Wednesday, 13 September 2023

Chandrababu Political Dilemma / 11 09 2023 / Danny Comment

 Chandrababu  Political Dilemma / 11 09 2023 / Danny Comment

 చంద్రబాబు 'ఇండియా' కూటమిలో  చేరుతారా?

 తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును  అరెస్టు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా పెద్ద కుదుపుకు గురయ్యాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సెప్టెంబరు 9 సోమవారం  చంద్రబాబును సిఐడి పోలీసులు నంద్యాలలో అరెస్టు చేశారు. సిఐడి న్యాయస్థానం వారిని మంగళవారం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడికి రాజమండ్రి జైలుకు పంపింది.

 చిత్రమైన రాజకీయాలు

 ఆంధ్రప్రదేశ్  రాజకీయాలు చిత్రమైనవి.  వైయస్ జగన్ మోహనరెడ్డి నాయకత్వంలోని వైసిపి ఇక్కడ అధికార పార్టి. నారా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టి ఇక్కడ ప్రతిపక్షపార్టి. బిజెపికి ఇక్కడ ఒక్క శాసనసభ్యుడు కూడ లేరు. ఒక్క శాతం ఓట్లు కూడ లేవు. గత ఎన్నికల్లో బిజెపికి 0.85 శాతం ఓట్లు పడ్డాయి.  అయినప్పటికీ వైసిపి, టిడిపి రెండూ పార్లమెంటులో బిజెపికి అనుకూలంగా వుంటాయి. జగన్ చంద్రబాబు ఏపిలో కుస్తీ – ఢిల్లీలో దోస్తి.

 జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. అయితే, ఏపిలో జనసేన మూడవ పెద్ద పార్టి.  గత ఎన్నికల్లో జనసేనకు 5.5 శాతం ఓట్లు వచ్చాయి. ఏపిలో బిజెపికన్నా జనసేన 6, 7 రెట్లు పెద్ద పార్టి. కాపు సామాజికవర్గంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ వుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ బిజెపి ఇచ్చే రోడ్ మ్యాప్ ప్రకారం చాలా నమ్మకంగా నడుచుకుంటుంటారు.  ఆయన్ని జనసైనికుడు అనడంకన్నా బిజేపి సైనికుడు అనడం మేలు.

 ‘కింగ్ మేకర్ ‘

వచ్చే ఎన్నికల్లో జనసేన గెలిచి అధికారాన్ని చేపడుతుందనే నమ్మకం పవర్ స్టార్ కు లేదు. అది వారి గొప్పతనం. తన బలహీనతల గురించి తనకు స్పష్టమైన అంచనా వుండడం కూడ గొప్పతనమే. అందువల్ల వారికి వారే పెట్టుకున్న టైటిల్ ‘కింగ్ మేకర్ ’ క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో గ్రీసు యువరాజు అలెగ్జాండర్ కు అనేక శాస్త్రాలు బోధించి కింగ్ మేకర్ అనిపించుకున్నాడు అరిస్టాటిల్. ఇప్పటి  కింగ్ మేకర్ వేరు. చంద్రబాబు గెలుపుకు పదో పరకో సీట్లు తగ్గితే తను సరఫరా చేసి ఆదుకుందామనే గొప్ప హృదయం వారిది. పవర్ స్టార్ కింగ్ మేకర్ వ్యూహం నచ్చని వాళ్ళు ఆయన్ని ‘ప్యాకేజి స్టార్’ అంటుంటారు. 

 ఒకప్పుడు శాసన సభల్లో ప్రతిపక్షం అంటేనే కమ్యూనిస్టులు అనుకునేవారు. ముందు ఆంధ్ర రాష్ట్రంలో, తరువాత ఆంధ్రప్రదేశ్ లో  చాలాకాలం కమ్యూనిస్టుల హవా నడిచింది. పార్లమెంటేరియన్లు అంటేనే కమ్యూనిస్టులు అనుకునేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. విలువలు లేనివారినే జనం  ఏరికోరి ఓట్లు వేస్తున్నారు.  నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటి వరకు వామపక్షాలకు  ప్రాతినిధ్యం లేదు.  దానితో సిపిఎం, సిపిఐ  అవమాన భారంతో కుమిలిపోతున్నాయి.  ఎవరో ఒకరి పంచన చేరి ఈసారైనా ఒక్క సీటు అయినా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని అవి తపిస్తున్నాయి. టిడిపితో పొత్తుకోసం సిపిఐ ప్రయత్నిస్తున్నట్టు వైసిపితో పొత్తు కోసం సిపిఎం ప్రయత్నిస్తున్నట్టు కొంతకాలంగా గట్టిగానే వినిపిస్తోంది.

నైరాశ్యలో కాంగ్రెస్

 ఏపి కాంగ్రెస్ గత పదేళ్ళుగా పూర్తి నైరాశ్యంలో వుంది. కాంగ్రెస్ ద్వార ప్రయోజనాలు పొందిన నాయకులు  క్రమంగా ఇతర పార్టీలకు  వలస వెళ్ళిపోయారు. పార్టి భవిష్యత్తును నమ్మి కాంగ్రెస్ మీద నిధులు ఖర్చు పెట్టేవారు ఇప్పుడు లేరు. రాహుల్ గాంధీ ‘భారత జోడో’ యాత్ర తరువాత మాత్రమే కాంగ్రెస్ రాష్ట్ర ఆఫీసులో కొందరు కార్యకర్తలు కనిపిస్తున్నారు.  కొన్ని కార్లు ఆగుతున్నాయి. రాత్రుళ్ళు కొన్ని లైట్లు వెలుగుతున్నాయి.

 అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బిజెపి

రాష్ట్ర విభజన కారణంగా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్ మీద చాలా గుర్రుగా వున్నారు.  అప్పటికి అధికారంలో వున్న పార్టికి ఒక్క సీటు కూడ రాకుండా ఓడించారు.  ఇప్పటి పరిస్థితి వేరు.  ప్రత్యేక హోదా, రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృధ్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తదితర అంశాల్లో బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపిని నిర్లక్ష్యం చేస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వుంది.  ఇప్పుడు ఏపి ప్రజలు స్థూలంగా బిజెపికి వ్యతిరేకంగా వున్నారు.  ఇక్కడ ఓట్లు సాధించడానికి బిజెపి దగ్గర ఒక్క ఆయుధం కూడ లేదు. ఒక్క నినాదం కూడ లేదు.

 జగన్ రాజును మించిన రాజభక్తి’

తన స్వంత బలం మీదనే, సింగిల్ హ్యాండెడ్ గా ఎన్నికల్లో గెలవాలనేది జగన్ అభిమతంగా వుంది.  గతంలో లానే 2024 ఎన్నికల్లోనూ వైసిపి  మరొకరితో పొత్తు పెట్టుకోవడం, సీట్లు పంచుకోవడం జగన్ కు ఏమాత్రం ఇష్టంలేదు. కేంద్రంలో బిజెపి విషయంలో జగన్ ‘రాజును మించిన రాజభక్తి’ని చాటుకుంటున్నారు. విచిత్రం ఏమంటే జగన్ ఓటు బ్యాంకులో రెడ్డి సామాజికవర్గంతప్ప అత్యధికులు బిజెపికి పూర్తి  వ్యతిరేకులు. మరీ ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీలు. జగన్ బిజెపికి అంతే విధేయంగావుంటే ఆ మేరకు ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీల ఓట్లు తగ్గుతాయి. ఏపి పోలీసులు కూడ జగన్ ఓట్లను తగ్గించడంలో తమవంతు కృషి గట్టిగానే చేస్తున్నారు.

 జగన్ కు  లోక్ సభలో 22 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం లోక్ సభకన్నా విలువైన రాజ్యసభలో 12 మంది సభ్యులున్నాయి. అయినప్పటికీ, ఒక్క మంత్రి పదవిని కూడ కోరుకోకుండా జగన్ బిజెపికి ఉచిత సేవలు అందిస్తున్నారు.  ఆయన ఏపిలో ‘బిజెపికాని బిజెపి’.

 చంద్రబాబు పొత్తు సెంటిమెంటు

 2019 ఎన్నికల్లో అనూహ్యంగా  ఘోర పరాజయం పొందిన తరువాత  చంద్రబాబుకు ఎన్నికల ఫోబియా పట్టుకుంది. ఎన్నికల్లో ఒంటరిగా పోవడానికి వారు భయపడుతున్నారు.  కూటమిగా పోవడమే మేలని వారు భావిస్తున్నారు.  ఆయన్నిప్పుడు 2014 ఎన్నికల సెంటిమెంటు వెంటాడుతోంది.  తనూ, మోదీ, పవన్ కళ్యాణ్  మళ్ళీ కలిస్తే మరొక్కసారి ఘనవిజయాన్ని సాధించవచ్చని ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నారు.  అది జరిగే పని కాదని ఆయన సన్నిహితులకు, ఆయన్ను సమర్ధించే మీడియా సంస్థలకు  కూడ తెలుసు.కానీ, ఆ విషయం వారికి మాత్రం అర్ధం కావడంలేదు.

 ఓట్లు చీలకూడదు

పవన్ కళ్యాణ్ కూడ దాదాపు చంద్రబాబు మైండ్ తోనే ఆలోచిస్తున్నారు.  జనసేన, టిడిపి, బిజేపి కలిసి  జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండ చూస్తే  తమ గెలుపు ఖాయమని ఆయన పదేపదే చెపుతున్నారు.  కేంద్రంలో అధికారంలో వున్న పార్టి అనే ఒకే ఒక్క మాటతప్ప  ఏపిలో బిజెపికి ఓట్లు లేవు.  పవన్ కళ్యాణ్ నే నమ్ముకుని ముందుకు పోవాల్సిన దయనీయ స్థితి ఆ పార్టీది. 

 జగన్ మీదే బిజెపికి నమ్మకం

బిజెపి దృష్టిలో జగన్ కాంగ్రెస్ తో విభేధించి బిజెపి పంచచేరిన రాజకీయ నాయకుడు. చంద్రబాబు బిజెపి తో విభేధించి కాంగ్రెస్ దగ్గరకు వెళ్ళగల నాయకుడు.  అంచేత, బిజెపి జగన్ ను నమ్మినంతగా చంద్రబాబును నమ్మదు. ఏపిలో వచ్చే ఎన్నికల్లోనూ జగన్ గెలవడమే మేలని బిజెపి భావిస్తోంది.  ఆ తరువాత వచ్చే 2029 ఎన్నికల సంగతి అప్పుడు చూసుకోవచ్చనేది ఆ పార్టి వ్యూహంగా కనిపిస్తున్నది.

 చంద్రబాబు ఒన్ సైడ్ లవ్

`         కేంద్ర హోంమంత్రి అమిత్ షా  బహిరంగ సభల్లోనూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశాల్లోనూ జగన్ ను గట్టిగానే విమర్శించారు. వాళ్లిద్దరూ పవన్ కళ్యాణ్ తో పొత్తు వుంటుంది అన్నారేగానీ చంద్రబాబుతో పొత్తు వుంటుందని ఒక్కసారి కూడ అనలేదు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తను గట్టెక్కాలంటే కేంద్రంలో అధికారంలోవున్న బిజెపి సహకారం అవసరం అని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. బిజేపితో ఆయన ‘ఒన్ సైడ్ లవ్’లో బాగా లోతుగా మునిగి తేలుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్ డిఏకు వ్యతిరేకంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి సరిగ్గా ఈ కారణంగానే చంద్రబాబును  దూరంగా పెట్టింది.

 ఎద్దేలు కర్ణాటక దిగ్భ్రాంతి

ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించే ఏకైన లక్ష్యంతో పనిచేసిన  పౌరసమాజం ‘ఎద్దేలు కర్ణాటక’ తెలుగులో ‘మేలుకో కర్ణాటక’ అని అర్ధం. ‘ఎద్దేలు కర్ణాటక’ బృదం రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించింది. ఇక్కడి పరిస్థితుల్ని పరిశీలించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ బిజెపిని ఓడించాలనేది ఆ సంస్థ లక్ష్యం. అయితే, ఇక్కడి రాజకీయ పరిస్థితి చాలా సంక్లిష్టంగా గందర గోళంలో వుంది. లోక్ సభ ఎన్నికల్లో వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి నాలుగు పార్టిల్లో దేనికి ఓటేసినా అవి అంతిమంగా బిజెపి ఖాతాలోనికే పోతాయనే అభిప్రాయం ఏపిలో కొన్నాళ్ళుగా  స్థిరపడిపోయింది. అందువల్ల, అసెంబ్లీ ఎన్నికల మీద వున్నంత ఆసక్తి ఎవ్వరికీ లోక్ సభ ఎన్నికల మీద లేకుండా పోయింది. ఏపీలో బిజెపిని ఓడించే ఒక పటిష్ట  వ్యూహాన్ని రచించలేక ‘ఎద్దేలు కర్ణాటక’  బృందం వెళ్ళిపోయింది.

 మోదీ అమిత్ షా లకు ముందే తెలుసా?

దేశ ప్రతిష్టకు సంబంధించిన జి-20 సమావేశాలు జరుగుతుండగా చంద్రబాబు అరెస్టుకు ముహూర్తం పెట్టారు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాజీలకు ఎపి ప్రభుత్వం బాబు అరెస్టు గురించి  ముందే తెలిపి వుంటుంది. మోదీ, అమిత్ షాలకు అసౌకర్యాన్ని కలిగించే పనులు ఏవీ జగన్ చేయరు; చేయలేరు. చేస్తారని ఎవరయినా అనుకుంటే అంతకన్నా అమాయకులు ఎవ్వరూ వుండరు.

 బాబు అరెస్టు టిడిపికి లాభమా? నష్టమా?

చంద్రబాబు అరెస్టు టిడిపికి లాభమా? నష్టమా? అనేదే ఇప్పుడు బిజెపి పరిశీలిస్తున్న అంశం. టిడిపి బుధవారం  పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ఏపిలోని ఏ జిల్లాలోనూ కనీస స్పందన కూడ రాలేదు. తెలుగుదేశం  రాజకీయాల కేంద్రంగా భావించే విజయవాడ నగరంలోనూ బంద్ ప్రభావం కనిపించలేదు. వన్ టౌన్ లో వస్త్ర సముదాయం మాత్రం మూసివేశారు. టిడిపి బంద్ ను ప్రజలు పట్టించుకోకపోవడం వైసిపికికన్నా బిజెపికే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చి వుంటుంది. వాళ్ళు అశిస్తున్నది కూడ ఇదే.  

  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు. 

 ఎన్ టి రామారావు నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా వున్న కాలంలోనే విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుండే చంద్రబాబుకు జాతీయ రాజకీయాలతో ఒక అనుబంధం వుంది. హెచ్ డి దేవ గౌడను  ప్రధానిని చేసిన యునైటెడ్ ఫ్రంట్ కు, అనంతరం ఏబి వాజ్ పాయిను ప్రధానిని చేసిన ఎన్ డిఏ కు కూడ అయనే కన్వీనర్ గా వున్నారు.  తన సూచన మేరకే ఏపిజే కలాం ను వాజ్ పాయి రాష్ట్రపతి చేశారని వారు తరచూ గుర్తు చేస్తుంటారు.  

 ఒంటరి బాబు

అప్పుడయితే వారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారుగానీ ఇవ్వాల్టి పరిస్థితి వేరు. చంద్రబాబు అరెస్టు అయితే ఎన్ డి ఏ నాయకులు స్పందించలేదు; ‘ఇండియా’ నాయకులు పరామర్శించలేదు. రాజకీయంగా ఇప్పుడు చంద్రబాబు ఒంటరివారయ్యారు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జి, అఖిలెష్ యాదవ్ తదితరులు లాంఛనంగా,  ఖండనలు ఇచ్చారు. అలా అనుకుంటే పురందేశ్వరి కూడ అరెస్టును ఖండించారు.  అదే పాతరోజులు అయితే, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, సీతారామ్ ఏచూరి ఈ పాటికి విజయవాడలో దిగిపోయేవారు.

 పవన్ కు రాజకీయం తెలీదు

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా లేత  కనుక చంద్రబాబు అరెస్టు కేసులో  జగన్ ను మాత్రమే విమర్శించారు. బాబు అరెస్టు వెనుక బిజెపి కేంద్ర పెద్దల సహకారం వున్నట్టు ఆయనకు తెలిసినట్టులేదు. సోము వీర్రాజును తప్పించినపుడే పవన్ కళ్యాణ్ కు ఒక విషయం అర్ధమై వుండాల్సింది; పురందేశ్వరిని పంపింది చంద్రబాబు కాళ్ళ కింది భూమిని లాగడానికని.  ఎపి రాజకీయాల్లో చంద్రబాబును బలహీనపరచి పవన్ కళ్యాణ్ ను ముందుకు తీసుకుని రావడం ఢిల్లీ బిజెపి  ‘డబుల్ ఇంజిన్’ వ్యూహం.  బిజెపి స్వంతంగా బలపడలేనప్పుడు పవన్ కళ్యానే వారికి దిక్కు.

 జైలు సెల్లో  జ్ఞానోదయం

రాజమండ్రి సెంట్రల్ జైలు రాజకీయ ఖైదీల స్పెషల్ విభాగంలో  ప్రవేశించాక చంద్రబాబుకు ఏపి కొత్త రాజకీయాల కొత్త కోణాల గురించి జ్ఞానోదయం అయ్యుంటుంది.  తను బిజెపితో ఒన్ సైడ్ లవ్ సాగించడం ఏపి ప్రజలకు నచ్చడంలేదని వారు తెలుసుకుని వుంటారు.  రాష్ట్ర బంద్ విఫలం కావడానికి అదే ప్రధాన కారణం అని గుర్తించి వుంటారు.  చంద్రబాబు అరెస్టు తరువాత ఒక్క టిడిపి నాయకుడు కూడ బిజెపి నేతల్ని పల్లెత్తు మాట అనలేదు. ఇప్పటికీ ఎన్డీఏ శిబిరంలో చేరాలనేది వారి ఆశయంగా కనిపిస్తున్నది. తాను మోదీ ప్రేమలో వున్నానంటూ పదేపదే చెప్పుకునే  రాజకీయ నాయకునితో ‘ఇండీయా’ టీమ్ కు పనేముంటుంది?

 బాబు వుండాల్సింది ‘ఇండియా’లో

 తను ఇప్పుడు వుండాల్సింది ‘ఇండియా’లో అని చంద్రబాబు గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోతాయి.   వామపక్షాలు ఇప్పటికే జాతీయ స్థాయిలో ‘ఇండియా’లో వున్నాయి.  పొత్తుల నిర్ణయం రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని సీతారాం ఏచూరి వంటివారు చెప్పి వున్నారు.  ఏపిలో కాంగ్రెస్ వామపక్షాలతో టిడిపి కలిసే అవకాశాలు పెరుగుతాయి.  చంద్రబాబుకు మరో ఆప్షన్ లేదు.  పవన్ కళ్యాణ్ ను బిజెపి మరింతగా ప్రమోట్ చేస్తుంది.  జగన్ తాను బిజెపి కాదంటూనే బిజెపి వెంట వుండక తప్పదు. అప్పుడుగానీ ఏపి రాజకీయాల్ని ఇప్పటిదాక కమ్ముకున్న మబ్బులు ఇక వీడిపోతాయి.

 జరిగేది ఇదే

జగన్ వైసిపి ఒంటరిగానే రంగంలో దిగుతుంది. ఇండియా టీమ్ లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ వగయిరాలు  ఎలాగూ వుంటాయి. చంద్రబాబుకు బిజెపి ఛాన్స్ ఇవ్వదు కనుక టిడిపి ఇండియాలో చేరుతుంది.  పవన్ కళ్యాణ్ బిజెపి ఇచ్చిన రోడ్ మ్యాప్ లో ముందుకుపోతారు.

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు

మొబైల్ : 9010757776

 రచన : 11 సెప్టెంబరు 2023

Thursday, 7 September 2023

Bunch of Thoughts – The Book Structure

 Bunch of Thoughts – The Book Structure

Parts, Chapters, sub- Chapters and Sub- Headings
4 parts, 23 Chapters, 14 sub- chapters and about 100 sub-headings
Parts
1. Part One - The Mission
2. Part Two - The Nation And Its Problems
3. Part Three - The Path To Glory
4. Part Four – Moulding Men

Part One – The Mission
Chapters
1. Our World Mission
2. Challenge Of The Time
3. Call For Our National Soul
4. For True National Glory
5. Live Positive Dynamic Hinduism
6. Vision of Our Work
Part Two – The Nation And Its Problems
Chapters
7. Our Mother Land (Sub- Chapters 1. The Grand Vision 2. Wanted Heroic Devotion)
8. Children of The Motherland
9. For a Virile National Life
10. Territorial Nationalism
11. Call For Courage of Conviction
12. Internal Threats (Sub- Chapters 1. The Muslims 2. The Christians 3. The Communists)
Part Three – The path To Glory
Chapters
13. Meeting the Historic Need
14. The Eternal Basis
15. The Elixir of National Life (Sub-Chapters 1. World Of Reality, 2. The Ultimate Sanction.
16. Worshippers of Victory
17. Fight To Win (Sub-chapters 1. The Right Measures 2. The Right Philosophy)
18. Nation at War (Sub-chapters 1. Call Of a new Era 2. Meeting the challenges)
Part Four – Moulding Men
Chapters
19. The Technique the Succeeds (Sub-chapters 1. For True National Reorganisation 2, The Right Approach 3. Efficacy of the Technique)
20. Character – Personal and National
21. Be Men With Capital ‘M’
22. Men With Mission
23. The Ideal Incarnate

Part One - 'The Mission' "The Mission" is one of the sections in the book "Bunch of Thoughts" by M.S. Golwalkar, the second Sarsanghchalak (Supreme Leader) of the Rashtriya Swayamsevak Sangh (RSS). This section outlines the RSS's vision and mission for the transformation of Indian society based on its ideological framework. "Bunch of Thoughts" is a collection of Golwalkar's speeches and writings, which provide insights into the RSS's ideology and goals. In "The Mission" section, Golwalkar discusses the following key themes: Cultural and National Identity: Golwalkar emphasizes the importance of preserving and promoting India's cultural and national identity. He believes that the Indian identity is deeply rooted in its ancient civilization and values. The RSS sees itself as a guardian of this identity and aims to protect it from what it perceives as external influences. Hindutva: The section expounds on the concept of Hindutva, which is central to the RSS's ideology. Golwalkar defines Hindutva as a cultural and nationalistic ideology that seeks to unify and strengthen the Hindu community. He believes that Hindutva is the essence of Indian identity and culture and should serve as the basis for national unity. Social Transformation: Golwalkar envisions a social transformation in India based on the principles of Hindutva. He emphasizes the need for individuals to imbibe Hindu cultural values and virtues, which he considers essential for the progress and well-being of society. National Unity: The RSS's mission, as outlined in this section, is to foster national unity and integration. Golwalkar believes that a unified Hindu society is the cornerstone of a strong and prosperous India. He calls for the eradication of divisions within the Hindu community. Role of the RSS: In "The Mission," Golwalkar underscores the role of the RSS in realizing its vision for India. He sees the organization as a vehicle for social and cultural reform, with the potential to shape the destiny of the nation. Critique of Westernization: Golwalkar expresses concerns about the influence of Westernization and materialism on Indian society. He believes that the adoption of Western values and lifestyles has eroded traditional Indian culture and values. It's important to note that Golwalkar's writings and the RSS's ideology have been a subject of debate and controversy. Critics argue that the organization's vision and mission, as outlined in "Bunch of Thoughts," promote a narrow and exclusionary form of nationalism that marginalizes religious and cultural minorities. Supporters, on the other hand, view the RSS as a defender of Hindu culture and values. "The Mission" section of "Bunch of Thoughts" reflects the RSS's ideological stance on cultural preservation, national identity, and the role it envisions for itself in shaping India's future. It provides insight into the organization's goals and aspirations for Indian society based on its interpretation of Hindu culture and Hindutva.


Part Two - The Nation And Its Problems

Part Three - The Path To Glory


Part Four – Moulding Men

The chapter titled "Moulding Men" from the book "Bunch of Thoughts" by M.S. Golwalkar, the second Sarsanghchalak (Supreme Leader) of the Rashtriya Swayamsevak Sangh (RSS), is a significant part of the book that outlines the RSS's ideological perspective on education and character formation. "Bunch of Thoughts" is a collection of Golwalkar's speeches and writings, which reflects the RSS's worldview and ideology. In the chapter "Moulding Men," Golwalkar discusses the role of education in shaping individuals and society. Here are some key points from this chapter: Character Formation: Golwalkar emphasizes the importance of education in building character and molding individuals into responsible, morally upright citizens. He argues that character development is as crucial as intellectual growth and that education should focus on both aspects. Holistic Education: Golwalkar advocates for a holistic approach to education that nurtures the physical, intellectual, emotional, and spiritual dimensions of an individual. He believes that a well-rounded education is essential for producing well-balanced individuals. Cultural and Moral Values: The chapter underscores the significance of imparting cultural and moral values through education. Golwalkar believes that education should instill a sense of pride in one's culture, heritage, and moral principles. He suggests that a strong foundation in these values is essential for the preservation of the nation's identity. Nationalism: Golwalkar's writings often contain strong nationalist sentiments. In "Moulding Men," he argues that education should cultivate a sense of patriotism and love for one's nation. He sees this as a vital element in producing responsible citizens who are dedicated to the welfare and progress of their country. Critique of Western Education: Golwalkar expresses concerns about the Western model of education, which he believes can lead to a disconnect from Indian cultural and spiritual values. He suggests that an education system rooted in Indian traditions and values would be more suitable for the nation. Role of the Guru: In line with the RSS's traditionalist approach, Golwalkar highlights the role of the guru (teacher) in imparting knowledge and values. He views the guru as a mentor who not only imparts academic knowledge but also guides students in ethical and spiritual matters. It's important to note that "Bunch of Thoughts" reflects the ideological perspective of the RSS, which is a right-wing Hindu nationalist organization in India. The book and Golwalkar's writings have been both praised and criticized for their views on education, culture, and nationalism. While some view them as a source of inspiration for those who share similar beliefs, others criticize them for what they perceive as an exclusionary and divisive ideology. In summary, the chapter "Moulding Men" from "Bunch of Thoughts" by M.S. Golwalkar discusses the RSS's perspective on education, character formation, and the role of cultural and moral values in shaping individuals and society. It is a reflection of the organization's worldview and ideology regarding the education system in India.

Friday, 1 September 2023

Uniform Civil Code (UCC) : Ideals, Difficulties and Politics

 Uniform Civil Code (UCC) : Ideals, Difficulties and Politics

ఉమ్మడి పౌరస్మృతి : ఆదర్శాలు, ఇబ్బందులు, రాజకీయాలు

 

KNPS Meeting, Narasaraopet

10th July 2023 Sunday from 2 p.m.

 

Danny Talking Points

Duration : 60-75 Mnts.

 

వేదిక మీదున్న-

వేదిక ముందున్న-

పెద్దలందరికీ

 

జై భీమ్ !

జై మీమ్ !

 

మిత్రులారా!

 

1.            భారత రాజకీయార్ధిక సామాజిక రంగాల్లో ప్రస్తుతం మూడు అంశాల మీద చాలా తీవ్రంగా చర్చ జరుగుతోంది.

 

2.            వీటిల్లో మొదటిది ‘మణిపూర్ లో జాతి హననం’, రెండవది దేశ సంపదను కొందరు అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెట్టడం, మూడవది ఉమ్మడి పౌరస్మృతి.

 

3.            నిజానికి ఈ మూడు వివాదాలు విడివిడి అంశాలు కాదు; ఈ మూడింటి మధ్యన ఒక అంతస్సంబంధం వుంది. 

 

4.            సదస్సు నిర్వాహకులు నాకు ఇచ్చిన టాపిక్ ‘ఉమ్మడి పౌరస్మృతి : ఆదర్శాలు, ఇబ్బందులు, రాజకీయాలు’. నేను ఆ అంశాన్ని కేంద్రంగా తీసుకుని ప్రసంగిస్తాను. సందర్భాన్నిబట్టి అవసరమైన మేరకు మిగిలిన రెండు అంశాలతోవున్న అంతస్సంబంధాన్ని ప్రస్తావిస్తాను.

 

5.            సంఘపరివారానికి రాజకీయ విభాగంగా 1951లో భారతీయ జన సంఘ్ పుట్టింది. ఎమర్జెన్సీ తరువాత అది జనతా పార్టీలో విలీనమై  పనిచేసింది. అక్కడి నుండి బయటికి వచ్చి 1980 లోక్ సభ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ (బిజెపి)గా అవతరించింది.

 

6.            బిజెపి తొలిసారిగా 1984 లోక్ సభ ఎన్నికల్లో పాల్గొంది.

 

7.            పంజాబ్ లో కల్లోలం, దానికి ప్రతిగా ఆపరేషన్ బ్లూస్టార్, భింద్రేన్ వాల హత్య, దానికి ప్రతిగా అప్పటి ప్రధాని ఇంరిరాగాంధి హత్య, దానికి ప్రతిగా ఢిల్లీ పరిసరాల్లో శిక్కుల ఊచకోత అనంతరం ఆ ఎన్నికలు జరిగాయి.

 

8.            ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘన విజయం లభించింది. 47 శాతం ఓట్లతో రికార్డు స్థాయిలో 414 సీట్లు సాధించింది.

 

9.            మతమైనారిటీలను వేధిస్తే ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకు ధృవీకరణ జరుగుతుందనే ఒక కొత్త ఫార్మూలాను ఈ ఎన్నికలు ముందుకు తెచ్చాయి.

 

10.       1984 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలను మాత్రమే పొందిన బిజెపి ఢిల్లీ అల్లర్ల ఫార్మూలాను భారత దేశం మొత్తానికి అన్వయించి రాజకీయ లబ్దిపొందాలని వ్యూహాలు రచించింది.

 

11.       శిక్కులు కేవలం పంజాబ్, ఢిల్లీ పరిసరాలకు పరిమితమైన మత మైనారిటీ సమూహం. ఢిల్లీ ఫార్మూలాను దేశమంతటా అమలు చేయాలంటే అంతకన్నా పెద్ద మత మైనారిటీ సమూహమైన ముస్లింలను లక్ష్యంగా పెట్టుకోవాలని బిజెపికి అర్ధం అయింది.

 

12.       1925లో ఆరెస్సెస్ పుట్టినప్పుడే ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల్ని తమకు మూడు అంతర్గత శత్రువులని ప్రకటించింది.

 

13.       సంఘ లక్ష్యమూ, రాజకీయ సన్నివేశము రెండూ బిజెపికి కలిసి వచ్చాయి.

 

14.       అప్పటి వరకు కాంగ్రెస్ మిశ్రమ ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు వర్గపోరాట సిధ్ధాంతాన్ని కొనసాగిస్తూ వుండేవి.

 

15.       భారత రాజకీయాల్ని మతం కేంద్రంగా నడపడంలో బిజెపి గొప్ప నైపుణ్యాన్ని సాధించింది. ఆ ధాటికి ఇతర ఆధునిక సిధ్ధాంతాలు, విధానాలు వెనుకబడిపోయాయి. 

 

16.       ముస్లింలను వేధించడమే ఎన్నికల్లో తమ విజయరహాస్యం అని తెలుసుకున్న బిజెపి వ్యూహకర్తలు మూడు ప్రధాన అంశాలను ముందుకు తెచ్చారు.

 

17.       మొదటిది; అయోధ్యలో రామమందిర నిర్మాణం, రెండవది; ఆర్టికల్ 370 రద్దు; మూడవది; ఉమ్మడి పౌరస్మృతి అమలు.

 

18.       ఈ మూడూ సహజంగానే ముస్లింలను వేధించే లక్ష్యంతో  రూపొందించిన విధానాలు.

 

19.       నిర్మాణంకన్నా నిర్మూలనకు ఎక్కువ మద్దతు దొరికే కాలం ఇది.

 

20.       అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడంవల్ల వచ్చే ప్రయోజనంకన్నా బాబ్రీ మసీదును కూల్చడంవల్ల కలిగే రాజకీయ ప్రయోజనం ఎక్కువ.

 

21.       జమ్మూ కశ్మీర్ కు స్వయంప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370, 35 ఏ లను రద్దు చేయడంతోపాటు రాష్ట్ర హోదా కూడ లేకుండా చేశారు.

 

22.       భారత దేశంలో ఒక ముస్లిం అభ్యర్ధి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్న ఏకైక రాష్ట్రం ఇప్పుడు ఉనికిలో లేదు.

 

23.       ఇక మూడవ అంశం ఉమ్మడి పౌరస్మృతి.

 

24.       వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, ఆస్తి హక్కు (marriage, divorce, inheritance, adoption and property rights) లకు సంబంధించిన నియమనిబంధనల్ని పౌరస్మృతి అంటారు.

 

25.       ఉమ్మడి పౌరస్మృతి అనేది పశ్చిమ దేశాల ఆధునిక ఆదర్శం. భారత దేశం యూరోప్ దేశాల్లా భాషా ప్రయుక్త దేశంకాదు. మనది అనేక జాతుల, అనేక సంస్కృతుల, అనేక భాషల, అనేక వాతావరణాల  ఉపఖండం.

 

26.       ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించడం, దానిని అందరి చేత ఆమోదింపచేయడం దాదాపు అసాధ్యం.  

 

27.       ఆ తేనెతుట్టెను కదపడం ప్రమాదకరం అని  ఈస్ట్ ఇండియా కంపెనీ  రెండవ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్  గుర్తించాడు.

 

28.        పౌరస్మృతి వ్యవహారాన్ని ఆయా మత సమూహాల ఇష్టాఇష్టాలకు వదిలేశాడు.

 

29.       ముస్లిం సమాజం ఖురాన్ – హదీసుల్లోని నియమాలను తమ పౌరస్మృతిగా పాటించుకుంటామన్నారు. హిందూ సమాజం మనుస్మృతిని  పౌరస్మృతిగా  పాటించుకుంటామన్నారు.

 

30.       “That in all suits regarding inheritance, marriage, caste and other religious usages or institutions, the law of the Koran with respect to Mahometans [Muslims], and those of the Shaster with respect to Gentoos [Hindus] shall be invariably be adhered to” అంటూ 1772 ఆగస్టు 15న ఉత్తర్వులు జారీచేశాడు.

 

31.       పరిపాలనా సౌకర్యం కోసం బ్రిటీష్  విద్యావేత్త విలియం జోన్స  1792లో ‘అల్ సిర్జియా’ పేరున ముస్లిం పౌరస్మృతిని, 1794లో ‘the Institutes of Hindu Law or the Ordinances of Manuపేరున హిందూ పౌరస్మృతిని  రూపొందించాడు.

 

32.       1857నాటి భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాటం తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనపోయి నేరుగా బ్రిటీష్ వలస పాలన మొదలయింది.

 

33.       వలస దేశంలో మరో తిరుగుబాటును నివారించడానికి తక్షణం ఒక శిక్షాస్మృతిని రూపొందించాల్సిన అవసరం వారికి వచ్చింది.

 

34.       లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే 1860లో తొలిసారిగా భారత శిక్షాస్మృతి (ఐపిసి)ని రూపొందించాడు. ఇది ఉమ్మడి శిక్షాస్మృతి.

 

35.       పౌరస్మృతిని ఆ యా మత సమూహాల ‘పర్సనల్ లా’లుగా అనుమతించారు.

Thursday, 31 August 2023

Telugu entrepreneurs should promote Telugu Novels and stories

 *తెలుగు భాషను ప్రచారం చేసే బాధ్యతను

వాణిజ్య, వ్యాపారవేత్తలు స్వీకరించాలి!*

 

బ్రిటన్ పెట్టుబడీదారులు తమ అవసరాల కోసం ఇంగ్లీషును ప్రపంచ వ్యాప్తంగా ఎలా ప్రచారం చేశారో చెప్పడానికి ఎక్కడో ఒక సంఘటనను చదివాను. బ్రిటన్ లో పారిశ్రామిక విప్లవం సాగుతున్న కాలంలో ఛార్లెస్ డికెన్స్ రచయితగా వున్నాడు. ఆయన ఒక రకం కమ్యూనిస్టు. ఆయనకు పెట్టుబడీదారీ వ్యవస్థ పడదు; పెట్టుబడీదారులకు ఆయనంటే నచ్చదు. కానీ, డికెన్స్ వారంవారం ఒక థియేటరులో తన రచనల్ని స్వయంగా చదివి వినిపించేవాడు. దానికి సంపన్న కుటుంబాలవాళ్ళు టిక్కెట్టు కొని వచ్చి వినేవారు. ‘టేల్ ఆఫ్ టూ సిటీస్’ నవలలో రాచరిక వ్యతిరేకురాలైన మేడం డీఫార్జ్ వంటి మహిళా గెరిల్లా పాత్రను వర్ణిస్తుంటే సంపన్నవర్గాల స్త్రీలు కొన్ని సందర్భాల్లో తట్టుకోలేక మూర్చపోయేవారట.  అయినప్పటికీ డికెన్స్ నవలల్ని వాళ్ళు ప్రమోట్ చేసేవారట. ఎందుకటా? వాళ్ళకు అందులో ఒక మారకపు విలువ కనిపించింది. డికెన్స్ నవలల్లో పాత్రలు చాలా వినసొంపుగా మాట్లాడుకుంటాయి. ‘గ్రేట్ ఎక్స్ పెక్టేషన్’ లో ప్రొటోగోనిస్టు  పిప్ చిన్న పట్టణం నుండి లండన్ మహానగరానికి వచ్చి ఓ అడ్వకేట్ ఇంటికి వెళ్ళడానికి జట్కా ఎక్కుతాడు. జట్కావాడు ఆ అడ్వకేట్ ఇల్లు తనకు తెలుసనీ, ఆయన చాలా మంచివారని చెపుతాడు. అడ్వకేట్ ఇంటికి చేరాక “వారు ఆఫీసులో వున్నారు లైటు వెలుగుతోంది. మీరు అదృష్టవంతులు. సరైన సమయంలో వచ్చారు” వంటి వినయపూర్వక మెచ్చుకోలు మాటలు చెపుతాడు. అప్పుడు పిప్ “నీ సేవలకు నేను ఎంత రుణపడివున్నానూ?” అని అడుగుతాడు. ఆ  జట్కావాడు ఇంకా చతురతతో “సాధారణంగా ఐదు పెన్నీలు ఇస్తారండి; మీరు ఎక్కువ ఇవ్వాలనుకుంటే మీ ఇష్టం” అంటాడు. ఇంత సంస్కారంతో ఎవ్వరూ ఎక్కడా మాట్లాడుకోరు. కానీ ఇంగ్లండ్ వాసులు సంస్కారవంతులు అని ప్రపంచం నమ్మాలంటే డికెన్స్ నవలల్ని ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయాలనుకున్నారట ఆనాటి బ్రిటీష్ పెట్టుబడీదాడులు.

 

తెలుగును తెలుగు సమాజం కూడ ఆదరించడంలేదు. ఇంగ్లీషు, హిందీలను  పక్కన పెట్టినా కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పోల్చినా తెలుగు పుస్తకాలు చదివేవారు చాలాచాలా తక్కువ. కవితా సంకలనాలను కవులు పంచుకుంటూ తిరగడమేతప్ప కొని చదివేవారు వుండదు. కథా సంకలనాలదీ దాదాపు అదేస్థితి. నవలలు తెలుగులో పెద్దగా రావడంలేదు. తెలుగు కథలు, నవలల్ని అలా ఇతర ప్రాంతాల్లో పంపిణీ చేయాలి. ఆ బాధ్యతను తెలుగు వాణిజ్య వ్యాపార వేత్తలు చేపట్టాలి.

-      డానీ

సమాజవిశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

Remembering Gidugu Ramamurthy -

*గిడుగును అందుకు స్మరించుకోవాలి !*

 

ప్రభుత్వం గిడుగు రామ్మూర్తిని స్మరించుకోవడం గొప్ప విషయం. అయితే దాన్ని 'వ్యవహారిక భాష దినోత్సవం' అని అంటే బాగుండేది. కనీసం 'వ్యవహారిక తెలుగు భాష దినోత్సవం' అన్నా బాగుండేది. ‘తెలుగు భాషాదినోత్సవం అన్నారు. గిడుగు రామ్మూర్తి కన్నా అనేక శతాబ్దాల ముందే తెలుగు భాష పుట్టింది. తెలుగును మనం ప్రాచీన భాషల్లో ఒకటి అంటున్నాం. గిడుగు ప్రత్యేకత ఏమంటే నియత విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాలను వ్యవహారిక భాషలో బోధించడానికి మహత్తర  కృషి చేయడం. 

తెలుగు భాష గొప్పది. అందమైనది. పశ్చిమదేశాల్లో ఇటాలియన్ భాష వినడానికి సొంపుగా ఉంటుంది అంటారు. తూర్పుదేశాల్లో తెలుగు వినడానికి అంత సొంపుగా ఉంటుంది. తెలుగు నేర్చుకున్నందుకు, తెలుగులో రాస్తున్నందుకు నాలాంటివాళ్ళకు చాలా ఆనందంగా గర్వంగా ఉంటుంది.  

వ్యవహారిక భాషలో కూడ ఒక ప్రామాణికీకరణ (స్టాండర్డైజేషన్) సాగింది.  విజయవాడ కేంద్రంగా, సినిమా మాధ్యమంలో ఇది పెరిగింది.  ఆ స్థాయిని దాటి స్థానిక యాసలో రాసే ధోరణి వచ్చింది. నిజానికి యాస ధోరణి ఉత్తరాంధ్రాలో మొదలయిందిగానీ తెలంగాణ ప్రాంతంలో ఇది ఒక ఉద్యమ స్థాయికి చేరింది. ఇప్పుడు రాయలసీమ రచయితలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. అలాగే గోదావరి జిల్లాలవారూ ప్రయత్నిస్తున్నారు. 

అయితే, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఒక్కటేనా వ్యవహారిక భాష? మొన్నటి ప్రభుత్వ ఉత్సవాన్ని కొందరు 'మాతృభాషా దినోత్సవం' గా కూడ ప్రకారం చేశారు. రాష్ట్రంలో  ఇంకో 15 వ్యవహారిక భాషలు, మాతృభాషలు ఉంటాయి . వాటికి ఉత్సవాలు జరపదా ప్రభుత్వం?. ఇది ఏ సంకేతాన్ని ఇస్తుంది?  ఆ భాషల గతి ఏంకానూ?  ఆ భాషల్లో ఇటీవలి కాలంలో వచ్చిన పరిణామాల గురించి  మాట్లాడరా? ఆ భాషల్ని అధికారికంగా నిర్దయగా చంపేస్తారా? 

ఒకరు దేశప్రజలందరూ హిందీలో (మాత్రమే) మాట్లాడాలంటారు. మరొకరు  తెలుగులో (మాత్రమే) బోధించాలంటారు. ఇంకొకరు తమ మతాన్ని మాత్రమే  అనుసరించాలంటారు. ఇవన్నీ అతివ్యాప్తి దోషాలు. ఆధిపత్యవాదనలు. ఒక భాషను అధికార భాషగా గుర్తిస్తే మిగిలిన భాషలు శ్రామిక భాషలైపోతాయన్న తర్కం ఇతరులకు తెలియకపోవచ్చు కానీ ప్రజాస్వామిక వాదులకు, నూతన ప్రజాస్వామిక వాదులకు స్పష్టంగా తెలుసు. వాళ్ళూ ఈ వరదలో కొట్టుకుపోతున్నారు.  మాతృభాషలో విద్యాబోధన అనే ఆదర్శం ఆచరణలో అధికారభాషలో విద్యాబోధనగా మారి కొత్త వివాదాలను సృష్టిస్తోంది.

నియత విద్యలో ప్రవేశానికి, తరగతి గది సంస్కృతి అలవాటు కావడానికి ప్రాధమిక దశలో మాతృభాషలో బోధన చాలా అవసరం. అక్కడయినాసరే ఎవరికి ఎవరి మాతృభాషలో బోధించాలనే ప్రశ్న కూడ తలెత్తుతుంది. ప్రాధమిక విద్య స్థాయిలో ప్రతి ఒక్కరికి  కనీసం మూడేళ్ళయినా వారివారి  మాతృభాషలల్లో మాత్రమే  బోధించాలి.  అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలి. అవసరం అయితే ఉద్యమించాలి. 

ఇంట్లో ఉర్దూ మాట్లాడుకునే ముస్లిం పిల్లలు స్కూళ్లలో తొలి దశలో తెలుగు మాధ్యమాన్ని తట్టుకోవడానికి ఇబ్బందులు పడతారు. ఒక అదనపు భాషను నేర్చుకుంటున్నందుకు వాళ్లను మెచ్చుకోవాలి. కానీ, అలా ఎవ్వరూ చేయరు. పైగా, ఉర్దూ ప్రభావిత ఉఛ్ఛారణతో తెలుగు మాట్లాడుతున్నందుకు అవహేళనకు గురిచేస్తారు. ఈ వివక్ష కారణంగా వాళ్ళు మొత్తం నియత విద్యనే మానేస్తారు. ఈ సమస్య ముస్లింలకు మాత్రమేకాదు; అధికార భాషేతర సమూహాలందరికి ఉంటుంది. 

భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి దాదాపు 70 ఏళ్ళు అవుతున్నాయి. పార్లమెంటులో చర్చలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల్లో వాదనలు తీర్పులు, జాతీయ టీవీల్లో డిబేట్లు అన్నీ ఇంగ్లీషులోనే కొనసాగుతున్నాయి. అంటే ఇంగ్లీషు మన రాజభాష అన్నమాట. ఇంగ్లీషును రాజభాషగా తొలగించి హిందీను రాజభాషగా మార్చేందుకు సంఘపరివారం ప్రయత్నిస్తున్నది. ఈ మధ్య భారత శిక్షాస్మృతికి హిందీ పేర్లు పెట్టడం ఒక వివాదంగా మారింది. ఓ నాలుగు రాష్ట్రాల హిందీ బెల్టులోతప్ప మిగిలిన భారత దేశంలో హిందీకన్నా ఇంగ్లీషే అనుసంధాన భాషగా వుంటుంది. 

ఎక్కడో అరుదుగా ఓ అధికారి ప్రయోగాత్మకంగా తెలుగులో ఉత్తర్వులు జారీచేసిన సంఘటనలుంటాయి. అందులో కఠిన గ్రాంధిక భాష వుంటుంది. అది సామాన్య ప్రజలకు అర్ధంకాదు. ఆ కృతక తెలుగు భాషకన్నా ఇంగ్లీషే మేలేమో అనిపిస్తుంది. అది గిడుగుకు అపచారం. మొన్నటి తెలుగు భాషాదినోత్సవానికి ప్రచురించిన ఆహ్వానపత్రంలోనే అనేక తప్పులున్నట్టు సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి. 

ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్లో, ఓ మూడేళ్ళ ప్రాధమిక విద్య ముగియగానే అందరూ ఇంగ్లీషు మీడియంకు మారిపోవడమే మేలు. ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశంలో ఇంగ్లీషు ఒక సామాజిక పెట్టుబడి. దానికి గొప్ప మారకపు విలువవుంది. దాన్ని సరుకు అన్నా తప్పుకాదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సైన్స్ టెక్నాలజీ మొత్తం ముందు ఇంగ్లీషులోకి మారుతుంది. దాన్ని వెంటనే తెలుగులోనికి మార్చగల యంత్రాంగం మనకు లేదు. ఆ మేరకు తెలుగు మీడియంలో చదివినవాళ్లు వెనుకబడిపోతున్నారు.  పైగా సంభావిత (conceptual) వ్యక్తికరణకు తెలుగులో చాలా పరిమితులున్నాయి. కృతకంగా అనువాదం చేసినా అవి చాలామందికి అర్ధం కావు. 

మాతృభాష వేరు; బోధన భాష వేరు, బతుకు తెరువు భాషావేరు. చాలా మంది వీటిమధ్య తేడాను గమనించలేకపోతున్నారు. నియత విద్య బతుకు తెరువు కోసమే ఉంటుంది. సులువుగా ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం కలిగించే కోర్సులు, సబ్జెక్టులు, మీడియంనే విద్యార్థులు ఎంచుకుంటారు. అభిరుచి మేరకు నియత విద్య చదివేవారు చాలాచాలా అరుదుగా మాత్రమే వుంటారు. 

1970 వ దశకంలో  బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయి. అందరూ కామర్స్ చదివి  బికాం  డిగ్రీ పట్టుకుని బ్యాంకుల్లో చేరేవారు. 1985 తరువాత ఐటి ఉద్యోగావకాశాలు పెరిగాయి. అందరూ అటుకేసి పరుగులు తీయడం మొదలెట్టారు. పట్టుబట్టి జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్, రూబీ, స్విఫ్ట్, రస్ట్ మొదలయిన ఓ ఇరవై కొత్త సాంకేతిక భాషలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) వచ్చింది. దాని వెనుక పరుగులు మొదలయ్యాయి. అందులో తెలుగు ఇంకా అభివృధ్ధికాలేదు. సరైన ఇన్ పుట్  ప్రాంప్ట్  లేకుండా  మేలైన అవుట్ పుట్ రాదు. తెలుగు లో ప్రాంప్ట్ ఇవ్వడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం. 

ఇంగ్లీషు మాధ్యమానికి ఉద్యోగావకాశాలు ఎక్కువకాబట్టి మెరుగయిన జీవితం కోసం పేదలు సహితం తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చేరుస్తున్నారు.  ప్రైవేటు స్కూళ్ల  ఫీజుల్ని తట్టుకోలేక  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని  ప్రవేశపెట్టాలని చాలా కాలంగా కోరుతున్నారు. అది చాలా సమంజసమయిన కోరిక. అదొక అవసరమైన ఉద్దీపన చర్య. 

ఇప్పటి ఉపాధ్యాయులకు వుండే నైపుణ్యం ఒక్కటే; పరీక్షల్లో ఎక్కువ మార్కుల్ని సాధించే చిట్కాల్ని విద్యార్ఢులకు బోధించడం. దీనికి ప్రభుత్వ రంగం,  ప్రైవేటు రంగం అనే తేడాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నారనగానే ఇంగ్లీషు మాధ్యమంలో బోధించే సత్తాలేని ప్రభుత్వ ఉపాధ్యాయిలకు హఠాత్తుగా తెలుగు భాషాభిమానం గుర్తుకు వచ్చింది. నిజానికి వారిలో చాలామందికి తెలుగును బోధించడం కూడా సరిగ్గా రాదు. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు ఓ ఉద్యమంగా భుజాన వేసుకున్నాయి. ఇదో ట్రేడ్ యూనియన్ వ్యవహారం. 

ఈమధ్యన ఒక తెలుగు భాషాభిమాని గ్రామ సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. వాళ్ళు ఇంటర్మీడియట్ లో సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతం చదివి వచ్చారుగాబట్టి వారికి సంస్కృతంలో పరీక్షలుపెట్టాలని ఓ సవాలు విసిరారు. ఇంటర్మీడియట్ పాసై 5 వేల రూపాయలకు కూలీపని చేస్తున్న వాలంటీర్స్ ను సంస్కృతంలో పరీక్షలు పెట్టమనడం దేనికీ?  తెలుగు ఎంఏ చదివి నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న ప్రభుత్వ తెలుగు టీచర్లు అందరినీ ‘మణిపూర్ లో జాతిహననం, ‘ఉమ్మడి పౌర స్మృతి, ‘హిండేన్ బర్గ్ రిపోర్టు వంటి ఏదో ఒక బర్నింగ్ టాపిక్ మీద అందమైన వ్యవహారిక తెలుగు భాషలో వెయ్యి పదాల వ్యాసం ఒకటి రాయమంటే పోలా? ఎవరికి ఎంత తెలుగు తెలుసో తేలిపోతుంది. 

భాషోత్సవాల్లో గిడుగు పేరిట కవులను ఎందుకు సత్కరిస్తారో నాకు అర్ధంకాదు; అందులో పద్యకవులను కూడ సత్కరిస్తుంటారు.  గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ‘ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ “ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను అన్నారు.  కవిత్వ రచన  అంతరించిపోతున్న ప్రక్రియ.  కథ, నవల, వ్యాసాలు, ఉపన్యాసాలు మాత్రమే ఆధునిక సాహిత్య ప్రక్రీయలు. ఉపన్యాసాల్లో వ్యవహారిక శైలి చాలా అందంగా వుంటుంది. 

గిడుగును తెలుగుకు మాత్రమే పరిమితం చేయడం ఇంకో చారిత్రక అపచారం. ఈనాటి మన సంకుచిత భాషాభిమానులకన్నా గిడుగు రామ్మూర్తి గొప్ప విశాల హృదయులు. లిపిలేని సవర భాషకు లిపిని సృష్టించారు. సవర భాషలో బోధించారు. బ్రిటీష్ అధికారుల్ని ఒప్పించి సవర భాషకు గుర్తింపు సాధించారు.  అందుకు వారిని ప్రత్యేకంగా  స్మరించుకోవాలి.  

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు.

 

రచన :   31 ఆగస్టు 2023, హైదరాబాద్

ప్రచురణ :  1 సెప్టెంబరు 2023, దిశ డైలీ,

 

https://www.dishadaily.com/editpage/article-on-gidugu-rammurthy-248077