Monday 31 July 2023

*డబ్బులు లేక ఉద్యమాలు ఆగవు* Kondapalli Seetharamaiah

 

*డబ్బులు లేక ఉద్యమాలు ఆగవు*

 


*డబ్బులు లేక ఉద్యమాలు ఆగవు*

 

“ఉద్యమాలు మనుషులులేక ఆగవచ్చుగానీ, ఆయుధాలు లేక, వాటికోసం డబ్బులు లేక ఆగవు” అని కొండపల్లి సీతారామయ్య తరచూ చెప్పేవారు. 

 

నేను తలపెట్టిన  కార్యక్రమం ఎన్నడూ డబ్బులు లేక ఆగలేదు.

 

చేతికి ఉంగరం వుందనే ధైర్యంతో 1970లు 80లలో ఇండోర్ మీటింగులుకాదు;  ఏకంగా బహిరంగ సభలు ప్రకటించేసేవాడిని.  ఆదివారం సభకు ఒక్కోసారి రెండు మూడు రోజులు గడువు కూడ వుండేది కాదు. నాది అతివాదం అతినమ్మకం అనేవారు.  కామ్రెడ్ ప్రభుదాస్ కు వుంగరం తీసి ఇచ్చి 100 రూపాయలు తెమ్మంటే అడ్వాన్సు వడ్డి 10 రూపాయలు పోనూ 90 రూపాయలు తెచ్చి ఇచ్చేవారు.  40 రూపాయలు ఇప్పటి టివి సెలబ్రెటి అనలిస్టు రంగావఝాల భరద్వాజకు, దళిత మహాకవి యువక అనే కలేకూరి ప్రసాద్ కు ఇచ్చేవాడిని. 

 

50 డెమ్మీ సైజు లిథో వాల్ పోస్టర్లు, మైదాపిండి జిగురు, రెండురోజులు సైకిలు అద్దె, భరద్వాజ ప్యాకేజి!. నాలుగు బల్లలు, నాలుగు కుర్చీలు, షామియానా, రెండు లైట్లు, ఒక మైక్రో ఫోను, నాలుగు స్పీకర్లు కలేకూరి ప్రసాద్ ప్యాకేజి. అప్పట్లో ఆ ప్యాకేజీల ధర అంతకన్నా చాలా ఎక్కువే వుండేది. అది రాడికల్స్ కు స్పెషల్ రేటు కాంట్రాక్టు.

 

నాటి రద్దీ ప్రాంతం న్యూ ఇండియా హొటల్ సెంటర్ మా మీటింగు స్థలం.  ఇప్పుడు అక్కడ హొటల్ ఐలాపురం వచ్చింది. ఆ పక్కనే పాపులర్ షూ కంపెనీ గొడౌను వుండేది. ఒక రోజు ముందు చెపితే వాళ్ల గొడౌను కీపర్ వచ్చి కరెంటు కనెక్షన్ ఇచ్చేవాడు. ప్రముఖ క్రిమినల్ అడ్వకేట్ కర్నాటి రామ్మోహనరావుగారు, చలసాని ప్రసాద్ మాకు ఆస్థాన ఉపన్యాసకులు. ఒక్క రోజు ముందు చెప్పినా కాదనే వారుకాదు. సందర్భాన్నిబట్టి వరవరరావు, త్రిపురనేని మధుసూదనరావు, కేవి రమణారెడ్డిలను పిలిచేవాళ్ళం. నేను అప్పట్లో ఎదుగుతున్న స్పీకర్. ఇంగ్లీషు, ఉర్దూ యాసలో తెలుగు మాట్లాడుతాడుగానీ, పాయింట్ ను కొత్తగా చెపుతాడని నా మీద విమర్శలాంటి ప్రసంశ వుండేది. కృష్ణాజిల్లాకు మదార్ నాయకత్వంలో వాసు, పొట్టి జయరాజులతో కలిపి జననాట్యమండలి శాఖ వుండేది. పాటల వ్యవహారం వాళ్ళు చూసుకునేవారు. మదార్ కు బోలెడు నత్తి. కానీ పాట ఎత్తుకుంటే నత్తిపోయేది. అదో విచిత్రం. నాకు ఉబ్బసం. ఇంట్లో వుంటే ఉబ్బసం వస్తుందిగానీ ఉద్యమం కోసం బయలుదేరితే అది భయపడిపోతుంది. ఉద్యమాల్లో ఇలాంటి విచిత్రాలు, మహాత్యాలు చాలా వుంటాయి.

 

సభకు కనీసం 3, 4 వందల మంది వచ్చేవారు. బెజవాడ సెలబ్రెటీలు అనేకులు వచ్చి జనంలో సామాన్యులుగా కూర్చొని ప్రసంగాలు వినేవారు. ఒక్కొసారి తెగ జనం వచ్చేసే వారు. ఆ రోడ్డు క్రిక్కిరిసి పోయేది. మా జననాట్యమండలి సభ్యులు ఎర్రజెండా పట్టుకుని జనంలోనికి వెళితే కనీసం మూడు వందల రూపాయలు వచ్చేవి. మరునాడు ఉంగరం విడిపించి, మిగిలిన డబ్బులతో ఇద్దరు హోల్ టైమర్లకు నెలకు సరిపడా బియ్యం, పప్పులు కొనే వాళ్ళం.

 

అప్పట్లో ఎంసెట్ పరీక్షలు కొత్తగా వచ్చాయి. ప్రింటింగ్ లో ఆఫ్ సెట్ టెక్నాలజీ వచ్చింది. కానీ టైపింగ్ / కంపోజింగ్ లో ఆల్ జీబ్రా రాలేదు. కాలేజీ తోజుల్లో నాది ఎంపిసి గ్రూపు. ఇంగ్లీషు హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగుండేది. ఏ-4 కాగితాల మీద ఇండియన్ ఇంకుతో మ్యాథ్స్ గైడ్స్ కోసం  ప్రింట్ కాపీ రాసిపెట్టేవాడిని. పేజీకి 7-8 రూపాయలు. ఒక రాత్రికి రెండు మూడు పేజీలు రాసేవాడిని. ఆరోజుల్లో అది  లగ్జరీ కిందే లెఖ్ఖ. అదంతా అపెరల్స్ (డ్రెస్సులు, బూట్లు) మీద పెట్టే వాడిని. దాని మీదా కొన్ని విమర్శలు వుండేవి. నా డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ గురించి, సిగరెట్ తాగే విధానం గురించీ  ఐదు రోజుల క్రితం విజయవాడ  బహిరంగ సభలో ఒకరు ప్రస్తావించారు కూడ.

 

కలిసిన ప్రతొక్కరు మర్యాదగా నాకో పుస్తకం కొనిపెట్టేవారు. నా గది పుస్తకాలతో నిండిపోయేది. గెస్ట్స్ వచ్చినపుడు టవలు కప్పి పుస్తకాల మీదే పడుకునేవారు. ప్రయాణాల్లో నా టిక్కెట్లు ఎవరో కొనేవారు. సినిమా కెళ్ళినా అంతే. ఎవరో ఒకరు టిక్కెట్టు కొనేవారు.

 

నా తిండి బట్టల గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నాకు ఆప్యాయంగా మంచి భోజనం పెట్టి అరపెట్టె సిగరెట్లు కూడ ఇచ్చే వీరాభిమాని హోటల్ సుబ్రహ్మణ్యం వుండేవారు.

 

నేను కొండపల్లి సీతారామయ్య చెప్పిన మాటల్ని ఇప్పటికీ నమ్ముతాను. డబ్బుల కోసం ఉద్యమాలు ఆగవు.  ప్రైవేటు కాలేజీలు వచ్చి ఉద్యమాల్లో స్టూడెంట్స్ బేస్ ను దెబ్బతీశాయి. టివీలు, క్రికెట్టు వచ్చి మన యువతరం సమయాన్ని హైజాక్ చేసేశాయి. సరుకుల మాయ సమూహాన్ని వ్యక్తులుగా మార్చేసింది. నాయకత్వాల ఇగో క్లాష్ లతో పార్టీలు ముక్కలు చెక్కలయ్యాయి. ఎవర్ని నమ్మాలో, ఎవరి వెనుక నడవాలో తెలీక అభిమానులు సంధిగ్ధంలో పడిపోయారు.

 

సామాజిక సంక్షోభం వచ్చినపుడు నాకో ఖురాన్ / ఓల్డ్ టెస్టామెంట్  కథ  ఒకటి గుర్తుకు వస్తుంది. వెనుక నుండి పారో భీకర సైన్యం తరుముకుని వస్తున్నది; ముందు తోవ లేదు. ఎర్రసముద్రం అలలు భయంకరంగా ఎగిసిపడుతున్నాయి. అప్పుడే ఒక మూసా (అలెహిస్సలాం) అవసరం అవుతారు. వారే ఎర్ర సముద్రాన్ని చీలుస్తారు. అది దైవ మహాత్యం అనుకోవచ్చు. ఇలాంటి మహత్తర సంఘటనలే చరిత్రను మలుపు తిప్పుతాయి. “అప్పుడు కాలం కడుపుతోవుంది కార్ల్ మార్క్స్ ను కనింది”. అన్న మయకోవిస్కి మాటలు నాకు తరచూ వినబడుతుంటాయి.

 

1970-80ల నాటి మిత్రులు హఠాత్తుగా గుర్తుకొచ్చారు. ఈ అనుభవం ఇప్పుడూ కొందరికి పనికిరావచ్చు.

 

30 జులై  2023


Saturday 29 July 2023

Purandeshwari's Strategic Moves Shake Andhra Pradesh's Political Landscape

 Purandeshwari's Strategic Moves Shake Andhra Pradesh's Political Landscape

There is a growing buzz in Andhra Pradesh's political circles as everyone wonders about Purandeshwari's current target. Is she aiming for Jagan or Chandrababu? The question lingers in the minds of many.

In the realm of parliamentary representative democratic politics, caste affiliations play a significant role, and this influence is quite pronounced in Andhra Pradesh's political landscape. Political leaders actively seek support from specific caste groups while also attempting to appease others. However, no single community can be termed as the absolute loyalists of any particular political party. While a significant portion of any community supports one party, a smaller fraction remains loyal to various other parties. It should be noted that political parties rely on a broad base of supporters, rather than being solely dependent on a particular social group.

In the Reddy community, a substantial majority supports the ruling YSR Congress Party (YSRCP), while a smaller section provides backing to other opposition parties, including the Telugu Desam Party (TDP). Similarly, a significant portion of the Kamma community aligns with the prime opposition party, the TDP, while another small segment extends support to various other parties, including the YSRCP. These two major social groups, along with their respective parties, hold considerable influence in the state's political arena.

The Bharatiya Janata Party (BJP) strategically targeted the third major social group, the Kapus, to expand its voter base. Since the formation of the new state, the BJP's leadership position has been held by leaders from the Kapu community, namely Kanna Lakshminarayana and Somu Veerraju.

In a recent cabinet reshuffle, Chief Minister Jagan Mohan Reddy allocated more positions to members from the Reddy and Kapu communities. However, the current Jagan cabinet lacks representation from the Brahmin, Kshatriya, and Vaishya communities, collectively referred to as 'upper Varnas'. Additionally, there is no representation for the Kamma community, which is a major agrarian caste.

Considering that a large section of the Reddy community already supports Jagan, he is now focusing on attracting a significant number of voters from the Kapu community to ensure victory in the upcoming elections.

A considerable portion of the Brahmin, Kshatriya, and Vaishya communities leans towards the BJP, while the other protion aligns with various other parties. In the last elections, most of the Muslim, Christian, Scheduled Tribe (ST), and Scheduled Caste (SC) social groups voted for YSRCP, with Jagan's Christian minority perspective playing a role in this support.

The Backward Categories (BCs), constituting nearly half of the state's total population, lend equal support to both the ruling and main opposition parties. Currently, the Congress, CPM, CPI, and BSP do not have a fixed vote bank in the state.

Pawan Kalyan, the chief of Jana Sena party (JSP), who had a limited impact in the last election, is gaining more support this time. He mainly appeals to the Kapu social class and repeatedly mentions that he is following the 'road map' designed by the BJP. Pawan Kalyan has been emphasizing a potential alliance between Janasena, BJP, and TDP in the next elections to prevent the anti-Jagan vote bank from splitting.

Since assuming her new post, Purandeshwari has been targeting Chief Minister Jagan, confirming the BJP's alliance with Jana Sena, but remaining ambiguous about including TDP Chandrababu. Her criticism includes Chandrababu's mishandling of the state's reorganization Act, which has the potential to politically embarrass him.

The BJP strategists aim to mobilize the Kamma community, as Pawan Kalyan focuses on rallying the Kapu community. As part of this approach, Purandeshwari, a member of the Kamma community and daughter of late NT Rama Rao, the founder of TDP, was fielded. The strained relationship between the families of Daggubati and Chandrababu also plays a role in her selection.

Jagan has been fully supporting the BJP in both houses of the Parliament, despite winning 22 out of 25 Lok Sabha constituencies in the last elections and having 12 members in the Rajya Sabha. Union Home Minister Amit Shah also criticized Jagan's administration during his recent visit to Visakhapatnam, and Purandeshwari further reinforces these accusations.

Though the BJP makes accusations, the YSRCP response has been relatively mild. Botsa Satyanarayana, a senior leader, mentioned that despite some differences, they will stay with the BJP at the Centre. Jagan has apparently directed his party's MPs to maintain the alliance with the BJP in the current monsoon meetings.

The BJP hopes to secure the Kapu vote bank with Pawan Kalyan's support and erode Chandrababu's influence with Purandeshwari's tactics, aiming to win 10 to 15 Lok Sabha seats in AP. Their target is to secure 20 of the total 25 Lok Sabha seats.

Jagan's potential victories in the next parliamentary elections do not concern the BJP, as they ultimately aim to absorb his support base and become strong independently, leaving Chandrababu's vote bank vulnerable to their grasp. Danny Senior Journalist and Social Analyst Mobile : 9010757776 Written on : 28 July 2023

Who is Purandeshwari's target now?

 

Who is Purandeshwari's target now?

There is a growing curiosity and speculation among the political circles in Andhra Pradesh. Is Daggubati Purandeshwari targeting Jagan? Chandrababu? That is the question on everyone's minds.

In the parliamentary representative democratic politics, caste affiliations play a significant role. Caste influence in Andhra Pradesh's politics is quite pronounced. Many political leaders actively engage in garnering support from specific caste groups while simultaneously trying to appease others. However, no single community can be termed as the absolute loyalists of any particular political party. While a significant portion of any community is supporting one party, the small portion remain loyal to various other parties. It should be noted that political parties largely rely on a broad base of supporters rather than being solely dependent on a particular social group.In the Reddy community, a significant majority extends support to the ruling YSR Congress Party (YSRCP). However, a smaller fraction is provides backing to other opposition parties, including the Telugu Desam Party (TDP). Similarly, in the Kamma community, a significant portion aligns with the prime opposition party, the TDP, while a smaller section extends support to various parties, including the YSRCP. These two major social groups, along with their respective parties, hold considerable influence in the political arena of the state.

The Bharatiya Janata Party (BJP) strategically targeted the third major social group, the Kapus, to expand its vote base. As such, since the formation of the new state, the leadership position in the BJP has been held by the leaders from the Kapu community namely Kanna Lakshminarayana and Somu Veerraju.

In the recent cabinet reshuffle, Chief Minister Jagan Mohan Reddy allocated more positions to the members from the Reddy and Kapu communities. The current Jagan cabinet does not have representation from the Brahmin, Kshatriya and Vaishya communities, collectively referred to as 'upper Varnas'.  Additionally, there is no representation for the Kamma community, which is a major agrarian caste.
Aa the large part of Reddy's society is already with Jagan, he believes that he has to pull large section from the Kapu community to ensure successive victory in the coming elections.  

            Half of the Brahmins, Kshatriyas and Vaishya communities are in favor of the BJP. However, the rest of the half continues in various parties.

Most of the Muslim, Christian, ST and SC social groups voted for YCP in the last elections. The main reason for this is that Jagan has a Christian minority perspective also.

Various castes of the Backward Categories (BCs), which constitute almost half of the total population of the state are lending equal support to the ruling and main opposition parties. Although there are still Congress, CPM, CPI and BSP parties in the state, they do not currently have a fixed vote bank.

These are the political and social equations till a year ago

Pawan Kalyan, the chief of Jana Sena party (JSP), who could not make much impact in the last election, is moving the crowd with persistence this time. His vote bank is certainly increasing more than before.

            Pawan Kalyan mainly appeals to the Kapu social class. Moreover, he is repeatedly saying that he is following the ‘road map’ designed by the BJP. He is repeatedly saying that Janasena, BJP and TDP will form into an alliance in the next elections so that the anti-Jagan vote bank will not split.
            From the moment Purandeshwari assumed her new post, she started firing sharp arrows aimed towards Chief Minister Jagan. She confirmed that the BJP will have an alliance with Pawan Kalyan of Jana Sena, but did not say that they would also include TDP Chandrababu. While avoiding the clear answer about Babu she said the matter of alliances is the propriety of  national leadership. 

Purandeswari didn't stop there, she went on a rampage saying that Chandrababu took the package instead of special category status for the AP state which was assured in the state re-organization Act. This is a statement that will certainly embarrass Chandrababu politically.

            During the media conference held on July 28, Purandeshwari criticized and accused Jagan's administration point by point. What is the aim of the BJP's game plan which is criticizing Jagan on one hand and Chandrababu on the other? Now an interesting discussion has started on the subject.
            BJP strategists feel that while Pawan Kalyan is working on mobilizing the Kapu community for them, they should focus on mobilizing the Kamma community. As part of this move, they fielded Purandeshwari from the Kamma community, excluding Somu Veeraju of the Kapu community.
            There are some other reasons for Purandeshwari's choice. The major reason is that she is the daughter of late NT Rama Rao, the founder of the TDP, hoping the sentiment will work. Another reason is that the relation between the families of Daggubati and Chandrababu have been severely strained in the recent times. 
            Even if there is a situation where they have to leave the TDP, the chances of the Kamma community joining the YCP are slim. Then they choose BJP. Four TDP Rajya Sabha members joined the BJP when the results of the last election came and TDP lost power. The BJP is expecting such developments to happen this time before the elections.
            Despite winning 22 out of 25   Lok Sabha Constituencies in the last election, and having 12 members in the Rajya Sabha Jagan has given up his independent political presence in national capital and is serving the BJP. He is voluntarily and fully supporting the BJP in both the houses of the Parliament. In return, he did not seek a single ministerial position in the central cabinet.
            During his recent visit to Visakhapatnam, Union Home Minister Amit Shah also leveled strong allegations against Jagan's regime. Now Purandeshwari is sharpening them.

It is strange that YCP is not able to give a firm retort even though BJP is making such accusations. It was reported in some newspapers that YCP senior leaders Botsa Satyanarayana said that despite some differences, they will stay with the BJP at the Centre. It seems that Jagan has directed his party's MPs to stay with the BJP in the current monsoon meetings as well.


`        There is no other party in the country that is lending such free service to BJP despite having so many MPs in hand.

            BJP is hoping that if they grab the Kapu vote bank with the support  of Pawan Kalyan and pull the ground from under Chandrababu's feet with Purandeshwari's tactics, they can win 10 to 15 Lok Sabha seats on their own in AP. Their target is 20 of the total 25 Lok Sabha seats.
            No matter how many seats Jagan wins in the next parliamentary elections, the BJP is not upset about them because they ultimately fall in their hands. They want to get rid of Chandrababu and loot the vote bank of TDP and become strong independently.
 

Danny

Senior Journalist and Social Analyst

Mobile : 9010757776

Written on :  28 July 2023

To Whom Purandeshwari Targetting

 పురందేశ్వరి టార్గెట్ ఎవరూ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికర సందేహం వేగంగా చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టార్గెట్ ఎవరూ? జగనా? చంద్రబాబునా? అనేది ఆ సందేహం.   

పార్లమెంటరీ ప్రాతినిధ్య  ప్రజాస్వామిక రాజకీయాలంటేనే కులమతాల ప్రస్తావన వస్తుంది. ఏపి రాజకీయాల్లో కుల ప్రభావం మరీ ఎక్కువ. మనరాజకీయ నాయకులు బహిరంగ సభల్లోనే కొన్ని కులమతాలను  అక్కున చేర్చుకుంటారు; కొన్ని కులమతాలను తిట్టిపోతుంటారు. అయితే, రాజకీయాల్లో ఏ సామాజికవర్గమూ నూటికి నూరు శాతం ఒక పార్టి వెనుక వుండదు. పెద్ద భాగం ఒక పార్టికి మద్దతుదారులుగా వుంటే చిన్న భాగం వివిధ  పార్టీల అభిమానులుగా వుంటుంది.

రెడ్డి సామాజికవర్గంలో పెద్ద భాగం అధికార పార్టి అయిన  వైయస్సార్ కాంగ్రెస్ పార్టికి మద్దతు ఇస్తోంది. అందులో చిన్న భాగం ప్రతిపక్ష టిడిపితో సహా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తుంటుంది. అలాగే, కమ్మ సామాజికవర్గంలో పెద్ద భాగం ప్రధాన ప్రతిపక్ష పార్టి అయిన  తెలుగు దేశం పార్టికి మద్దతు ఇస్తోంది. అందులో చిన్న భాగం  వైయస్సార్ సిపితో సహా అనేక పార్టీలకు మద్దతు ఇస్తుంటుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు రెండు పార్టీలకు కొమ్ము కాస్తుండడంతో బిజెపి తన దృష్టిని మూడో పెద్ద సామాజిక వర్గమైన కాపుల మీద పెట్టింది. కొత్త రాష్ట్రం ఎర్పడ్డాక రాష్ట్ర బిజెపికి నాయకత్వం వహించిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందినవారే.

గత ఏడాది జరిపిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో జగన్ ఓసీల్లో రెడ్లు, కాపులకు మాత్రమే స్థానం కల్పించారు. ఓసిల్లో  ‘అగ్రవర్ణాలు’ అయిన బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యులకు ప్రస్తుత జగన్ కేబినెట్ లో స్థానం లేదు. అలాగే, వ్యవసాయ కులాలకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి కూడ స్థానం లేదు. రెడ్డి సామాజికవర్గంలో పెద్ద భాగం ఎలాగూ జగన్ వెంట వున్నది. కాపు సామాజికవర్గం నుండి కూడ ఒక పెద్ద భాగాన్ని ఆకర్షిస్తే పోల్ మేనేజ్మెంటుకు లెఖ్ఖ సరిపోతుందని జగన్ భావిస్తున్నారు.

బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యు సామాజిక వర్గాల్లో సగభాగం బిజెపికి అనుకూలురుగా వుంటున్నారు. మిగిలినవారు సగభాగం అన్నిపార్టిల్లోనూ కొనసాగుతున్నారు.

ముస్లిం, క్రైస్తవ, ఎస్టి, ఎస్సీ సమూహాల్లో అత్యధికులు గత ఎన్నికల్లో  వైసిపికి ఓట్లేశారు. జగన్ కు క్రైస్తవ మత మైనారిటి కోణం కూడ వుండడం దీనికి ప్రధాన కారణం.

జనాభాలో అధిక సంఖ్యాకులుగా భావించే వెనుకబడిన తరగతులకు చెందిన సమూహాలు దాదాపు చెరి సగం అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో వుంటున్నాయి. రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బిఎస్పీ పార్టీలు వున్నప్పటికీ ప్రస్తుతం వాటికి స్థిర ఓటు బ్యాంకు లేదు.

ఇవీ ఓ ఏడాది క్రితం వరకున్న సామాజిక సమీకరణలు.

గత ఎన్నికల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‍ ఈసారి పట్టుదలతో జనాన్ని కదిలిస్తున్నారు. ఆయన ఓటు బ్యాంకు గతంకన్నా పెరుగుతున్నది. ఆయన ప్రధానంగా కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షిస్తున్నారు. పైగా, తాను బిజెపి ఇచ్చే రోడ్ మ్యాప్ ను అనుసరిస్తున్నట్టు పదేపదే చెపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా  వుండేందుకు జనసేన, బిజెపి, టిడిపి కలిసి పోటీ చేస్తాయని వారంటున్నారు.

పురందేశ్వరి కొత్త పదవిని చేపట్టిన క్షణం నుండే  ముఖ్యమంత్రి జగన్ మీద పదునైన బాణాలను వదలడం మొదలెట్టారు. జనసేన పవన్ కళ్యాణ్ తో పొత్తు వుంటుందని వారు నిర్ధారించారుగానీ టిడిపి చంద్రబాబుని కూడ కలుపుకుని పోతాం అనలేదు. పొత్తుల విషయం తమ జాతీయ నాయకత్వం పరిధిలోని అంశం అంటూ తప్పుకున్నారు. వారు అక్కడితో ఆగలేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారని కుండబద్దలు కొట్టారు. ఇది రాజకీయంగా చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రకటన. జులై 28న నిర్వహించిన మీడియా సమావేశంలోనూ పురందేశ్వరి పాయింట్ల వారీగా జగన్ పరిపాల మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించారు. ఒకవైపు, జగన్ ను విమర్శిస్తూ, మరోవైపు చంద్రబాబును ఇరుకున పెడుతూ సాగుతున్న బిజెపి గేమ్ ప్లాన్ లక్ష్యం ఏమిటీ? అనే అంశం మీద ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలయింది.

కాపు సామాజికవర్గాన్ని సమీకరించే పనిలో పవన్ కళ్యాణ్ వున్నప్పుడు  తాము కమ్మ సామాజికవర్గాన్ని సమీకరించడం మీద దృష్టి పెట్టాలని బిజెపి వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఈ ఎత్తుగడలో భాగంగానే వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును తప్పించి కమ్మ సామాజికవర్గానికి చెందిన పురందేశ్వరిని రంగంలో దించారు. పురందేశ్వరి ఎంపికకూ మరికొన్ని కారణాలున్నాయి. ఆమె ఎన్టీ రామారావు పుత్రిక కావడాన టిడిపి వ్యవస్థాపకుని  సెంటిమెంటు పనికి వస్తుందనేది ఒక కారణం. వ్యక్తిగతంగా దగ్గుబాటి కుటుంబానికీ చంద్రబాబుకూ పడదనేది ఇంకో కారణం.

టిడిపిని వదలాల్సిన పరిస్థితి వచ్చినా  కమ్మ సామాజికవర్గం వైసిపిలో చేరే అవకాశాలు తక్కువ. అప్పుడు వాళ్ళు బిజెపిని ఎంచుకుంటారు. గత ఎన్నికల ఫలితాలు రాగానే, టిడిపి అధికారాన్ని కోల్పోయిందని తెలియగానే నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. అలాంటి పరిణామాలు  ఇప్పుడు ఎన్నికలకు ముందే చోటుచేసుకుంటాయని బిజెపి అంచనా వేస్తున్నది.

గత ఎన్నికల్లో 22 మంది లోక్ సభ సభ్యుల్ని గెలిపించుకున్నప్పటికీ, రాజ్యసభలో ప్రస్తుతం 12మంది సభ్యులున్నప్పటికి జగన్ ఢిల్లీలో స్వతంత్ర రాజకీయ ఉనికిని వదులుకుని బిజెపి సేవలో తరిస్తున్నారు.  అడిగినా అడక్కపోయినా పార్లమెంటు వుభయ సభల్లోనూ బిజెపికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. దానికి ప్రతిఫలంగా కేంద్ర కేబినెట్ లో ఒక్క మంత్రి పదవిని కూడ కోరలేదు.

ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడ  జగన్ పాలన మీద గట్టి ఆరోపణలు సంధించారు. వాటికి ఇప్పుడు పురందేశ్వరి మరింత పదును పెడుతున్నారు.

బిజెపి ఇంతగా ఆరోపిస్తున్నా వైసిపి గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నది. కొన్ని విబేధాలున్నా కేంద్రంలో బిజెపితోనే వుంటామని వైసిపి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చింది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనూ బిజెపితోనే వుండాలని ఎంపిలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. చేతిలో ఇంతమంది ఎంపీలు వున్నప్పటికీ ఎదురు తిట్లు తింటూ  బిజేపికి ఇంతటి ఉచిత సేవ చేస్తున్న పార్టి దేశంలో మరెక్కడా లేదు.

పవన్ కళ్యాణ్ సహకారంతో కాపు ఓటు బ్యాంకును కొల్లగొడుతూ,  పురందేశ్వరి వ్యూహాలతో చంద్రబాబు కాళ్ల కింది నేలను లాగేస్తే ఏపిలో తాము స్వంతంగానే ఓ పది పదిహేను లోక్ సభ సీట్లు గెలుచుకోవచ్చని బిజెపి ఆశిస్తోంది. మొత్తం 25 లోక్ సభ సీట్లలో 20  వాళ్ల టార్గెట్.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జగన్ ఎన్ని  సీట్లు గెలుచుకున్నా చివరకు అవి వచ్చి పడేవి తమ ఒళ్ళోనే కనుక వాటి గురించి బిజేపికి బెంగలేదు. వాళ్ళిప్పుడు చంద్రబాబుని తప్పించి టిడిపి ఓటు బ్యాంకును కొల్లగొట్టి స్వతంత్రంగా బలపడాలనుకుంటున్నారు.

డానీ

సీనియర్ జర్నలిస్టు  9010757776

రచన :  28 జులై 2023

*సబ్ కా సాథ్ సబ్ కా వికాస్*

 

*సబ్ కా సాథ్ సబ్ కా వికాస్*

1.        దేశ జనాభాలో ముస్లింలు 15 శాతం పైగా వుంటున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలో, ప్రభుత్వరంగ సంస్థ (PSU)ల్లో వాళ్ళు  5 శాతం కూడ లేరు.

2.        విద్యారంగంలో వారి ప్రాతినిధ్యం 5 శాతం కూడ లేదు.

3.        28 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 4,120 శాసన సభ్యులు (MLAs) ఉన్నారు.

4.        పార్లమెంటు లోక్ సభలో 543 ఎంపీలున్నారు.

5.        పార్లమెంటు రాజ్యసభలో 245 ఎంపీలున్నారు.

6.        కేంద్రంలోనేగాక, మరో 17 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో వున్నది.

7.        వీటిల్లో ఎక్కడా ఒక్క ముస్లింకు కూడ స్థానం కల్పించలేదు.  

8.        వాణిజ్య రంగంలొ ముస్లింల వాటా కృశించుకుపోతున్నది.

9.        బ్యాంకులు రుణాలివ్వవు.

10.     క్లయింటల్ బేస్ కూడ తగ్గిపోతున్నది.

 

*ఎవరి దగ్గర అయినా ఈ పది సమస్యలకు పరిష్కారాలుంటే సూచించండి*

- డానీ

కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

మంటల్లో మినీ ఇండియా!

 Danny Speech

Talking Points
Round Table Conference
27 July 2023 Thursday
From 3 p.m.
Media Plus, Auditorium
Abids, Hyderabad
10 -12 Mnts
మంటల్లో మినీ ఇండియా!
అస్సలాము అలైకుమ్!
జైభీమ్ !
జై మీమ్ !
లాల్ సలామ్!
మిత్రులారా !
INTRO
1. వర్తమాన భారత దేశంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య మణిపూర్ మంటలు.
2. కుకీలను చూసి ఇది ఆదివాసి, గిరిజన సమస్యగా కొందరు చూస్తున్నారు.
3. కుకీలు కొండల్లో, మైతీలు లోయల్లో నివసిస్తున్నారు కనుక దీనిని మరి కొందరు కొడవాసులు, లోయ వాసుల సమస్యగా చూస్తున్నారు.
4. కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కనుక దీని కొందరు మత సమస్యగా చూస్తున్నారు.
5. మైతీలు మెజారిటీ, కుకీలు మైనారిటీ కనుక దీన్ని మైనార్టిలమెజారిటీల పోరుగా కొందరు చూస్తున్నారు.
6. అక్కడ ఖనిజ నిక్షేపాలు అపారంగా వుండడం మూలంగా ఇది కార్పొరేట్ల సంపద పెంపు వ్యవహారంగా మరి కొందరు చూస్తున్నారు.
7. విభిన్నమైన సాంస్కృతిక జీవనం గల కుకీలను వేధించడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ముందుకు తెచ్చిందంటున్నవారూ వున్నారు.
8. ప్రజల్లో అపఖ్యాతిపాలయిన ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మైతీలను కుకీల మీదికి ఉసి గొల్పుతున్నాడనే వాదనా వుంది.
9. విభిన్నమైన సాంస్కృతిక జీవనం గల కుకీలను వేధించడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ముందుకు తెచ్చిందంటున్నవారూ వున్నారు.
10. మణిపూర్ సమీపంలోనే మైన్మార్, లావోస్, థాయిలాండ్ కలిసే గోల్డెన్ ట్రయాంగిల్ (Golden Triangle) వుంటుంది కనుక డ్రగ్ మాఫియా కోణం వుందని ఇంకొందరంటున్నారు.
11. ప్రస్తుతం మణిపూర్ లో శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది. శాంతిభద్రతల నిర్వహణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హొంమంత్రి అమిత్ షాలు అంత సమర్ధులుకారని తేలిందని ఇంకొందరు అంటున్నారు.
12. ఈ పది అంశాల్లో ఏ ఒక్కటీ అబధ్ధంకాదు. ఇంతకు మించిన అనేక కోణాలు ఇప్పుడు మణిపూర్ మంటల్లో వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మణిపూర్ లో వున్నాయి.
13. మణిపూర్ ఇప్పుడు మినీ ఇండియా.
PART – I PROTO
14. దేశంలో ఫాసిస్టు పాలన మొదలయిందని నాలుగేళ్ల క్రితం ఎవరయినా అంటే చాలామంది అంగీకరించేవారుకాదు.
15. ఇవ్వాళ దేశంలో ఫాసిస్టు పాలన సాగుతోందని మణిపూర్ ఆదివాసి మహిళలు కూడ అంటున్నారు.
16. కుకీ గిరిజన మహిళ డాక్టర్ ముడూసా వీడియోను ఇప్పుడు అందరూ చూసి వుంటారు. నాగరీకులం అని గొప్పలు చెప్పుకునే మైదానవాసులకన్నా గొప్ప చైతన్యం ఈరోజు ఆదివాసుల్లో కనిపిస్తున్నది.
17. 1984 చివర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధి హత్య తరువాత ఢిల్లీ పరిసరాల్లో శిక్కుల మీద ఊచకోత సాగింది. ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రికార్డు స్థాయిలో మెజారిటీ దక్కింది.
18. ఒక మైనారిటీ సమూహాన్ని వేధిస్తుంటే మెజారిటీ ఓటు బ్యాంకు ధృవీకరణ జరుగుతుందనే ఒక కొత్త పోల్ మేనేజ్మెంట్ సూత్రం ముందుకు వచ్చింది.
19. శిక్కులు పంజాబ్, ఢిల్లీ ప్రాంతాలకే పరిమితమయిన మైనారిటీలు. దేశం మొత్తంగా విస్తరించివున్న మత మైనారిటీలయిన ముస్లింలకు ఆ రోజు నుండే ముప్పు మొదలయింది.
20. అలాగే కీలవేణ్మణి, కారంచేడు సంఘటనలు దళితులకు పొంచివున్న ముప్పును చాటి చెప్పాయి.
21. 1980ల నాటి అస్సాం అశాంతి మన దేశంలో మైదాన ప్రాంతానికీ, అడవీ ప్రాంతానికి మధ్య ఒక వైరం వుందని చెప్పింది.
22. భూగోళం మీద అత్యంత అణిచివేతకు గురవుతున్న సమూహాలు రెండు, మొదటిది; ముస్లిం సమూహం; రెండోది ఆదివాసి సమూహం.
23. ఆదివాసుల నివాస ప్రాంతాల్లో అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. ముస్లిం దేశాల భూముల్లో చమురు నిల్వలున్నాయి.
24. ఈ రెండు నిక్షేపాలు జాతీయ, అంతర్జాతీయ మెగా కార్పోరేట్లకు కావాలి. మనదేశ ప్రభుత్వంతో సహా అనేక దేశాల ప్రభుత్వాలు ఇప్పుడు కార్పోరేట్ల కోసం ఊడిగం చేస్తున్నాయి. జాతి సంపదను వాళ్లకు కట్ట బెడుతున్నాయి.
25. గతంలోనూ మనకు నియంతలున్నారు. వారికీ ఇప్పటి వారికీ చాలా తేడావుంది. గత నియంతలు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసమైనా సంక్షేమ పథకాల ద్వార ప్రజలకు మేలు తలపట్టి ఆ తరువాత తమ మద్దతుదారులైన కార్పొరేట్లకు మేళ్ళు చేసిపెట్టేవారు.
26. ఇప్పటి నియంతలు వేరు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. అవ్సరమైతే కార్పొరేట్ల పక్షాన నిలబడి జాతుల ప్రక్షాళన చేయడానికి కూడ వెనుకాడడం లేదు.
27. కొందరు నమ్ముతున్నట్టు ఇది క్రోనీ కేపిటలిజం కాదు; క్రోనీ లెజిస్లేచరి. ప్రాయోజిత శాసన వ్యవస్థ; ప్రాయోజిత కార్వనిర్వాహక వ్యవస్థ, ప్రాయోజిత న్యాయ వ్యవస్థ. ప్రాయోజిత మీడియా వ్యవస్థ.
28. నరేంద్రమోదీ - అమిత్ షాల పాలన ముస్లింలను వేధిస్తున్నదన్నది చాలా స్పష్టం.
29. ముస్లిం, క్రైస్తవ తదితర మైనారిటీ సమూహాలను వేధిస్తుంటే హిందూ సమూహాలు మొత్తంగా కాకపోయినా అందులో సగమైనా సంబరపడి తమకు ఓట్లు వేస్తాయని సంఘపరివారం గట్టిగా నమ్ముతున్నది. ప్రతి ఎన్నికల్లోనూ అలాంటి ఎత్తుగడల్నే అది అనుసరిస్తున్నది.
Part – 2 CONTEXT
30. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ముందుకు తెచ్చింది ముస్లింలను వేధిస్తున్నట్టు సంకేతాలివ్వడానికే అని దాదాపు అందరికీ తెలుసు. అదిప్పుడు ఆదివాసులకు అంటుకుంది.
31. ఉమ్మడి పౌరస్మృతి ఒక ఆదర్శమేగానీ ఆచరణ సాధ్యంకాదు. అత్యంత వైవిధ్యపూరిత సాంస్కృతిక సాంప్రదాయాలున్న భారత దేశంలో అస్సలు ఆచరణ సాధ్యంకాదు.
32. భాగవతంలో భూమిని చాపలా చుట్టి సముద్రంలోనికి తీసుకుపోయిన హిరణ్యాక్షుని కథ వుంటుంది. మన మెగా కార్పొరేట్లు ఆదానీ, అంబానీలు అలాంటివాళ్ళు. ఇప్పటికే వాళ్ళు సముద్రాన్ని మింగేశారు.
33. ముంద్రా పోర్టు, కృష్ణపట్నం పోర్టు, కరైకాల్ పోర్టు, హాజిరా పోర్టు, ధామ్రాపోర్టు, దహెజ్ పోర్టు, గంగవరం పోర్టు, వైజాగ్ టెర్మినల్, మార్మగోవా టెర్మినల్, విఝింజమ్ పోర్టు, కట్టుపల్లిపోర్టు, కమరజర పోస్టు, టునా టెర్మినల్, అగర్దన షిప్ యార్డ్ అండ్ టెర్మినల్, దిఘి పోర్ట్ ఆదానీ గ్రూపు ఆధీనంలోనే వున్నాయి.
34. ముంబాయి, అహ్మదాబాద్, లక్నో, మంగలూరు, జైపూరు, గువాహటి, త్రివేండ్రపురం, ఎయిర్ పోర్టులు ఆదానీ గ్రూపువే.
35. జమ్మూ- కశ్మీర్ కు రాష్ట్ర హోదా, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక హోదాలను రద్దు చేసినపుడు దాన్ని చాలామంది ముస్లింల వేధింపుగా మాత్రమే చూశారు.
36. ఆ రాష్ట్రంలో ముస్లిమేతరులు వుండరా? కొండలు, లోయలుగల రాష్ట్రంలో గిరిజన, ఆదివాసి తెగలు వుండవా? వాళ్లంతా బాధితులు కదా? అనే ఆలోచన చాలా మందికి రాలేదు.
37. అసమాన సమాజంలో సంక్షేమ పథకాలను రూపొందించే సమయంలో ‘సానుకూల వివక్షను’ (positive discrimination) పాటించాల్సి వుంటుంది.
38. ఎక్కువగా వెనుకబడినవారికి సమానవాటా ఇచ్చినా సరిపోదు; ఎక్కువవాటా ఇవ్వాల్సి వుంటుంది. ఇక్కడ అలాజరగడం లేదు. ఇప్పటికే ఎక్కువ వాటా పొందినవారికి మరింత ఎక్కువ వాటా ఇస్తున్నారు. EWS రిజర్వేషన్ అలాంటిదే.
39. ఫాసిజం ఇటలీలో, నాజిజం జర్మనీలో మైనార్టి మత సమూహాలను వేధించాయని మనకు తెలుసు. కానీ అక్కడ కూడ మెజారిటీలయిన క్రైస్తవుల్లోని కార్పొరేట్లు మాత్రమే బాగుపడ్డారుగానీ సామాన్య క్రైస్తవులు సహితం చాలా అగచాట్ల పాలయ్యారు. మనకు ఇప్పుడు ఇక్కడ అదే పునరావృతం అవుతున్నది.
40. మోదీజీ ప్రధాని పదవిని చేపట్టాక గత ఏడాది చివరి వరకు 4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పబ్లిక్ రంగ సంస్థల్ని అమ్మేశారు. గడిచిన 8 నెలల్లో అమ్మినవి దీనికి అదనం.
41. దేశంలో ముస్లిం జనాభ 20 కోట్లు. జనాభాలో ముస్లింలు 15 శాతం. ప్రభుత్వరంగ సంస్థల్లో వాళ్ళు 3,4 శాతం కూడ వుండరు.
42. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తే ఆ మూడు శాతం ముస్లింలు నష్టపోయేమాట నిజమేగానీ, మిగిలిన 97 శాతం మంది హిందువులు కూడ నష్టపోతారన్నది అంతకన్నా వాస్తవం.
43. సముద్రం ఆకాశం రెండింటినీ మింగేశాక వాళ్ళకు ఇప్పుడు లోయలు కొండలు కావాలి. ఇప్పుడు మన కార్పొరేట్లు అడవి మీద విరుచుకు పడ్డారు. ఈ విడత ఇది మణిపూర్ తో మొదలయింది.
44. మైదానంలో వాడుతున్న మెజారిటీ మైనారిటీ ఫార్మూలానే అడవిలోనూ వాడుతున్నారు. మణిపూర్ లో మెజారిటీ మెయితీ తెగను మైనారిటీ కుకీ తెగల మీదికి ఎగదోస్తున్నారు.
45. మణిపూర్ లో జాతి ప్రక్షాళన (Ethnic Cleansing) జరుగుతున్నదనీ, ముఖ్యమంత్రి బైరేన్ సింగ్ కుకీల వ్యతిరేకి అనీ, పోలీసులు ప్రభుత్వాధికారులు బాహాటంగా మెయితీ అల్లరి మూకలకు సహకరిస్తున్నారని సాక్షాత్తు బిజెపి శాసన సభ్యుడు పావోలియన్ లాల్ హావ్ కిప్ (Paolienlal Haokip) మీడియా ముందు ఆరోపిస్తున్నారు.
46. అల్లరి మూకలు మణిపూర్ లో పోలీసు స్టేషన్ల నుండి ఆరు వేల ఆయుధాలు ఎత్తుకుని పోయారట. అల్లరి మూకలంటే అక్కడ మెయితీలు అనే అర్ధం. పావోలియన్ లాల్ హావ్ కిప్ ఆరోపణల్ని బట్టి పోలీసులే ఆయుధాలు అందజేశారని అనుకోవాలి.
47. కార్పొరేట్ల అటవీ ప్రాంత ఆక్రమణ మణిపూర్ తో ఆగదని దేశంలోని ఆదివాసులందరికీ తెలిసిపోయింది. నాగాలండ్ మొత్తం కుకీలకు సంఘీభావాన్ని తెలుపుతోంది.
48. అడవి భూముల మీద ఆదివాసులకు వుండే ప్రత్యేక హక్కుల్ని రద్దు చేయడానికే ఉమ్మడి పౌరస్మృతిని తెస్తున్నారని కూడ ఆదివాసులు పసికట్టారు.
49. ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా ఝార్ఖండ్ లో ఒక ఉద్యమం ఆరంభమయ్యి క్రమంగా అటు ఈశాన్య రాష్ట్రాలకు, ఇటు ఛతీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.
50. సామాజిక వివక్ష కొనసాగుతున్న కారణంగా విద్యా, ఉద్యోగరంగాల్లో తమకు రాజ్యాంగపరంగా లభించిన రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఉమ్మడి పౌరస్మృతిని ప్రయోగిస్తారని ఎస్సి, బిసిలకు సహితం అనుమానం కలుగుతోంది.
51. గోల్డెన్ ట్రయాంగిల్ (Golden Triangle) డ్రగ్స్ తయారీ - స్మగ్లింగ్ కు ప్రపంచ కేంద్రం. టన్నులకొద్దీ హెరాయిన్ డ్రగ్స్ పట్టివేత కేసులో గుజరాత్ లోని ముంద్రా పోర్టు పేరు 2021లో చాలా కాలం వార్తల్లో నిలిచింది.
52. మణిపూర్ లో మే 3 న అల్లర్లు మొదలయ్యాయి. ఆ మరునాడు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 355 ద్వార మణిపూర్ లో శాంతిభద్రతల విభాగాన్ని తన ఆధీనంలోనికి తీసుకుంది. ఇంటర్నేట్ సదుపాయాలను పూర్తిగా రద్దు చేసింది.
53. సుప్రీం కోర్టు ప్రత్యక్ష్య జోక్యం తరువాత మాత్రమే మణిపూర్ లో జులై 20 నుండి ఇంటర్నేట్ సదుపాలను పాక్షికంగా పునరుధ్ధరించారు.
54. అప్పుడు మాత్రమే మే నెల 4న ఆ రాష్ట్రంలో జరిగిన ఒక ఘోర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోనికి వచ్చింది.
55. ముగ్గురు కుకీ మహిళల్ని ఇళ్ళ నుండి లాక్కొని వచ్చి వివస్త్రల్ని చేసి వందలాది మంది చూస్తుండగా వీధుల వెంట ఈడ్చుకుంటూ వెళ్ళి బహిరంగంగా అత్యాచారం చేసిన సంఘటన ఆ వీడియోలో వుంది.
56. బయటికి వచ్చింది ఒక్క వీడియోనే. ఇలాంటి కొన్ని వందల అత్యాచారాలు అక్కడ జరిగినట్టు సోషల్ మీడియా ద్వార తెలుస్తోంది.
57. దీనిబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో గడిచిన 80-82 రోజులుగా మణిపూర్ లో కుకీ జాతి హననం జరుగుతోందని మనం భావించవచ్చు.
Part – III – Epilogue
58. ఇప్పుడు మణిపూర్ మంటల సెగ పార్లమెంటుకు తాకింది.
59. గత రెండున్నర నెలలుగా మణిపూర్ లో శాంతిభద్రతల పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే వుంది. అక్కడ జరుగుతున్న హననానికి నేరుగా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత.
60. ఇన్నాళ్ళూ మణిపూర్ మీద నోరు మెదపని ప్రధాని మోదీజీ ఆ వీడియో బయటికి వచ్చాక నోరు తెరిచారు. మణిపూర్ మీద 36 సెకన్లు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పనిలో పనిగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్ గడ్, రాజస్థాన్ లలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించి మణిపూర్ సమస్యను రాజకీయ మలుపు తిప్పారు.
61. ప్రత్యర్ధుల మీద దాడి చేయడానికి సంఘపరివారానికి ఒక పురాతన ఫార్మూలా వుంది.
62. ముస్లింల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మీద విదేశీయులు, చొరబాటుదార్లు, టెర్రరిస్టులు, పొరుగుదేశాల భక్తులు, వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు, జాతి వ్యతిరేకులు, భారత వ్యతిరేకులు వంటి నిందల్ని వేసేవారు.
63. ఇప్పుడు సరిగ్గా అవే నిందల్ని కుకీల మీద వేస్తున్నారు.
64. అయితే ఇప్పుడు ఒక తేడా వచ్చింది. దేశప్రజలు నరేంద్ర మోదిజీ, అమిత్ షాల మాటల్ని గతంలోలా నమ్ముతున్నట్టు కనిపించడం లేదు.
65. నరేంద్రమోదీ, అమిత్ షా ఇద్దరూ యాంటి నేషనల్స్! యాంటి ఇండియన్స్! అనే మాటలు కూడ ఇప్పుడు మణిపూర్ కుకీలు వాడుతున్నారు.
66. ప్రజలు ఇదివరకట్లా తమ మాటల్ని నమ్మడం లేదని నరేంద్ర మోదిజీ, అమిత్ షాలకు కూడ అర్ధం అయింది.
Sign OFF
67. మణిపూర్ శాంతి భద్రతల వ్యవహారం తమ చేతుల్లోనే వుండడంవల్ల అక్కడి పరిణామాలకు ప్రధాని, హోంత్రులే ప్రత్యక్ష బాధ్యులు.
68. ఇన్నాళ్ళుగా మణీపూర్ లో ఏం జరుగుతున్నదో వాళ్లకు తెలియకపోతే ఆ పదవులకు వారు అనర్హులు. తెలిసి కూడ కొనసాగనిచ్చారంటే ఇప్పుడు వినపడుతున్న కుట్ర సిధ్ధాంతం నిజమే అని నమ్మాల్సి వుంటుంది.
69. ఏది ఏమైనా, పార్లమెంటులో మణిపూర్ మీద మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కలవరం స్పష్టంగానే కనిపిస్తున్నది.
70. చివరికి ఇప్పుడు వాళ్ళు భారత్, ఇండియా అనే పదాలను వినడానికి కూడ భయపడుతున్నారు.
71. ముస్సోలినీ, హిట్లర్ కూడ చివరి రోజుల్లో భయంతోనే బంకర్లలో బతికారు. ఇప్పుడు ఢిల్లీ సన్నివేశాలు అటు దిశగా సాగుతున్నట్టు కనిపిస్తున్నాయి.
72. మన పార్లమెంటరీ ప్రాతినిథ్య ప్రజాస్వామిక వ్యవస్థలో కొత్త అధ్యాయం అరంభం అవుతున్నదనడనికి ఇవి తొలి సంకేతాలు కావచ్చు!
73. ఇప్పుడు మనం బిజెపి ముక్త్ దక్షణ భారత్ లో వున్నాం.
74. 2024 లోక్ సభ ఎన్నికల తరువాత బిజెపి ముక్త్ సంపూర్ణ భారత్ ఏర్పడాలి అని ఆశిద్దాం.
75. ఇదే సరయిన అదను. లోక్ సభకు అన్ని పార్టీలను మరచిపొండి -Indian National Development Inclusive Alliance- INDIA కూటమిలోని సభ్య పార్టీలను గెలిపించండి.
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు.