Friday 25 September 2015

ఇస్లాం ప్రతిష్ఠకు అతి, మితవాదాల చేటు

ఇస్లాం ప్రతిష్ఠకు అతి, మితవాదాల చేటు
Updated :26-09-2015 01:27:10
http://www.andhrajyothy.com/images/print_icon.gif


http://www.andhrajyothy.com/ImageRetrive.aspx?FileName=C://Inetpub//vhosts//andhrajyothy.com//ajnews.andhrajyothy.com//AJNewsImages//2015//Sep//20150925//Hyderabad//635788276307232620.jpg
క్కడ సహనం అవసరమో అక్కడే మీరు తొందరపడుతున్నారు 
హజ్రత్ఊమర్ఫారూఖ్‌, రెండవ ఖలీఫా

ప్రపంచ సినిమా వేదిక మీద ఇరాన్సినిమాలది గౌరవనీయమైన స్థానం. యాక్షన్కథలతో హాలీవుడ్ప్రపంచ మార్కెట్ను కొల్లగొడుతుంటే, ఇరాన్సినిమాలు ఉన్నతమైన భావోద్వేగాలతో ప్రపంచ సినీ ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొడుతుంటాయి. భారతీయ సినిమాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో హిందూమత విలువల్ని ప్రచారం సాగిస్తున్నట్టు, హాలీవుడ్సినిమాలు క్రైస్తవ/యూదు మత విలువల్ని ప్రచారం చేస్తున్నట్టు, ఇరాన్సినిమాలు ఇస్లాం మత విలువల్ని కళాత్మకంగా ప్రచారం చేస్తుంటాయి. అనుమానం వున్నవాళ్ళు 2012లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్అవార్డు అందుకున్న సెపరేషన్‌’ సినిమా చూడవచ్చు.

ఇరాన్సినిమా అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు మాజిద్మాజిద్‌. ‘చిల్డ్రన్ఆఫ్హెవెన్‌’ సినిమా చూడని సినీ అభిమానులు వుండరు. కాన్వెంటు బూట్లు పోతే పేద కుటుంబాల పిల్లలకు ఎంత కష్టమో చెప్పే కథ ఇది. ‘చిల్డ్రన్ఆఫ్హెవెన్‌’ (1977),’ బరణ్‌’ (2002) చిత్రాల దర్శక-నిర్మాత మాజిద్మాజిద్నిర్మించిన కొత్త సినిమాముహమ్మద్‌ - ది మెసెంజర్ఆఫ్గాడ్‌’ దీనికి సంగీత దర్శకుడు ఏఆర్రహమాన్‌. మాజిద్మాజిద్‌, ఏఆర్రహమాన్వంటి వర్తమాన ప్రపంచ సినీరంగ దిగ్గజాలు జోడీ కడితే సినిమా కళాత్మకంగా ఎంత గొప్ప స్థాయిలో వుంటుందో ఊహించుకోవచ్చు. 
ముహమ్మద్ప్రవక్త (వారికి శాంతి కలుగుగాక) మీద సినిమా తీసినందుకు ముంబాయికి చెందిన సున్నీ రజా అకాడమీ అభ్యంతరం తెలిపింది. ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా సినిమా తీసినందుకూ. అందులో పనిచేసినందుకూ మాజిద్మాజిద్‌, రెహమాన్ఇద్దరూ మళ్ళీ కల్మా చదవాలనీ, అంటే ఇస్లాం మీద తమ విశ్వాసాన్ని మళ్ళీ ప్రకటించాలనీ, వాళ్ళు ఇస్లాం పద్ధతుల్లో మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోవాలనీ ఒక ఫత్వా జారీచేసింది. సినిమాను నిషేధించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లకు లేఖలు రాసింది. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తుండే విశ్వహిందూ పరిషత్రెహమాన్కు హుటాహుటీన ఘర్వాపసీ ఆహ్వానం పంపింది. రెహమాన్తిరిగి హిందూమతం లోనికి వస్తే, (ముస్లింలు) ఎన్ని ఫత్వాలు జారీచేసినా కీడు జరక్కుండా రక్షణ కల్పిస్తామని వీహెచ్పి నేత సురేంద్ర జైన్ఒక హామీ కూడా ఇచ్చారు. దానితో వ్యవహారం రాజకీయ మలుపు తిరగడమేగాక, ఫత్వాల పరిధి పరిమితుల్ని వివరించాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది.

ఇస్లాం ధర్మానికి ఐదు మూలస్థంభాలు: విశ్వాసం (ఈమాన్‌), ఆరాధన (నమాజ్‌), ఉపవాసం (రోజా), జకాత్‌ (దానం), హజ్‌ (మక్కాయాత్ర). వీటిల్లో మొదటిదీ అత్యంత ప్రాణప్రదమైనది ఈమాన్‌. ఇస్లాం చాలా నిరాడంబర మతం. గోడలు బద్దలుగొట్టి తలుపులు బార్లా తెరిచిన సమూహం ముస్లింలు. ‘‘లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్రసూలిల్లా (అల్లాతప్ప మరో దేవుడులేడు; ముహమ్మద్ఆయన ప్రవక్త) అంటూ ఏకవాక్య ప్రకటనతో ఎవరయినా ఎప్పుడయినా ఇస్లాంను స్వీకరించవచ్చు. క్షణం ముస్లిం సమాజంలో చేరిపోవచ్చు. ఇదే కల్మా చదవడం అంటే. ఇదే ఈమాన్‌. ఇస్లాం ఏకేశ్వరోపాసన మతం. ముస్లిం సమాజంలో అల్లాతప్ప మరెవ్వరూ ఆరాధనీయులుకాదు. అదొక్కటే గీటురాయి. మరింత వివరంగా చెప్పాలంటే ప్రవక్తలు కూడా ఆరాధనీయులుకారు. వాళ్లను గౌరవించాలి; ఆరాధించకూడదు.

ఆధునిక సమాజంలో నిరంతరం వస్తుండే అనేక కొత్త అంశాలకూ, మత నియమాలకూ మధ్య పొంతన కుదర్చడానికి ఎప్పటికప్పుడు ఒక ధార్మిక వివరణ అవసరం అవుతుంది. వాటినే ఫత్వాలు అంటారు. ఇస్లాం ధార్మిక జీవితానికి రెండే ప్రామాణిక గ్రంధాలు. మొదటిది ఖురాన్‌, రెండోది హదీస్‌ (ప్రవక్త ముహమ్మద్ఉపదేశాలు, వారి జీవితాచరణ). సమాజంలో నిరంతరం వస్తుండే అనేక కొత్త అంశాలకు ధార్మిక వివరణ (ఫత్వా) ఇవ్వాల్సిన సందర్భాల్లో రెండు గ్రంధాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటి వివరణలు సమస్యను పరిష్కరించేలా వుండాలిగానీ, మరింత జటిలం చేసేవిగా వుండకూడదు. మతపెద్దల్లో ఉదార వాదులు, ఆచరణాత్మకవాదులు, అతివాదులు, మితవాదులు ఎప్పుడూ వుంటారు. దీనికి ముస్లిం సమాజం కూడా మినహాయింపుకాదు.

విగ్రహారాధనకు ఇస్లాం వ్యతిరేకమనేది అందరికీ తెలిసిన అంశమే. అయితే, వ్యతిరేకతను ఛాందసులు మరీ అతిగా సాగదీస్తుంటారు. విగ్రహాలను కళ్ళతో చూడ కూడదంటారు. జాతరలు, ఉత్సవాల బాజాభజంత్రీలని చెవులతో వినకూడదంటారు. అది అక్కడితో ఆగదు. ఫొటోలను కూడా విగ్రహాల జాబితాలోనికి చేర్చేస్తారు. ము స్లీంలు ఫొటోలు దిగకూడదు. సినిమాలు చూడకూడదు. సినిమాల్లో నటించకూడదు. వాళ్ల ఇళ్ళలో టీవీలు వుండకూడదు... ఇలా సాగుతాయి ఫత్వాలు, వివరణల రూపంలో వాళ్ల ఆంక్షలు. హజ్యాత్ర మీద అనేక వందల డాక్యుమెంటరీలు వచ్చాయనిగానీ, మక్కాలో హజ్నమాజ్ను ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారనిగానీ, అరబ్సినిమాలకు ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానం వుందనిగానీ వారు గుర్తించరు. అంతవరకు దేనికీ, ఐఎస్వంటి కరడుకట్టిన ఇస్లాం ఛాందసవాద సంస్థలు సహితం తమ ప్రచారానికి టీవీలు, కెమేరాలు, సోషల్మీడియాను ఆశ్రయించక తప్పడంలేదు. అయినా, వాస్తవాలను ఛాందసులు అనేక సందర్భాల్లో గుర్తించరు. అతివాదులు, మితవాదులు జారీచేసే ఫత్వాలు సమస్యను జటిలంగా మార్చడమేగాక, బయటి ప్రపంచంలో ఇస్లాం ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తుంటాయి. ఏఆర్రెహమాన్‌, మాజిద్మాజిద్ మీద ముంబాయి రజా అకాడమీ జారీ చేసిన ఫత్వా దీనికి తాజా ఉదాహరణ.

ధార్మిక వ్యవహారాల్లో కొత్త సవాళ్ళు, సమస్యలు, సందేహాలను పరిష్కరించే సందర్భాల్లో అల్లా మిద విశ్వాసానికి (ఇమాన్‌) భంగం కలగకుండా, ఇతర విషయాల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవచ్చని ఆచరణాత్మకవాదులు, ఉదారవాదులు భావిస్తారు. హిందూ భక్తిగీతాలను ముహమ్మద్రఫీ అంతటి పారవశ్యంతో పాడిన గాయకుడు బాలీవుడ్లో మరొకరు లేరు. అంతమాత్రాన రఫీ మతవిశ్వాసాల(ఈమాన్‌) కు వచ్చిన ఇబ్బంది ఏమిలేదు. అదొక మంచి మతసామరస్య సాంప్రదాయం కూడా. ఇలాంటి ఉదాహరణలు మనకు అనేకం కనిపిస్తాయి. బీఆర్చోప్రా మహాభారత్టీవీ సీరియల్ను రాసింది ఒక ముస్లిమే. హిందూత్వ ప్రచారం కోసం తీసిన చాణక్య హిందీ సీరియల్ను తెలుగులోనికి అనువాదం చేసింది కూడా ఒక ముస్లిమే.

తాను సృష్టించిన మనిషి విశ్వాసి(ముస్లిం)గా జీవించాడో, అవిశ్వాసి (కాఫిర్‌)గా జీవించాడో తేల్చాల్సింది అల్లా ఒక్కడే; సాటి మనుషులెవ్వరికీ అలాంటి అధికారంలేదు. మాజిద్మాజిద్‌, ఏఆర్‌. రెహమాన్ఇద్దరూ ఈమాన్కు భిన్నంగా వ్యవహరించారో లేదో తేలేది వాళ్ల మరణానంతరం తీర్పు దినాన. ఈలోపు పిల్ల పంచాయితీలు, అకాడమీ ఆర్భాటాలు దేనికీ? ఛాందసులు తెలిసో తెలియకో అల్లా అధికారాల పరిధిలోనికి ప్రవేశిస్తున్నారు. మేరకు వారిది అల్లా మీద తిరుగుబాటే!

భారత ముస్లీం సమాజంలో ఇటీవల వస్తున్న మార్పు ఏమంటే ఛాందసులకన్నా ఉదారవాదులకు ఆమోదాంశం పెరగడం. ఢిల్లీ జామ మసీదు ఇమామ్తో సహా దేశంలోని దాదాపు వెయ్యిమంది ముస్లీం మతపెద్దలు ఐఎస్ఐఎస్కార్యకలాపాలను తీవ్రంగా ఖండిస్తూ ఫత్వా జారీచేయడం దీనికి తాజా ఉదాహరణ. ఐఎస్ఐఎస్ను ఇస్లాం వ్యతిరేక సంస్థగా వారు పేర్కొనడం మహత్తర అంశం. ఇక సాంప్రదాయమే వర్ధిల్లుతుంది.

ముహమ్మద్ప్రవక్త (వారికి శాంతి కలుగుగాక) మీద సినిమాలు రావడం ఇది మొదటిసారికాదు. గతంలోనూ కొన్ని డ్రామా, యానిమేషన్సినిమాలు వచ్చాయి. ఇస్లాం సానుకూల ప్రచారం కోసం సినిమాలు తీసినవాళ్ళూ వున్నారు. ఇస్లాం ప్రతికూల ప్రచారం కోసం సినిమాలు తీసినవాళ్ళూ వున్నారు. 1980 దశకం ఆరంభంలో ఓమర్ముఖ్తార్‌ (లయన్ఆఫ్ది డిజర్ట్‌) సినిమాతో భారత సినీ ప్రేక్షకులకు దగ్గరయిన దర్శకుడు ముస్తఫా అక్కడ్‌. అతనే అంతకు ముందు 1977లోముహమ్మద్‌ - ది మెసంజర్ఆఫ్గాడ్‌’ అనే సినిమాను అరబ్బీ, ఇంగ్లీషు భాషల్లో నిర్మించాడు.’’ డెభ్భయి కోట్ల (ఇప్పుడు 157 కోట్లు) మంది విశ్వసించే ఇస్లాం గురించి ఇతరులకు తెలిసింది చాలా తక్కువ అని నాకు తెలిసినపుడు చాలా ఆశ్చర్యం వేసింది. లోటును పూరించడం కోసమే సినిమా తీశాను’’ అని ముస్తఫా అక్కడ్స్వయంగా చెప్పుకున్నాడు. ఇస్లామిక్ధార్మిక అంశాలకు అత్యంత సాధికారపీఠంగా భావించే అల్అజ్హర్విశ్వవిద్యాలయం (కైరో, ఈజిప్టు) ముస్తఫా అక్కడ్సినిమా స్ర్కిప్టును పరిశీలించి ఆమోదం తెలిపింది. సౌదీ అరేబియా రాజు ఖలీద్బిన్అబ్దుల్అజీజ్‌, లిబియా నేత మువమ్మర్అల్గఢాఫీ, మొరాకో రాజు కింగ్హసన్ సినిమా నిర్మాణానికి అవసరమైన నిధుల్ని అందించారు.

ది మెసేజ్‌’ సినిమాలో, యుద్ధానికి వెళుతున్నప్పుడు ప్రవక్త తన సహచరులకు కొన్ని ఆదేశాలిస్తారు. ‘‘నిరాయుధుల మీద కత్తి దూయవద్దు. మహిళల్ని, పిల్లల్ని హింసించవద్దు. బందీలతో గౌరవంగా వ్యవహరించండి, చెట్లు నరకవద్దు. బావుల్ని విధ్వంసం చేయవద్దు’’ అంటారు. యుద్ధనియమాల్ని చూస్తుంటే రెండవప్రపంచ యుద్ధం తరువాత ఐక్యరాజ్య సమితి రూపొందించుకున్న విధానాలు గుర్తుకు వస్తాయి.


ఇస్లామి్ఔన్నత్యాన్ని ఇంతగా చాటిచెపి ముుస్తఫా అక్కడ్‌ ‘దిసీమెసేసినిమా ముుసిలు పద్ద సంఖ్యలోవున్న భారతదేశంలో విడుదల కాలేదు. కొందరు ఛాందస ముసి నాయయుకులు భారత ప్రభుత్వంపై వత్తిడక తెచ్చి, దాని విడుదలను అడు ్డకున్నారు. ఫలితంగా కోట్లాదిమంది నిరక్షరాస్య భారత ముుసింలు ఆడియో- విజువల్మిియాో ద్వారా తము ముతం గురించి తెలుసుకునే గొప్ప అవకాశాన్ని కోల్పోయాూరు. ఒకవిధంగా ఇస్లాం ప్రచారాన్ని అడ్డుకునేశక్తులు చేయాల్సి పనిని ఛాందసముుసిం నాయకులే చేసినట్టయిుుంది. ఇది ఒకరకం ఆత్మాహుతి! ముుస్లింల ప్రాబల్యం ఎక్కువగావున్న అరబ్దేశాల్లో విజయువంతంగా ఆడినసినిమాముుస్లింల ప్రాబల్యంలతక్కువగావున్న దేశంలో విడుదల కూడా కాకపోవడం ఒక రాజకీయు వైచిత్రి!

చారిత్రాత్మక చికాగో ప్రపంచ ధార్మిక ముహాసభ ఉపన్యాసంలో స్వామివివేకానందుడు మనుషులు బావిలోని కప్పల్లా వుండేపోతే ఇతర ముతాల గొప్పతనం ఎవ్వరికీ ఎప్పటికీ తెక్షయుదు అంటారు. ఇప్పుడు ఇస్లాంది అదే పరిస్థితి. ఇతర ముతస్థులు ఇస్లాంను అర్ధం చేసుకుంట్నుది తక్కువ; అపార్ధం చేసుకుంటున్నది ఎక్కువ. ఐఎస్ంటి ఉగ్రవాద ంస్థలు ఉన్మాదంతో చేసేొన్ని అమాుష చర్యల్నే ఇతరులు ఇస్లాం ధర్మిక ఆచరణ అనుకునే ప్రమాూదముూ లేకపోలేదు. మురోవెెపు, కొందరు తుంటరులు మహమ్ముద్ప్రవక్తను (వారికి శాంతి కలుగుగాక) అవహేళన చేస్తూ, అవమాూనిస్తూఇన ్నసెన్స్ఆఫ్ముసిమ్్సు’(2012) వంటి చవకబారు సిమాు తీసిస్లాం మీద దుర్పుచారాని సాగిస్తుంటారు. అలాంటి సినిమామాూలను సిూలతోే ఎదుర్కోవాలి. అప్పుడు ముుస్తఫా అక్కడ్చేసిసిదీ, ఇప్పుడు మాూజిద్మాూజిద్చేస్తున్నదీ అదే.
ఇప్పుడు మా్మాూజిద్‌ ‘ముహమ్మద్‌- ది మెుసెఆఫ్గాడ్‌’కు కూడా నిషేధం ముప్పు పొంచివుంది. వెండితెర మిద మాజిద్మాజిద్మరో అద్భుత కావ్యాన్నీ ఆవిష్కరించినట్టు సినిమా టీజర్లు చెపుతున్నాయి. అప్పట్లో, ముస్తఫా అక్కడ్సినిమాకు మౌరీస్జెర్రే అందించిన బ్యాక్గ్రౌండ్స్కోర్‌ 1978లో ఆస్కార్నామినేషన్పొందింది. మాజిద్మాజిద్సినిమాకు ఏఆర్రెహమాన్అంతకు మించిన మహత్తర సంగీతాన్ని అందించాడని మచ్చుగా మూడు నిముషాల టీజర్లను చూస్తేనే అర్ధం అవుతోంది. ‘‘నువ్వు నా సినిమాకు ఎందుకు సంగీతాన్ని అందించలేదు?’’ అని రేపు నేను చనిపోయాక అల్లా నన్ను అడుగుతాడనే భయంతోనే సినిమాకు సంగీతాన్ని అందించాను’’అంటూ రెహమాన్స్వయంగా ఒక వివరణ ఇచ్చాడు. వివరణలో ఆయన అల్లా మీద విశ్వాసాన్ని పునరుద్ఘాటించడం విశేషం. రెహమాన్ఈమాన్భద్రంగానే వుంది. దాని కోసం ఫత్వాలు అక్కరలేదు. ఇప్పుడు భారత ముస్లింలు మాత్రమేకాక ఉదార హృదయులయిన భారతీయులందరూ చేయాల్సింది ఏమంటే మాజిద్మాజిద్సినిమాను నిషేధానికి గురికాకుండా కాపాడుకోవడం. అది సక్రమంగా విడుదలయ్యి ప్రేక్షకులకు చేరేలా చేయడం.

అహ్మద్మొహియుద్దీన్ఖాన్యజ్దానీ జర్రానీ (డానీ) 
సీనియర్పాత్రికేయుడు

No comments:

Post a Comment