Sunday 28 April 2013

DANNY NOTES


అతివాదులు, మితవాదులూ ఒక్కటే
Danny Notes, 3 May, 2013

దేశభక్తి గురించి భారతీయ జనతా పార్టి అతిగా మాట్లాడుతుంది. భారత భూమిని, గనుల్ని ఘనపు అడుగుల చొప్పున తవ్వేసి, కోట్ల టన్నుల ఇనప ఖనిజాన్ని చైనాకు తరలించిన ’గనుల ఘనుడు’ గాలి జనార్దనరెడ్డి కమలనాధుడే!  దేశానికి ఈ స్థాయిలో ద్రోహం చేసినవాడూ సమీప గతంలో మరొకడులేడు!

అద్వానీయో, వెంకయ్యనాయుడో "ఇప్పుడు గనుల ఘనులు మాతోలేరు", "కర్ణాటక బీజేపి పునీత మయింది" అంటే జనం నమ్ముతారా?

గాలి జనార్దన రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన తరువాత బీజేపి దూరంగా పెట్టిందా? అతని దేశద్రోహాన్ని ముందే కనిపెట్టి పక్కన పెట్టిందా? ఈ ప్రశ్న ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. 

కాంగీయులు కూడా భారీ స్కాములు నడిపారు.  గాలి జనార్దన రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి  శత్రుదేశానికి సహకరించాడు!  నేరం చేస్తున్నపుడు అతను కర్ణాటకలో బీజేపి మంత్రి!  



విలాసవంతమైన పాత్రికేయ జీవితం
Mayday,2013,  Danny Notes

విలాసవంతమైన పాత్రికేయ జీవితంలో దొరకనిది సమయం ఒక్కటే!!
ఈరోజు ఉదయం నాలుగు గంటలకు లేచాను. మా హైస్కూలు పూర్వ విద్యార్ధుల సమావేశాలు నెల 10,11 నర్సాపురంలో జరుగుతున్నాయి. సందర్భంగా తెచ్చే సావనీర్ కు ఒక ఆర్టికల్ కావాలని మా అమ్మనమంచి కృష్ణశాస్త్రి -మేయిల్. కృష్ణశాస్త్రి మాటంటే అదో శాసనం. నేను చాలాసార్లు శాసనోల్లంఘనం చేశానుగానీ, కృష్ణశాస్త్రి ఆదేశాల్ని మాత్రం ఉల్లంఘించలేకపోయాను.

అలనాటి నా సహాధ్యాయుల్ని తలుచుకుని ఒక ఆర్టికల్ రాయడం మొదలెట్టా. దాన్ని పూర్తి  చేయక ముందే, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ పంతుకుల శ్రీనివాస్ వచ్చాడు. పక్షం రోజులుగా అడుగుతుంటే అతనికి రోజు అప్పాయింట్ మెంట్ ఇచ్చాను. నన్ను ఇంటర్వ్యూ  చేయడానికి నలభై ప్రశ్నలతో వచ్చాడతను. అతనికి సమాధానాలు ఇస్తున్నపుడే, మా గురువుగారు వాసిరెడ్డి వేంకట కృష్ణారావుగారు ఫోన్ చేశారు.   వారి ఫోన్ లో ఒబామా నుండి ప్రచండ వరకు చాలా విషయాలుంటాయి. ఆర్టికల్, ఫోన్, ఇంటర్వ్యూ!!!  త్రిపాత్రాభినయం!! మధ్యాహ్నం పన్నెండు అయింది, అప్పటి వరకు నో బ్రేక్ ఫాస్ట్పంతుకుల శ్రీనివాస్ ను పంపించి, శాస్త్రికి -మెయిల్ పంపితే, టీచర్స్ మీద ఇంకో ఆర్టికల్ పంపాలని ఇంకో ఫర్మానా!! అదీ పూర్తి చేసే సమయానికి రెండు దాటింది. శెలవురోజైనా టీవీలకు శెలవు వుండదు కదా. మళ్ళీ మా ఆవిడతో కలిసి  ఆఫీసు, అక్కడ రోజువారీ స్క్రిప్టు, తరువాత రాత్రి ఎనిమిది గంటలకు పర్చేజింగులు. సో ఆన్!!!

మే డే ! ఇప్పుడు మనమున్న పరిస్థితికన్నా, చికాగో పోరాటానికి ముందు రోజులే బాగుండేవేమో!         

శ్రీలంక తమిళులు - తెలంగాణులు
 30-4-2013 Danny Notes  

రాత్రి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో శ్రీలంక తమిళుల సంఘీభావ సభకు వెళ్ళాను.

మా గురువుగారు వాసిరెడ్డి కృష్ణారావు గారి ఉపన్యాసాన్ని, చాలా రోజుల తరువాత, వినే అవకాశం దొరికింది. ఆంధ్రజాతి అనే మాటను వారు ఇంకా వదలకపోవడం కొంత అసంతృప్తిగా అనిపించినా, ప్రపంచ వ్యాప్తంగా సహజ వనరుల దోపిడికి అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న కౄరమైన విధానాలను ఆయన వివరించిన తీరు చాలా బాగుంది. ఇన్నేళ్ల తరువాత కూడా మా గురువుగారిలో అదే ఉద్వేగం. అదే ఆవేశాన్ని చూసి ఆనందం వేసింది.

వరవరరావుగారి ఉపన్యాసం పాత విషయాలను కొత్త కోణంలో ఆవిష్కరించింది. ముఖ్యంగా, తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ నిర్వహిస్తున్న "దళారి బూర్జువా" పాత్రను ఉదాహరణలతో సహా వివరించిన తీరు అద్భుతం. "బయ్యారం ఇనుప గనులు జగన్ - బ్రదర్ అనిల్ కా? కేసిఆర్ - కేటీఆర్ కా?" "ఆదివాసుల హక్కులు ఏంకావాలీ?" "అనాదిగా సాగుతున్న దండకారణ్య పోరాటం ఏంకావాలీ?" అని వరవరరావు లేవనెత్తిన ప్రశ్నలు, తెలంగాణుల ఉద్యమానికి సరైన దారిని చూపుతున్నట్టున్నాయి.

Danny Notes  

ప్రతి జీవీ గుంపుగానే బతుకుతుంది. మనిషి గుంపుగానేకాక, సమాజంగానూ జీవిస్తాడు. సమాజం అనేది మనిషికి మాత్రమే ప్రత్యేక లక్షణం. పందుల గుంపు, ఎలుకల మంద వున్నట్టు, మనుషుల గుంపు, మనుషుల మంద కూడా వుంటాయి. వీటికి భిన్నంగా, మనుషుల సమాజం కూడా వుంటుంది.
పులి అడవిలోవున్నా, మనుషుల మధ్య వున్నా గుంపు స్వభావంతో ఒక్కలాగే ప్రవర్తిస్తుంది. మనిషి అలాకాదు. మనిషి సమాజంలో పెరిగితే సామాజికుడిగానూ, అడవిలో పెరిగితే గుంపు స్వభావంతోనూ ప్రవర్తిస్తాడు. టార్జన్, జింబోలు శరీరధర్మాలరీత్యా మానవజీవులు (Biological men) మాత్రమే తప్ప, సామాజిక జీవులు (Social men)మాత్రం కాదు.సామాజిక మనిషి సమాజంలో మాత్రమే పెరగాలి.

గుంపులో చేరడానికి ఎవ్వరికీ ఎలాంటి అర్హతలూ అఖ్ఖరలేదు. కేవలం సహజాత ప్రవృత్తితో గుంపు / మంద బతికేస్తుంది. కానీ, సమాజసభ్యుడు కావడానికి కనీసం 18 సంవత్సరాల ప్రత్యేక పెంపకం (nurture) కావాలి. ఈ పెంపకాన్ని పూర్తిచేయనివాళ్ళు సమాజ సభ్యులుకారు. సమాజం ఎర్పరుచుకున్న నీతి, నియమాలు, స్మృతి తదితరాలతో సమాజ సభ్యులుకానివారిని శిక్షించడం కుదరదు. నేరం కూడా. 18 సంవత్సరాల పెంకాన్ని పూర్తి చేయని పిల్లలు సమాజ సభ్యులుకారు. వినడానికి వింతగా ఉండొచ్చుగానీ, తార్కికంగా పిల్లలు ఇతర జీవులతో సమానం. అందుకే పిల్లల్ని శిక్షించకూడదనే విలువ ముందుకు వచ్చింది.
ఇంతకీ ఈ సాకటం అంటే ఏమిటీ?

హైదరాబాద్ చరిత్ర - 2

గోల్కొండ కోట మూసీ నదికి ఉత్తర దిక్కున ఉంది. మూసీనది దక్షణ దిక్కున ఉన్న శాలిబండకు చెందిన భాగమతి అనే అమ్మాయిని ప్రేమించాడు యువరాజు కులీ కుతుబ్ షా. ఆమె హిందూ బలహీనవర్గాలకు చెందిన అమ్మాయి. ప్రియురాలిని కలవడానికి మూసీ నదిని దాటి వెళ్ళేవాడు యువరాజు. మతంకానిమతం, కులంకానికులం. అయినా నవాబు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా వలీ అభ్యంతరం చెప్పలేదు. పైగా కొడుకు మూసీనది దాటడానికి పడుతున్న కష్టాన్ని దూరం చేయడం కోసం పురానాపూల్ కట్టించాడు. అదీ హైదరాబాద్ చరిత్ర.

రాజ్యంలొ ప్లేగు వ్యాధి వచ్చి వందలాదిమంది బంజారాలు చనిపోయారు. ప్లేగు నిర్మూలన చేస్తానని శపథంచేస్తూ, చార్మినార్ కట్టించాడు ముహమ్మద్ కులీ కుతుబ్ షా. అదీ హైదరాబాద్ చరిత్ర.

- వరవరరావు
విరసం పాఠశాల 12 జనవరి 2013

హైదరాబాద్ చరిత్ర

హైదరాబాద్ చరిత్ర అంటే సంఘ్ పరివారం చెపుతున్న చరిత్రకాదు. యంఐయం చెపుతున్న చరిత్ర అంతకన్నాకాదు. హైదరాబాద్ చరిత్ర అంటే పురానాపూల్ చెప్పే చరిత్ర, చార్‌మినార్ చెప్పే చరిత్ర.

- వరవరరావు
విరసం పాఠశాల 12 జనవరి 2013

హైదర్ ఆబాద్

భగవంతుడా! సముద్రాన్ని చేపలతో నింపేసినట్టు నా హైదరాబాద్ నగరాన్ని మనుషులతో నింపేయి.

- ముహమ్మద్ కులీ కుతుబ్ షా (1591)
.
సామ్రాజ్యవాదం - మతతత్వం

అమెరికన్ సామ్రాజ్యవాద విస్తరణకు జియోనిజం తోడ్పడినట్టు, భారత పెట్టుబడీదారీ వ్యవస్థ బలపడ్డానికి హిందూత్వ తోడ్పడుతోంది.

- వరవరరావు
విరసం పాఠశాల 12 జనవరి 2013


Inspired by the Varavara Rao’s speech last Saturday 

I want to write a novel on the significance of 

Hyderabad history and its culture.

The title of the book will be 

BHAGYA – the City of Destiny

15-1-2013


మావో బాటలో సోనియా గాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి, ఇప్పుడు మావో బాటలో నడుస్తున్నారు.
" from defeat to defeat, to the final victory " అన్నాడు మావో జెడాంగ్.
బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ... అలా అడుగుపెట్టిన ప్రతిచోటా పార్టీకి  ఘోర పరాజయాల్ని అందించిన రాహుల్ ’బాబు’ 2014 లో కాంగ్రెస్ కు భారీ విజయాన్ని అందిస్తారని సోనియా నమ్ముతున్నారు.
మావో ఆలోచనా విధానం వర్ధిల్లాలి.
సోనియా ఆలోచనా విధానం వర్ధిల్లాలి.


స్త్రీ-పురుష సంబంధాల గురించి మనం మాట్లడేదంతా సారాంశంలో ఆస్తిసంబంధాల గురించే.

మనిషి వ్యవహార శైలిలో ఉన్న మర్మికతే అది. అదే అతన్ని ఇతర జీవుల నుండి విడగొడుతుంది. లేకపోతే ఆర్ధిక నిర్ణాయకవాదం అయిపోతుంది. మనిషి అలా ప్రవర్తించడు. కానీ సారంశం అదే.

ఆధిపత్య భావన అనేది స్వంతాస్థి కొనసాగింపే. ఉన్నత రూపం అనవచ్చు.  

Learned Person
జ్ఞానుల్ని నాలుగుసార్లు కలవకండి

జ్ఞానుల్ని మొదటిసారి కలిసినపుడు, వాళ్ల జ్ఞానం మీద గౌరవభావంతో మొక్కాలనిపిస్తుంది.
జ్ఞానుల్ని రెండవసారి కలిసినపుడు, వాళ్ళ జ్ఞానాన్ని ఎలాగైనా తస్కరించాలనిపిస్తుంది
జ్ఞానుల్ని మూడవసారి కలిసినపుడు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానంతోనే వాళ్ళను అధిగమించాలనిపిస్తుంది
జ్ఞానుల్ని నాలుగవసారి కలిసినపుడు, ఆత్మన్యూనతాభావంతో వాళ్లపై నైతిక దాడి చేయాలనిపిస్తుంది.


Democracy Redefined 

The government of the FDIs, by the FDIs, for the FDIs. 

Manmohan Singh
Sonia Gandhi
Rahul Gandhi &
Pranab Mukhrerji
December 5, 2012
The Day of FBI Bill wins vote in Lok Sabha 

Democracy

The government of the people, by the people, for the people

Abraham Lincoln, 
November 19, 1863
The Day of the Gettysburg Address

December 6, 2012


జైళ్ళశాఖ ముఖ్యప్రకటన

ఖైదీలతో జైళ్ళు నిండిపోయిన కారణంగా కొత్త ఖైదీలని రాష్ట్ర సచివాలయంలో పెడుతున్నామహోచ్!!!


దొంగలంజ కొడుకులేలే పాలన

ముఫ్ఫయిదేళ్ల క్రితం రాష్ట్రంలోని ఏ గోడమీద చూసినా జేగురు రంగులో ఒక నినాదం కనిపించేది.

దొంగ ఓట్ల, దొంగనోట్ల రాజ్యం ఒక రాజ్యమా?
దొంగలంజ కొడుకులేలే పాలన ఒక పాలనా?

ఇందులో రెండవ వాక్యం మరీ తీవ్రంగా వుందని అప్పుడు నేను అనుకునేవాడిని.
అంతకన్నా తీవ్ర పదజాలం వుంటేనే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ పంపకాల్లో, వాటాలు వున్నది తెలుగు, తెలంగాణ, రాయల తెలుగు మాట్లాడేవాళ్లకేనా?
ఉర్దు, గిరిజన భాషలు మాట్లాడేవాళ్లకు వాటాలు లేవా?



సమాజం మరీ చాదస్తంగాలేదు.
మా పిల్లలకు సంబంధాలు రావడం విశేషంకాదు. రెండు మతాల నుండి, రెండు ప్రాంతాల నుండి, భిన్న కులాల నుండి కూడా సంబంధాలు వస్తుండడం ఆనందంగా వుంది.

రాత్రి అజుబా (బాలగోపాల్ కొడుకు) చెప్పాడు, misahabl అని. s సైలెంటు అని నాకు తెలీనంతకాలం ’లెస్ మిజరబుల్స్’ అంటూ అన్ని అక్షరాలు పలికేవాడ్ని. నవల నిండా ఇన్ని కష్టాలు వుంటే లెస్ అంటాడేమిటీ? వెటకారం కాకపోతే! అనుకునేవాడిని. ఇలా నా అజ్ఞానంతో కొన్ని చోట్ల ఉపన్యాసాలు కూడా ఇచ్చాను. అప్పుడు విన్నవాళ్లకు ఫ్రెంచ్ రాకపొవడం నా అదృష్టం. ఇప్పుడు నాకు అర్ధం అయ్యింది ఏమంటే వినేవాళ్ళు అజ్ఞానులైవుంటే మనం జ్ఞానులుగా చెలామణి కావచ్చు.

చిన్నప్పుడేప్పుడో Victor Hugo నవల Les Misérables చదివాను. నేను చదివిన నవలల్లోకెల్లా పెద్ద నవల అదే. తరువాత, అక్కినేని నాగేశ్వరరావు నటించిన బీదలపాట్లు సినిమా చూశాను. ఆ సినిమాను అంతకు ముందు, మా నాన్నగారి రోజుల్లో, చిత్తూరు నాగయ్య నటించారట.
ఈ రోజురాత్రి వసంత ఇంట్లో Les Misérables నవల చూశా. ఇంటికి రాగానే Les Misérables సినిమా కావాలని మా పెద్దాడిని అడిగా. టామ్ హూపర్ దర్శకత్వం వహించిన Les Misérables musical drama film చూపించాడు వాడు.
మనిషిని వెంటాడే పాపభీతిని అద్భుతంగా చిత్రించిన నవల. అది విక్ట్రర్ హ్యూగో గొప్పతనం. కానీ, గొప్ప నవలను ఇంత గొప్ప సినిమాగా తీస్తారా? అనిపించింది. ఫాంటైన్ పాత్రలో అన్నే హ్యాథ్‌వే తెరమీద తెరబయట కూడా వెంటాడింది. ఆమె కమ్మర్షియల్ సెక్స్ వర్కర్ గా మారిన తొలిరాత్రి పాడిన పాట ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది. సినిమా చూస్తూ కొన్ని చోట్ల గట్టిగా ఏడ్చేశా. వీలైతే రేపు ఆ పాటను పోస్ట్ చేస్తా. తప్పక చూడాల్సిన సినిమా.
అన్నట్టు మరో విషయం ఏమంటే Les Misérables కథానాయకుని పేరు జీన్ వాల్జీన్ అనే ఇంతకాలం అనుకునేవాడిని. ఫ్రెంచి ఉఛ్ఛారణ మరోలా వుంది. అసలు నవల పేరే మన ఉఛ్ఛారణకు భిన్నంగావుంది.


ఖాజా విలాపం

1948 : హైదరాబాద్ పతనం’ పుస్తాకావిష్కరణ సభలో కవి ఖాజా ప్రసంగం వివాదం రేపిందని విన్నాను. ఆ సమయంలో నేను సభలో లేను.నిజాం రాచరిక పాలన మీద పొరాడిన పేద, మధ్యతరగతి ముస్లింలు రెండు విధాలా నష్టపోయారనీ, దానికి ప్రధానంగా కమ్యూనిస్టులు బాధ్యత వహించాలని ఖాజా విమర్శించాడట. నిజాం గద్దెదిగి అరవై ఐదేళ్ళు అవుతున్నా, నాటి దొరల దౌర్జాన్యాలని వదిలిపెట్టి, ఇప్పటికీ నిజాం వ్యతిరేక పాటల్ని కమ్యూనిస్టులు ప్రచారం చేయడంలోని ఔచిత్యాన్ని ఖాజా ప్రశ్నించాడట. ఇప్పుడు సాగుతున్న తెలంగాణ ఉద్యమంపట్ల తనకు సూత్రప్రాయంగా సమర్ధనవున్నా, ఉద్యమ నాయకత్వం ముస్లింలకు మరొసారొ ద్రోహం చేస్తుందని తనకు గట్టి అనుమానం వుందని ఖాజా చెప్పాడట! పోలీసు యాక్షన్ సందర్భంగా వేలాది ముస్లింలని ఊచకోత కోస్తే ఆ విషయాన్ని ఇన్ని పార్టీలు ఎందుకు దాచిపెడుతున్నాయని ఖాజా ప్రశ్నించాడట!

29-4-2013

జైళ్ళశాఖ ముఖ్యప్రకటన
ఖైదీలతో జైళ్ళు నిండిపోయిన కారణంగా కొత్త ఖైదీలని రాష్ట్ర సచివాలయంలో పెడుతున్నామహోచ్!!! 


దొంగలంజ కొడుకులేలే పాలన
ముఫ్ఫయిదేళ్ల క్రితం రాష్ట్రంలోని ఏ గోడమీద చూసినా జేగురు రంగులో ఒక నినాదం కనిపించేది.
దొంగ ఓట్ల, దొంగనోట్ల రాజ్యం ఒక రాజ్యమా?
దొంగలంజ కొడుకులేలే పాలన ఒక పాలనా?
ఇందులో రెండవ వాక్యం మరీ తీవ్రంగా వుందని అప్పుడు నేను అనుకునేవాడిని.
అంతకన్నా తీవ్ర పదజాలం వుంటేనే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తోంది.
 29 April 2013

Awards
టెలివిజన్ అవార్డులు
నాకెందుకో అవార్డుల మీద ఆసక్తిలేదు. ఎప్పుడూ సంస్థకూ ఎంట్రీలు పంపలేదు. పంపివుంటే, అవార్డు వచ్చేసేది అని కూడాకాదు. ఎప్పుడూ పంపాలని పించలేదు.

Biryani
బిర్యాని
వంటకానికైనా, ప్రాంతీయ భౌగోళిక వాతావరణం, వందల సంవత్సరాల సంసృతీ, సాంప్రదాయం, ఆర్ధిక వనరుల అందుబాటు అన్నీ కలిసి వుంటాయి. ఒక ప్రాంతపు వంటకాన్ని మరో ప్రాంతపు వాళ్ళు ఆస్వాదించాలేగానీ, దాన్ని ద్వేషించడమూ తప్పు, అదేపనిగా దాన్ని ఆరగించడమూ తప్పు. శీతలమండలాల్లో తినే పిజ్జాల్ని ఉష్టమండలాల్లో అదేపనిగా తింటే ఏమవుతుందీ? ఎల్డీయల్ కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి గుండె ఆగిపోతుంది!! హైదరాబాద్ లో పండే బేదాన ద్రాక్ష పళ్ళు అద్భుతంగా వుంటాయి. హైదరాబాద్లో ఆపిల్ తోటలు వేస్తే, రేగుపళ్ళు కాస్తాయి. దేనికైనా స్థలకాల జ్ఞానం  అవసరం.   

Telugu Writers Meet
తెలుగు కథా రచయితల సంగమం

చిలుమూరు సమావేశం చాలా బాగా జరిగిందిపాత మిత్రులతో మూడు రోజులు గడపడం కొత్త శక్తిని పుంజుకున్నట్టు అయింది. కొత్తతరం అభిప్రాయాల్ని, శక్తినీ, అసంతృప్తుల్ని తెలుసుకోవడానికి వీలు చిక్కింది.
ఆంధ్రాప్యారిస్ తెనాలి సమీపాన, కృష్ణానదీ తీరాన, ఒక సువిశాల వ్యవసాయ క్షేత్రంలోని గొడ్లపాక మా సమావేశ  స్థలం. వేదిక రొమాంటిక్ గా వుంది. వసతి బాగుంది. వంటకాలు అదుర్స్. ఆతిథ్యం ఆత్మీయంగా వుంది. చర్చలు అర్ధవంతంగా వున్నాయి.
ప్రయాణంలో నేను ముక్తవరం పార్ధసారధిగారివల్ల చాలా లాభపడ్డాను. ప్రపంచ సాహిత్యం గురించి చాలా రోజుల తరువాత ఒక పునశ్ఛరణ చేసుకునే అవకాశం దోరికింది.
మాకు ఆతిథ్యం ఇచ్చిన శ్రీరామ గ్రామీణ విద్యా సంస్థల నిర్వాహకులకు, ముఖ్యంగా కొలసాని తులసి విష్ణు ప్రసాద్ గారికి మరీమరీ ధన్యవాదాలు. ఏమాత్రం వీలు చిక్కినా అక్టోబరులో సందర్శించాల్సిన గ్రామం చిలువూరు.
నిర్వాహకుడు ఖదీర్ బాబూకు ప్రత్యేక కృతజ్ఞతలు

Christmas
రాత్రి ఇంకో-టీ కి వెళితే శాంతాక్లాజ్ బాటిల్ ఓపెనర్ ఇచ్చాడు.

నరసాపురం మిషన్ హైస్కూలుతో నాకున్న ప్రగాఢ అనుబంధంలో  క్రిస్మస్ కూడా ఒక భాగం. నియత విద్యలో భాగంగానే నేను బైబిల్ చదివాను. లంచ్ అవర్ కు ముందు ప్రతిరోజూ బైబిల్ క్లాస్ వుండేది.

కరుణ, జాలి, సేవాదృక్పధాన్ని వ్యాప్తి చేసే మతం క్రైస్తవం.

మానవజాతి పాపాలను కడిగివేయడానికి శిలువనెక్కిన ఏసుక్రీస్తు "ఫర్ గివ్ దెమ్ ఫాదర్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ" అనడం త్యాగానికి పరాకాష్ట

ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు కలిసుండాలనేది ఒక భావోద్వేగ ఆశయం మాత్రమే. తెలంగాణతో పాటూ రాయలసీమలోనూ ప్రత్యేకవాదం పుంజుకున్నాక సమైక్యవాదానికి ఇక భౌతిక పునాది అనేది లేనట్టే!

మన ఉద్యమాలు చాలా వేగంగా ముందుకు పొతున్నాయి. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ ఉద్యమాన్ని పెద్దాపురం (సెన్సార్ కట్) వాటిక వరకు తీసుకువెళ్ళి కొత్త రికార్డు నెలకొల్పారు. ఇక ముందు వారి రికార్డును వారే బ్రేక్ చేస్తారో, ఇంకెవరైనా బ్రేక్ చేస్తారో వేచిచూడాలి.

మూడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు

కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాలు కలవడానికి ప్రాతిపదిక ఆంధ్ర భాష  అనుకునేవారు. దాని మీద భిన్నాభిప్రాయాలు వచ్చాయి.
కోస్తాంధ్ర వాళ్లది తెలుగు భాష. తెలంగాణ వాళ్లది తెలంగాణ భాష. మరి రాయలసీమ వాళ్లది భాషా? అది కూడా తేలిపోతే, మూడు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఒక పనైపోతుంది.

ఆంధ్రప్రదేశ్ పంపకాల్లో, వాటాలు వున్నది తెలుగు, తెలంగాణ, రాయల తెలుగు మాట్లాడేవాళ్లకేనా? ఉర్దు, గిరిజన భాషలు మాట్లాడేవాళ్లకు వాటాలు లేవా?

రెండూ నేనే
ఫేస్ బుక్కులో నేను కొన్ని విమర్శలు చేస్తుంటాను. కొన్ని ఛలోక్తులు విసురుతుంటాను. అవి ఎవరిమీదో కాదు. చాలా సందర్భాల్లో నామీదే నేను విమర్శలు సంధిస్తుంటాను. ప్రస్తుతం నాది తండ్రి పాత్ర ఒక్కటే కాదు. కొడుకుపాత్ర కూడా వుంది. అందువల్ల తండ్రుల మీద విమర్శ చేసినా, పిల్లల మీద విమర్శ చేసినా రెండూ నాకే వర్తిస్థాయి

కాంగ్రెస్ తెలంగాణతో తల గోక్కుంటున్నది

నోటిదురుసు
 "సమైక్యరాష్ట్రంలో కలిసుండడం ఇష్టంలేని వారెవరైనా రాష్ట్రం విడిచి దిక్కున్న చోటుకు పోవాలి" - లగడపాటి

క్రోర్ కమిటి
కాంగ్రెస్ కోర్ కమిటీ అంటే క్రోర్ కమిటి. ఒక అంశాన్ని తేల్చడానికి అది కోటిసార్లు సమావేశమౌతుంది.
కమల్ హసన్ విశ్వరూపం
ఆరు నెలల్లోనే టీవీల్లో వచ్చేస్తున్నాయి కనుక, థియేటరుకు వెళ్ళి సినిమాలు చూసే అలవాటు తప్పింది.   అంచేత కమల్ హసన్ విశ్వరూపం  ఇంకా చూడలేదు.

కమల్ హసన్గారివద్ద మా పెద్దబ్బాయి అరుణ్ ఇక్బాల్  రెండు సినిమాలకు టెక్నీషియన్ గా పనిచేశాడు. నాకు తెలిసినంతవరకు కమల్ ఇంటిపేరులోని హసన్ ఒక ముస్లిం పేరు. ఒక ముస్లిం స్వాతంత్ర సమరయోధుడి పేరును కమల్ వాళ్ల నాన్న తన పిల్లలకు పెట్టారని విన్నాను. నేపథ్యంలో, కమల్హసన్ వుద్దేశ్యపూర్వకంగా ఒక ముస్లిం వ్యతిరేక సినిమా తీస్తారని అనుకోను. వాస్తవం ఏమిటో సినిమా చూసినవాళ్ళు చెప్పాలి.  

ఆడపిల్లలు లేకపోతే మనిషి సంపూర్ణంగా బతికినట్టు కాదని మా నాన్నగారు అనేవారు.

ఎందుకోగానీ మాకు మొదట ఆడపిల్ల పుడుతుందని బలంగా అనిపించేది. ఒకే సంతానంతో సరిపెట్టాలనీ పేరు కూడా నిర్ణయించుకున్నాం. కానీమొదటి సంతానంగా మాకు మగపిల్లాడు పుట్టాడు. ఆడపిల్ల కోసం మరో ప్రయత్నం చేశాం. మాకు రెండో సంతానం కూడా మగపిల్లాడే. మూడో ప్రయత్నం చేసే సాహసం లేకపోయింది. అప్పటికే లోటు బడ్జెట్!

జీవితానికి సంబంధించిన ప్రతి బాధనూ, ప్రతి విషాదాన్నీప్రతి పార్శ్వాన్నీ నేను అనుభవించాను. ఆడపిల్లకు తండ్రికాకపొవడం ఒక్కటే లోటు.

 మా నాన్న అభిప్రాయం ప్రకారం అయితే, నా జీవితం అసంపూర్ణం.   


గత ఏడాది హైదరాబాద్ మాదన్నపేట కూర్మగడ్దలోని శ్రీహనుమాన్జీ మందిర్ గోడ పైకి కొందరు దుండగులు గోమాంసాన్ని విసిరి పారిపోయారు. ఇతర మతాల దేవతల్ని అపవిత్రం చేయడం అనేది దుండగ చర్య. తద్వార ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవచ్చని కొందరు నాయకులు ఆశిస్తారు. అయితే, ప్రజలు ఎన్నడూ రాజకీయ నాయకులు అనుకున్నంత మూర్ఖులుకారు. ప్రజల్లో చైతన్యం పెరిగేకొద్దీ ఒకరి దేవతల్ని మరొకరు అవమానించే సంఘటనలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఎవరి దేవతల్ని వారే అవమానించుకుని నేరాన్ని అవతలి పక్షం వైపుకు నెట్టేస్తున్నారు. కూర్మగడ్ద సంఘ్హటన తరువాత నగర పోలీసులు సహజంగానే ముస్లిం సామాజికవర్గానికి చేందిన కొందరు యువకుల్ని అరెస్టుచేసి జ్యూడీషియల్ రిమాండుకు పంపించారు. వార్త అన్న్ని తెలుగు, ఇంగ్లీషు, హిందీ పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. తరువాత అసలు వాస్తవం బయటపడింది. హిందూ సామాజికవర్గానికి చెందిన నలుగురు యువకులు దుశ్చర్యకు పాల్గొన్నట్టు పోలీసులు కనుగొన్నారు. దానికి ఒక నెల రోజుల ముందు జరిగిన మహబూబ్నగర్లో ఉపఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్దిపొందిన సంఘ్పరివారం అదే వ్యూహాన్ని హైదరాబాద్లో అమలు చెయడానికి చేసిన ప్రయత్నమే కూర్మగడ్ద సంఘటన అని పోలీసులు తేల్చారు. వార్త ఇంగ్లీషు పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ప్రముఖ తెలుగు పత్రికలు వార్తను  ప్రచురించలేదు.

ఇంగ్లీషు పత్రికలకూ, తెలుగు పత్రికలకూ తేడా ఏమిటని మిత్రులు నన్ను అడగవచ్చు. ముస్లింలు చదివితే ఉర్దు పత్రికలు చదువుతారు లేకపోతే ఇంగ్లీషు పత్రికలు చదువుతారు అనేది మార్కెట్ వర్గాలు తేల్చిన విషయం. తరువాత వాళ్ళ ప్రాధాన్యత తేలుగు పేపర్లు. వాళ్ళు హిందీ పేపర్లు అస్సలు చదవరు. హైదరాబాద్ లొ హిందీ పేపర్లని మార్వాడీలు, ఇతర ఉత్తరాది వారు చదువుతారు.     

Outdated Generation
జనరేషన్ అలవాట్లను చూస్తుంటే నా తరానికి కాలం చెల్లింది అనిపిస్తుంది.

అప్పట్లో స్నానం చేయకుండా స్కూలుకు వచ్చేవాళ్ళను ఎగతాళి చేసేవారు. ఇప్పుడు స్నానం చేసేవాళ్ళను ఎగతాళి చేస్తున్నారు. పళ్ళు తోముకోవడం, ముఖం కడుక్కోవడం కూడా చెడు అలవాటు అయింది.
సూర్యోదయంతో లేవడం, సూర్యాస్తమయం అయ్యాక పడుకోవడం మంచి అలవాటు అనేవారు. సూర్యాస్తమయం అయ్యాక లేవడం సూర్యోదయం అయ్యాక పడుకోవడం ఆధునిక అలవాట్లు అంటున్నారు.
అమెరికా కంపెనీల కోసం హైదరాబాద్లో పనిచెసేవాళ్ళు రాత్రంతా మెలుకువగావున్నా ఒక అర్ధం వుంది. ఉద్యోగమే లేనోళ్లు కూడా  జాగారాలు చేయడం దేనికో అర్ధం కావడంలేదు.
అప్పట్లో ఇంటి తిండి ఆరోగ్యం  అనేవారు. ఇప్పుడు బయటి తిండి బహు రుచి అంటున్నారు.
అప్పట్లో ఆరు పదులు దాటాక  లైఫ్ స్టైల్ రోగాలు వచ్చేవి. ఇప్పుడు పాతికేళ్లకే లైఫ్ స్టైల్ రోగాలు వస్తున్నాయి.
అప్పట్లో నూరేళ్ళు జీవించు అని దీవించేవారు. ఇప్పుడు రాత్రి గొప్పగా  జీవిస్తే చాలు అంటున్నారు

ఉత్పత్తి సంబంధాలు

సృష్ఠిలో ప్రతిజీవీ తన సంతతిని సృష్టిస్తుంది. మనిషి తన సంతతి భౌతిక అవసరాల కోసం భౌతిక ఉత్పత్తిని కూడా చేపడతాడు. అలా ఉత్పత్తిని చేసే క్రమంలో మనిషి తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే, అప్పటికి స్వతంత్రంగా అస్థిత్వంలోవున్న కొన్ని సంబంధాల్లోనికి ప్రవేశిస్తాడు.
ఉత్పత్తి సంబంధాలు ఇద్దరు వ్యక్తుల స్థాయిలో వుండవచ్చు, ఒక వాణిజ్య సంస్థ స్థాయిలో వుండవచ్చు, సమాజమంత పెద్ద స్థాయిలోనూ ఉండవచ్చు
(ఇది మార్క్స్ కు అచ్చంగా అనువాదమూ కాదూ, అలాగని పూర్తిగా  నా స్వంతమూ కాదు. మార్క్స్ నాకు అర్ధమయిన, నాకు అంగీకారమయిన తీరు ఇది

అబ్బా - పండుగొప్ప చేప
రాత్రి మా అబ్బా చాలా గుర్తుకొచ్చారు. దానికి కారణం పండుగొప్ప చేప.
నిన్న సాయంత్రం ఔషన్ మాల్లో పండుగొప్ప (Sea Bass) చేపను చూసి కొనాలని ముచ్చట పడ్డాను. అది 1600 గ్రాములుంది. కెజీ 450రూపాయలు. 720 రూపాయలుపెట్టి చేప కొనడానికి సందేహించాను. లోపులో ఐఏఎస్  అధికారి భార్య దాన్ని కొనేసింది. తరువాత నేను  చిన్న సైజు  చందువాయి చేపతో సరిపెట్టుకున్నాను. అదీ, మా ఆవిడ బలవంతం మీద!!
మా ఇళ్లల్లో, పండుగొప్ప, చందువాయిరావలు, సొటారు, మాతగొర్క (పండుగొరస), అరబ్బీ చేపల్ని మాత్రమే తినేవాళ్ళు. అవి దొరకనపుడు అసలు చేపే తినేవారుకాదు. అదో దర్జా!!!
నేను మొదటి మూడు రకాల చేపలైతేనే తినేవాడ్ని. నా కోసం మా అబ్బా రెండు కిలోల పండుగొప్పనో, చందువాయినో కొనేసేవారు.
మా అబ్బా మెకానిక్. అప్పటి ఆయన  నెలసరి ఆదాయంకన్నా, ఇప్పుడు నా రోజువారీ ఆదాయం కొన్ని రెట్లు ఎక్కువ. కానీ, నేను ఈరోజూ ముందూ వెనక ఆలోచించకుండా రెండు కిలోల పండుగొప్పను కొనలేను.
మనం పెరిగామా? తరిగామా?
మా అమ్మీ ఇంట్లో వున్నప్పుడు చందువాయి చేప  వండుకుని తినడం ఒక ఆనందం. అదీ కొసమెరుపు!!  

ప్రపంచ 4 తెలుగు మహాసభలు

సినారే :
కొత్త పాటలో పల్లవి మాత్రమే ఈరోజు రాష్ట్రపతికి అంకితం. చరణాలు 2008 లో మేస్త్రి దాసరి నారాయణరావుకు ఆల్రెడీ అంకితం.   


ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు కలిసుండాలనేది ఒక భావోద్వేగ ఆశయం మాత్రమే. తెలంగాణతో పాటూ రాయలసీమలోనూ ప్రత్యేకవాదం పుంజుకున్నాక సమైక్యవాదానికి ఇక భౌతిక పునాది అనేది లేనట్టే!

ఆంధ్రా నాయకులు ఆంధ్రుల్ని ఇప్పటి వరకు తెలంగాణవాళ్ళతో తిట్టించారు. ఇక ముందు రాయలసీమ వాళ్లతోనూ తిట్టిస్తారనుకుంటా.

బ్రిటీష్ వలసకాలంలోనే నిజాం ప్రపంచంలోనే అపర కుబేరుడు. (ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోనికి తీసుకుంటే ఇప్పటికీ  అపరకుబేరుడే)అప్పటికే హైదరాబాద్ దేశంలోనే ఐదవ మహానగరం. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతలు తోడవ్వడంతో,  1956  తరువాత హైదరాబాద్ అభివృధ్ధి మరింత వేగంగా  సాగింది.

విజయబాబు గారికి రాచకొండ విశ్వనాధ శాస్త్రి తెలిసి ఉండరు కానీ రాచకొండ విశ్వనాధ శాస్త్రి  గారికి తెలుగు తెలుసు. రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారు విరసం వ్యవస్థాపక సభ్యులు.

తెలుగు తెలిసిన పెద్దలంతా ౧౯౭౫లో  ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరించినట్టు విజయబాబు గారికి తెలీదు.

నాక్కూడా తెలుగు తెలుసు. విజయబాబు గారికన్నా నాకు మంచి తెలుగు నుడికారం తెలుసని వారికి మనవి చేసుకుంటున్నాను

విజయబాబు గారికి సోనియా గాంధీ గారు బాగా తెలుసు. కానీ, సోనియా గాంధీ గారికి తెలుగు తెలీదు.

అదీ విషయం!!

"ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరించాలని విప్లవ రచయితల సంఘం పిలుపునిచ్చింది.

విరసం పిలుపును నేను బలపరుస్తున్నాను." అని నేను రాసిన పోస్ట్ మీద "అయ్యో! విరసంలో తెలుగు వాళ్లు లేరా ?" అని  సీహెచ్. విజయ బాబు, కడప వారు కొంచెం జాలి పడ్డారు.

విజయబాబు గారికి శ్రీశ్రీ తెలిసి ఉండరు కానీ శ్రీశ్రీ గారికి తెలుగు తెలుసు. శ్రీశ్రీగారు విరసం వ్యవస్థాపక అధ్యక్షులు!

విజయబాబు గారికి  కొడవటిగంటి కుటుంబరావు తెలిసి ఉండరు కానీ కొడవటిగంటి కుటుంబరావు  గారికి తెలుగు తెలుసు. కొడవటిగంటి కుటుంబరావు గారు విరసం వ్యవస్థాపక సభ్యులు.



Animated Political Satires - 2

తెలుగులో  24/7న్యూస్ ఛానళ్ళ రాక 2004 లో ఆరంభమయింది. ’మాస్టర్జీశీర్షికతో, సినిమా పాటల ఆధారంగా, యానిమేటెడ్ రాజకీయ వ్యంగ్య కార్యక్రమాన్ని, 2004  మార్చిలో టీవీ-9 ఆరంభించింది. దీని నిడివి నిముషంన్నర నుండి రెండు నిముషాల వరకు వుండేది. ఆడవి శ్రీనివాస్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ప్రొడక్షన్స్ దీన్ని ర్రూపొందించింది. తరువాత కార్యక్రమం "వికటకవిగాపేరు మార్చుకుని ఇన్-హౌస్ ప్రొడక్షన్ మొదలయింది.  

సారీ సారీ సారీ.

లల్లూబ్రదర్స్ రూపకల్పన బృందంలో అప్పటి మా ఎడిటర్ వీయస్సార్ శాస్త్రి(ఇప్పుడు -న్యూస్) , న్యూస్ బ్యూరో చీఫ్ మూర్తి (ఇప్పుడు ఏబిఎన్-ఆంధ్రజ్యోతి), ప్రొడ్యూసర్లు డివిఎస్ రాజా, రవి, యానిమేషన్ శివ, వీడియో ఏడిటర్లు శ్రీనివాసరెడ్డి, రవి పేర్లు రాయడం మరిచాను.
అందరికీ మరోసారి సారీ!

       

పీఆర్పి రోజుల్లో
పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారటా?
అల్లు అరవింద్ : టిక్కెట్టు అంటేనే అమ్ముకోవడం కోసం పుడుతుంది.

వెంకయ్య నాయుడు : రాహుల్ గాంధికి జ్ఞానదంతాలు కూడా రాలేదు. నరేంద్రమోడీకి దంతాలు కదిలే వయసు వచ్చేసింది.

మాయావతి : రాహుల్ బాబు కచ్చా హై. కచ్చా.
ఘ్ణ్ ద్ :

గులాం నబీ ఆజాద్: గులాం కభీ ఆజాద్ నథా!

సామిడి జగన్ రెడ్డి మొత్తం వ్యాసంలోఅధూరెలోని ఒక్క కథ పేరుగానీ, స్కైబాబా కథనశైలి గురించి ఒక్క వాక్యంగానీ, కథలకు ప్రాణప్రదమైన నాటకీయ నిర్మాణం గురించిన వివరణగానీ ఎక్కడా కనిపించదు. ఆమేరకు ఆయన స్కైబాబాకు ప్రాధమికంగా అన్యాయం చేశాడు. పుస్తకాన్ని అడ్డుపెట్టుకుని తనకు కిట్టనివాళ్ల మీద వెర్రిదాడి చేసి, వాళ్లను స్కైబాబాకు కొత్త ప్రత్యర్ధులుగా మార్చాడు. ఆమేరకు స్కైబాబాకు మరో అన్యాయం చేశాడు.

స్కైబాబా కథలు అన్నీ కాకపోయినా  కొన్ని నేను చదివాను. సున్నితమైన అంశాల్ని, సుతారంగా రాయడంలో స్కైబాబాకు ప్రత్యేక ప్రతిభవుంది. పరంపరలో ఆయన రచనలు సాగిస్తే మరిన్ని విజయాలు తన ఖాతాలో వేసుకోగలడుఅయితే, కథల్ని ముస్లింవాద కథలనో, తెలంగాణవాద కథలనో, రచయితో, సమీక్షకులో అనుకోవడంపట్ల నాకు సూత్రప్రాయంగా కొన్ని అభ్యంతరాలున్నాయి


సెక్స్ కూడా కసరత్తే

ప్రముఖ ఫిజీషియన్ వి. శాంతారాంగారు మాకు మెడికల్ కన్సల్టెంట్. ఆమధ్య కలిసినపుడు "రోజూ మార్నింగ్ వాక్ కు వెళుతున్నారా?" అని అడిగారు. "బద్దకించి సగం రోజులు వెళ్లడంలేదన్నాను" అన్నాను. "అలాంటప్పుడు సెక్స్ లో పాల్గొనండి. అది కూడా మంచి కసరత్తే" అన్నారు.

ఖాజా విలాపం

1948 : హైదరాబాద్ పతనంపుస్తాకావిష్కరణ సభలో కవి ఖాజా ప్రసంగం వివాదం రేపిందని విన్నాను. సమయంలో నేను సభలో లేను.నిజాం రాచరిక పాలన మీద పొరాడిన పేద, మధ్యతరగతి ముస్లింలు రెండు విధాలా నష్టపోయారనీ, దానికి ప్రధానంగా కమ్యూనిస్టులు బాధ్యత వహించాలని ఖాజా విమర్శించాడట. నిజాం గద్దెదిగి అరవై ఐదేళ్ళు అవుతున్నా, నాటి దొరల దౌర్జాన్యాలని వదిలిపెట్టి, ఇప్పటికీ నిజాం వ్యతిరేక పాటల్ని కమ్యూనిస్టులుప్రచారం చేయడంలోని ఔచిత్యాన్ని ఖాజా ప్రశ్నించాడట. ఇప్పుడు సాగుతున్న తెలంగాణ ఉద్యమంపట్ల తనకు సూత్రప్రాయంగా సమర్ధనవున్నా, ఉద్యమ నాయకత్వం ముస్లింలకు మరొసారొ ద్రోహం చేస్తుందని తనకు గట్టి అనుమానం వుందని ఖాజా చెప్పాడట! పోలీసు యాక్షన్ సందర్భంగా వేలాది ముస్లింలని ఊచకోత కోస్తే విషయాన్ని ఇన్ని పార్టీలు ఎందుకు దాచిపెడుతున్నాయని ఖాజా ప్రశ్నించాడట!


ఖాజా ఆవేదనకు అర్ధం వుంది

ఖాజా అవేదన మీద నాకు సంపూర్ణ సానుభూతి వుంది. ముస్లింలకు జరిగిన అన్యాయంలో నాటి ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీకి బాధ్యత లేదని చెప్పలేము. నాటి సాయుధపోరాట విరమణ పిలుపులో హిందూత్వ అంశని నిరాకరించనూలేము. అయితే, రోజుల్లో హిందూత్వ ప్రభావం కమ్యూనిస్టులకు మాత్రమే పరిమితమైలేదు. నాటి కాంగ్రెస్ లో హిందూత్వ ప్రభావం ఎక్కువగావుంది. నిజాం వ్యతిరేక పొరాటంలో పాల్గొన్న ప్రముఖ కుటుంబాన్ని పరికించినా, కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఆర్యసమాజ్ ప్రతినిధులు కనిపిస్తారు. అంతిమ ఘట్టంలో ఆర్యసమాజ్ సామాజికంగా లబ్ది పొందింది. దాన్ని, కాంగ్రెస్ తనకు రాజకీయ లబ్దిగా మార్చుకుంది. పోలీస్ యాక్షన్ తరువాత ప్రాణాలు కోల్పోయింది ముస్లింలు మాత్రమేకాదు, రైతుకూలీ కమ్యూనిస్టులు కూడా భారీ సంఖ్యలో వున్నారు. రెండు రకాల బాధితుల మధ్య  ఒక సమన్వయాన్ని సాధించే పని నేటి తరం చేయాలి.

love marrigage కాదు  arranged marrigage
మా ఇద్దరి ఫోటో చూసి చాలామంది ఫేస్ బుక్ ఫ్రెండ్స్ మాది ప్రేమ వివాహమా? అని అడుగుతున్నారు. కొందరు మా ఆవిడ బొట్టు గురించి కూడా అడుగుతున్నారు. మాది ప్రేమ వివాహంకాదు. కులాంతర, మతాంతర వివాహమేగానీ, అది పెద్దలు కుదిర్చిన పెళ్ళే. సరిగ్గా చెప్పాలంటే పార్టీ పెళ్ళి. నేను సున్నీ ముస్లిం పఠాన్, ఆమె హిందూ కమ్మ. అయితే మా పెళ్ళికి అవి ప్రాతిపదికలు కావు. సామ్యవాదం ఒక్కటే ప్రాతిపదిక
అప్పట్లో కమ్యూనిస్టు పార్టీల్లో ఒక సాంప్రదాయం వుండేది. తమ పిల్లల్ని పార్టీలో ఇవ్వాలనుకున్నవాళ్ళు విషయాన్ని పార్టీ నాయకత్వానికి తెలిపేవాళ్ళు. పార్టీలో ఎవరో ఒకరుపెళ్ళిళ్ల పేరయ్యగా మారి సంబంధాలు కుదిర్చేవారు. అలా కుదిరిందే మా పెళ్ళి.
మా పెళ్ళి ప్రతిపాదన కొండపల్లి సీతారామయ్య స్థాయిలోనే మొదలయ్యింది. నిమ్మలూరి భాస్కరరావు (అజ్ఞాత సూర్యుడు) ’పెళ్ళిళ్ల పేరయ్యగా వ్యవహరించారు. ఆయనే మాకు పెళ్ళిచూపులు కూడా ఏర్పాటు చేశారు. పెళ్ళి నిర్ణయం తీసుకోవడానికి మా ఆవిడ కొంత గడువు కోరిందిగానీ, తన కూతుర్ని నాకు ఇవ్వాలని మా మావయ్య యేలూరి భీమయ్యగారు చాలా ఆసక్తి చూపించారు. అది వారి గొప్పతనం.

  1983  ఏప్రిల్  27 విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మా పెళ్ళికి జరిగిన చలసాని ప్రసాద్ పురోహితుడు. అప్పటి నిరాడంబర సాంప్రదాయం ప్రకారం నేను పెళ్ళికి కొత్త బట్టలు కూడా కుట్టించుకోలేదు. ఫోటోలు కూడా తీయించుకోలేదు. పెళ్లయిన ఏడాదిన్నర తరువాత మేమిద్దరం తొలిఫోటో తీయుంచుకున్నాము. అదే ఇది

No comments:

Post a Comment