Sunday 28 April 2013

MT Khan


మా కులగురువు 
 MT Khan

'1948 : హైదరాబాద్ పతనం’ పుస్తకావిష్కరణ సభలో ఖాన్ సాబ్ (ఎం.టీ. ఖాన్) కనిపించారు. వయోభారం ప్రస్పుటంగా కనిపిస్తోంది. వారు కొత్త పుస్తకం కొంటుంటే నేనే అడ్డుపడి, "దాన్ని మీకు గ్యాపకంగా ఇచ్చే అవకాశాన్ని నాకు కల్పించండి" అన్నాను ప్రాధేయపూర్వకంగా. ఖాన్ సాబ్‌కు స్వాభిమానం చాలా ఎక్కువ. వారు ఇతరుల నుండి ఏవీ స్వీకరించరు. నిన్న వారు ఏ కళతో వున్నారోగానీ, కొంచెం అనాసక్తిగానైనా, నా విజ్ఞప్తిని అంగీకరించారు. రెండు కాపీలు కొని ఒకటి వారికి ఇచ్చాను. వారొక షరతు పెట్టారు. "జ్ఞాపిక మీద నీ సంతకం కావాలి" అన్నారు. ఇది నాకు ఊహించని వరం. "మా కులగురువు ఖాన్ సాబ్ గారికి వినయంగా" అని రాశా. అది చూసి వారు ఒకసారి కాగిలించుకున్నారు. తొలితరం కమ్యూనిష్టు విప్లవకారులకు ఖాన్ సాబ్ ఇప్పుడు సజీవ ప్రతీక.
7 April 2013

No comments:

Post a Comment