Friday 1 May 2015

Nizam & False stories

నిజాం మీద ఇన్ని అబధ్ధాలా?

తెలంగాణ ఉద్యమ నేత కేసిఆర్ కు ఉద్యమ కారణాలవల్లనో, వ్యక్తిగత ఆసక్తులవల్లనో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నచ్చివుండవచ్చు. అలాగే, సంస్థగత కారణాలవల్లనో, వ్యక్తిగత ద్వేషాల కారణంగానో  మరొకరికి  నిజాం నవాబు   నచ్చివుండకపోవచ్చు. నచ్చనంతమాత్రాన అబధ్ధాలు రాయాల్సిన అవసరంలేదు. 'నిరంకుశ నిజాంకు ప్రశంసలా?"  (ఆంధ్రజ్యోతి , 28 ఏప్రిల్ 2015) వ్యాసంలో  దుగ్గినేని సత్యనారాయణరావు
ఆలోచనలకన్నా అబధ్ధాలు ఎక్కువగా రాశారు.

1.  బ్రిటీష్ ఇండియాకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే, దానికి రెండు నెలల ముందే  భారతదేశం లోని సంస్థానాలకు స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని వ్యాసకర్త దాచిపెట్టారుసంస్థానాలకు మూడు ఆప్షన్లు వుండినాయి. . స్వతంత్ర దేశంగా వుండడంబి. ఇండియన్ యూనియన్ లో విలీనం కావడం. సి. పాకిస్తాన్ లో  విలీనం కావడం. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటిదాన్ని ఎంచుకున్నాడు

2. నిజాం సంస్థానాన్ని  భారతదేశంలో విలీనం చేశారు. ఎనిమిదేళ్ల తరువాత నిజాంతెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి  ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటుచేశారుఇటీవలి తెలంగాణా ఉద్యమం సాగిందే ఈనిర్ణయంలోని తప్పును సరిదిద్దడానికి. పరిజ్ఞానం రచయితకు వున్నట్టులేదు.

3. తనకు  జరిగిన అన్యాయాన్ని ఎదిరించినందుకు చాకలి ఐలమ్మను నైజాం పోలీసులు  నరికారు అని రాశారు. చాకలి ఐలమ్మ పోరాటం చేసింది విస్నూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి మీద. ఆమె చనిపోయింది 1985లో. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అప్పటికి 18 సంవత్సరాల క్రితమే చనిపోయాడు.

4. 'మా భూమి నాటకంలో  బండెనక బండి కట్టి...'  పాట వుందనేది ఒక అబధ్ధం. పాటను నిజాం నవాబు మీద రాశారని చెప్పడం మరో అబధ్ధం. వేరే సందర్భంలో పాటను బండి యాదగిరి వరంగల్ జిల్లా దేశ్ ముఖ్ మీద రాశాడు. యాదగిరి  పాటలో ఎక్కడా నిజాం నవాబు ప్రస్తావనే  లేదు.

5. 'మాభూమి' సినిమాలో వున్న  బండెనక బండి కట్టి...'  పాటను గద్దర్ రాశాడు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన దేశ్ ముఖ్ మీద  పాటరాస్తే  సెన్సార్ ఇబ్బందులు వస్తాయని సంకోచించి, దేశ్ ముఖ్ పేరువున్నచోట నిజాం నవాబు పేరును నింపేశారునిజాం నవాబు రోల్స్ రాయిస్ కారులో తిరుగుతాడుగానీ పదారు ఎడ్లబండ్లు కట్టుకుని తిరగడు అని పుర్రెలో కాసింత మెదడు అనే పదార్ధం వున్నవాడెవడికయినా అర్ధం అవుతుంది. చనిపోయిన నిజాం నవాబు ఆత్మవచ్చి పరువునష్టందావా వేయదనే నమ్మకంతో, హైదరాబాద్ ముస్లింలు తెలుగు సినిమా చూడరన్న ధైర్యంతో బరితెగించి పాపానికి గద్దర్ ఒడిగడ్డాడు. ముస్లిం సమాజం ఎన్నటికీ గద్దర్ ను  క్షమించదు.

6. చరిత్రలో మహత్తరంగా భావించే తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం సాగింది కేవలం  వరంగల్, నల్గొండ జిల్లాలలోనేఇప్పటి అర్ధంలో  ఖమ్మంజిల్లా కూడా వుంది గానీ అది అప్పటికి ప్రత్యేక జిల్లాగా ఏర్పడలేదు. పారాటాలన్నీ  స్థానిక దేశముఖ్ లకు వ్యతిరేకంగానే సాగాయి.

7. నిజాం వ్యతిరేక వుద్యమం అని చెప్పుకుంటున్నదంతా నిజానికి దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా ప్రజలు సాగించినన ఉద్యమమే. మహారాష్ట్ర నుండి దిగుమతి అయిన ఆర్యసమజ్ శక్తులుమాత్రం తమ గురిని నిజాం మీద పెట్టాయి.

8. నిజాం హయాంలో జరిగిన దురాగతాల్లో నూటికి తొంభై ఐదు  శాతం దేశ్ ముఖ్ లు సాగించిందే. నిజాం సాగించిన దురాగతాలు చాలా చాలా స్వల్పం. అవి కూడా చివరి రోజుల్లో అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి నిస్పృహతో చేసిన చర్యలే.   నాలుగు వందల సంవత్సరాల  కుతుబ్ షాహీ - నిజాంల పాలనలో రజాకార్ దురాగతాల కాలం ఆరు నెలలే

9. నిజాంది రాజరిక వ్యవస్థ. అంతర్గతంగానే అది పీడక వ్యవస్థ. అంతమాత్రాన అప్పట్లో జరిగిన ప్రతి హింసాత్మక ఘటననీ నిజాం ఖాతాలో వేసేయడం చరిత్రకారులు చేయాల్సిన పనికాదు

10. తెలుగు పత్రికల ఎడిట్ పేజీలు ఆలోచనల సంఘర్షణలకు అద్దంపట్టే రోజులు పోయాయి. ఇప్పుడు ముస్లిం సామాజికవర్గాల మనోభావాల్ని దెబ్బతీసేలా అబధ్ధాలని కూడా అవి ప్రచారం చేస్తున్నాయి. ఈధోరణి ఇటీవల పెరుగుతోంది. ఇది మరికొన్ని అనర్ధాలకు దారితీస్తాయి.

.యం. ఖాన్ యజ్దానీ (డానీ)
(సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు,
మొబైల్ : 7674999063

http://www.andhrajyothy.com/Artical?SID=105425&SupID=26


1 comment: