Tuesday 14 November 2017

MUSLIM COW

MUSLIM COW
కథ పేరు
ముసల్మాను ఆవు.

నేను ఒక కథ చెపుతాను
ఎవరయినా కథనం రాయండి.
కథ పేరు మీ ఇష్టం

1. గ్రామీణ ప్రాంతం.
2. ముస్లిం కుటుంబం.
3. లేకలేక సంతానం కలుగుతుంది.
4. ఒకే ఆవుపాలు తాగిస్తే బిడ్డ ఆరోగ్యంగా వుంటాడని పక్కంటి అయ్యవార్లు చెపుతారు.
5. ముస్లిం కుటుంబం ఒక ఆవును కొని పెంపకం సాగిస్తుంది.
6. కొన్నేళ్లకు ఆవు ముసలిడైపోయి వట్టిపోతుంది. అయినా ఆ కుటుంబం దాన్ని సంతకు తోలరు.
7. దాని పాలుతాగి పెరిగిన పిల్లాడు దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు.
8. వృధ్యాప్య కారణం ఆవు చనిపోతుంది.
9. వ్చనిపోయిన ఆవును ముస్లీంలు కోసుకు తినరు.
10. ఊర్లోని మాదిగలు వచ్చి చనిపోయిన ఆవును తీసుకుపోతామంటారు. దాని తోలుతో రెండు జతల చెప్పులు కూడా చేసి పెడతామంటాడు.
11. ముస్లీం కుటుంబం ఆవును ఇవ్వదు.
12. ఆవు ముస్లింల పెంపకంలో పెరిగింది గాబట్టి అది ముస్లీం అవు అవుతుందని వాళ్ళు భావిస్తారు.
13. ఆవును స్నానం చేయించి, బల్ల మీద పెట్టి ఖననానికి తీసుకుపోతుంటాడు.
14. అప్పుడు వాళ్ళ మీద గోగ్రవాదులు దాడి చేస్తారు.
15. ఆ తరువాత ఏమైందీ --- కథనం రాసేవాళ్ళు తేలుస్తారు.

కథ నా పేరుతో, కథనం మరొకరి పేరుతో ఈ కథ రూపుదిద్దుకోవాలి.

హిందూ తరహాలో గోమాతకు అంత్యక్రియలు చేసిన ముస్లింలు
26-11-2017 09:49:09

లక్నో: గో సంరక్షణపేరుతో అచారకాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అందుకు భిన్నమైన ఉదంతం వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్‌లోని గంగా యమున సంగమంలో ఇది జరిగింది. ఎవరి పర్యవేక్షణలో లేని ఒక ఆవు మృతిచెందగా, ముస్లిం సోదరులు దానికి స్నానం చేయించి, ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించి, చివరిగా ఆ గోమాతను ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి హిందువులు కూడా హాజరై సహకారం అందించారు. గాలిబ్ గ్రామంలో జరిగిన ఆవు అంత్యక్రియల కార్యక్రమానికి ముస్లిం సోదరుడు ఫకీర్ మహమ్మద్ సారధ్యం వహించారు.

No comments:

Post a Comment