూ యాంటి నేషనల్స్! యాంటి ఇండియన్స్! అనే వాస్తవాన్ని గుర్తించండి’ అనే అర్థం వచ్చేలా వాళ్ళు కవితలు, వ్యాసాలు రాస్తున్నారు. వాళ్ళు అంటున్న యాంటి నేషనల్స్! యాంటి ఇండియన్స్! అనే ఆరోపణలు తార్కికంగా ఎవరికి వర్తిస్తాయో విడమరచి చెప్పనవసరం లేదు. ఇప్పుడు అడవిలో జరుగుతున్నట్టే రేపు మైదాన ప్రాంతంలోని మెజారిటీ సమూహాల్లోనూ ఈ మార్పు తప్పక వస్తుంది.
ఇన్నాళ్ళుగా మణిపూర్‌లో ఏం జరుగుతున్నదో ప్రధాని, హోంమంత్రులకు తెలియదంటే ఆ పదవులకు వారు అనర్హులు. తెలిసి కూడా అక్కడ దారుణాలని కొనసాగనిచ్చారంటే ఇప్పుడు వినపడుతున్న కార్పొరేట్ కుట్ర సిద్ధాంతం నిజమే అని దేశం నమ్మాల్సి వుంటుంది. ఏది ఏమైనా, పార్లమెంటులో మణిపూర్ మీద మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కలవరం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పుడు వాళ్ళు భారత్, ఇండియా అనే పదాలను వింటేనే అసహనానికి గురవుతున్నారు. ముస్సోలినీ, హిట్లర్ కూడ చివరి రోజుల్లో భయంతోనే బంకర్లలో బతికారు. ఇప్పుడు ఢిల్లీ సన్నివేశాలు ఆ గతాన్ని గుర్తు చేస్తున్నాయి.
మన పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ఆరంభం అవుతున్నదనడానికి ఇవి తొలి సంకేతాలు కావచ్చు! ఇప్పటికే మనం ‘బీజేపీ ముక్త్ దక్షిణ భారత్’లో వున్నాం. 2024 లోక్‍సభ ఎన్నికల తరువాత ‘బీజేపీ ముక్త్ సంపూర్ణ భారత్’ ఏర్పడవచ్చు. మెజారిటీ సమూహాలు మణిపూర్‍లోలా ఆత్మపరిశీలన చేసుకుంటే ఇదేమీ అసాధ్యం కాదు.
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్
రచన ః
ప్రచురణ : 1 ఆగస్టు 2023 ఆంధ్రజ్యోతి దినపత్రిక,
https://www.andhrajyothy.com/2023/editorial/do-you-want-to-wake-up-until-the-whole-country-burns-1113495.html
Friday, 15 September 2023
ఇప్పుడయినా ' బాబు' కళ్ళు తెరుస్తారా? !
ఇప్పుడయినా ' బాబు' కళ్ళు తెరుస్తారా? !
చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణల్లో ఒక స్పష్టత చోటు చేసుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ అర్ధం కాని బ్రహ్మపదార్ధంగా వున్నాయి. ఇక ఆ రాజకీయ మబ్బులు విడిపోయే సందర్భం వచ్చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన పౌరసమాజం ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించింది. అయితే, ఇక్కడి రాజకీయ పరిస్థితి చాలా సంక్లిష్టంగా వుండడంతో బిజెపిని ఓడించే ఒక వ్యూహాన్ని ఆ బృందం రచించలేకపోయింది.
పొత్తులేని పోటీకి ససేమిర !
ఏపిలో వైయస్సార్ సిపి (వైసిపి) అధికార పార్టి, తెలుగు దేశం (టిడిపి) ప్రతి పక్షపార్టి. రంగంలో ఇంకా జనసేన, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, బిఎస్పి, సిపిఐ వున్నాయి. అయితే, ఈ ఆరు పార్టిల్లో ఒక్కదానికీ శాసన సభలో ప్రాతినిథ్యంలేదు.
జగన్ నాయకత్వంలోని వైసిపికి మరొకరితో పొత్తు పెట్టుకోవడం, సీట్లు పంచుకోవడం ఏమాత్రం ఇష్టంలేదు. స్వంత బలం మీదనే గెలవాలనేది జగన్ అభిమతంగా వుంది. 2019 ఎన్నికల్లో అనూహ్య పరాజయం తరువాత చంద్రబాబుకు 2014 ఎన్నికల సెంటిమెంటు వెంటాడుతోంది. తనూ, మోదీ, పవన్ కణ్యాణ్ మళ్ళీ కలిస్తే మరొక్కసారి ఘనవిజయాన్ని సాధించవచ్చని ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నారు. కానీ అది జరిగే పని కాదని వారికి అర్ధం కావడంలేదు.
పవన్ కళ్యాణ్ కూడ దాదాపు చంద్రబాబు బాటలోనే ఆలోచిస్తున్నారు. జనసేన, టిడిపి, బిజేపి కలిసి జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండ చూస్తే తమ గెలుపు ఖాయమని ఆయన పదేపదే చెపుతున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న పార్టి అనే ఒకే ఒక్క మాటతప్ప ఏపిలో బిజెపికి ఓట్లు లేవు. గత ఎన్నికల్లో ఆ పార్టికి స్వంతంగా ఒక్క శాతం ఓట్లు కూడ రాలేదు. పవన్ కళ్యాణ్ కే 5.5 శాతం ఓట్లు వచ్చాయి. ఆ లెఖ్ఖన ఏపిలో బిజేపికన్నా పవన్ కళ్యాణ్ పార్టి 6,7 రెట్లు పెద్దది.
బిజెపితో ఒన్ సైడ్ లవ్ !
రాష్ట్ర విభజన కారణంగా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్ మీద చాలా గుర్రుగా వున్నారు. ఇప్పటి పరిస్థితి వేరు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృధ్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తదితర అంశాల్లో బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వుంది. స్థూలంగా వాళ్లు బిజెపికి వ్యతిరేకంగా వున్నారు.
కేంద్రంలో బిజెపి విషయంలో జగన్ ‘రాజును మించిన రాజభక్తి’ని చాటుకుంటున్నారు. విచిత్రం ఏమంటే జగన్ ఓటు బ్యాంకులో రెడ్డి సామాజికవర్గంతప్ప అత్యధికులు బిజెపికి పూర్తి వ్యతిరేకులు. మరీ ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీలు. ఆయనకు లోక్ సభలో 22 మంది సభ్యులున్నారు, ప్రస్తుతం లోక్ సభకన్నా విలువైన రాజ్యసభలో 12 మంది సభ్యులున్నాయి. అయినప్పటికీ, ఒక్క మంత్రి పదవిని కూడ కోరుకోకుండా జగన్ బిజెపికి ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన ఏపిలో ‘బిజెపికాని బిజెపి’.
బిజెపి దృష్టిలో జగన్ కాంగ్రెస్ తో విభేధించి బిజెపి పంచచేరిన రాజకీయ నాయకుడు, చంద్రబాబు బిజెపి తో విభేధించి కాంగ్రెస్ దగ్గరకు వెళ్ళగల నాయకుడు. అంచేత, బిజెపి జగన్ ను నమ్మినంతగా చంద్రబాబును నమ్మదు. ఏపిలో వచ్చే ఎన్నికల్లోనూ జగన్ గెలవడమే మేలని బిజెపి భావిస్తోంది. ఆ తరువాతి 2029 ఎన్నికల సంగతి అప్పుడు చూసుకోవచ్చనేది ఆ పార్టి వ్యూహంగా కనిపిస్తున్నది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభల్లోనూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశాల్లోనూ జగన్ ను గట్టిగానే విమర్శించారు. వాళ్లిద్దరూ పవన్ కళ్యాణ్ తో పొత్తు వుంటుంది అన్నారేగానీ చంద్రబాబుతో పొత్తు వుంటుందని ఒక్కసారి కూడ అనలేదు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తను గట్టెక్కాలంటే కేంద్రంలో అధికారంలోవున్న బిజెపి సహకారం అవసరం అని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. బిజేపితో ఆయన ‘ఒన్ సైడ్ లవ్’లో బాగా లోతుగా మునిగి తేలుతున్నారు.
ఏపీలో బిజెపి వ్యూహమిదే !
జాతీయ రాజకీయాల్లో ఎన్ డిఏకు వ్యతిరేకంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి సరిగ్గా ఈ కారణంగానే చంద్రబాబును ఆహ్వానించలేదు. నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవడంతో సిపిఎం, సిపిఐ అవమాన భారంతో కుమిలిపోతున్నాయి. ఎవరో ఒకరి పంచన చేరి ఈసారైనా ఒక్క సీటు అయినా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని అవి తపిస్తున్నాయి. టిడిపితో పొత్తుకోసం సిపిఐ, వైసిపితో పొత్తు కోసం సిపిఎం ప్రయత్నిస్తున్నట్టు గట్టిగానే వినిపించింది.
ఏపి కాంగ్రెస్ గత పదేళ్ళుగా పూర్తి నైరాశ్యంలో వుంది. కాంగ్రెస్ ద్వార ప్రయోజనాలు పొందినవారు క్రమంగా ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. పార్టి భవిష్యత్తును నమ్మి నిధులు ఖర్చు పెట్టేవారు లేరు. రాహుల్ గాంధీ ‘భారత జోడో’ యాత్ర తరువాత మాత్రమే కాంగ్రెస్ ఆఫీసులో కొందరు కార్యకర్తలు కనిపిస్తున్నారు. కొన్ని కార్లు ఆగుతున్నాయి. కొన్ని లైట్లు వెలుగుతున్నాయి.
వైసిపి, టిడిపి, జనసేన. బిజెపి నాలుగు పార్టిల్లో దేనికి ఓటేసినా అవి అంతిమంగా బిజెపి ఖాతాలోనికే పోతాయనే అభిప్రాయం ఏపిలో కొన్నాళ్ళుగా స్థిరపడిపోయింది. అందువల్ల, అసెంబ్లీ ఎన్నికల మీద వున్నంత ఆసక్తి ఎవ్వరికీ లోక్ సభ ఎన్నికల మీద లేకుండా పోయింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెప్టెంబరు 9 సోమవారం చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడికి పంపడంతో రాష్ట్రా రాజకీయాలు ఒక్కసారిగా పెద్ద కుదుపుకు గురయ్యాయి.
దేశ ప్రతిష్టకు సంబంధించిన జి-20 సమావేశాలు జరుగుతుండగా చంద్రబాబు అరెస్టుకు ముహూర్తం పెట్టారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాజీలకు ఎపి ప్రభుత్వం ముందే తెలిపి వుంటుంది. మోదీ, అమిత్ షాలకు అసౌకర్యాన్ని కలిగించే పనులు ఏవీ జగన్ చేయరు; చేయలేరు. చేస్తారని ఎవరయినా అనుకుంటే అంతకన్నా అమాయకులు ఎవ్వరూ వుండరు.
చంద్రబాబు అరెస్టు టిడిపికి లాభమా? నష్టమా? అనేదే ఇప్పుడు బిజెపి పరిశీలిస్తున్న అంశం. టిడిపి బుధవారం పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ఏ జిల్లాలోనూ కనీస స్పందన రాలేదు. తెలుగుదేశం రాజకీయాల కేంద్రంగా భావించే విజయవాడ నగరంలోనూ బంద్ ప్రభావం బొత్తిగా కనిపించలేదు. టిడిపి బంద్ ను ప్రజలు పట్టించుకోకపోవడం వైసిపికికన్నా బిజెపికే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చి వుంటుంది. వాళ్ళు అశిస్తున్నది కూడ ఇదే.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా లేత కనుక చంద్రబాబు అరెస్టు కేసులో జగన్ ను మాత్రమే విమర్శించారు. సోము వీర్రాజును తప్పించినపుడే పవన్ కళ్యాణ్ కు ఒక విషయం అర్ధమై వుండాల్సింది; పురందేశ్వరిని పంపింది చంద్రబాబు కాళ్ళ కింది భూమిని లాగడానికని. ఎపి రాజకీయాల్లో చంద్రబాబును బలహీనపరచి పవన్ కళ్యాణ్ ను ముందుకు తీసుకుని రావడం ఢిల్లీ ‘డబుల్ ఇంజిన్’ వ్యూహం.
టిడిపు రాష్ట్ర బంద్ పిలుపు విఫలం కావడానికి ప్రధాన కారణం చంద్రబాబు బిజెపి ప్రేమలో వుండడమే. రాజమండ్రి సెంట్రల్ జైలు రాజకీయ ఖైదీల స్పెషల్ విభాగంలో ప్రవేశించాక చంద్రబాబుకు కొత్త రాజకీయాల కొత్త కోణాలు అర్ధం అయ్యుంటాయి.
బాబు గేమ్ చేంజరేగానీ
తను ఇప్పుడు వుండాల్సింది ‘ఇండియా’లో అని చంద్రబాబు గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోతాయి. వామపక్షాలు ఇప్పటికే జాతీయ స్థాయిలో ‘ఇండియా’లో వున్నాయి. పొత్తుల నిర్ణయం రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని సీతారాం ఏచూరి వంటివారు చెప్పి వున్నారు. ఏపిలో కాంగ్రెస్ వామపక్షాలతో టిడిపి కలిసే అవకాశాలు పెరుగుతాయి. చంద్రబాబుకు మరో ఆప్షన్ లేదు. పవన్ కళ్యాణ్ ను బిజెపి మరింతగా ప్రమోట్ చేస్తుంది. జగన్ తాను బిజెపి కాదంటూనే బిజెపి వెంట వుండక తప్పదు.
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు
మొబైల్ : 9010757776
రచన ః 12 సెప్టెంబరు 2023
ప్రచురణ ః 15 సెప్టెంబరు 2023
దిశ డైలీ
https://www.dishadaily.com/editpage/chandrababu-should-think-about-his-role-in-national-politics-252738
Thursday, 14 September 2023
"Rights, Wrongs, and Laughs: A Satirical Celebration"
Title: "Rights, Wrongs, and Laughs: A Satirical Celebration"
Setting: A courtroom in India, with a large banner reading "75 Years of Independence - But Are We Really Free?"
Characters:
Ravi - Social Activist
Tina - Student
Justice Kapoor - Judge
Anil - Advocate
Meera - Women Teacher
Raju - Farmer
[The courtroom is buzzing with anticipation as the audience takes their seats. The stage is set with a judge's bench, a podium for the advocate, and chairs for the witnesses.]
Scene 1: The Opening Statements
[Judge Kapoor enters, banging the gavel.]
Judge Kapoor: (Sarcastically) Order in the court! We're gathered here today to discuss the state of our fundamental rights. Or as some might say, the state of our 'fundamentally right' violations. Let's begin with our first witness, the passionate social activist, Ravi.
[Ravi takes the stand.]
Ravi: (Enthusiastically) Your Honor, esteemed audience, I've spent 30 years fighting for the rights of the marginalized. But today, I realized, the biggest violator of our rights is the traffic in this city! I mean, who designed these roads, a maze-loving hamster?
[Laughter from the audience.]
Scene 2: The Student Perspective
[Tina takes the stand.]
Tina: (Animatedly) Your Honor, esteemed panel, my generation is the future, but the state of our education system is a time machine stuck in the past! We're still using textbooks that mention the Berlin Wall like it's a recent event. And the WiFi in my college is so slow, it's like watching a buffering tortoise!
[Chuckles from the audience.]
Scene 3: Legal Limbo
[Anil, the advocate, takes the stand.]
Anil: (Dramatically) Your Honor, fellow colleagues, I've been practicing law for decades, but sometimes it feels like I'm juggling legal papers in a hurricane! The legal process is so slow that by the time a case is resolved, it's like trying to recall the plot of a soap opera you stopped watching ten years ago.
[Audience laughter.]
Scene 4: The Gender Equation
[Meera, the women teacher, takes the stand.]
Meera: (Passionately) Your Honor, ladies, and gentlemen, I've taught countless students, but it's disheartening to see how women's rights are still stuck in the previous century. We teach our girls to be strong and independent, but society expects them to excel at everything while balancing on a tightrope!
[Audience applause.]
Scene 5: A Farmer's Plight
[Raju, the farmer, takes the stand.]
Raju: (Sadly) Your Honor, respected guests, I've toiled on my land for generations, but today, I can't even grow a pumpkin without fearing for my livelihood. The government keeps changing its policies like they're trying to follow a Bollywood script. My life feels like a never-ending soap opera too!
[Audience sympathy.]
Scene 6: A Surprising Verdict
[Judge Kapoor takes off his judicial robe and steps down.]
Judge Kapoor: (Emotionally) Ladies and gentlemen, today, in the spirit of our 75th Independence Day, I want to make a statement. We may joke about our rights, but it's our responsibility to fight for them. We have the power to change our nation's destiny!
[Audience applause and standing ovation.]
[As the play concludes, the characters join hands, representing unity in the quest for true freedom.]
In this satirical comedy, we've laughed at the absurdities of our system, but it's a reminder that the struggle for true freedom and the protection of our fundamental rights continues. Happy 75th Independence Day, India!
Title: "Rights & Wrongs: A Satirical Spectacle"
Characters:
Ravi (Social Activist)
Priya (Student)
Justice Kapoor (Judge)
Anita (Advocate)
Mrs. Gupta (Women Teacher)
Raj (Farmer)
Setting: A community hall decorated for India's 75th Independence Day celebration.
Scene 1: The Prologue
(Ravi stands on a soapbox, passionately addressing the crowd.)
RAVI
Ladies and gentlemen! As we celebrate 75 years of independence, let's not forget the struggles we still face for our fundamental rights!
(Enter Priya, holding a placard that reads "Education for All!")
PRIYA
And that includes the right to quality education, Ravi! Students like me demand it!
Scene 2: The Courtroom Caper
(Justice Kapoor presides over a mock trial.)
JUSTICE KAPOOR
Order in the court! Our next case, "The Missing Rights"! Advocate Anita, present your arguments.
(Anita presents a humorous and satirical case highlighting absurd violations of rights.)
ANITA
Your Honor, a farmer can't plant without seeds, a student can't learn without books, and a woman can't lead without equal opportunities!
Scene 3: The Schoolyard Standoff
(Mrs. Gupta addresses her fellow teachers.)
MRS. GUPTA
Ladies, we must unite! We deserve equal pay for equal work!
(They perform a comical skit showcasing the challenges faced by women in the workplace.)
Scene 4: The Farmland Folly
(Raj enters, wearing a straw hat and holding a pitchfork.)
RAJ
We feed the nation, yet our rights are trampled upon! It's time for a revolution!
(Raj and Ravi lead a comical protest, waving vegetables instead of flags.)
Scene 5: The Advocacy Extravaganza
(Anita and Priya plot a courtroom coup.)
ANITA
We'll challenge the system head-on! The law must protect our rights!
PRIYA
And we'll make sure it does, Anita! Together, we can change the world!
Scene 6: The Grand Finale
(All characters gather on stage, addressing the audience.)
ALL
On this historic day, let's pledge to uphold our fundamental rights! Together, we can build a better, more just India!
(They join hands, and the crowd erupts in applause.)
THE END