Thursday 31 January 2013

Viswaroopam - Notes


NOTES ON VISWAROOPAM

విశ్వరూపం  -1
సాంకేతికంగా అద్భుతమైన, నటనపరంగా ఉన్నతమైన,  విస్తృతిలో అంతర్జాతీయమైన, సన్నివేశాలపరంగ అర్ధసత్యమైన, సమర్పించడంలో అతితెలివైన, సారాంశంలో అమెరికా అనుకూలమైన సినిమా.

విశ్వరూపం  -2
కమల్‌హసన్ భారతీయ సినిమాను  సాంకేతికంగా అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్ళారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. సాంస్కృతికంగా అమెరికా స్థాయికి తీసుకువెళ్ళారు అనంటే ఇంకా సమంజసంగా ఉంటుంది.

విశ్వరూపం  -3
కథాస్థలం ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఇరాక్ అయితే కథ ఎలా నడిచేది? అనే ఒక చిన్న సందేహం ఏఒక్కరికి కలిగినా, విశ్వరూపం నిర్మాతలు ఆశించే అంతర్జాతీయ ప్రయోజనాలు అర్ధం అవుతాయి.

విశ్వరూపం  -4
కళనుకళగానే చూడాలనేది పాలకవర్గాల భావజాలం. కళను సామాజికంగానే చూడాలనేది పాలితుల చారిత్రక అవసరం.

విశ్వరూపం  -5
కళాకారుడు కళాకారుడిగానే వుంటే ఎవరీకీ అభ్యంతరం వుండదు. తెలిసిగానీ, తెలియకగానీ రాజకీయాల్లోకి అడుగుపెడితే, ఆ తరువాత రాజకీయాలే వుంటాయి.

విశ్వరూపం  -6
అమెరికా ప్రాయోజిత కార్యక్రమంగా అంతర్జాతీయ వేదికలపై సాగుతున్న ముస్లిం వ్యతిరేక ప్రచారానికి అనువుగా ఈ సినిమా వుంది. అయితే, ఇందులో ఎక్కడా హిందూ -ముస్లిం విబేధాల ప్రస్తావన లేదు. నేరుగా, ఈ సినిమావల్ల భారతదేశంలో మతఘర్షణలు చెలరేగే అవకాశాలు అస్సలు లేవు. ఈ సినిమాను ముస్లింలు నిరసిస్తే సరిపోతుంది.  నిషేధించాల్సిన అవసరం అస్సలు లేదు.

విశ్వరూపం  -7
ఎప్పుడైనాసరే, కళాసాహిత్యాల నిషేధం అనేది కోరదగ్గ అంశంకాదు. సాంస్కృతిక దాడిని సాంస్కృతిక దాడితోనే ఎదుర్కోవాలి.

Tuesday 22 January 2013

Elegy to B Chandrasekhar



నివాళి
నిమగ్నత అతని జీవనవిధానం
-      ఉషా యస్ డానీ

1980వ దశకంలో, కోస్తాజిల్లాల రాడికల్ ఉద్యమంలో, నేనూ చంద్రా జంట ఉపన్యాసకులుగా ఉండేవాళ్ళం. రాడికల్స్ యువజన విభాగానికి నేనూ, విద్యార్థి విభాగానికి తనూ ప్రాతినిధ్యం వహించేవాళ్లం. భావి నాయకత్వాన్ని తయారుచేయడానికి, ఎంపిక చేసిన ఓ ఆరుగురి కోసం, 1984లో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని పల్లేర్లమూడిలో, విరసం ఒక ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నిర్వహించింది. అందులో, నేనూ చంద్రా సహాధ్యాయులం.

తరువాతి కాలంలో, ఎ. సుబ్రహ్మణ్యం, బాలగోపాల్‌లతో కలిసి, చంద్ర, పౌర హక్కులు, మానవ హక్కుల ఉద్యమాల్లో చాలా చురుగ్గా పనిచేశాడు. నేను పాక్షికంగా నాయకత్వం వహించిన 1985 నాటి కారంచేడు ఉద్యమంలోనూ, నేనూ నేరుగా నాయకత్వం వహించిన 2000 నాటి చినగంజాం స్నో వైట్ సాల్ట్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలోనూ గుంటూరుకు చెందిన సీనియర్ లాయర్ వై. కోటేశ్వరరావుతో పాటు చంద్రా కూడా మాకు బాసటగా ఉన్నాడు.

1991 నాటి చుండూరు ఉద్యమంలో చంద్ర చురుగ్గా పాల్గొన్నాడు. ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. చుండూరు హత్యాకాండ నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో చంద్ర ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించాడు.

సాహిత్య వ్యాసంగంతోపాటూ, తత్వశాస్త్రంలో చంద్రకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. మార్క్సిస్టు - లెనినిస్టుగా మొదలైన చంద్ర ఇటీవలి కాలంలో పోలిష్ సామాజిక శాస్త్రవేత్త జిగ్మంట్ బౌమన్‌కు వీరాభిమానిగా మారాడు. ఇటాలియన్ సామాజిక శాస్త్రవేత్త ఆంటోనియో గ్రామ్‌స్కీని తెలుగునాట ఎక్కువగా ప్రచారం చేసింది అతనే. ఆ తరువాత ఫ్రెంచ్ ఆధునికానంతర తత్వ్తవేత్తలు, మైకెల్ ఫోకాల్ట్ (ఫ్యూకో), జాక్వస్ డెర్రిడాల ప్రభావం చంద్ర మీద బలంగా పడింది.

దేన్ని చదివినా అందులో పూర్తిగా లీనం అయిపోవడం చంద్ర బలం, అదే అతని బలహీనత కూడా. 1920లలో నికోల శాక్కొ, బార్టోలోమియో వాంజేట్టి అనే ఇద్దరు ఇటాలియన్లను అమెరికాలో ఉరివేసిన సంఘటన 1980లలో చంద్రను తీవ్రంగా కలచివేసింది. ఈ కేసును వాదించడానికి ’ది శాక్కొ - వాంజెట్ట్టి డిఫెన్స్ కమిటీ’ ఒకటి అప్పట్లో ఏర్పడింది. అందులో ఒక అడ్వకేట్ (అతని పేరు ఇప్పుడు నాకు గుర్తులేదు) ఈ కేసుతో పూర్తిగా లీనమైపోయాడు. శాక్కొ, వాంజేట్టి కేసు ఫైళ్ళ ఆధారంగా చంద్ర తెలుగులో ఒక గొప్ప నవల రాశాడు. ఆ లాయర్ పాత్ర నిజజీవితంలోనూ అతన్ని చివరి వరకూ వెంటాడింది అనిపిస్తుంది. 1997 నాటి విష్ణువర్ధన్, చలపతి కేసు సందర్భంగా, ఉరి శిక్షకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో చంద్ర ఆ స్ఫూర్తితోనే మమేకమైపోయాడు.

ఫ్యూకో ముందుకు తెచ్చిన ’హిస్టరీ ఆఫ్ హ్యూమన్ సెక్సువాలిటీ’ గురించి చంద్ర చాలా సందర్భాల్లో చర్చ చేసేవాడు. మనం ప్రధాన స్రవంతి సెక్స్‌ను ప్రామాణికంగా తీసుకునీ, ఉపస్రవంతుల సెక్స్‌ను నిర్లక్ష్యం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసేవాడు.

తత్వశాస్త్రానికి సంబంధించినంత వరకు, నేనూ, త్రిపురనేని శ్రీనివాస్, చంద్రా ముగ్గురం త్రిపురనేని మధుసూదనరావు గురుకులం నుంచి వచ్చినవాళ్లం. వయసులో వాళ్లిద్దరూ నాకన్నా పదేళ్ళు చిన్నవాళ్ళు. ఈ మాట గుర్తుకొచ్చినపుడు నాకు ఎక్కడో హెచ్చరిక గంటలు మోగుతున్నాయి అనిపిస్తుంది.

ఆధునిక సమస్యలన్నింటి ప్రస్తావన మార్క్స్ రచనల్లో లేకపోవచ్చు. అయినప్పటికీ, ఆధునిక సమస్యలన్నింటినీ అర్థం చేసుకోవడానికే కాక, వాటిని మార్చడానికి అవసరమైన పనిముట్లు కూడా మార్క్సిజంలో ఉన్నాయని  భావించేవారిలో  నేనూ ఒకడ్ని. అంచేత, ఇతర సామాజిక శాస్త్రవేత్తల్ని నేను పరికించినవాడినే తప్పా, వాళ్ళతో మమేకమైపోయిన వాడిని మాత్రం కాదు. ఈ విషయంలో నామీద చంద్రాకు కాస్త (నిజానికి బోలెడు) అసంతృప్తి ఉండేది. ఏడాది క్రితం పర్‌స్పెక్టివ్ ఆర్కే ఇంట్లో కలిసినప్పుడు, శాక్కొ - వాంజెట్టి పుస్తకం మీద డానీ! బౌమన్ గురించి నా నమ్మకాన్ని వమ్ముచేయవని ఈ కానుక’ అని రాసిచ్చాడు. ఇప్పుడు నేను ’జిగ్మంట్ బౌమన్ లిక్విడ్ మోడర్నిటీ’ని మరింత అధ్యయనం చేయాలి అనుకుంటాను.


హైదరాబాద్,
22  జనవరి   2013
 (ఆంధ్రజ్యోతి దినపత్రిక, 23  జనవరి  2013) 

Saturday 19 January 2013

Danny Quotes


Danny Quotes


కొందరి ఆహారం మరికొందరికి విషం కావచ్చు. దీనికైనా సందర్భం ముఖ్యం.

Stupid people
మూర్ఖులకు అద్భుత శక్తి వుంటుంది. ఎంతటి గొప్పవాళ్లనైనా వాళ్ళు తమస్థాయికి దిగజార్చేయగలరు.

 Stupid people
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మిత్రులతో మాట్లాడవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శత్రువులతో మాట్లాడవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మూర్ఖులతో మాట్లాడలేము.



Beauty of life
జీవనశౌందర్యం అంటే మరేదోకాదు అణగారినవాళ్ళు స్వేఛ్ఛా గాలులు పీల్చడానికి చేసే పెనుగులాట.

స్త్రీ-పురుష సంబంధాల గురించి మనం మాట్లడేదంతా సారాంశంలో ఆస్తిసంబంధాల గురించే.

మనిషి వ్యవహార శైలిలో ఉన్న మర్మికతే అది. అదే అతన్ని ఇతర జీవుల నుండి విడగొడుతుంది. లేకపోతే ఆర్ధిక నిర్ణాయకవాదం అయిపోతుంది. మనిషి అలా ప్రవర్తించడు. కానీ సారంశం అదే.

ఆధిపత్య భావన అనేది స్వంతాస్థి కొనసాగింపే. ఉన్నత రూపం అనవచ్చు.  

Learned Person
జ్ఞానుల్ని నాలుగుసార్లు కలవకండి

జ్ఞానుల్ని మొదటిసారి కలిసినపుడు, వాళ్ల జ్ఞానం మీద గౌరవభావంతో మొక్కాలనిపిస్తుంది.
జ్ఞానుల్ని రెండవసారి కలిసినపుడు, వాళ్ళ జ్ఞానాన్ని ఎలాగైనా తస్కరించాలనిపిస్తుంది
జ్ఞానుల్ని మూడవసారి కలిసినపుడు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానంతోనే వాళ్ళను అధిగమించాలనిపిస్తుంది
జ్ఞానుల్ని నాలుగవసారి కలిసినపుడు, ఆత్మన్యూనతాభావంతో వాళ్లపై నైతిక దాడి చేయాలనిపిస్తుంది.



Victory  & Defeat 
మనం సాధించిన ప్రతి  విజయం వెనక మన పాత్ర వున్నట్టు. మనం ఎదుర్కొన్న ప్రతి పరాజయం వెనుక మన పాత్ర వుంటుంది. 


Food & Poison 

ఒకరి ఆహారం మరొకరికి విషం కావచ్చు. ఒకరి విషం మరొకరికి ఆహారం కావచ్చు.

 vice versa

ప్రపంచంలో ప్రతీదీ తద్వెతిరేకంగానూ (the other way around, vice versa) వుంటుంది. 

Marxism 

ఆధునిక సమస్యలన్నింటి ప్రస్తావన మార్క్స్ రచనల్లో లేకపోవచ్చు. అయినప్పటికీ, ఆధునిక సమస్యలన్నింటినీ అర్ధం చేసుకోవడానికేకాక, వాటిని మార్చడానికి అవసరమైన పనిముట్లు కూడా మార్క్సిజంలో వున్నాయి. మనం వాటిని సమర్ధంగా వాడడం నేచుకోవాలి.  

Human creativity 

మనుషులు సృజనాత్మకంగా రెండు పనులు చేస్తారు. చేతనైతే తమను పోలిన ప్రపంచాన్ని సృష్టిస్తారు. అది చేతకాకపోతే, ప్రపంచమంతా తమలానే వుందనే భ్రమల్లో బతికేస్తారు. 

Statues

ఎప్పుడైనాసరే  ఓట్లు సమకూర్చిపెట్టే విగ్రహాలనే అధినేతలు గౌరవిస్తారు.

History 

చరిత్రలేనివాళ్ళకు ఇతరుల చరిత్ర జీర్ణంకాదు.


Crime and Punishment 
దొంగతనం జరిగినపుడెల్లా వాడుకగా రెండు సూచనలు ముందుకు వస్తుంటాయి.మొదటిది, దొంగను కఠినంగా శిక్షించాలనీ. రెండోది, ఇళ్ళకు పెద్ద తాళంకప్పలు వేసుకొవాలనీ. ఈ రెండు సూచనలు ఇవ్వడానికి మనుషులకు మెదడు అనే పదార్ధం లేకపోయినా ఫరవాలేదు.

Being 

సృష్టిలో అయినా, సమాజంలో అయినా ఏదీ ఊరికే ఉనికిలోకిరాదు. ఏదీ ఊరికే పోదు. ఒక అంశం పుట్టుకకుగల కారణాలను రూపమాపకుండా, దాన్ని ఎన్నటికీ రూపమాపలేం.



Best & Most Terrible Seasons of Life
Friday, December 23, 2011


యక్ష :         జీవితంలో అన్నింటికన్నా గొప్ప రుతువేదీ?
యుధిష్ఠిర:    మన శత్రువులు కూడా మన వ్యక్తిత్వాన్ని మెచ్చుకునే కాలం. 

యక్ష :         జీవితంలో అన్నింటికన్నా బాధాకర రుతువేదీ?
యుధిష్ఠిర:    మన మిత్రులు కూడా మన శత్రువుల నాదస్వరాలకు నాట్యమాడే కాలం. 


24 January 2013
Stupid people
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మిత్రులతో మాట్లాడవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శత్రువులతో మాట్లాడవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మూర్ఖులతో మాట్లాడలేము.

24 January 2013
Stupid people
మూర్ఖులకు అద్భుత శక్తి వుంటుంది. ఎంతటి గొప్పవాళ్లనైనా వాళ్ళు తమస్థాయికి దిగజార్చేయగలరు. 

24 January 2013
Beauty of life
జీవనశౌందర్యం అంటే మరేదోకాదు అణగారినవాళ్ళు స్వేఛ్ఛా గాలులు పీల్చడానికి చేసే పెనుగులాట.  


26 January 2013

Man and Private Property

మనుషులు మనుషులుగా వున్నప్పుడు మనుషులుగానే వుండాలనుకుంటారు.

కానీ, స్వంతాస్థి భావన మనుషులను ఎన్నడూ మనుషులుగా వుండనివ్వదు.



Private Property and Selfishness

స్వంతాస్థి భావన మనసుల్ని స్వార్ధంతోనో, నిర్వేదంతోనో నింపేస్తుంది.

మనుషుల్ని స్వార్ధపరులుగానో, నిస్సహాయులుగానో మార్చేస్తుంది.



Man and Woman Relations



స్త్రీ-పురుష సంబంధాల గురించి మనం మాట్లడేదంతా, సారాంశంలో,  ఆస్తిసంబంధాల గురించే.



Human Relations

నిజానికి ఈనాడు మనం చూస్తున్న మానవ సంబంధాలన్నీ, సారాంశంలో ఆస్థి సంబంధాలే.

Human Relations
మనిషితప్ప, సృష్టిలో ఏ జీవీ దుస్తులు ధరించదు. పారదర్శకంగావుంటుంది.
మనిషి దుస్తులులేకుండా తిరగలేడు, భావోద్వేగాలు లేకుండా ఆలోచించలేడు

Nature , private property  and man
ప్రకృతి నుండి మనిషి స్వంతాస్థిని సృష్ఠించాడు. 
స్వంతాస్థి మనిషి నుండి ఒక స్వార్ధపరుడ్ని సృష్ఠించింది.

Private property -  Bane and Bliss
స్వంతాస్థి మానవత్వానికి ఒక శాపం. విచిత్రం ఏమంటే, 
స్వంతాస్థి కోసమే మనిషి జీవితాంతం తప్పస్సు చేస్తాడు. 

Learned Person
జ్ఞానుల్ని నాలుగుసార్లు కలవకండి

జ్ఞానుల్ని మొదటిసారి కలిసినపుడు, వాళ్ల జ్ఞానం మీద గౌరవభావంతో మొక్కాలనిపిస్తుంది.
జ్ఞానుల్ని రెండవసారి కలిసినపుడు, వాళ్ళ జ్ఞానాన్ని ఎలాగైనా తస్కరించాలనిపిస్తుంది
జ్ఞానుల్ని మూడవసారి కలిసినపుడు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానంతోనే వాళ్ళను అధిగమించాలనిపిస్తుంది
జ్ఞానుల్ని నాలుగవసారి కలిసినపుడు, ఆత్మన్యూనతాభావంతో వాళ్లపై నైతిక దాడి చేయాలనిపిస్తుంది. 




Women and private property
స్వంతాస్థి లేకుంటే వారసత్వపు హక్కులు వుండవు.
వారసత్వపు హక్కులు లేకుంటే స్త్రీలు పాతివ్రత్యాన్ని పాటించాల్సిన పని వుండదు.  
స్త్రీలు పాతివ్రత్యాన్ని పాటించాల్సిన పనిలేకుంటే వాళ్లమీద పురుషాధిపత్యం వుండదు.
పురుషాధిక్య సమాజంలో విత్తనానికే హక్కులుంటాయి; భూమికి వుండవు.

Women and private property
స్వంతాస్థి లేకుంటే వారసత్వపు హక్కులు వుండవు.
వారసత్వపు హక్కులు లేకుంటే స్త్రీలు పాతివ్రత్యాన్ని పాటించాల్సిన పని వుండదు.  
స్త్రీలు పాతివ్రత్యాన్ని పాటించాల్సిన పనిలేకుంటే వాళ్లమీద పురుషాధిపత్యం వుండదు.
పురుషాధిక్య సమాజంలో విత్తనానికే హక్కులుంటాయి; భూమికి వుండవు.

Women’s Lib
స్త్రీల విముక్తి పోరాటాలు స్వంతాస్థిని రద్దు చేయడం కోసం సాగాలి.
కానీ, సాంస్కృతిక  శేషదుష్ప్రభావం కారణంగా, తరచూ,  తద్వేతిరేకంగా జరుగుతుంది.
ముందువాళ్ళు పాతివ్రత్యాన్ని ప్రేమించి, తరువాత స్వంతాస్థిని ప్రేమించవచ్చు.
లేదా, ముందు స్వంతాస్థిని ప్రేమించి, తరువాత పాతివ్రత్యాన్ని ప్రేమించవచ్చు.

Oppressed and Private property  
పీడితవర్గాల  విముక్తి పోరాటాలు స్వంతాస్థిని రద్దు చేయడం కోసం సాగాలి.
కానీ, సాంస్కృతిక  శేషదుష్ప్రభావం కారణంగా, తరచూ,  తద్వేతిరేకంగా జరుగుతుంది.
ముందువాళ్ళు ఆధిపత్యవిధానాలని ప్రేమించి, తరువాత స్వంతాస్థిని ప్రేమించవచ్చు.
లేదా, ముందు స్వంతాస్థినే ప్రేమించి, తరువాత ఆధిపత్యవిధానాలని  ప్రేమించవచ్చు.
ఈ దుష్పరిణామాల్ని నివారించడానికి సమాజానికి ఎప్పుడూ ఒక అగ్రగామిదళం కావాలి. 


Chaste and Commercial sex   

మనం స్వంతాస్తిని పరిరక్షించుకున్నంత కాలం సమాజంలో దొంగలు వుంటారు.
పాతివ్రత్యం, ఏకపత్నీవ్రతం వున్నంతకాలం సమాజంలో వేశ్యా వృత్తి, వివాహేతర సంబంధాలు వుంటాయి.  


Plastic Money Generation

క్రెడిట్ కార్డ్ తరం 

కష్టపడు, సంపాదించు, ఆస్వాదించు  -  పాతతరం

ఆస్వాదించు, చెల్లించు, కష్టపడు     -  కొత్తతరం



Weaker Sections

బలహీనవర్గాలు పొలాల్లో పండిస్తారు, ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేస్తారు. ఉద్యమాల్లో తుపాకీగుళ్ళకు ఎదురెళతారు. విజయాల్లో పక్కకు నెట్టివేయబడతారు


Ban on Literature

ఎప్పుడైనాసరే, కళాసాహిత్యాల నిషేధం అనేది కోరదగ్గ అంశంకాదు.
సాంస్కృతిక దాడిని సాంస్కృతిక దాడితోనే ఎదుర్కోవాలి.
వాదించే శక్తిలేనపుడు మనుషులు తిట్లు లంఘించుకుంటారు.
ప్రభుత్వాలు నల్లచట్టాలను రూపొందిస్తాయి 

Rulers, Ruled and Art

కళను కళగానే చూడాలనేది పాలకవర్గాల భావజాలం.
కళను సామాజికంగానే చూడాలనేది పాలితుల చారిత్రక అవసరం.

Comfort ability  and individual
సౌకర్యవంతంగా బతకాలనే ఆలోచన వచ్చిన మరుక్షణమే మనిషి చనిపోతాడు.


Modernsociety and comforts

సౌకర్యాలను సాధించడమే మనిషి సామర్ధ్యానికి అంతిమ కొలమానంగా ఆధునిక సమాజం మార్చేస్తుంది.

Modern Society and Human relations
ఆధునిక సమాజం అనేది ఒక భ్రమ. అందులో మానవ సంబంధాలు వుండవు. వుండేదల్లా మానవ వినాశనమే.

Parents, Children and comfortism
పిల్లలు సౌకర్యంగా జీవించాలని తల్లిదండ్రులు తమ సౌకర్యాలను ఫణంగా పెడతారు. సౌకర్యాలు ఒక సంస్కృతిగా మారగానే పిల్లలు మొదట మోసంచేసేది తలిదండ్రులనే

Parents and children

మన తల్లిదండ్రులు మన కోసం  వాళ్ళ సర్వస్వాన్ని ఫణంగా పెడతారు. మనం మన సౌకర్యాల్లో ఆచితూచి కొంత భాగాన్ని మాత్రమే వాళ్లకు ఇస్తాము.

Parents, children and Parents
మన తల్లిదండ్రులు మన కోసం  వాళ్ళ సర్వస్వాన్ని ఫణంగా పెడతారు. మనమూ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తాము. ఇందులో మర్మం ఏమంటే, మన పిల్లలకు  మన సర్వస్వాన్ని ఫణంగా పెట్టే క్రమంలో మనం మన తల్లిదండ్రులకు అన్యాయం చేస్తాము

Selfishness
స్వార్ధానికి కొనసాగింపే మోసం.  

Individual and family
మన ఆలోచనలు కుటుంబం చుట్టూ తిరుగుతాయన్నది ఒక భ్రమ. మన ఆలోచనలు  మన చుట్టే తిరుగుతాయి.





Modernsociety and invidual
ఆధునిక సమాజంలో వ్యక్తి మాత్రమే వుంటాడు. సమూహం వుండదు. మనిషి సమూహం నుండి ఒంటరి అవుతాడు.

Social group and individual
సమూహం  లేకుండా మనిషి బతకలేడు. కానీ, సమూహాన్ని అధిగమించి మనిషి ఎదగాలనుకుంటాడు. అదే ఆధునిక జీవితంలో వైవిధ్యం.

Betrayals of parents
మనమంతా తల్లిదండ్రుల ద్రోహులం.

Society and individual
సమాజానికి భిన్నంగా వుండేవారూ కొందరు వుంటారు. అయితే, మనుషుల్ని తనకు భిన్నంగా సమాజం ఎన్నడూ వుండనివ్వదు.

Modern society and Parents
మనం మన తలిదండ్రుల్ని బాగా చూసుకోవాలనేది మన వ్యక్తిగత ఆలోచనఆధునిక సమాజ చలన శక్తులు  దాన్ని ఒప్పుకోవు.

Everything for children
అసలు కిటుకంతా పిల్లలకు సర్వస్వం ధారపొయాలనేదానిలోనే వుంది. పిల్లలకు సర్వస్వం ధారపోసాక ఇంకేమీ మిగలదు కనుక అలాంటివాళ్ళు మిగిలినవారు ఎవరికీ ఏమీ ఇవ్వలేరు. ఆక్రమంలో మనుషులు తల్లిదండ్రుల్నేకాదు, తమనుతాము కూడా మోసం చేసుకుంటారు. దీన్ని నేరము-శిక్ష అనే అర్ధంలో చూడకూడదు. ఒక జీవన విధానంగా చూడాలి. ఇప్పుడుదాన్నే మార్చాలి.

Relativity between parents and children
Relativityతల్లిదండ్రులు, పిల్లలు అనేవి సాపేక్ష పదాలు. తల్లిదండ్రుల నుండి పిల్లలు పుట్టుకొచ్చినట్టే, పిల్లల నుండి తల్లిదండ్రులు పుట్టుకువస్తారు.




Three generations

ప్రతికుటుంబంలో మూడుతరాలు వుండాలి. పోషించినవాళ్ళు, పోషిస్తున్నవాళ్ళు, పోషించేవాళ్ళు. ఇదొక వృత్తం. తరాల స్థానాలు ప్రతి తరానికీ మారిపోతుంటాయి.


Three generations

కుటుంబం అంటే కనీసం మూడు తరాల సమిష్టి ఆర్ధిక సమూహం.

Family and three generations
మూడుతరాలులేని జీవనవ్యవస్థని, కుటుంబం అనకూడదు.
కలిసి జీవించే వ్యక్తుల సంఖ్యనుబట్టి, వాటిని, ఇంగ్లీషులో,  Nuclear, solo parent, Atomistic  వగయిరా పేర్లతో పిలుస్తున్నారు.

Market and family
మార్కెట్ గురించి మాట్లాడకుండా కుటుంబం, సమాజం గురించి ఎంత మాట్లాడినా మనం సమస్యను కనీసంగా తడిమినట్టు కూడా కాదు. మనం ఇంటా బయట ఎదుర్కొంటున్న సంస్థాగత విషాదాలకు మూలం మార్కెట్టే!

Television   
బయటికి వెళితే బూచాడు పట్టుకు పొతాడని పిల్లల్ని తలిదండ్రులు భయపెట్టేవాళ్ళు. ఇది యాభై యేళ్లక్రితం నాటి సంగతి. ఇప్పుడు బూచాడిని ఇంట్లోకి తెచ్చి, అగ్రపీఠం మీద కూర్చోబెట్టి పిల్లల్ని అప్పచెపుతున్నారు తల్లిదండ్రులు.

Television  
మన ఇళ్లల్లోకి చాలా విషయాలను ఉచితంగా తీసుకువస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికది మనల్ని పట్టుకుపోయి మార్కెట్ కు  అప్పచెపుతుంది.

Market  
మార్కెట్ ప్రవేశమూ, కుటుంబ వ్యవస్థ పతనం ప్రారంభమూ ఒక్కసారే మొదలవుతాయి.


Market  
మార్కెట్ ప్రభావంతో, మనిషి పగలంతా సామాజిక జీవితానికి  చిల్లులు పెటుతుంటాడు. సామాజిక సంబంధాలు పతనమైపోతున్నయని రాత్రంతా ఏడుస్తుంటాడు.

Market
మార్కెట్ మన జీవితాల్లోకి ఆనందాన్నీ, దుఖ్ఖాన్నీ నింపుతుందితియ్యటినీళ్ళు ఆవిరైపోయి, సముద్రపు నీరు ఉప్పగైపొయినట్టు ఆనందం ఆవిరైపొతుంది. దుఖ్ఖం స్థిరపడిపొతుంది.

Caretaking
మనల్ని విమర్శించాల్సినవాళ్ళు విమర్శించనపుడు మనల్ని మనమే విమర్శించుకుందాం.
మనల్ని పొగడాల్సినవాళ్ళు  పొగడనప్పుడు  మనల్ని మనమే పొగుడుకుందాం. అప్పుడు అతివిశ్వాసమూ తగ్గుతుంది. ఆత్మన్యూనతా తగ్గుతుంది; అపధ్ధర్మం


Crony Capitalism



క్రొనీ క్యాపిటలిజం కొద్ది మందిని రాత్రికిరాత్రే సహస్ర కోటీశ్వరుల్ని చేసేస్తుంది. మిగిలిన శతకోటి జనంలో వ్యామోహాన్ని పెంచి స్వీయవినాశనానికి దారితీస్తుంది.  


Purchasing capacity

మారుతున్న తరాలు

 1950 ల నాటి తరాల దగ్గర కొనడానికి శక్తీ వుండేదికాదు, కొనుక్కోవడానికి బజార్లో సరుకులూ, వస్తువులు వుండేవికావు.

 1970ల నాటి తరాలు అవసరాన్నిబట్టి,  స్తోమతనుబట్టి బజార్లో  సరుకులు, వస్తువులు కొనేవారు.

 2000 ల నాటి తరాలు అవసరం, స్తోమతలబట్టికాక బజార్లో అమ్ముతున్నారు గాబట్టి సరుకులు, వస్తువులు కొంటున్నారు. 


Three Seasons

మూడు రుతువులు

బాల్యంలో మనిషి పని నేర్చుకుంటాడు, ఇతరులమీద ఆధారపడతాడు.

యవ్వనంలో మనిషి పనిచేస్తాడు, ఇతరులనీ పొషించగలుగుతాడు
వృధ్ధాప్యంలో మనిషి పనిచేయలేడు, ఇతరుల మీద ఆధార పడతాడు.