Tuesday 11 July 2017

MUSLIM COW

MUSLIM COW

ముసల్మాను ఆవు. 

నేను ఒక కథ చెపుతాను
ఎవరయినా కథనం రాయండి.
కథ పేరు మీ ఇష్టం

1. గ్రామీణ ప్రాంతం.
2. ముస్లిం కుటుంబం. 
3. లేకలేక సంతానం కలుగుతుంది. 
4. ఒకే ఆవుపాలు తాగిస్తే బిడ్డ ఆరోగ్యంగా వుంటాడని పక్కంటి అయ్యవార్లు చెపుతారు.
5. ముస్లిం కుటుంబం ఒక ఆవును కొని పెంపకం సాగిస్తుంది.
6. కొన్నేళ్లకు ఆవు ముసలిడైపోయి వట్టిపోతుంది. అయినా ఆ కుటుంబం దాన్ని సంతకు తోలరు. 
7. దాని పాలుతాగి పెరిగిన పిల్లాడు దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు.
8. వృధ్యాప్య కారణం ఆవు చనిపోతుంది.
9. వ్చనిపోయిన ఆవును ముస్లీంలు కోసుకు తినరు. 
10. ఊర్లోని మాదిగలు వచ్చి చనిపోయిన ఆవును తీసుకుపోతామంటారు. దాని తోలుతో రెండు జతల చెప్పులు కూడా చేసి పెడతామంటాడు.
11. ముస్లీం కుటుంబం ఆవును ఇవ్వదు.
12. ఆవు ముస్లింల పెంపకంలో పెరిగింది గాబట్టి అది ముస్లీం అవు అవుతుందని వాళ్ళు భావిస్తారు.
13. ఆవును స్నానం చేయించి, బల్ల మీద పెట్టి ఖననానికి తీసుకుపోతుంటాడు.
14. అప్పుడు వాళ్ళ మీద గోగ్రవాదులు దాడి చేస్తారు.
15. ఆ తరువాత ఏమైందీ --- కథనం రాసేవాళ్ళు తేలుస్తారు.

కథ నా పేరుతో, కథనం మరొకరి పేరుతో ఈ కథ రూపుదిద్దుకోవాలి.

No comments:

Post a Comment