దేవుడా! నన్ను కమ్యూనిస్టు కాకుండా
చేసినందుకు నీకు ధన్యవాదాలు!
డానీ
ప్రతి ఘర్షణలో, మేధో సంఘర్షణలో రెండు
సామాజికవర్గాలుంటాయి. వాటిల్లో తప్పని సరిగా ఒకటి బలమైనది, మరొకటి బలహీనమైనది వుంటుంది.
ఒకటి పీడిస్తుంది. మరొకటి పీడితురాలిగా వుంటుంది. మనం ఎప్పుడయినా చేయాల్సింది పీడితుల పక్షం నిలబడడమే!
ఇలా నిలబడాలంటే చాలా నైతిక స్థైర్యంకావాలి.
పెత్తందారీ
కులాలు. వెనుకబడిన కులాల మధ్య వివాదం మొదలయితే నేను వెనుకబడిన కులాల పక్షం వహిస్తాను. వెనుకబడిన కులాలు,
దళితుల మధ్య వివాదం మొదలయితే నేను దళితుల పక్షం
వహిస్తాను. దళితుల్లో మాలలు, మాదిగల మధ్య వివాదం మొదలయితే నేను మాదిగలపక్షం వహిస్తాను.
హిందువులకు శిక్కులకు మధ్య వివాదం మొదలయితే నేను శిక్కులపక్షం వహిస్తాను. హిందువులకు
క్రైస్తవులకు మధ్య వివాదం మొదలయితే నేను క్రైస్తవుల పక్షం వహిస్తాను. తెలంగాణకు సీమాంధ్రకూ
మధ్య వివాదం మొదలయితే నేను తెలంగాణ పక్షం వహిస్తాను. తీరాంధ్రకూ, రాయలసీమకూ మధ్య వివాదం మొదలయితే నేను రాయలసీమ పక్షం వహిస్తాను.
పురుషులకూ, స్త్రీలకు మధ్య మధ్య
వివాదం మొదలయితే నేను స్త్రీల పక్షాన నిలబడతాను. కార్మికులకూ యజమానులకూ మధ్య వివాదం
మొదలయితే నేను కార్మికుల పక్షాన నిలబడతాను. ఉత్తరాదికీ దక్షనాదికీ మధ్య వివాదం మొదలయితే
నేను దక్షణాది పక్షాన నిలబడతాను. ప్రపంచదేశాల మధ్య వివాదం మొదలయితే నేను మూడవ ప్రపంచదేశాల
పక్షాన నిలబడతాను.
ఇవన్నీ
నేను దాదాపు మూడు దశాబ్దాలుగా చేస్తూనే వున్నాను. ఇక ముందు కూడా చేస్తాను. ఇలాంటి సందర్భాల్లో
చాలా మంది నన్ను లౌకికవాది, ప్రజాస్వామికవాది అంటూ మెచుకుంటూ కూడా వుంటారు. కానీ, హిందువులకు
ముస్లింలకు మధ్య వివాదం మొదలయినపుడు ముస్లింల పక్షం వహిస్తే వెంటనే నేను కొందరి దృష్టిలో మతవాది అయిపోతున్నాను.
మరి కొందరయితే నాకు కమ్యూనిజం మూల సూత్రాలు
నేర్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇది విషాదం. నిజానికి ముస్లిం సమాజంలోనూ అష్రాఫ్, అజ్లాఫ్. అర్జాల్ లమధ్య వివాదం మొదలయినా నేను అజ్లాఫ్. అర్జాల్ ల పక్షం వహిస్తాను.
కష్టకాలంలో
పీడితుల పక్షాన నిలబడడానికి కమ్యూనిస్టు సిధ్ధాంతం అడ్డంకిగా మారితే అది అసలు కమ్యూనిజమేకాదు.
దాన్నే కమ్యునిజమని ఎవరైనా చెలాయించదలిస్తే అలాంటి కమ్యూనిజం నాకు అక్కరలేదు. అసలు విషయం ఏమంటే భారతదేశంలో కమ్యూనిజంతో పనిలేనివాళ్ళంతా, పీడిత జీవితం తెలియనివాళ్ళంతా
కమ్యునిస్టు నాయకులుగా చెలామణి అయిపోతున్నారు. దేవుడా! నన్ను కమ్యూనిస్టు కాకుండా చేసినందుకు
నీకు ధన్యవాదాలు!
24 April 2014
No comments:
Post a Comment