Sunday 28 April 2013

Six Dogs and an Old Lady


ఆరుకుక్కలు ముసలామె
డానీ      story 
11-4-2013

జూబిలీహిల్స్ రోడ్ నెంబరు 15 లో ఉందా ఇల్లు. ఎకరం వైశాల్యంలో ప్రత్యేకంగా కట్టించుకున్న భవంతి అది. ఇటలీ ఆర్కిటెక్ట్ దాన్ని రూపకల్పన చేశాడు. సువిశాల లాన్లో ఉద్యానవన విభాగం  నిపుణులు చెట్లు, మొక్కలు నాటరు.

"స్వర్గద్వారాలు తడుతున్నాను" అనిపించింది యువకుడికి; కాలింగ్ బెల్లు నొక్కుతున్నప్పుడు. "బయటే ఇంత అందంగావుంటే లోపల ఇకెంత బాగుంటుందో?" అనుకున్నాడు.

భారీ దెయ్యపు సైజు గేటు. గేటులో ఇంకో చిన్న గేటు. చిన్న గేటు పైభాగాన  కంతలాంటి బుల్లి కిటికి.
ఎక్కడా అలికిడిలేదు. రెండోసారి కాలింగ్ బెల్లు నొక్కబోయి  హఠాత్తుగా  ఆగిపొయాడతను.
కంతలో నుండి రెప్పలు వాలిపోయిన రెండు చిన్ని కళ్ళు అతన్నే చూస్తున్నాయి.
"బీమ్ టెలికమ్యూనికేషన్స్ నుండి వచ్చానండీ" అన్నాడతను చిన్ని కళ్లకేసి చూస్తూ.
అటు నుండి స్పందన లేదు.
"ఇంటర్నెట్ .... ఇంటర్నెట్ కనెక్షన్ " గొంతు పెద్దది చేసి అరిచాడతను.
అరుపుకు కంతలో కళ్ళు మాయమైపోయాయి. కాస్సేపాగి, కిర్రు మంటు గేటు తెరుచుకుంది.
ఎదురుగా ముసలామె నిలడివుంది. ఆమె చుట్టూ పులుల్లాంటి ఆరు అల్షేషియన్ జాతి   కుక్కలు నాలుకలు చాచి వగరుస్తూ నిలబడ్డాయి.
కుక్కల్ని చూడగానే యువకుడికి పై ప్రాణాలు పైకే పొయినట్టయింది ముసలామె మాత్రం ఇదేమీ పట్టించుకోనట్టు రోడ్దు కేసి చూస్తోంది. ఎప్పుడో విడిపోయిన బంధువుల్ని ఇప్పుడే చూస్తున్నట్టు వుందామె చూపులు.
"కుక్కలు " అన్నాడతను భయంభయంగా.
" మా అబ్బాయిలే. నిన్నేం చేయవు" అందామే వీధికేసే చూస్తూ.
అప్పుడే ఎదురుగా వున్న ఇంటి గేటు తెరుచుకుని ఒక కారు బయటికి వచ్చింది. కారు వెళ్ళిపోయాక ఇంటామె గేటు మూసివేసింది.
"" అంది ముసలామే. చాలా నిరాశగా


తన కొడుకు ఏడు కుక్కలపెట్టు అనేమాట ఆమెకు నచ్చలేదు.  

No comments:

Post a Comment