Tuesday 31 January 2023

Three Prisoners - ముగ్గురు ఖైదీలు


 ముగ్గురు ఖైదీలు

 


ముగ్గురు ఖైదీలు

 

 

ఈ ఫొటోలో నాపక్కన వసంతరావు వున్నాడు. మా వెనక ఏడుకొండలు వున్నాడు. ఏడు కొండలు ఆంధ్రా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్సెస్  ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. వసంతరావు రాజమండ్రిలో క్రిమినల్ లాయర్ గా వుంటున్నాడు. డాక్టర్ ఏంఎఫ్ గోపీనాధ్ ఆధ్వర్యంలో జరిగిన  ‘భారత్ బచావ్’ రాష్ట్ర సదస్సు సందర్భంగా  జనవరి 29న చాలాకాలం తరువాత మేము విజయవాడలో కలిశాం.

 

మేం ముగ్గురం జైల్ మేట్సుం! 1980 ఫిబ్రవరి నెలలో ఓ రెండు వారాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసివున్నాం. మాది 2-బి వార్డు. అంటే పొలిటికల్ ప్రిజనర్స్ వార్డు. మొత్తం తొమ్మిది మంది. ఎనిమిదిమంది పురుషులు, ఒక స్త్రీ. ఆమెను వుమెన్స్ వార్డులో వుంచారు.

 

తోరాడ సత్యనారాయణ ఏ-1; నేను ఏ-2. కేవీ రమణారెడ్డిగారు మమ్మల్మి ‘నవరత్నాలు’ అంటూ మెచ్చుకుంటూ అరుణతారలో ఓ ఉత్తేజకరమైన వ్యాసం రాశారు.

 

ఏమి రోజులవీ. అదొక విలాసవంతమైన జైలు జీవితం (దుస్సమాసం కాదుకదా!). అనుక్షణం సస్పెన్స్ తో కూడిన గొప్ప అడ్వంచర్ థ్రిల్లర్ అది. నాకు రాష్ట్రస్థాయిలోనేగాక  ఢిల్లీ, కలకత్తా వరకు ఒక గుర్తింపు తెచ్చిన సంఘటన అది. బెయిల్ వచ్చినపుడు ఒక ఆనందంతోపాటూ కొంచెం బాధా వేసింది. ఇంతటి ప్రేమాభిమానాలతో కూడిన ఒక భావోద్వేగ జీవితాన్ని కోల్పోతున్నాననిపించింది.

 

పోలీసు అధికారి మీద హత్యాయత్నం ఆరోపణలున్న కేసులో మాకు రెండు వారాల్లోనే బెయిల్ రావడం చాలా మందికి ఆశ్చర్యంగా కనిపించింది. ఉద్యమానికి అభిమానులైన అడ్వకేట్లు రాజమండ్రి, హైదరాబాద్ లోనేకాక ఢిల్లీలోనూ తమ ప్రయత్నాలు చేశారు. అన్నింటికంటే ఆశ్ఛర్యం ఏమంటే రాజమండ్రి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్లు సహితం మా బెయిల్ కోసం తమ పరపతిని ఉపయోగించారట. యుధ్ధరంగంలో వున్నప్పుడు మనం ఊహించని వైపు నుండి కూడ మద్దతు దొరుకుతుంది. జైల్లో కూడ సిబ్బంది అధికార్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు.

 

అప్పటి ఆంధ్రాయూనివర్శిటీ రాడికల్ విద్యార్ధి నాయకుడు చెరుకూరి రాజ్ కుమార్ ను పోలీస్ కష్టడీ నుండి తప్పించిన సంఘటన ఇది. ఆ తరువాత రాజ్ కుమార్ పూర్తిగా రహాస్య జీవితానికి వెళ్ళిపోయాడు.  తరువాతి కాలంలో పీపుల్స్ వార్ లో  జాతీయ నాయకునిగా మారి ‘ఆజాద్’ గా చాలా ప్రసిధ్ధుడు అయ్యాడు. ఏం మనిషతను? ఒక ఐదు నిముషాలు తీరిక దొరికితే చుట్టూ వున్న వారిని కడుపుబ్బా నవ్వించేవాడు. అంతటి హాస్య ప్రియుడు. మరుక్షణం ఒక అరవీరభయంకరునిగా మారిపోయి ప్రత్యర్ధి మీద దాడి చేసేవాడు. 

 

ఇది ముందు రాజమండ్రి గోదావరి స్టేషన్ సమీపానవున్న  విక్రం మహల్ మైదానంలో జరిగిన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ బహిరంగ సభలో మొదలయ్యింది.  మ్యూజియం రోడ్డు పోలీస్ స్టేషన్ కష్టడీ బ్రేక్ వరకు సాగింది. ఇంతకీ మా మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా? ‘Attempt to murder – on circle inspector – in police station’.  మా స్థాయికి తగ్గ కేసు అది. దేనికయినా ఒక లెవల్ వుండాలి !

 

ఆ కేసు మా ప్రతిష్టను బాగా పెంచేసింది. కేరళలో కున్నిక్కాల్   అజిత 1968 నవంబరు 24న మలబార్ స్పెషల్ పోలీస్ క్యాంప్ మీద చేసిన దాడి సంఘటన అంతటి పేరు మాకు ‘అప్పనంగా’ వచ్చేసింది. కొన్నాళ్లు జనం మమ్మల్ని ‘నవరత్నాలు’ అనేవాళ్ళు.

 

జైల్లో పులి శివరామకృష్ణయ్య అనే పాత నక్సలైట్ మాకు తోడయ్యాడు. నెల్లూరు జిల్లా తనది. లైఫర్. అన్యాయంగా అతన్ని సాధారణ ఖైదీలతో వుంచేవారు. మేము జైలుకు వెళ్ళాక పోరాడి ఆయన్ని రాజకీయ ఖైదీల వార్డుకు తెచ్చుకున్నాం. జైల్లో నిమ్మకాయల రాఘవయ్య నాయుడు (బ్యాంకు అధికారి) మాకు తాత్విక గురువు. మార్క్సిస్టు ఎకనామిక్స్ లో నిపుణుడు. రోజూ ఒక గంట రాజకీయార్ధికశాస్త్రం పాఠం చేప్పేవారు.  తోరాడ సత్యనారాయణ మా దళపతి. అంటే పార్టి జైల్ కమిటి నాయకుడు. తోరాడ సత్యనారాయణ అప్పటికే యాక్షన్ హీరో. తనకు అంతకు ముందే జైల్ బ్రేకింగ్ అనుభవం వుంది. కడియాల రాఘవేంద్రరావుతో కలిసి తను కొన్ని జైళ్ళను  బ్రేక్ చేసి నక్సలైట్ ఖైదీలను విడిపించాడు.  బయటి నుండి ఏకంగా రాజమండ్రి జైలు సెల్ వరకు సొరంగం తవ్వేసిన ఘనుల్లో ఒకడు. మనది మామూలు ట్రైనింగా?

 

ఏడుకొండలు మంచి బాడీ బిల్డర్. వైజాగ్ లో తనను మిస్టర్ యూనివర్శిటీ  అనేవారు. “రాజ్ కుమార్ ను తప్పించండి” అని బయటి నుండి పార్టి ఆదేశాలు రాగానే పోలీసు స్టేషన్ లో ముందు దాడి చేసింది తనే. ఒక విలువైన కామ్రేడ్ ను బతికించుకోవడం కోసం పది మంది చనిపోవడానికి సిధ్ధమయ్యే రోజులవి. మనుషులు ఎవరి బతుకులు వాళ్ళు ఎలాగూ బతికేస్తారు. పెళ్ళాం పిల్లల్ని పోషించుకుంటారు. కొండొకచో పెళ్ళాం పిల్లలే పోషిస్తారు. ఇలాంటి రొటీన్ జీవితంలో నాకు ఎలాంటి రుచి అనిపించదు. మరొకరికి మేలైన బతుకుని ఇవ్వడం కోసం తాము చనిపోవడానికి సిధ్ధపడం Altruistic Suicide. ఇది సామాన్యమైన విషయం కాదు. అలాంటి సన్నివేశాలు అప్పట్లో తరచూ కనిపించేవి.

 

హీరో అంటే ఇప్పుడు సినిమా యాక్టర్లను అంటున్నారుగానీ, అసలు అర్ధం జనపద గణ నాయకుడు. ఆ అర్థంలో వరవరరావు 2011లో జరిగిన ఒక సభలో నన్ను హీరో అన్నారు. దానికి రాజమండ్రి కేసు ఒక విధంగా ఆరంభం. 

 

సరిగ్గా ఇలాంటి సంఘటననే కారంచేడు ఉద్యమం సందర్భంగా 1985 సెప్టెంబరు 11 సాయంత్రం చీరాల పోలీస్ స్టేషన్ లో రీ-ప్లే జరిగింది. మళ్ళీ అదో పెద్ద యాక్షన్ సీన్!

 

ఈ భూమ్మీద నాకు ఇద్దరు నచ్చరు; పోలీసులు; ద్రోహులు. శత్రువుకన్నా ద్రోహి ప్రమాదకారి. గురజాడ అప్పారావుగారి జట్కావాడిలా నాకు పోలీసులు లేని సమాజం ఇష్టం. అంటే ఆంక్షలు లేని సమాజం అన్నమాట! పోలీసులు చాలా మందిని అకారణంగా తిడుతుంటారు; కొడుతుంటారు; చిత్రహింసలు పెడుతుంటారు; కొందరిని చంపేస్తారు కూడ. నేనే పోలీసుల్ని కొట్టానని నా మీద మూడు పట్టణాల్లో మూడుసార్లు కేసులు నమోదు అయ్యాయి. మూడు చోట్లా అరెస్టు చేశారు. వీటికి నేనేమీ చింతించను. అవన్నీ గొప్ప జ్ఞాపకాలు.

 

కారంచేడు ఉద్యమంలోనూ చీరాల కోర్టు నన్ను, బి పరంజ్యోతి తదితరుల్ని ఒంగోలు జైలుకు రిమాండ్ వేసింది. మళ్ళీ అదొక పెద్ద డ్రామా సీన్. ఒంగోలు జైలు లోపలి వరకూ వెళ్ళాం. జైలు సెల్లోకి మాత్రం  అడుగు పెట్టలేదు. అంతకు ముందే బయటికి వచ్చేశాం.

 

ఇప్పుడు ఓటిటిలో నడుస్తున్న  Keanu Reeves JOHN WICK సీరీస్ అంతటి యాక్షన్ ప్యాక్డ్ డ్రామా సన్నివేశాలు ఇవన్నీ. వీటిని స్క్రీన్ మీద చూస్తున్నప్పుటికన్నా నిజ జీవితంలో చేస్తున్నప్పుడు చాలా థ్రిల్ గా వుంటుంది. మృత్యువు మన నీడగా మారిపోయినపుడు జీవికను నిలబెట్టుకోవడానికి పెనుగులాడడమే జీవితంలో అందమైన ఘట్టం. ఎప్పుడయినా తీరిక దొరికినప్పుడు వీటిని ఒక నవలగా రాస్తాను.

మనుషులు భావోద్వేగాలతో బతకగలగడం ఒక వరం!  

ముస్లిం నాయకత్వాలు ఆ.కు. (ఆధిపత్య కులాల) పార్టీలనే నమ్ముకుని వుంటున్నారు.

 ఆకురాతి మురళీ కృష్ణ  ముస్లిం సమాజం మీద చేసిన ఆరోపణల మీద ఈ గ్రూపులో ఇంత చర్చ జరుగుతోందా? నాకు ఈ క్షణం వరకు తెలీదు. 

ఆకురాతి మురళీ కృష్ణ  ఐక్యవేదిక గ్రూపులో ముస్లిం సమాజం మీద అకారణంగా దాడి చేశారు. నేను వారి మీద గానీ వారి సామాజికవర్గం మీదగానీ ఏ దశలోనూ ఎలాంటి పరుష పదాలూ వాడలేదు. నేను చాలా వినయంగా - 

MuraliKrishna Akurati గారూ! 

ఇది చాలా అభ్యంతరకర పోస్టు. 

1. ముస్లిం నాయకత్వాలు ఆ.కు. (ఆధిపత్య కులాల) పార్టీలనే నమ్ముకుని వుంటున్నారు. 

2. దళితబహుజనులతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మాణానికి ముస్లింలు ముందుకు రావడంలేదు.

3. ముస్లింలకు ఫూలే అంబేడ్కర్ ఐడియాలజీ లేదు.  

4. ముస్లింలు ఎంతసేపటికీ వ్యాపార దృక్పథాన్ని వదలడం లేదు. 

 అనే 4 ఆరోపణలు మీరు చేశారు. 

మీ ముందు మూడు ఆప్షన్లున్నాయి. 

1. మీరు చేసిన ఆరోపణల్ని నిరూపించాలి.  

2. నిరూపించలేకపోతే  ఆ ఆరోపణల్ని ఉపసంహరించుకోవాలి.

3. ఫాసిజానికి అత్యంత బాధితులయిన ముస్లిం సమాజం మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు  బహిరంగ  క్షమాపణలు చెప్పాలి. 

అని అడిగాను. 

అలాగే గ్రూపు adminsకు మూడు విజ్ఞప్తులు  చేశాను. 

1. అణగారిన సమూహాల ఐక్యతకు భంగం కలిగిస్తూ మురళీకృష్ణ ఆకురాతి  ముస్లిం సమాజం మీద అసంబర్ధంగా  చేసిన ఆరోపణల పోస్టును ముందు తొలగించండి. 

2. వారి ఆరోపణల్ని తిప్పికొట్టే ఆవకాశాన్ని నాకు కల్పించండి. 

3. మురళీకృష్ణ ఆకురాతి ఈ గ్రూపు ఆశయాలకు భంగం కలిగించారని తేలితే వారిని ఈ గ్రూపు నుండి తప్పించండి. 

ఇది ఎక్కడయినా డెమోక్రాటిక్ ప్రాసెస్. ఇది జరగాల్సిందే. 

ఈ సందర్భంలో ముసిం సమాజ ప్రతినిధులు ఈ డెమోక్రాటిక్ ప్రాసెస్ ను ప్రారంభించమని ఈ గ్రూపు adminsను కోరాలి. 

MuraliKrishna Akurati ఆరోపణల మీద తమ అభ్యంతరాలను చెపుతూ పోస్టులు పెట్టాలి. (అభ్యంతరాలను చెప్పడం అంటే హిందూ బిసీ సమూహాలను విమర్శించమనికాదు) 

వాళ్లు ఇంకో పనికూడ చేయవచ్చు. నాకు ఫోన్ చేసి MuraliKrishna Akurati పెట్టిన పోస్టు అభ్యంతరకరమే అయినప్పటికీ  ఐక్యత కోరుతూ  ఈ చర్చను ఇక్కడితో ఆపేద్దాం అని నాకు సూచించవచ్చు. నేను వెంటనే సానుకూలంగా స్పందించేవాడిని. ఏ ఒక్కరూ ఆ రెండు పనులు చేయలేదు. 

గ్రూపు అడ్మిన్ డెమోక్రాటిక్  ప్రాసెస్ ను మొదలు పెట్టకముందే  ఒక 

ముస్లిం ప్రతినిధి MuraliKrishna Akuratiని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టారు. 

MuraliKrishna Akurati గారు ఈ పోస్టు పెట్టడంలో  malice ఏమిటీ? అనే సందేహం కూడా వీరికి రాలేదు. 

"MuraliKrishna Akurati చాలా మంచి మనిషి. నాకు చాలాకాలంగా తెలుసు. నాకు  పెద్దన్నలాంటివారు" అని కితాబు ఇచ్చారు. 

ఈ వివాదంలో ఆయన MuraliKrishna Akurati  పక్షం వహించారు. అంటే MuraliKrishna Akurati ముస్లిం సమాజం మీద చేసిన ఆరోపణల్లో నేరుగా భాగస్వామి అయ్యారు. 

గ్రూపులో MuraliKrishna Akurati  పక్షం వహిస్తూ పోస్ట్ పెట్టాక వారు నాకు ఫోన్ చేసి MuraliKrishna Akurati గారి గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం మొదలెట్టారు.  

ఇది కపటం! గుంటనక్క వ్యవహారం! 


కృష్ణార్జున బోధి మంగళగిరి గారికి, 

MuraliKrishna Akruti గారు చేసిన ఆరోపణల్ని నేను ఇంకా  ఖండించలేదు. వారు తన ఆరోపణలకు వత్తాసుగా ఒక ఆడియో కూడ పెట్టారు. ఆ ఆరోపణల్ని నిరూపించమని   నేను వారిని సమంజసంగా కోరుతున్నాను. 

రెండు రోజుల్లో వారు తన ఆరోపణల్ని నిరూపించాలి. లేకపోతే గ్రూపు ఐక్యతకు భంగం కలిగించినందుకుగాను  వారిని ఈ గ్రూపు నుండి తొలగించండండి.   ఈ రెండు పనుల్లో ఏదో ఒకటి జరక్కపోతే, వారెంత నిరాధార బూటకపు అసంబధ్ధపు కపటపు చారిత్రక అజ్ఞానపు వాస్తవ విరుధ్ధపు ఆరోపణలు చేశారో నిరూపించడానికి నాకు అవకాశం ఇవ్వండి. 

Danny  MTF  9010757776

కృష్ణార్జున బోధి మంగళగిరి గారికి, 

నేను నిన్న రూ. 8000 లు  పెట్టి మార్చి 11, 12 తేదీల ఢిల్లీ సమావేశానికి నా భార్యతోసహా రానూపోనూ  రైలు టిక్కెట్లు కొని వుంచుకున్నాను. 

బయట ముస్లింల  మీద జరుగుతున్న భౌతిక మూక  దాడుల్లో కాల్బలంగా పనిచేస్తున్న సమూహాలే ఈ గ్రూపులోనూ ముస్లిం సమూహాల మీద నైతిక దాడులు చేస్తుంటే సహించడం కష్టం. నాకిది ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు. ఢిల్లీ సమావేశానికి ముస్లింలను రావద్దంటే అది మీ ఇష్టం. 

Danny  MTF  9010757776


కృష్ణార్జున బోధి మంగళగిరి గారూ!


మీరు మురళి కృష్ణ ఆకృతి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పలేదు. 

మిత్రమా ! M Subba Rao DNT Political Party

 MuraliKrishna Akruti గారు!  ఈ గ్రూపులో ముస్లిం సమాజం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. వారి చేత ఆ ఆరోపణల్ని ఉపసంహరింపచేయండి. లేదా ఆ ఆరోపణలకు సమాధానం ఇచ్చే అవకాశాన్ని మాకు ఇవ్వండి. లేదా వారిని గ్రూపు నుండి తొలగించండి. అని మూడు ప్రతిపాదనలు చేశాను. ఇవేవీ మేము చేయము. ముస్లింలు మాత్రం ఢిల్లీ రావాలి మీరు అంటున్నారు. ఇదొక కొత్త రకం ఆధిపత్యమా? 

Danny 9010757776


ఇప్పుడే ఒక విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. MuraliKrishna Akurati గారు! ఈ Group Admin లలో ఒకరట! 

Bhaskara Rao C OPDR గారూ! 

సంఘపరివారం అనాదిగా ముస్లింల మీద రకరకాల దాడులు చేస్తునే వుంది. సంఘపరివారం దాడుల్ని ఎదుర్కొంటామంటూ పెట్టిన 'భారత్ బచావో' వాట్సప్ గ్రూపు కూడ ముస్లిం వ్యతిరేక ప్రచారం మొదలెట్టింది. ఇలాంటి దుష్ప్రచారాల మీద అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ముస్లింలకు లేకుండా చేసినందుకు ధన్యవాదాలు.  

ముస్లింల మీద వ్యతిరేక కామెంట్ పెట్టిన MuraliKrishna Akurati  గారిని Admin గా వుంచి, వారిని ఎవరూ విమర్శించకుండా  హఠాత్తుగా  Bhaskara Rao C OPDR changed this group's settings to allow only admins to send messages to this group అని నిర్ణయం తీసుకున్నందుకు మీకు   మరొక్కసారి ధన్యవాదాలు. దీన్ని మీ స్టైలు మత సామరస్యం అనుకోవాలా? లేక మీ టైపు ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ అనుకోవాలా? You are really great. 


మన భారత్ బచావో Admin MuraliKrishna Akurati గారి పేరు చెప్పుకుని ఈ టిక్కెట్లతో నాలుక గీసుకోవాలి. 


ఆ సమయంలో adminగా పదిసార్లు ముందుకు వచ్చిన కృష్ణార్జున బోధి మంగళగిరి గారిని పదేపదే ప్రాధేయపడ్డాను. ఆ పోస్ట్ తీసేయండి అని లేదా  సమాధానం ఇచ్చే అవకాశం నాకు ఇవ్వండని. ఆ admin కనీసం నా విన్నపాన్ని acknowledge కూడ చేయలేదు. ఈ లోగా  పోస్ట్ చేసే అవకాశం నుండి నన్ను మీరు తొలగించారు. బాధితుడ్నే శిక్షించే న్యాయం. పిర్యాదిదారుడ్నే నోరు మూయించే ధర్మం. ఈ అనుభవం చాలు.  ఎక్కువ నష్టం జరక్కముందే కళ్ళు తెరిపించినందుకు మరొక్క మారు  మీకు ధన్యవాదాలు.


నేను గుమ్మం ముందు నిలబడి ఒక గంట సేపు బతిమిలాడాను. ఆరుగురో ఏడుగురో admins వున్నారు. ఏ Admin కూడ స్పందించలేదు. 



ముస్లిం సమాజం అంతర్ముఖంగావున్నా, మౌనంగా ఇంట్లో కూర్చున్నా ఇంట్లో దూరి గిల్లికజ్జాలు పెట్టుకుని ఎదురుదాడి చేసే సంస్కృతిని మేము చాలా కాలంగా చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడా అదే సంస్కృతి. ఒకరు ముస్లింలను రెచ్చగొడతారు.  ఇంకొకరు ముస్లింల నోరు మూస్తారు. మరొకరు వచ్చి ముస్లింలు ఇంతేనబ్బా లొల్లి చేస్తారు అని తీర్పు ఇస్తారు. 1947లో మొదలయిన ఆట ఇది.ఇది మీకూ కొత్తకాదు; మాకూ కొత్త కాదు. 

ముస్లిం సమాజం మీద నిందవేసిన వ్యక్తి సాధారణ సభ్యుడు కాదు; ఒక admin  అనే ఎరుక మీకు ఇంకా కలిగినట్టులేదు. ముస్లిం సంఘాలు లేకుండ, ముస్లిం ఆలోచనాపరులు లేకుండా  మీ భారత్ బచావో  వాట్సప్ గ్రూప్ వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. 



కృష్ణార్జున బోధి మంగళగిరి గారూ!


మీరు మురళి కృష్ణ ఆకృతి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పలేదు. 



మిత్రమా ! M Subba Rao DNT Political Party


 MuraliKrishna Akurati గారు!  ఈ గ్రూపులో ముస్లిం సమాజం మీద టివ్రమైన ఆరోపణలు చేశారు. వారి చేత ఆ ఆరోపణల్ని ఉపసంహరింపచేయండి. లేదా ఆ ఆరోపణలకు సమాధానం ఇచ్చే అవకాశాన్ని మాకు ఇవ్వండి. లేదా వారిని గ్రూపు నుండి తొలగించండి. అని మూడు ప్రతిపాదనలు చేశాను. ఇవేవీ మేము చేయము. ముస్లింలు మాత్రం ఢిల్లీ రావాలి మీరు అంటున్నారు. ఇదొక కొత్త రకం ఆధిపత్యమా? 

Danny 9010757776




ఇప్పుడే ఒక విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. MuraliKrishna Akurati గారు! ఈ Group Admin లలో ఒకరట! 



Bhaskara Rao C OPDR గారూ! 

సంఘపరివారం అనాదిగా ముస్లింల మీద రకరకాల దాడులు చేస్తునే వుంది. సంఘపరివారం దాడుల్ని ఎదుర్కొంటామంటూ పెట్టిన 'భారత్ బచావో' వాట్సప్ గ్రూపు కూడ ముస్లిం వ్యతిరేక ప్రచారం మొదలెట్టింది. ఇలాంటి దుష్ప్రచారాల మీద అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ముస్లింలకు లేకుండా చేసినందుకు ధన్యవాదాలు.   


ముస్లింల మీద వ్యతిరేక కామెంట్ పెట్టిన MuraliKrishna Akurati  గారిని Admin గా వుంచి, వారిని ఎవరూ విమర్శించకుండా  హఠాత్తుగా  Bhaskara Rao C OPDR changed this group's settings to allow only admins to send messages to this group అని నిర్ణయం తీసుకున్నందుకు మీకు   మరొక్కసారి ధన్యవాదాలు. దీన్ని మీ స్టైలు మత సామరస్యం అనుకోవాలా? లేక మీ టైపు ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ అనుకోవాలా? You are really great. 



మన భారత్ బచావో Admin MuraliKrishna Akurati గారి పేరు చెప్పుకుని ఈ టిక్కెట్లతో నాలుక గీసుకోవాలి. 


ఆ సమయంలో adminగా పదిసార్లు ముందుకు వచ్చిన కృష్ణార్జున బోధి మంగళగిరి గారిని పదేపదే ప్రాధేయపడ్డాను. ఆ పోస్ట్ తీసేయండి అని లేదా  సమాధానం ఇచ్చే అవకాశం నాకు ఇవ్వండని. ఆ admin కనీసం నా విన్నపాన్ని acknowledge కూడ చేయలేదు. ఈ లోగా  పోస్ట్ చేసే అవకాశం నుండి నన్ను మీరు తొలగించారు. బాధితుడ్నే శిక్షించే న్యాయం. పిర్యాదిదారుడ్నే నోరు మూయించే ధర్మం. ఈ అనుభవం చాలు.  ఎక్కువ నష్టం జరక్కముందే కళ్ళు తెరిపించినందుకు మరొక్క మారు  మీకు ధన్యవాదాలు.


నేను గుమ్మం ముందు నిలబడి ఒక గంట సేపు బతిమిలాడాను. ఆరుగురో ఏడుగురో admins వున్నారు. ఏ Admin కూడ స్పందించలేదు. 



ముస్లిం సమాజం అంతర్ముఖంగావున్నా, మౌనంగా ఇంట్లో కూర్చున్నా ఇంట్లో దూరి గిల్లికజ్జాలు పెట్టుకుని ఎదురుదాడి చేసే సంస్కృతిని మేము చాలా కాలంగా చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడా అదే సంస్కృతి. ఒకరు ముస్లింలను రెచ్చగొడతారు.  ఇంకొకరు ముస్లింల నోరు మూస్తారు. మరొకరు వచ్చి ముస్లింలు ఇంతేనబ్బా లొల్లి చేస్తారు అని తీర్పు ఇస్తారు. 1947లో మొదలయిన ఆట ఇది.ఇది మీకూ కొత్తకాదు; మాకూ కొత్త కాదు. 


ముస్లిం సమాజం మీద నిందవేసిన వ్యక్తి సాధారణ సభ్యుడు కాదు; ఒక admin  అనే ఎరుక మీకు ఇంకా కలిగినట్టులేదు. ముస్లిం సంఘాలు లేకుండ, ముస్లిం ఆలోచనాపరులు లేకుండా  మీ భారత్ బచావో  వాట్సప్ గ్రూప్ వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. 


 మురళీకృష్ణగారు పోస్టు పెట్టింది  12.45 కు.

అప్పటి నుండి మూడు గంటల పాటు నేను నాకూ అవకాశం ఇవ్వాల్సిందిందిగా బతిమిలాడుతున్నాను. 

మీరు నాకు కామెంట్ చేసే అవకాశం కూడ లేకుండా చేసింది. 15.37కు. 

మురళీ కృష్ణ ఆకురాతి గారు ఒక గంటలో వివరణ ఇస్తారని మీరు ప్రకటించింది 16. 46కు. అంటే ఒక గంటా 10 నిముషాల తరువాత.  ఆ తరువాత మురళీ కృష్ణ ఆకురాతిగారు  ఇంకో గంట తీసుకుంటారా? 17. 46? ఏంటిది సార్ ! నవ్వులాటనా? 



🙏🏼 మిత్రులకు వందనం 🙏🏼


నేను గత 6గం.క్రితం హాస్పిటల్ కు వెళ్లి, ఇప్పుడే తిరిగి వచ్చాను. ఈలోగా చాలా విమర్శలు నా మీద వచ్చాయి. అందుకు ముందుగా మన్నించండి. 

1. ఒక చిన్న పొరపాటు నా ద్వారా జరిగింది , ఐనా మిత్రులు సరిగా అవగాహన చేసుకోలేక నన్ను అపార్ధం చేసుకున్నారు. 

  * నా పొరపాటు : మిత్రులు కరీముల్లా గారిని మాత్రమే ఉద్దేశించి పెట్టిన పోస్ట్, వారి వ్యక్తిగత ఇన్బాక్స్ లో పోస్ట్ చేయాల్సింది , హాస్పిటల్ కు వెళ్ళే హడావుడిలో ఈ గ్రూపులోనే రాయడం జరిగింది. అది  మన గ్రూపుకు సంబంధించిన విషయం కాదు. ఐనా పొరపాటే. అందుకు మన్నించండి. 

    * షుమారు గత 10సం.లుగా నేనూ, ఊ.సా.గారు, మరికొందరు మిత్రులం "బహుజనులకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మాణం" కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఎక్కువగా అబిడ్స్ లోని మిత్రుడు జహీరుద్దీన్ ఆలీఖాన్ గారి సియాసత్ పత్రిక కార్యాలయంలో జరిగినవి. ఆ సందర్భంగా మేము ఎదుర్కొన్న ఇబ్బందుల్లో భాగంగా పైన పేర్కొన్న అంశం గుర్తుచేసుకోవడం జరిగింది. 

  * ఐనప్పటికీ " ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మాణంలో" అని కూడా నా పోస్ట్ లో ఉటంకించడం జరిగింది. మరొకసారి చదివివుంటే ,నా పైన ఇలాంటి విమర్శలు  వచ్చివుండేవి కాదు. ఐనప్పటికీ అపార్ధం కలిగించే అవకాశం కల్పించినందుకు విచారం వ్యక్తపరుస్తున్నాను. 

   * నేనేదో వాయిస్ మెయిల్ పెట్టాననీ , సాక్ష్యాలతో నిరూపించుకోవాలనీ , లేకపోతే నామీద యాక్షన్ తీసుకోవాలనీ సోదరుడు డేనీ గారు తనకోపం ప్రదర్శించారు. ఆ సోదరుడు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదని భావిస్తాను, పరిచయం లేకపోవడంచేత.


2. పోతే నా స్నేహితులు అందరకూ తెలుసు ముస్లిం సోదరుల పట్ల నావైఖరి. నిన్న నా ఫేస్బుక్ లో కూడా ముస్లింలు, క్రిస్టియన్లు వైదీక మత అవమానాలు భరించలేక మతం మార్చుకున్న మా సోదర మూలవాసీలే , విదేశీ వలసవాదులైన ఆర్యుల లాగా కాదు అని.

  * బాబ్రీ మసీదు ధ్వంసం చేసిన రోజున , మా "బీసీ ఫోరం" బ్యానర్తో ర్యాలీ తీసి , నిరసన సభ జరిపింది నేనే.మా పొన్నూరు ముస్లిం సోదరులెవరినైనా అడగండి, చెప్తారు. ఆంధ్రభూమి పొన్నూరు విలేకరి కరీముల్లాను అడగండి (98480 41355)

నా గురించి చెబుతాడు.

* షేక్ జిలానీ (టీచర్, కరోనా వలన దివంగతుడు)ని "మా పెద్దబ్బాయి" అని బహిరంగ సభలలో చెప్పుకున్నవాడిని. 

* నేనేమీ శీలపరీక్ష చేసుకోనక్కర లేదు. కాకపోతే నాగురించి తెలియనివారు ఆవేశంలో రాసినారు. వారికి తెలియజెప్పడానికే ఈ వివరణ..


2. పోతే మరో పోస్ట్ లో  @Samasamaj Chacha Vedika గారు "నాయకత్వంలో ఉండేవారు హేతువాద/నాస్తిక భావజాలం కలవారై ఉండాలి" అని రాశారు. నేను వారి అభిప్రాయాలను సమర్ధించాను. ఎందుకంటే మా సంస్థ అదేవిధంగా నియమాలను పెట్టుకుని ఆచరిస్తున్నది కాబట్టి. నియమాలను కాదని ఆచరణలో మరోరకంగా ప్రవర్తించే వారిమికాదు. ఒకవేళ అలాంటి నియమంలో అనర్ధం వుంటే హేతుబద్ధంగా వివరించండి. అంతేగాని నియంతల లాగా రూలింగ్ ఇవ్వకూడదు గదండీ. 

3. పోస్టును చదవకుండా, అవగాహన చేసుకోకుండా , "పోస్ట్ లో బూతు"లు వెతికేవారి విమర్శలు నేను పట్టించుకోను, అది వారి విజ్ఞతకే  వదిలేస్తున్నాను.

4. ఈ వివరణను అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నా.

అందరకూ "నీల్-లాల్ సలాం" 


- ఆకురాతి మురళీకృష్ణ.


నిరూపించమనండి ఆయన్ని ఈ నిందల్ని?


1. ముస్లిం నాయకత్వాలు ఆ.కు. (ఆధిపత్య కులాలు అనేనా? ) పార్టీలనే నమ్ముకుని వుంటున్నారు. 

2. దళితబహుజనులతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మాణానికి ముస్లింలు ముందుకు రావడంలేదు.

3. ముస్లింలకు ఫూలే అంబేడ్కర్ ఐడియాలజీ లేదు.  

4. ముస్లింలు ఎంతసేపటికీ వ్యాపార దృక్పథాన్ని వదలడం లేదు. 




మొన్నటి సదస్సు తరువాత సంఘపరివారం  ఒక  agent Provocateur ద్వార  ఒక చిచ్చు పెడుతుందని భయపడ్డాను. నా భయాన్ని MuraliKrishna Akruti గారు నిజం చేశారు! 


మొదటి నుండి నా డిమాండ్ అదే! 


దయచేసి మళ్ళామళ్ళా ఇదే పోస్టు పెట్టవద్దు.  మురళీకృష్ణ ఆకృతి గారికి ఒక రాజకీయ పార్టిని స్థాపించి నిర్వహించగల సామర్ధ్యంలేదని జహీరుద్దీన్ ఆలీఖాన్ కు ఆరోజు అనిపించి వుండవచ్చు.  జహీరుద్దీన్ ఆలీఖాన్ లేకపోయినా సరే తనే  తనను నమ్మే  సామాజికవర్గాలు, ప్రముఖులతో ఒక రాజకీయ పార్టిని నిర్మించి గెలిపించి తన సామర్ధ్యాన్ని నిరూపించుకునే అవకాశం మురళీకృష్ణ ఆకృతి గారికి బోలెడు వుండింది.  కానీ,  వారు ఇన్నేళ్ళకు కూడ ఆ పని చేయలేకపోయారు. దీని అర్ధం ఏమిటీ? 


అయినా   ఫాసిస్టు అణిచివేతను అందరికన్నా అనుభవిస్తున్న సమూహం మీద ఒక వ్యక్తిగత అనుభవంతో ఇంత పెద్ద నింద వేస్తారా? సజావుగా సాగుతున్న గ్రూపులో చిచ్చు పెడతారా? ఇలా చిచ్చు పెట్టే వారిని ఆంగ్లంలో ఏమంటారో నాకు బాగా తెలుసు. 




Monday 30 January 2023

అత్యంత బాధితులే సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం మీద పోరాటంలో ముందుండాలి

 అత్యంత బాధితులే  

సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్  నియంతృత్వం మీద 

పోరాటంలో ముందుండాలి


పెట్టుబడీదారీ వ్యవస్థ తనకు అవసరం అయినప్పుడు హేతువాదాన్ని ప్రోత్సహించింది. కార్పొరేట్ వ్యవస్థ తనకు అవసరం అయినప్పుడు మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తుంది. 


మతాలు కూడా అంతే. నియంతలు కొన్ని దేశాల్లో ఇస్లాంను వాడుకున్నారు, కొన్ని దేశాల్లో క్రైస్తవాన్ని వాడుకున్నారు, కొన్ని దేశాల్లో బౌధ్ధాన్ని వాడుకున్నారు. ఇప్పటి భారత దేశంలో హిందూమతాన్ని వాడుకుంటున్నారు. ఎక్కడయినా సరే, నియంతృత్వం కాన్ స్టాంట్. మతం వేరియబుల్. 


సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వంను చాలామంది సులువుగా వుంటుందని 'ఫాసిజం' అంటున్నారు. 'ఫాసిజం' అనడం మరీ తప్పేమీ కాదుగానీ కొన్ని సందర్భాల్లో ఈ పదంవల్ల  కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  కొందరు ఫాసిజం అనగానే ఇటలీ, ముస్సోలిని, జర్మనీ హిట్లర్ ల పోలికలు తెచ్చి ప్రస్తుతం ఆ పరిస్థితులు  ఇక్కడ లేవుకనుక  దీనిని ఫాసిజం అనరాదని చాలా తెలివిగా వాదిస్తున్నారు. కనుక టెక్నికల్ గా సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం అనాలనేదే నా ప్రతిపాదన. అదే సరైనది. 


ఒక సామాజిక సిధ్ధాంతంగా కమ్యూనిజం మహత్తరమైనది. కానీ, భారత కమ్యూనిస్టు పార్టీలన్నీ (ఈసంఖ్య ఇప్పుడు 100 దాటింది) అనేక చారిత్రక తప్పులు చేశాయని ఒప్పుకునే నిజాయితీ మనకు వుండాలి. గాంధీ, కాంగ్రెస్, అంబేడ్కర్, రాజ్యాంగం తదితర అంశాల మీద అప్పుడు కమ్యూనిస్టు పార్టీలు చేసిన వ్యాఖ్యల్ని మళ్ళీ ముందుకు తెస్తే ఇంకో పది ముక్కలు అదనంగా చేరుతాయి. ఇప్పటి సమస్యకు ఇది పరిష్కారం కాదు. 


ఐక్యత ఒక్కటే ఇప్పటి ఎజెండా. చైనాలో జపాన్ వ్యతిరేక జాతీయ ఐక్యసంఘటన కొనసాగిన నాలుగేళ్ల  కాలంలో రాతల్లోగానీ, ఉపన్యాసాల్లోగానీ మావో 'వర్గపోరాటం' అనే పదాన్ని ఒక్కసారి కూడ వాడలేదట. ఆ దృక్పథం వుండాలి మనకు. 


In 'Bunch of Thoughts' published in 1966, MS Golwalkar talks about 3 internal threats (enemies) - Muslims, Christians & Communists.అని ప్రకటించాడు. 


దీన్నివాళ్ళు ఈమధ్య కొద్ది మార్పులు చేసి The “malicious-5” or M5, అంటున్నారు. 

1.   Marxism

2.   Macaulayism

3.   Missionaries

4.   Materialism and

5.   Muslim extremism.


ఈ ప్రకటన ఆధారంగా  సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం బాధితులు ఎవరో ఒక జాబితా తయారు చేయవచ్చు. ఈ జాబితాలో తొలిగా వుండేది  ముస్లింలు అనే విషయంలో ఎవరికీ అభ్యంతరం వుండాల్సినపనిలేదు.  ఆ తరువాత క్రైస్తవులు. ఆ తరువాత కమ్యూనిస్టులు, ఆదివాసులు, ఎస్సీలు, బిసిలు ... ... ఇలా సాగుతుంది ఈ జాబితా. 


ఒకవైపు, మైనారిటి మత విశ్వాసుల  సంఘపరివారం ఎలాగూ దాడి చేస్తున్నది.  ఇప్పుడు హేతువాదాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం ఎవరయినా చేస్తున్నారంటే వాళ్ళు మత విశ్వాసుల మీద మరోవైపు నుండి దాడి చేయడానికి సిధ్ధపడుతున్నారని అర్ధం. 


ఇది చారిత్రక  సందర్భం అయినప్పుడు హేతువాదం గురించి మాట్లాడడం అసందర్భం. హేతువాద వేదికల్లో ముస్లింలు, క్రైస్తవులు పాల్గొనరు. అసలు బాధితులు లేకుండా సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం  మీద పోరాటానికి అర్ధమే వుండదు. 


డానీ

ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

9010757776


గత శతాబ్దం (1922-2022)లో భారత రాజకీయ రంగంలో జరిగిన రెండు పరిణామాలు.

 గత శతాబ్దం (1922-2022)లో 

భారత రాజకీయ రంగంలో జరిగిన  రెండు పరిణామాలు. 

1. ఆరెస్సెస్; వంద సంస్థలుగా విస్తరించడం. ఇది ప్రమాదం. 

2. భారత కమ్యూనిస్టు పార్టి. వంద ముక్కలుగా చీలడం. ఇది విషాదం. 

3. అంబేడ్కరిస్టుల మధ్య ఐక్యత దెబ్బతినడం. ఇది బాధాకరం.


ఇప్పుడు రెండు చారిత్రక కర్తవ్యాలు. 

1. ముందు; సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వాన్ని వ్యతిరేకించే పార్టీలు, సంఘాలు, ఆలోచనాపరులు ఐక్యం కావడం. 


2. ఆ తరువాత; సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వపు బాధితులందర్నీ ఏకం చేయడం. 

- ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

Wednesday 25 January 2023

‘బహుభార్యత్వం’పై పట్టుపట్టకపోవటమే మంచిది!

బహుభార్యత్వంపై పట్టుపట్టకపోవటమే మంచిది!

“బహుభార్యత్త్వాన్ని రద్దు చేయడమే మేలు! దాని కోసం భారత ముస్లిం సమాజం పట్టుబట్టక పోవడమే మంచిది” - అని నేను పెట్టిన పోస్ట్ ను ఖండించిన వారందరు ముస్లిం పురుషులు. ఒక్క ముస్లిం  స్త్రీ కూడ  నా పోస్ట్స్ ను ఖండించలేదు.          

బహుభార్యత్వం వల్లనే ప్రపంచంలో వ్యభిచారం, వివాహేతర  సంబంధం, సహజీవనం  కనుమరుగు అవుతుంది అన్నట్టు చాలామంది సూచించారు. 

బానిసలు, ఆనాధలు, నిరాశ్రయులు, నిరుపేదల్ని మాత్రమే ముస్లిం పురుషులు రెండవ వివాహం చేసుకుంటున్నట్టు ఏ ఒక్కరు గట్టిగా చెప్పలేదు.  

బహుభార్యత్వం రాజ్యాంగ బద్ధమో కాదో తేల్చడానికి మొన్న శుక్రవారం మధ్యాహ్నం (బాద్ జుమ్మా)   సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమించినట్టు కామెంట్  చేసిన మేధావుల్లో ఏ ఒక్కరికి కూడ తెలీదు. వీరిలో కొందరు లాయర్లు కూడ వున్నారు.  ఇది మన స్థితి !  

ఇతర సమాజాల ముందు ముస్లింలను మొరటువారిగా, అనాగరీకులుగా , మధ్యయుగాల  సాంప్రదాయాలను వదులుకోలేనివారిగా చిత్రించడమే ఈ వివాదం లక్ష్యం. అత్యున్నత న్యాయంస్థానం కూడ  ఇలాంటి కేసుల్లో  కేంద్ర ప్రభుత్వ పెద్దల అభిమతం, ప్రయోజనాలను, దేశప్రజల సాధారణ మూడ్ (మూజువాణి)ను  దృష్టిలో పెట్టుకుని అంతిమ తీర్పులు ఇస్తాయన్నది ఇప్పుడు బహిరంగ విషయమే.   ఇలాంటి సందర్భాల్లో ముస్లిం సమాజం ఎలాంటి నష్టనివారణ చర్యలు   చేపట్టాలన్నది ఇక్కడొక సవాలు. దానిని గురించి ఆలోచన చేయకుండా ఒకరినొకరు ఎద్దేవలు ట్రోల్ చేసుకుంటూ కాలం గడిపితే గతంలో పడ్డ శిక్షలే పడుతాయి. గతంలో జరిగిన పరాభవాలే జరుగుతాయి.     

‘బహుభార్యత్వం’పై పట్టుపట్టకపోవటమే మంచిది!

ప్రచురణ : ఆంధ్రజ్యోతి, 29 జనవరి 2023 

https://www.andhrajyothy.com/2023/editorial/it-is-better-not-to-insist-on-polygamy-999747.html


Tuesday 24 January 2023

The aim of Marxist literature is to change the society

 The aim of Marxist literature is to change the society

సమాజ మార్పే మార్క్సిస్టు సాహిత్య లక్ష్యం

           సమాజంలో దేనికీ ఒక అర్ధమే వుండదు. ప్రతి దానికీ అనేక అర్ధాలూ, నిర్వచనాలూ, దృక్పథాలూ వుంటాయి. కళాసాహిత్యాలు కూడ దీనికి మినహాయింపుకాదు. మనిషి ఆలోచనలు, భావాలు, సంస్కారాల నుండి కళాసాహిత్యాలు పుడతాయనే అభిప్రాయం ఒకటుంది. కళాసాహిత్యాలు ఒక మహాత్యము అనే భావన కూడ బలంగా చెలామణిలో వుంది. స్వయంగా దేవుడే తమచేత రచనలు చేయించాడు అని చెప్పుకున్న మహాకవులున్నారు. 

కళాసాహిత్యాల విషయంలో మార్క్సిస్టుల దృక్పథం వేరు. వాళ్ళు సమాజాన్ని కళసాహిత్యాలకు పుట్టినిల్లుగా చూస్తారు. కళాసాహిత్యాలకే కాక సమస్తరంగాల్లో మనుషుల ఆలోచనలకు సమాజమే మూలం అనేది మార్క్సిస్టుల అభిప్రాయం. మరోమాటల్లో చెప్పాలంటే, మార్క్సిస్టుల సమాజ విమర్శ నుండే మార్క్సిస్టుల కళాసాహిత్య  పరామర్శ పుడుతుంది. సమాజ విమర్శలో రాజకీయ విమర్శ కూడ వుంటుందిగనుక మార్స్కిస్టు సాహిత్యంలోనూ రాజకీయ విమర్శ వుంటుంది. దైవాంశాన్నీ, మహాత్యాలను తొలగించి కళసాహిత్యాలను శుష్కంగా మారుస్తున్నారనే నింద ఎలాగూ మార్క్సిస్టు సాహిత్యకారుల మీద వుంది. మార్క్సిస్టు సాహిత్యకారులకు సౌందర్యశాస్త్రం (aesthetics) తెలీదు; సాహిత్యాన్ని రాజకీయాలతో కలుషితం చేస్తారు అనే విమర్శ కూడ వుంది. సౌందర్యశాస్త్రంలో కూడ వర్గ దృక్పధం వుంటుంది. శ్రమే జీవన సౌందర్యం అనేది మార్క్సిస్టు సాహిత్యకారుల ప్రమాణం.  కష్టాలు,. సవాళ్ళు, ఆణిచివేతల నుండి బయటపడడానికి జీవులు చేసే కృషికన్నా సౌందర్యం ప్రకృతిలోగానీ, సమాజంలోగానీ ఏముంటుందీ? 

మార్క్సిస్టు సాహిత్యంలో మాత్రమే రాజకీయాలుంటాయా? ఇతర సాహిత్యాల్లో రాజకీయాలు వుండవా? అనేది తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశం. ‘కళ కళ కోసమే’ అనేది చాలా కాలం ఒక విలువగా కొనసాగింది.  ‘రాజ్యం రాజ్యం కోసమే’ అనే రాచరిక నియంతృత్వం నుండి పుట్టిన  సిధ్ధాంతం ఇది. ఆధునిక యుగంలో దీని మీద అనేక విమర్శలు వెల్లువెత్తాయి.  ‘ప్రభుత్వాలు ప్రజల కోసం’ అనే కొత్త విలువలు వచ్చాయి. 

‘కళ కళ కోసమే’ (లాటిన్ లో Ars Gratia Artis) అనే విలువతో హాలీవుడ్ లో మెట్రో గోల్డ్విన్ మేయర్ (ఎంజియం) అనే భారీ చలనచిత్ర నిర్మాణ సంస్థ 1924లో ఏర్పడింది. కళా విలువల గురించి అంత గొప్పగా మాట్లాడిన ఆ సంస్థే ‘జేమ్స్ బాండ్’ ప్రాంచైజీను నిర్మించింది. రెండవ ప్రపంచ యుధ్ధం తరువాత బ్రిటీష్  నవలాకారుడు ఇయాన్ లాంచెస్టర్ ఫ్లెమింగ్ ‘జేమ్స్ బాండ్’  పాత్రను సృష్టించాడు. బాండ్; బ్రిటీష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్విస్ (M16) ఏజెంటు.  ప్రపంచ మార్కెట్లో  అప్పట్లో బ్రిటన్, అమెరికాలతో పోటీపడుతున్న రష్యా, చైనా  తదితర సోషలిస్టు దేశాల్ని అవహేళన చేయడం ఈ పాత్ర లక్ష్యం. 1991లో రష్యా పతనం తరువాత  జేమ్స్ బాండ్ పాత్ర ముస్లిం-చమురు దేశాల్ని అవహేళన చేయడం మొదలెట్టింది. కళకళ కోసం నినాదంతో మొదలైన సంస్థ ఇంత పచ్చిగా అంతర్జాతీయ రాజకీయాల్ని చిత్రిస్తూ సినిమాలను తీసింది. ఎంజియం సంస్థ ప్రస్తుతం  ఇ-కామర్స్ జెయింట్ అమేజాన్ ఆధీనంలో వుంది. కళకళ కోసం అనే నినాదం వెనుక కూడ రాజకీయార్ధిక ప్రయోజనాలుంటాయని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. 

మార్క్సిస్టు సాహిత్యకారులు తమకు రాజకీయాలున్నాయని బాహాటంగా ప్రకటించడమేగాక కళాసాహిత్యాలకు రాజకీయాలు వుండాలని కూడ వాదిస్తారు. మరోమాటల్లో చెప్పాలంటే ఇతరులు చాటుగా చేసే పనిని మార్క్సిస్టులు బాహాటంగా చేస్తారు. చెప్పాల్సిందీ, చెయ్యాల్సిందీ చాటుగానా? బాహాటంగానా అనేది ఒక్కటే తేడా? 

మనుషుల సామాజిక, రాజకీయ, మేధో జీవిత ప్రక్రియలన్నింటినీ భౌతిక ఉత్పత్తి జీవన విధానం నిర్ణయిస్తుందననేది మార్క్సిస్టుల స్థూల అవగాహన. "మనుషుల సామాజిక అస్తిత్వాన్ని వాళ్ళ చైతన్యం నిర్ణయించదు; అందుకు విరుధ్ధంగా మనుషుల సామాజిక అస్తిత్వం వాళ్ళ చైతన్యాన్ని నిర్ణయిస్తుందని’ ఒక సందర్భంలో కార్ల్ మార్క్స్ చాలా స్పష్టంగా ప్రకటించాడు.  It is not the consciousness of men that determines their being, but on the contrary their social being, that determines their consciousness." 

సామాజిక అస్తిత్వం (social being) అనే మాట చాలా విస్తృతమైనది. ఇందులో అర్ధికం, సాంస్కృతికం, కులం, మతం, లింగం, వర్ణం, భాషా, ప్రాంతం వగయిరాలు ఎన్నో వుంటాయి. కొందరు సంకుచిత మార్క్సిస్టులు  సామాజిక అస్తిత్వాన్ని కేవలం ఆర్ధిక పునాదికే పరిమితం చేయడంవల్ల దాని విస్తృతికి గండిపడుతోంది. ఆర్ధికేతర అణచివేతకు గురయ్యే సమూహాలు మార్స్కిస్టు సంస్థలకు దూరం కావడానికి ఇలాంటి సంకుచిత వాదాలు దోహదం చేస్తాయి. అన్నిరకాల దోపిడీ అణిచివేతల లక్ష్యం సారాంశంలో ఆర్ధికమే కావచ్చుగానీ దోపిడీ అణిచివేతలన్నీ ఆర్ధిక రూపంలో మాత్రమే వుంటాయనడం మూర్ఖత్వం. అది మార్క్సిజం కాదు. సంకుచిత మార్క్సిజం. 

మార్క్సిస్టు కళాసాహిత్యాలు  19వ శతాబ్దం మధ్యలోనో, రష్యాలో సోషలిస్టు విప్లవం విజవంతం అయిన తరువాతో మొదలయ్యాయనే అభిప్రాయం కూడ సరైనదికాదు. అణగారిన సమూహాలను విముక్తి చేసే ప్రణాళికను  మార్క్స్ 1848లో  ప్రచురించిన మాట నిజమేగానీ,  సమాజంలో అనాదిగా రకరకాల రూపాల్లో అణిచివేత పీడనలు కొనసాగుతూ వున్నాయి. వాటిని ప్రతిఫలించే సాహిత్యం కూడ అనాదిగా వుంది; ఇప్పుడూ వుంది.  కార్మికవర్గ సాహిత్యం తప్ప మరేదీ మార్క్సిస్టు సాహిత్యంకాదని ఎవరయినా అంటే వాళ్ళు మార్క్సిస్టు సిధ్ధాంతాన్ని మూర్ఖంగా  బలహీనపరుస్తున్నారని అర్ధం. దళిత, బహుజన, మైనారిటీ, ఆదివాసీ, స్త్రీవాద వగయిరా అణగారిన సమూహాలు   సాగించే ఉద్యమాలన్నీ విముక్తి పోరాటాలే; అవి సృష్టించే కళాసాహిత్యాలన్నీ విముక్తి సాహిత్యమే; టెక్నికల్ గా మార్క్సిస్టు సాహిత్యమే. 

మార్క్సిస్టు సాహిత్య సంఘాలు ఒక్కో చారిత్రక దశలో తమ నిర్ణిత కార్యక్రమాన్ని బట్టి ఒక్కో రకం సాహిత్య ప్రక్రియకో, ఒక్కో రకం సామాజిక అంశానికో అధిక ప్రధాన్యం యిస్తుంటాయి. అంత మాత్రాన ఇతర సాహిత్య ప్రక్రియలో, ఇతర సామాజిక అంశాలో అప్రధానమైనవి అయిపోవు. 

మార్క్సిస్టు దృక్పథం నుండి సౌందర్యశాస్త్రాన్ని అభివృధ్ధి చేసినవారి జాబితా చాలా పెద్దది. అనటోలి లూనచరస్కీ, జియోర్జీ ప్లెఖనొవ్, బెర్తొల్ట్ బ్రెక్ట్, ఆంటోనియో గ్రాంస్కీ, జియోర్జ్ లుకాక్స్ మొదలయినవారు వారిలో ప్రముఖులు. తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు మార్క్సిస్టు సాహిత్య విమర్శను సాహిత్యరంగంలో వర్గపోరాటం స్థాయికి తీసుకుని వెళ్ళారు. ఆసక్తివున్నవాళ్ళు వాళ్ళ గ్రంధాల్ని విస్తారంగా అధ్యయనం చేయాల్సే వుంటుంది.  ఔత్సాహికులు మాత్రం ముందుగా  కొన్ని మూల సూత్రాలను అయినా తెలుకోవడం ముఖ్యం. 

మార్క్సిస్టు సమాజ విమర్శ, సాహిత్య పరామర్శ ఎలాంటి మార్మికతకు తావియ్యకుండ  సూటిగా సరళంగా వుంటుంది.  ఇందులో మూడే మూడు మెట్లున్నాయి. 

మొదటి మొట్టుసమాజాన్ని వున్నది వున్నట్టు నిజాయితీగా చూపెట్టాలి. 

     సమాజంలో ఏ విభాగంలో అయినా  ఏ అంశాన్ని  తీసుకున్నా దాని యధాస్థితి కొందరికి ఆహ్లాదకరంగా ఉంటుంది మరికొందరికి అసహ్యకరంగా ఉంటుంది. కొందరికి ఇష్టంగా ఉంటుంది కొందరికి కష్టంగా ఉంటుంది. వివాహవ్యవస్థనే  తీసుకోండి. ప్రపంచ దేశాల్లోని దాంపత్య వ్యవస్థల్లో భారత దాంపత్య వ్యవస్థ మహా గొప్పది అనంటే మన దేశంలో పురుషులకు ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ, స్త్రీలకు దానికి విరుధ్ధమైన అనుభవాలు  వుండవచ్చు. వాళ్ళు పై అభిప్రాయాన్ని తప్పక ఖండిస్తారు. సమాజంలో సమతుల్యత కోసమే కులవ్యవస్థ వుందని అంటే యజమానికులాలకు ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ శ్రామిక కులాల అనుభవాలు అందుకు విరుధ్ధంగా వుండవచ్చు. వాళ్ళు పై అభిప్రాయాన్ని ఖండిస్తారు.  మరే దేశంలోకన్నా భారత దేశంలో మతసహనం పరిఢవిల్లుతోంది అనంటే మెజారిటీ మత సమూహాలకు ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ, మైనారిటీ మత సమూహాల అనుభవాలు అందుకు విరుధ్ధంగా వుండవచ్చు. వాళ్ళు పై అభిప్రాయాన్ని తప్పక ఖండిస్తారు. ప్రతి అంశంలోని రెండు విరుధ్ధ వాస్తవాలను సాహిత్యం నిజాయితీగా ప్రతిఫలించాలి. 

రెండో మెట్టుసమాజం ఇప్పుడు ఇట్లా  ఎందుకు వున్నదో వివరించాలి.

కళాసాహిత్యాలు కేవలం కొందరి  ఆహ్లాదాన్నీ, మరికొందరికి ఆవేదనను చిత్రిస్తే సరిపోదు. కొందరికి సౌకర్యం ఎలా దక్కిందో ఇతరులకు ఆ దుస్థితి ఎందుకు దాపురించిందో కూడ  వివరించాలి.  

 

మూడో మెట్టుసమాజంలోని అణగారిన సమూహాల జీవితాల్లో మార్పును  ఎలా  తేవచ్చో సూచించాలి.    

సమాజంలో సహజంగానే   వైవిధ్యాలు ఉంటాయి. వైరుధ్యాలు కూడ వుండవచ్చు శతృవైరుధ్యాలు వుండకూడదు. వాటిని తొలగిస్తే అణగారిన సమూహాల జీవితాల్లో మార్పు వచ్చి కొత్త సమాజం వారికి కూడ ఆహ్లాదకరంగా వుంటుంది.  మార్చడం అంటే వంద అర్ధాలు వుండవు; ఒక్కటే అర్ధం వుంటుంది; పీడితుల మీద అణిచివేతను తొలగించడమే. అణిచివేతను తొలగించేపని శాంతియుతంగా జరుగుతుందా? పెద్ద ఘర్షణతో జరుగుతుందా? అనేది సందర్భాన్ని బట్టి ఆధారపడివుంటుంది. 

        మార్క్సిస్టు రచయితలు వస్తువుకు ప్రాధాన్యం ఇచ్చి   శిల్పాన్ని నిర్లక్ష్యం చేస్తారనే  అపోహ ఒకటుంది. వస్తుశిల్పాలు విడిగా ఉంటయనేదే  ఒక తప్పుడు అవగహన. శిల్పంలేని వ్యక్తీకరణే ఉండదు. అయితే, మార్క్సిస్టులు వస్తువు మీద  ధ్యాస పెడతారు అనేది వాస్తవం. సాహిత్యానికి సామాజిక కోణాన్ని నిర్ణయించేది వస్తువే. సాహిత్యానికి సామాజిక కోణం ఉండకూడదనేవాళ్ళు అతి తెలివిగా మార్క్సిస్టు సాహిత్యంలో శిల్పం ఉండదని ఆరోపిస్తుంటారు. ఇలా ఆరోపించేవారికి కూడ వస్తువు ఉంటుంది; అది యధాస్థితిని కాపాడడం. వాళ్ళు నేరుగా ఆ ముక్క చెప్పారు; దాన్ని దాటవేస్తారు లేదా హాస్యాన్నో వినోదాన్నో ఆశ్రయిస్తారు. ఇక శిల్పం విషయానికి వస్తే అద్భుత శిల్పాన్ని సృస్థించిన మార్క్సిస్టు రచయితలు అనేకులు కనిపిస్తారు. జాక్ లండన్ రచనల్లో మనవపాత్రల్ని మించిన ప్రధాన పాత్రగా ప్రకృతి ఉంటుంది. తెలుగులో రావి శాస్త్రిని మించిన శిల్పం ఎవరికుంది? 

కళాసాహిత్యాలు కాల్పానికంగా మాత్రమే వుండాలిగానీ వాస్తవికతతో వాటికేం పనీ? అనే వాళ్ళని అలా వుండనివ్వండి!. సమాజాన్ని వున్నదున్నట్టు చిత్రించాలి అనే మార్క్సిస్టు సాహిత్య ఆదేశంతో మార్క్సిస్టేతరులకు కూడా పెద్దగా అభ్యంతంరం వుండకపోవచ్చు. అయితే, సమాజం  అలా ఎందుకు వున్నదో వివరించాలనే విషయంలో తగవు వుంటుంది. కవులు, రచయితలు భావుకులుగా వుండాలే తప్ప శాస్త్రపరిశోధకుల్లా వుండరాదనే గడుసరి వాదంతో వాళ్ళు సామాజిక వాస్తవిక వాదాన్ని ఎదుర్కొంటారు. ఇక సమాజాన్ని మార్చాలనే విషయంలో మాత్రం రెండు రకాల సాహిత్యాల మధ్య తగువు తీవ్రంగా వుంటుంది. సమాజాన్ని మార్చడానికీ, మార్చమని ఆదేశించడానికి కవులు, రచయితలు  ఉపదేశకులా? నియంతలా? అని వాళ్లు విరుచుకుపడతారు. సమాజంలో మార్పును అడ్డుకోవడానికి వాళ్ళు కొంచెం గట్టిగానే నడుంబిగిస్తారు. ఇలాంటి సందర్భాల్లోనే సాహిత్య సాంస్కృతిక రంగాల్లో  వర్గపోరాటం అవసరం అవుతుంది. 

ఇతరుల వాదాలు ఎన్నివున్నా ఎలా వున్నా సమాజంలో అణగారిన సమూహాల జీవితాలను మెరుగ్గా మార్చడమే మార్క్సిస్టు కళా సాహిత్యాల  లక్ష్యం. కార్ల్ మార్క్స్ చనిపోయినపుడు ఆయన సమాధి వద్ద ఒక కొటేషన్ రాయాల్సి వచ్చింది. మార్క్స్ జీవిత కాలంలో అనేక గ్రంధాలు ప్రచురించాడు; కొన్ని లక్షల  వాక్యాలు రాశాడు.  వాటన్నింటి నుండి ఆయన భావాల్ని ప్రతిఫలించే ఒక వాక్యాన్ని ఏంగిల్స్ ఎంపిక చేశాడు. ఆ వాక్యం ఏమంటే: “తత్త్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా  వాఖ్యానించడంతో సరిపెట్టారు; నిజానికి చెయ్యాల్సిందేమంటే ప్రపంచాన్ని మార్చడం” (“The philosophers have only interpreted the world, in various ways. The point, however, is to change it.). సమాజాన్నిమార్చడమే మార్క్సిస్టు సాహిత్య లక్ష్యం.

 (రచయిత ఖదీర్ బాబు ఆధ్వర్యంలో  షామీర్ పేట్ ల్యాండ్ ఆఫ్ లవ్ (LOL)లో 2022 నవంబరు 25,26 తేదీల్లో జరిగిన రైటర్స్ మీట్ లో చేసిన ప్రసంగం ఆధారంగా)

 ఉషా యస్ డానీ

9010757776

 ప్రచురణ : అక్షరం పేజి, ప్రజాశక్తి, 23 జనవరి 2023

 https://epaper.prajasakti.com/view/?date=2023-01-23&edition=1&pg_no=4=4

Monday 23 January 2023

ప్రజలు ఎంతో ఆశగా కమ్యూనిజాన్ని కోరుకుంటున్నారు!

 ప్రజలు ఎంతో ఆశగా కమ్యూనిజాన్ని కోరుకుంటున్నారు!

కమ్యూనిస్టు పార్టీలు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాయి!   


ప్రజలు ఎంతో ఆశగా కమ్యూనిజాన్ని కోరుకుంటున్నారు!

కమ్యూనిస్టు పార్టీలు ఎంతో అజ్ఞానంలో కూరుకుపోతున్నాయి!  

 

వర్తమాన ప్రపంచం చాలా కొద్ది మందికి మాత్రమే ఆహ్లాదకరంగా ఉంటుంది.  అత్యధికులకు భరించశక్యంగా ఉండదు. ఈ  సమూహాలన్నీ అనేక రకాల  దోపిడీకి, అణిచివేతలకు గురవుతుంటాయి. కొందరు ఆర్ధిక  అణిచివేతకు మరికొందరు సాంస్కృతిక  అణిచివేతకు, ఇంకొందరు భాష అణిచివేతకు, ఇంకొందరు ప్రాంత అణిచివేతకు, లింగ అణిచివేతకు, తెగ అణిచివేతకు, మత అణిచివేతకు ఇంకా అనేక రకాల అణిచివేతలకు గురవుతుంటారు. 

వీరి మీద సాగే దోపిడి, అణిచివేతలు ఒకటే కాకపోవడంవల్ల  వీళ్ళందరూ  విడివిడిగా జీవిస్తుంటారు.  కొన్ని సందర్భాలలో పరస్పర విరుద్ధం గాను, ప్రత్యర్ధులుగాను కొనసాగుతుంటారు.  వీరి మీద సాగే దోపిడి, అణిచివేత రూపాలు వేరయినా వీరందరూ బాధిత సమూహాలు. అదే వీరి ఐక్యతకు సామాజిక పునాది.  దోపిడీ అణిచివేతలకు  బాధితులు కనుక వీరందరూ   దోపిడీ అణిచివేతలకు వ్యతిరేకంగా ఒక సమతా సమాజాన్ని కోరుకుంటారు.  అదే వీరి ఐక్యతకు బౌధ్ధిక  పునాది.  వీళ్లకు కార్ల్ మార్క్స్ తెలియకపోవచ్చూ, కమ్యూనిజం గురించి తెలియకపోవచ్చూ  అలాంటి గ్రంధాలూ చదివి వుండకపోవచ్చూ. అయినప్పటికీ వీళ్లు సమతావాదులు. వీళ్లు సమాజసిధ్ద సహజసిధ్ద సామ్యవాదులు. ఆర్గానిక్ కమ్యూనిస్టులు. 

మనది బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కనుక  ఆర్గానిక్ కమ్యూనిస్టులు అందరూ ఒకే రాజకీయ పార్టీకి అభిమానులుగా  ఉండకపోవచ్చూ. వాళ్ళందరూ తమ ఆసక్తి సందర్భాలనుబట్టి అనేక రాజకీయ పార్టీలకు అభిమానులుగా మారవచ్చూ. వీళ్ళందరినీ ఉత్తేజ పరచి తన వైపుకు ఆకర్షించడం కమ్యూనిస్టు పార్టీకి చారిత్రక బాధ్యత.  కానీ అందుకు విరుధ్దంగా జరుగుతోంది. ఆర్ధిక దోపిడీని  మాత్రమే గుర్తించడంతో ముందు ఎస్టీ, ఎస్సి, బిసి,  మైనారిటీలు, స్త్రీలలో  ఎక్కువభాగం కమ్యూనిస్టు పార్టీలకు దూరమయ్యాయి.  మిగిలిన  కొద్దిపాటి యజమాని కులాలు, కార్మిక  సమూహాలు సహితం కమ్యూనిస్టు పార్టీలను వదిలేస్తున్నాయి.   

భారత కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించినవారు గొప్ప  ఉన్నతులు. బాగా చదువుకున్న వారు. కుటుంబాలను, ఆస్తుల్ని వదులుకున్నవారు. దాంపత్య సుఖాన్ని సహితం  త్యాగం చేసిన వారు. జైళ్లకు వెళ్లారు. చివరకు ఆత్మబలిదానానికి కూడా సిధ్ధాపడ్డవాళ్లు.  ముజప్ఫర్   అహ్మద్ , చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎస్ ఏ డాంగే, బిటి రానాదివే, ఐఎంఎస్ నంబూద్రిపాద్, ముగ్ధుమ్ మొహియుద్దీన్, చారు  మజుందార్,  చండ్ర పుల్లారెడ్డి,  తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వర రావు, కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్య మూర్తి ఇంకా లేఖ్ఖలేనన్ని పేర్లు ఐ జాబితాలో ఉంటాయి.    

అయితే, భారత సమాజ నిర్దిష్ట వాస్తవిక స్వభావానికి సరిపడా విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడంలో  మాత్రం   భారత  కమ్యూనిస్టు పార్టీలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి.  ఒక ఉత్తేజాన్ని రేకెత్తించి ఒక నమ్మకాన్ని కలిగించి   సమూహాలు సమూహాలుగా అణగారిన వర్గాల్ని కదిలించే  విప్లవ కార్యక్రమం ఇప్పటికి ఏ కమ్యూనిస్టు పార్టీ దగ్గరాలేదు

పది కారణాలు పేర్కొనవచ్చు 

మొదటిది;  

భారత  కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించినవారు రష్యా విప్లవ నాయకుడు వి ఐ లెనిన్ ను, చైనా  విప్లవ నాయకుడు మావో సేటుంగ్స్ ను అతిగా నమ్మారు.  

రెండోది; లెనిన్ గానీ, మావో గానీ గొప్ప సృజనశీలురు. వాళ్ళు మార్క్స్   -ఏంగిల్స్ చెప్పిన      మూల  సూత్రాలను పాటిస్తూనే, తమ దేశాల నిర్దిష్ట సామజిక చారిత్రక పరిస్థితులకు అనువుగా సృజనాత్మకంగా భిన్నమైన విప్లవ కార్యక్రమాలను రూపొందించుకున్నారు. విజయాలు సాధించారు. అలాంటి  సృజనాత్మకత భారత కమ్యూనిస్టు నాయకులకు ఏ దశలోనూ ఏ మాత్రం లేదు. 

రెండోది; 

లెనిన్, మావో ఇద్దరూ  గొప్ప సృజనశీలురు. వాళ్ళు మార్క్స్   - ఏంగిల్స్ చెప్పిన      మూల  సూత్రాలను పాటిస్తూనే, తమ దేశాల నిర్దిష్ట సామజిక చారిత్రక పరిస్థితులకు అనువుగా సృజనాత్మకంగా భిన్నమైన విప్లవ కార్యక్రమాలను రూపొందించుకున్నారు. విజయాలు సాధించారు. అలాంటి  సృజనాత్మకత భారత కమ్యూనిస్టు నాయకులకు ఏ దశలోనూ ఏ మాత్రం లేదు.  

మూడవది :

సృజనాత్మకత లేకపోవడంవల్ల భారత కమ్యూనిస్టు పార్టీలు మొదటి నుండి రష్యా, చైనాల తోకపట్టుకుని నడవడానికి  అలవాటు పడిపోయాయి.   తొలిదశలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ద గ్రేట్ బ్రిటన్ జనరల్ సెక్రటరీ రజని పామే దత్త్ అడుగుజాడల్లో నడిచారు.  అయన కార్యక్షేత్రం  గ్రేట్ బ్రిటన్. భారతదేశంలో అప్పుడు బ్రిటిష్ వలస పాలన  నడుస్తోంది. ఇంగ్లండ్ కమ్యూనిస్టు పార్టీని విమర్శనాత్మకంగా చుడాలనే ఇంగితం మనోళ్లకు లేకపోయింది.  రెండవ ప్రపంచ యుద్ధకాలంలో  అక్షరాజ్యాలయిన జర్మనీ, ఇటలీ, జపాన్ కూటమికి వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్లు మరో కూటమిగా మారాయి. అంతర్జాతీయ వేదిక మీద రష్యాకు ఇంగ్లండ్ మిత్రదేశం ఉంటున్నది   గాబట్టి అప్పట్లో బ్రిటిష్ -ఇండియాలో సాగుతున్న క్విట్ ఇండియా ఉద్యమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకించింది. జర్మనీ జపాన్ ల మద్దతు కోరిన సుభాష్ కేంద్ర   బోస్ ను విమర్షించిందీ.    అంతర్జాతీయ మార్గదర్శకత్వంలో సిపిఐ (ఎం) చైనా మార్గాన్ని ఎంచుకొంది. చారు మజుందార్ నాయకత్వంలో ఏర్పడిన సిపిఐ (ఎంఎల్) ఏకంగా "చైనా చైర్మన్ మన చైర్మన్" అని ప్రకటించి మూఢభక్తిని ప్రకటించుకుంది. ౨౦౦౪లో అప్పటి పీపుల్స్  వార్ తనను తాను రద్దు చేసుకుని మావోయిస్టు పార్టీగా మారిపోయింది. నక్సల్బరీ ఉద్యమానికి చైనా  కమ్యూనిస్టు పార్టీ చేసిన ఉపకారం ఒక్కటే; తమ పార్టీ అధికార పత్రికలో  'వసంత మేఘగర్జన (Spring థండర్) శీర్షికన ఒక వ్యాసం రాయడం. ౧౯౫౧ లో రష్యా వెళ్లిన సిపిఐ నాయకులకులతో స్టాలిన్స్ కాస్సేపు కూర్చొని   మాట్లాడాడు. ౧౯౭౦లలో చైనా వెళ్లిన  సిపిఐ (ఎంఎల్) ప్రతినిధి బృందానికి మావో కనీసం ఇంటర్  వ్యూ కూడా ఇవ్వలేదు.  చైనా మీద జపాన్ దురాక్రమణకు పాల్పడినప్పుడు జాతీయ ప్రభుత్వంతో   ఐక్యసంఘటన కట్టి, ఒకవైపు  దేశంలో జాతీయనాయకునిగా పేరుగాంచి మరోవైపు కమ్యూనిస్టు పార్టీని బలపరచి విప్లవ దిశగా నడిపిన నాయకుడు మావో.  మన దేశం మీద దాడి చేసిన చైనాను సమర్ధించి రెండు విధాలా నష్టపోయింది సిపిఐ (ఎం). ౧౯౯౧లో తూర్పు యూరోప్ - రష్యా పతనమయ్యేమాట వరకు ఆ దేశాల్లో మారిన  పరిణామాల గురించి సిపిఐ ఎన్నడూ మాట్లాడలేదు. అసలు ౧౯౧౭లో రష్యాలో గానీ, ౧౯౪౯లో చైనాలో గానీ జరిగింది సోషలిస్టు విప్లవం కాదనే స్పృహ కూడా మన కమ్యూనిస్టు పార్టీలకు లేదు.   ఆనాటి ఛైనా సామాజికార్ధిక పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని  ౧౯౪౦లలో మావో 'నూతన ప్రజాస్వామిక విప్లవం' కార్యక్రమాన్ని రూపొందించాడు. పెట్టుబడిదారులు భూస్వామ్య వ్యవస్థను కూలదోసి తమకు అనుకూలమైన పార్లమెంటరీ వ్యవస్థను నిర్మించడాన్ని 'ప్రజాస్వామిక విప్లవం'  అంటారు. అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశాల్లో  'ప్రజాస్వామిక విప్లవాన్ని' చేపట్టడానికి  పెట్టుబడిదారులు సిదధంగా లేనప్పుడు కమ్యూనిస్టు పార్టీయే  పూనుకొని   విజయవంతం చేసే 'ప్రజాస్వామిక విప్లవాన్నే  'నూతన ప్రజాస్వామిక విప్లవం' అంటారు. ఇదేమి సోషలిస్టు విప్లవం కాదు. సోషలిస్టు విప్లవానికి పూర్వ దశ విప్లవం అన్నమాట. తమను ఎవరు అనుకరించరాదని, ప్రతి అర్ధవలస దేశం తమ సామాజిక భౌతిక స్థితిగతుల్ని బట్టి స్వంతంగా   ప్రజాస్వామిక విప్లవాన్ని రూపొందించుకోవాలని మావో చాలా స్పష్టంగా చెప్పాడు. తనను కలిసిన భారత కమ్యూనిస్టు బృందంతో ఆనాడు స్టాలిన్ కూడా ఇలాంటి హెచ్చరికే చేశాడు. స్వంతంగా భారత నూతన ప్రజాస్వామిక  విప్లవ  కార్యక్రమాన్ని రూపొందించే సాహసాన్ని భారత కమ్యూనిస్టు నాయకుల్లో ఏ ఒక్కరు చేయలేదు. పాత కమ్యూనిష్టులు ఘనంగా చెప్పుకునే 'ఆంధ్రా థీసిస్' గానీ,  సిపిఐ (ఎం) చెప్పే   జనతా ప్రజాతంత్ర విప్లవం గానీ సిపిఐ (ఎంఎల్ ), మావోయిస్టు పార్టీలు  చెప్పే   'నూతన ప్రజాస్వామిక విప్లవం' గానీ అన్ని  ౧౯౪౦ల నాటి మావో పుస్తకానికి నాకాళ్లే .  వీటిల్లో వీళ్ళందరూ మహా అయితే ఒకటి రెండు వాక్యాలు అదనంగా చేర్చి ఉంటారు.  ౮౦ ఎల్లా క్రితపు ఒక దేశపు కార్యక్రమం ఇప్పటికి మనకు పనికి వస్తుందనుకోవడం చారిత్రక bhwtika   వాదానికి వ్యతిరేకం.    


నాలుగవది: 

అతివాద మితవాదాలు కూడ కమ్యూనిస్టు పార్టీలు చేసిన తప్పిదాల్లో కీలకమైనవి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిజాం సర్కారు ఏమాత్రం  అణిచివేసిందోగాని   నెహ్రు-పటేల్ కాంగ్రెస్   సైన్యం అంతకు వంద రెట్లు ఎక్కువగా ఆ పోరాటంలో  కమ్యూనిస్టుల్ని చంపేసింది.  అయినా కాంగ్రెస్ ను అతిగా నమ్మిన సిపిఐ  ఎమర్జెన్సీ రోజులో ఆ పార్టీ పక్షాన  నిలిచింది.  అదే సమయంలో కాంగ్రెస్ ను అతిగా ద్వేషించిన సిపిఐ (ఎం)  పాలిట్  బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు జనసంఘ్ తో  అపవిత్ర అనుబంధాన్ని కొనసాగించారు.  ఇది ఆరెస్సెస్ కు అప్పటి అనుబంధ రాజకీయ సంస్థ; ఇప్పటి బిజెపికి పూర్వ రూపం.   బిజెపి నాయకత్వంలోని ఆరేళ్ళ  ఎండిఏ పాలన తరువాత ౨౦౦౪లో కేంద్రంలో వామపక్షాల మద్దతుతో  సెంట్రిస్టు  కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ)  ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి పరిస్థితుల్లో అదొక మంచి రాజకీయ ప్రయత్నం. ప్రజలు కూడ మంచి జరుగుతున్నదనే ఆశలో వున్నారు. అమెరికాతో ఇండియా అణుఒప్పందం చేసుకుంటునప్పుడు  వామపక్షాలు తమ నిరసన తెలిపితే సరిపోయేది. అవి  అతిగా అలిగి ఏకంగా యుపిఎ నుండి బయటికి వచ్చేశాయి. ఇదొక చారిత్రక తప్పిదం. ఆ పిదప ఒకవైపు యుపిఎ నైతికగా  పతనం అయింది. మరో వైపు వామపక్షాల బలం కూడ పతన దిశగా సాగింది.  మధ్యలో బిజెపి భారీగా పుంజుకుని మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 

ఐదవది :

ఎస్టీ, ఎస్సి, బిసి, మైనారిటీలు, స్త్రీలు  దాదాపు ౮౫ శాతం  ఉన్న  దేశం మనది. అనేక పద్ధతుల్లో  అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న శ్రేణులు ఇవి. కార్మికవర్గంలోనూ వీరి శాతం చాలా ఎక్కువ.   ఐ    శ్రేణుల ప్రత్యేక అస్తిత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని, వీరిమీద   సాగుతున్న ప్రత్యేక దోపిడీ పీడనల్ని కమ్యూనిస్టు పార్టీలు ఎన్నడూ సీరియస్ గా  పట్టించుకోలేదు. పార్లమెంటరీ ఎన్నికల్లో  రాజ్యాధికారాన్ని చేపట్టి  ఆర్ధిక సమానత్వాన్ని  సాధిస్తే సాంస్కృతిక సమానత్వం దానికదే వస్తుందనే ఒక కంటితుడుపు మాటలు మాత్రమే అనేవారు.  దాదాపు ౬౦-౭౦  సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీలను  నమ్ముకున్న ఎస్టీ, ఎస్సి, బిసి, మైనారిటీలు, స్త్రీలు  ౧౯౮౦వ దశకం తరువాత ప్రత్యామ్నాయాలు వెతకడం మొదలెట్టారు. కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం ఐ అణగారిన సమూహాల ఆవేదనను అర్ధం చేసుకోకపోగా వాళ్ళు వదిలి వెళ్లిపోవడం వల్లనే దేశంలో కమ్యూనిస్టు    ఉద్యమాలు బలహీనపడిపోయాయనే ఎదురు నిందను మోపారు. వర్గం మన దేశంలో కులం, మతం, తెగ, లింగం తదితర రూపాల్లో ఆపరేట్ అవుతున్నదనే ఆలోచనే కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఎన్నడూ రాలేదు. ఇవికాక మిగిలిన ౧౫ శాతం యజమాని సామాజిక వర్గాల   సెంటిమెంట్ దెబ్బతింటుందనే భయం  వాళ్ళను వెంటాడింది. ఆ ౧౫ శాతం కూడ తమ ప్రత్యామ్నాయాల్ని ఎంచుకుంది.    


ఆరవది: 

కమ్యూనిస్టు పార్టీల నాయకుల మూలంగా ప్రపంచా వ్యాప్తంగా కమ్యూనిజానికి ఆమోదాశం తగ్గుతున్నది గమనించిన ప్రపంచ బ్యాంక్ ౧౯౮౪లో ఒక్కసారిగా విజృంభించి  ముప్పేట దాడి సాగించింది.  ఒకవైపు ఫైనాన్స్  తోటి, మరోవైపు సంస్కృతీ తోటి అణగారిన సమూహాల మీద దాడి మొదలెట్టింది.  పెట్టుబడిదారీ వ్యవస్థ తన ప్రయోజనాల కోసం మతాన్ని ఆశ్రయిస్తుందనేది  సాంప్రదాయ కమ్యూనిస్టుల   ఊహకు కూడ అందని విషయం. మూడోవైపు,  ఐటి విప్లవాన్ని ప్రవేశపెట్టింది. కార్ల్స్ మార్క్స్ పెట్టుబడిదారీ విధానం పుట్టుక పెరుగుదలల్ని వివరించాడు. లెనిన్ పెట్టుబడిదారీ విధానం అత్యున్న దశగా సామ్రాజ్యవాద యుగాన్ని వివరించాడు. సామ్రాజ్యవాద దశలో ఒక భూస్వామ్య దేశంలో పెట్టుబడిదారీ (ప్రజాస్వామిక) విప్లవాన్ని ఎలా పూర్తి చేయవచ్చొ మావో చుపించాడు. కానీ, పెట్టుబడిదారీ వ్యవస్థ మతాన్ని కవచంగా ధరించి కార్మికుల్ని చీల్చేసి అణిచివేస్తున్నపుడు కమ్యూనిస్టు పార్టీలకు దరి చూపడానికి అంతర్జాతీయ మార్గదర్శి లేకుండాపోయాడు. జీవిత కాలమంతా ఇతరుల్ని అనుకరిస్తూ గడిపేసిన భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులకు దారీతెన్నూ కనిపించలేదు. కొత్తగా వఛ్చిన ఐటి విప్లవం వాళ్ళను మరి ఉక్కిరిబిక్కిరి చేసేసింది.    

ఏడవది :

కమ్యూనిస్టులు వేరు
కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వేరు

అవసరమైనవాళ్ల ద్వార కాకుండా  అవసరం లేనివాళ్ల ద్వార
భారత దేశంలోనికి కమ్యూనిజం  వచ్చింది.

కమ్యూనిజం అవసరమైనవాళ్ళు
దాన్ని  స్థానిక అవసరాలకు అనువుగా
సృజనాత్మకంగా అన్వయిస్తారు

కమ్యునిజం అవసరంలేనివాళ్ళు
అతివాదం పేరుతో
కమ్యూనిజాన్ని జడపదార్ధంగా మారుస్తారు


అణగారిన వర్గాల మధ్య అనేక వైరుధ్యాలున్నమాట వాస్తవం. అయినప్పటికీ అణగారినతనం వాళ్లను ఏకం చేస్తుంది. కలిసిపోరాడడం నేర్పుతుంది. ఐక్యత సందర్భం అయినప్పుడు వైరుధ్యాల గురించి మాట్లాడేవాడు మూర్ఖుడు.


ఎనిమిదవది :

తొమ్మిదవది :


పడవది  :  

భారత దేశంలో ఒక రాజకీయ విషాదం ఉంది. మన సమాజం ఆహ్లాదకరంగా ఉందని భావించే సమూహాలు వందేళ్లలో వంద సంస్థలుగా విస్తరించగా,  భారత కమ్యూనిస్టు పార్టీ  వంద ముక్కలుగా చీలిపోయింది.  కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఎన్నడూ విప్లవ కార్యక్రమాన్ని అడగరు. వాళ్ళు ఎప్పుడు పార్టీ అగ్రనాయకుడ్ని నమ్ముతారు.  పార్టీలు చీలిపోయినప్పుడు నాయకత్వం మీద అభిమానము, నమ్మకమే ప్రాతిపదికగా ఉంటుంది. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి ఏ సిద్ధాంత ప్రాతిపదిక మీద చీలిపోయారని అడిగితె వివరం చెప్పేవాళ్ళు దొరకడం కష్టం. "'దున్నేవానికే  భూమి' ప్రాతిపదికగా సాగే  వ్యవసాయిక విప్లవం ఇరుసుగా గల నూతన ప్రజాస్వామిక  విప్లవం"  వర్ధిల్లాలి, "పల్లెపట్టు పైరగాలి పట్టణాల చుట్టును; భూతాలకు ప్రేతాలకు గోరీలే కట్టును" అంటుంటే     ౧౯౭౦-౮౦ లలో వీధులు దద్దరిల్లేవి. అలా  నినదించిన వారిలో పది శాతము మందికి కూడా adelA జరుగుతుందో తెలీదు. యాభయ్ ఏళ్ళ తరువాత కూడా ఆ పార్టీల కార్యక్రమాలు మారలేదు; అప్పుడప్పుడు తక్షణ పరిణామాల మీద  కొన్ని అనుబంధ తీర్మానాలు తప్ప     

Saturday 21 January 2023

Muslim society better not to insist for polygamy

For Publication in the Edit page of Andhrajyothi daily.

 Muslim society better not to insist for polygamy

 బహుభార్యత్వం కోసం  ముస్లిం సమాజం

పట్టుబట్టక పోవడమే మంచిది

 

దివ్య ఖురాన్ లో ‘మహిళలు’ శీర్షికతో ఒక సూరా వుంది. ఆ సూరా పేరు ‘అన్ నిసా’. ఖురాన్ లో ఇది నాలుగవ సూరా. బానిసలు, అనాధలు, నిరుపేదలు, నిరాశ్రయులు, వితంతువులు అయిన స్త్రీలను ఆదుకోవడంలో భాగంగానూ,  సమాజంలో వారికి ఒక గౌరవనీయమైన స్థానం ఇవ్వడం కోసమూ  వాళ్ళను వివాహం చేసుకోవడం కూడ ఒక పరిష్కార మార్గమనే ఒక సూచన ఈ సూరాలో వుంది.


ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మందిని వివాహం చేసుకున్న సంఘటనలు మనకు అబ్రహామిక్ మతాలయిన యూదు, క్రైస్తవ, ఇస్లాంల  పవిత్ర గ్రంధాల్లోనేగాక ఇతర మత గ్రంధాలలోనూ కనిపిస్తాయి. దానికి అనేక సమర్ధనలు కూడ ఆ గ్రంధాల్లో వుంటాయి.

 

పురాణాల ప్రకారం హిందూ సమాజంలోనూ బహుభార్యత్త్వానికి అవకాశంవుంది. మధ్యయుగాల్లోనూ  బహు భార్యలు కలిగిన హిందూ రాజులు అనేకమంది మనకు కనిపిస్తారు. కానీ, వర్తమాన హిందూ సమాజం ఆ సాంప్రదాయాన్ని అధికారికంగా వదులుకుంది. అయితే, అనధికారికంగా బహుభార్యత్త్వాన్ని పాటిస్తున్నవారు హిందూ సమాజంలో మనకు అనేక మంది తారసపడుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అనధికార రెండవ భార్య వ్యవస్థను ఇప్పటికీ చూడవచ్చు. వర్తమాన భారత ముస్లిం సమాజంలోకన్నా హిందూ సమాజంలోనే బహుభార్యత్త్వం ఎక్కువ సంఖ్యలో వుందని కొన్ని సామాజిక పరిశోధనల గణాంకాలు చెపుతున్నాయి.

గత ఏడాది జులై నెలలో జాతీయ కుటుంబ- ఆరోగ్య సర్వే (NFHS) ప్రకటించిన నివేదిక ప్రకారం ముస్లింలు, హిందువులకన్నా క్రైస్తవుల్లో బహుభార్యత్త్వం ఎక్కువ శాతం వుందట. ఆదివాసీ తెగల్లో ఒక సాంప్రదాయంగా బహుభార్యత్త్వం వుండడం,  ఈశాన్య రాష్ట్రాల్లోని ఆదివాసుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు కావడం దీనికి కారణమని ఆ సర్వే నివేదిక పేర్కొంది.

ముస్లిం సమాజంలో బహుభార్యత్త్వానికి కొన్ని షరతులతో ధార్మిక సమర్ధన వుంది కానీ దాన్ని పాటిస్తున్న వాళ్ళు చాలా చాలా తక్కువ. హిందూ సమాజం బహుభార్యత్త్వాన్ని త్వజించింది కానీ దాన్ని ఇప్పటికీ పాటిస్తున్నవాళ్లు ముస్లీంలకన్నా ఎక్కువ. మరోమాటల్లో చెప్పాలంటే ముస్లిం సమాజం బాహాటంగా చేస్తున్నదాన్ని హిందూ సమాజం చాటుగా చేస్తున్నది. కొన్ని గ్రామాల్లో ‘వుంపుడుగత్తెల’ (స్త్రీవాదులు క్షమించుగాక!) సమూహాలు ఇప్పటికీ బాహాటంగానే  కనిపిస్తాయి.

 

బహుభార్యత్త్వం కూడ విడాకుల వివాదం లాంటిది. దేశంలో ముస్లిం సమాజంలో కన్నా హిందూ సమాజంలో విడాకులు పొందిన స్త్రీలు చాలా ఎక్కువ. కానీ ముస్లిం పురుషులు చాలా సులువుగా విడాకులు ఇచ్చేస్తారనే సాధారణ అభిప్రాయమే సమాజంలో బలంగా వుంది. వివాహ వయస్సు విషయంలోనూ ఇలాంటి అపోహలే వున్నాయి. సిపాయిల తిరుగుబాటుకు పదేళ్లు ముందు వివాహానికి కనీస వయస్సును పదేళ్ళుగా నిర్ణయిస్తూ చట్టం వచ్చింది. అంటే అంతకు ముందు అంతకన్నా తక్కువ వయస్సున్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. ఇది కేవలం ముస్లింల సాంప్రదాయంకాదు; బ్రిటీష్ ఇండియాలో అందరి సాంప్రదాయం. కానీ ముస్లింలు మాత్రమే అతి పిన్న వయస్సులో ఆడపిల్లలకు పెళ్ళి చేస్తారనే అభిప్రాయం ఇతర సమాజాల్లో బలంగా నాటుకుంది.

భారత ముస్లింలు అంతర్ముఖులుగావున్నా, మౌన ప్రేక్షకులుగా వుండిపోతున్నాసరే సహించలేని సమూహాలు ప్రస్తుతం అధికారంలో వున్నాయి. అవి తరచూ ముస్లింలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడాన్ని మనం గత దశాబ్ద కాలంగా చూస్తున్నాం. ఇతర సమాజాల ముందు ముస్లింలను అనాగరికులుగా చిత్రించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ముస్లిం సమాజాన్ని వేధిస్తే  మరో సమాజం ఆనందిస్తే అది ఎన్నికల్లో ఓట్లుగా మారి వరుస విజయాలను  సమకూరుస్తుందనే రాజకీయ వ్యూహం ఒకటి దేశవ్యాప్తంగా అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలే ఈ రకం వ్యూహాలను రచిస్తున్నప్పుడు ఇక వారి అభిమానులైన అల్లరి మూకలు ఊరుకుంటాయా? ఈ మూకలు ఏం చేసినా వాళ్ళకు సత్కారాలుంటాయి; పదోన్నతులు దక్కుతాయి; శిక్షలు మాత్రం వుండవు. టోటల్ లీగల్ ఇంప్యూనిటి!

దేశంలో ట్రిపుల్ తలాక్ వివాదం సాగుతున్న రోజుల్లోనే సంఘీయులు కొందరు ‘బహుభార్యత్త్వం’, ‘నిఖా హలాలా’ల మీద కొత్త వివాదాన్ని రేపారు. ఈ రెండు సాంప్రదాయాలు రాజ్యంగబధ్ధమో, చట్టబధ్ధమో తేల్చాలంటూ 2018 జులైలో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సహా పలువురు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (PIL) వేశారు.  ఈ వివాదాన్ని తేల్చడానికి సుప్రీంకోర్టు జస్టిస్ ఇందిరా బెనర్జీ, హేమంత్ గుప్తా, సూర్యకాంత్, ఎంఎం సుంద్రేష్, సుధాన్షు ధులియాలతో  ఐదుగురు - జడ్జీల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం గత ఆగస్టు 30న జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC), జాతీయ మహిళా కమీషన్ (NCW), జాతీయ మైనారిటీస్ కమీషన్ (NCM) లను ప్రతివాదులుగా చేర్చి ఈ అంశం మీద వాళ్ళ అభిప్రాయాలను కోరింది.  జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తా మూడు నెలల క్రితం పదవీ విరమణ చేయడంతో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. ఐదుగురు – జడ్జీలతో కొత్తగా  రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం జనవరి 20న ప్రకటించింది.

ఈ సందర్భంగా మనం ఆధునిక కాలంలో పౌరస్మృతి చరిత్రను ఒకసారి మననం చేసుకోవాలి. దేశంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలయిన కొత్తలోనే వలస పాలకులకు ఒక విషయం  స్పష్టంగా బోధపడింది. తమ పౌరస్మృతి భారతదేశ సంస్కృతికి పొసగదనీ, బ్రిటీష్ పౌరస్మృతిని వలస దేశంలో బలవంతగా అమలు చేస్తే తిరుగుబాట్లు చెలరేగుతాయనీ వాళ్లు గుర్తించారు. తమ తమ పౌరస్మృతుల్ని ప్రకటించాల్సిందిగా ముస్లిం, హిందూ ధార్మిక ప్రతినిధుల్ని కోరారు. ముస్లింలు ఖురాన్-హదీసుల్ని, హిందువులు మనుస్మృతిని తమ పౌరస్మృతులుగా పేర్కొన్నారు. వాటిని ఆమోదిస్తూ 1772 ఆగస్టు 15న అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ ఉత్తర్వులు జారీచేశాడు. అప్పటి నుండి మనుస్మృతి, ఖురాన్-హదీసులు హిందూ, ముస్లింల అధికార పౌరస్మృతులుగా కొనసాగాయి.

స్వాంతంత్ర్యం వచ్చాక, దేశవాసులందరికీ “న్యాయమూ, స్వేఛ్ఛ, సమానత్వము, సోదరభావం”లను హామీ ఇచ్చిన భారత రాజ్యాంగం 1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆమోదాన్ని పొందింది. 1950 జనవరి 26 నుండి  అమల్లోనికి వచ్చింది. మనుస్మృతిని తొలగించి ఆ స్థానాన్ని కబళించిందని భారత రాజ్యాంగాన్ని ఆనాడు తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాలే ఇప్పుడు బహుభార్యత్త్వం, నిఖా హలాలాలకు రాజ్యాంగ ఆమోదం వుందోలేదో  తేల్చాలని వాజ్యం వేశాయి. తంపులమారితనం మన సాంస్కృతిక జీవితంలో భాగం అయిపోయింది.

 

రేపు ఏర్పడబోయే ఐదుగురు జడ్జీల రాజ్యంగ ధర్మాసనం అంతిమంగా ఎలాంటి తీర్పు చెపుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం. అత్యున్నత న్యాయస్థానపు అత్యున్నత ధర్మాసనం ఎలాంటి తీర్పు చెప్పినా ముస్లిం సమాజం ఆమోదించక తప్పదు. అయినప్పటికీ, ముస్లిం సమాజం కూడ తనవైపు నుండి కొన్ని సంస్కరణల్ని చేపట్టాలి.

పురుషుల జనాభాకన్నా స్త్రీల జనాభా రోజురోజుకూ తగ్గిపోతున్న  కాలం ఇది. దేశంలో 52 మంది పురుషులకు 48 మందే స్త్రీలున్నారు. మరోవైపు సహజీవనానికి క్రమంగా ఆమోదాంశం పెరుగుతున్న రోజులివి, వివాహేతర లైంగిక సంబంధాలు ఇప్పుడు శిక్షార్హమైన నేరం కూడ కాదు. సమీప భవిష్యత్తులో ఇలాంటి మార్పులు అనేకం రానున్నాయి. ముస్లిం పురుషులకు అనుకూలంగావున్న తలాక్ పధ్ధతుల్ని బాధితులైన ముస్లిం స్త్రీలు సహితం వ్యతిరేకించారన్న వాస్తవాన్ని ధార్మిక పెద్దలు గుర్తు పెట్టుకోవాలి. బహుభార్యత్త్వానికి కూడ బాధితులున్నారు.  

ఇప్పటి భారత ముస్లిం సమాజంలో బహుభార్యత్త్వాన్ని కలిగివున్నవారు వెయ్యికి ఒక్కరు కూడ లేరు. ఆ కొద్ది మంది అయినా బానిసలు, అనాధలు, నిరుపేదలు, నిరాశ్రయులు, వితంతువులు అయిన స్త్రీలను మాత్రమే పెళ్లి చేసుకున్నారని  చెప్పే పరిస్థితి లేదు.  పౌరస్మృతిలోని ఈ వెసులుబాటును ముస్లింలకన్నా ముస్లిమేతరులే ఎక్కువగా వాడుకుంటున్నారనే విమర్శ కూడ వుంది. అనేక మంది సెలబ్రెటీలు బహుభార్యత్త్వం పొందడం కోసం తాత్కాలికంగా ఇస్లాంను స్వీకరించిన సందర్భాలు అనేకం వున్నాయి.  ఈ నేపథ్యంలో బహుభార్యత్త్వం సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి భారత ముస్లిం సమాజం అనవసర ప్రతిష్టకు పొయి పట్టుబట్టక పోవడమే మంచిది. అత్యున్నత న్యాయస్థానపు రాజ్యాంగ ధర్మాసనం ఎలాగూ బహుభార్యత్త్వం రాజ్యాంగ బధ్ధం కాదనే తీర్పు చెపుతుంది.  వాటిని రద్దు చేయడానికి అత్యున్నత న్యాయస్థానంతో సహకరించడమే మేలు.  దానివల్ల ముస్లిం సమాజపు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.

 

ఏఎం ఖాన్ యజ్దానీ (డానీ)

రచయిత ముస్లిం ఆలోచనాపరులు, మొబైల్ : 9010757776

 

విజయవాడ

21-01-2023 

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీల నాయకులు పదేపదే కమ్యునిజాన్ని బలహీనపరుస్తూ వచ్చారు.

     వందేళ్లలో  భారత కమ్యూనిస్టు పార్టి వంద ముక్కలుగా చీలిపోయింది. ఆ వందేళ్లలోనే ఆరెస్సెస్‍ వంద  అనుబంధ సంఘాలుగా విస్తరించి అధికారాన్ని చేజిక్కించుకుని అజేయశక్తిగా మారింది.  organisms best adjusted to their environment are the most successful in surviving and reproducing. Survival of the fittest!

భారత కమ్యూనిస్తు పార్టీలకు చాలా మంది గొప్పవాళ్ళు నాయకత్వం వహించారు. వీరి త్యాగాల్ని, కమిట్ మెంట్ ను తక్కువగా చూడలేం. అయితే వీరందరిలోనూ ఒక లోపం వుంది. లెనిన్ లానో, మావో లానో తమ దేశ సామాజిక వాస్తవికతకు అవసరమైన నిర్ధిష్ట విప్లవ కార్యక్రమాన్ని   రూపొందించడంలో వీళ్లంతా విఫలం అయ్యారు. మార్క్సిజాన్ని సృజనాత్మకంగా నిర్దిష్ట భారత సమాజానికి అన్వయించడం వీరికి చేతకాలేదు. కొంతకాలం ఇంగ్లండ్ కమ్యూనిస్టు పార్టిని నమ్ముకుని కాలం గడిపేశారు. కొంతకాలం రష్యన్  కమ్యూనిస్టు పార్టిని అనుకరిస్తూ  కాలం గడిపేశారు. కొంతకాలం చైనా  కమ్యూనిస్టు పార్టిని అనుసరిస్తూ  కాలం గడిపేశారు. 1984-94వ దశాబ్దంలో ప్రపంచ బ్యాంక్ కొత్త వ్యూహాలతో విరుచుకుపడినప్పుడు అనుసరించడానికి అంతర్జాతీయ మోడల్ దొరక్క చేతులేకాక కాళ్ళూ ఎత్తేశారు. 


మన కమ్యూనిస్టు నాయకులకు ఒక దేశ విప్లవ కార్యక్రమాన్ని రూపొందించగల మేధావితనం. విప్లవానికి  నాయకత్వం వహించదగ్గ  సామర్ధ్యం రెండూ లేవని నాకు 1986 ప్రాంతం నుండే ఒక అనుమానం పీకసాగింది. అది 1989లో బలపడింది. 2004లో వీరివల్ల కాదని తేలిపోయింది. 


భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీల నాయకులు పదేపదే కమ్యునిజాన్ని బలహీనపరుస్తూ వచ్చారు. కానీ; కమ్యూనిజం ఓడిపోలేదు; ఓడిపోదు. 

Friday 13 January 2023

Prajasakti Edit Page Article Words – 948 Characters - 6,500

 

మానవతావాదులు మనలోనే వున్నారు !

Prajasakti Edit Page Article

Words – 948

Characters  - 6,500

 

Jan 13,2023 07:31

ప్రతి ఒక్కరిలో మానవీయ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. వాటిని మనం జాగృతం చేసుకుంటూ ఉండాలి. మానవతావాదులు మనలోనే ఉన్నారు. అంటే... మన మధ్యే ఉన్నారని అర్థం. అంతేకాదు, మనలో అంటే ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంటారు. స్వార్థం, కుత్సిత బుద్ధి పక్కన పెడితే, మనుషులంతా మానవతావాదులే.. కదా? డబ్బూ, అధికారం చాలా మంది దగ్గర ఉంటాయి. అయితే వాటిని మానవత్వ కోణంలోకి మార్చి, తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని బాగుచేయాలనుకోవడం గొప్ప సామాజిక సేవ !

''ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు. మార్పు మనతోనే మొదలయితే-ప్రపంచం అదే మారుతుంది!'' అంటాడు ప్రపంచ ప్రసిద్ధ రష్యన్రచయిత లియో టాల్స్టాయ్.

           వృద్ధాప్యంలో కన్నబిడ్డలు వదిలేసినా, పూర్వ విద్యార్థులు పూనుకుని, తమ ఉపాధ్యాయురాలిని చేరదీసిన సంఘటన కేరళ లోని మలప్పురంలో జరిగింది. అక్కడ ఒక ప్రయివేటు పాఠశాలలో ఒకప్పుడు ఎంతో తెలివైన ఉపాధ్యాయురాలిగా పేరున్న ఒక టీచర్కాలక్రమంలో వీధిపాలైంది. స్వంత కొడుకులు, కూతుళ్ళు ఆమెను వదిలేశారు. జీవిత చరమాంకంలో ఆమె చాలా కష్టాలపాలైంది. కూడూ, గూడూ లేక వీధుల్లో తిరగాల్సి వచ్చింది. తన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో ఎక్కడ ఉన్నారో కూడా ఆమెకు తెలియదు. చివరకు బతకడానికి రైల్వే స్టేషన్ముందు బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. ఎందరి ఛీత్కారాలకో గురవుతూ, మొండిగా అక్కడక్కడే కాలం గడుపుకోసాగింది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఒక పూర్వ విద్యార్థిని ఆమెను గమనించింది. అతి కష్టం మీద గుర్తుపట్టింది. దగ్గరికి వచ్చి వివరాలు అడిగింది. అంతే! ఆమె తనకు పాఠాలు చెప్పిన విద్యా టీచర్అని పూర్తిగా నమ్మింది. తనను దివ్యగా పరిచయం చేసుకుంది. తనది బ్యాచో, తన బ్యాచిలో ఎవరెవరు ఉండే వారో చెప్పుకుంది. సంభాషణలు సంబంధాన్ని మరింత బలపరిచాయి. ఒకప్పుడు ఎంతో గౌరవం గా బతికిన విద్యా టీచర్జీవితం అలా కావడం పూర్వ విద్యార్థినికి నచ్చలేదు. ఎంతగానో బాధపడింది. ఊరికే బాధపడితే లాభమేమిటీ? ఏదో చేయాలని అనుకుంది. ఒకప్పటి విద్యార్థిని దివ్య-ఇప్పుడు ఐఎయస్అధికారి. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళి స్నానం చేయించి, వేరే శుభ్రమైన బట్టలిచ్చి, భోజనం పెట్టి పడుకోబెట్టింది. అధికారి గనుక, దగ్గరలో అన్ని వసతులు ఉన్న చిన్న ఇల్లు వెతకండని మనుషుల్ని పంపింది.

               తనతో చదువుకున్న పూర్వ విద్యార్థినీ విద్యార్థుల్ని సంప్రదించింది. విషయం వారందరికీ తెలియజేసింది. అంతే కాదు, తన సర్కిల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకు చెప్పి, అందరినీ కదిలించింది. తన విద్యాటీచర్భవిష్యత్కోసం కొంత నిధి ఏర్పాటు చేసింది. అలా తమ స్కూలు టీచర్కు మంచి జీవితం అందించాలన్న పూర్వ విద్యార్థుల సంకల్పం నెరవేరింది. తను చొరవ తీసుకుని, అందరినీ కలుపుకుని సమిష్టిగా ఒక ప్రయత్నం చేసి విజయురాలైంది ఐఏయస్దివ్య. కన్నవాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆమె ఆస్థి కాజేసి, నిస్సహాయురాలిని చేసి రోడ్డున పడేసినా, ఒక టీచర్‌, తన విద్యార్థుల సహకారంతో మళ్ళీ గౌరవప్రదమైన జీవితంలోకి రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. విద్యాటీచర్తను ఉద్యోగంలో ఉన్నప్పుడు బోధించిన పాఠాల సారాంశం, అందించిన సంస్కారం పూర్వ విద్యార్థుల్లో పనిచేసింది. ఆమె ఎంత నిజాయితీగా నిబద్ధతతో పాఠాలు చెప్పకపోతే, ఆమె తన విద్యార్థినీ విద్యార్థులకు అంత ప్రీతిపాత్రురాలు కాగలదూ? అలా పదేళ్ల తర్వాత కూడా వాళ్ళు ఎందుకు తరలివచ్చారూ? ప్రతి ఒక్కరిలో మానవీయ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. వాటిని మనం జాగృతం చేసుకుంటూ ఉండాలి. మానవతావాదులు మనలోనే ఉన్నారు. అంటే... మన మధ్యే ఉన్నారని అర్థం. అంతేకాదు, మనలో అంటే ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంటారు. స్వార్థం, కుత్సిత బుద్ధి పక్కన పెడితే, మనుషులంతా మానవతావాదులే.. కదా? డబ్బూ, అధికారం చాలా మంది దగ్గర ఉంటాయి. అయితే వాటిని మానవత్వ కోణంలోకి మార్చి, తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని బాగుచేయాలనుకోవడం గొప్ప సామాజిక సేవ !

           మన సమాజంలో ఇలాంటి పనులు ఎంతమంది చేస్తున్నారూ? అని నిట్టూర్పులు విడిచి, నిరాశపడకుండా ''మనమేమైనా చేయగలమా?'' అని ఎవరికి వారు కార్యాచరణకు పూనుకోవాలి. వారి పరిధిలో వారు చేయగలిగింది చేయడానికి సిద్ధపడాలి. మానవవాదులంటే ఎవరో ప్రత్యేకంగా ఉండరు. మనలోనే ఉంటారు. మన ఆలోచనల్లోనే ఉంటారు. చేయవల్సిందల్లా 'వారిని' బయటికి తీయడమే. అంటే ఆలోచనలతోనే మరో పదిమందికి స్ఫూర్తినందించడం. జిలుగు వెలుగుల సినిమా రంగంలో ఉండి కూడా ప్రజల పక్షాన నిలిచిన నటులు కొందరు మనకు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవాడు నానా పటేకర్‌. తన ఆదాయంలో తొంభయి శాతం ఛారిటీలకు ఇచ్చారు. గతంలో కార్గిల్యుద్ధ సమయంలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. తన ఆదాయంలో ఎక్కువ మొత్తం రైతుల అభ్యున్నతికి ఖర్చుపెట్టారు. కరువుకు గురైన నాలుగు గ్రామాల్ని దత్తతకు తీసుకున్నారు. పేద ప్రజల కొరకే తన జీవితం అన్నట్లుగా అన్ని వేళలా వారికి అండగా ఉంటున్నారు. ఉదాహరణకు ఇక్కడ ఒక్క నానా పటేకర్గురించి చెప్పుకున్నాం. కానీ, సమాజంలో అక్కడక్కడా ఇలాంటి వారు ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రయత్నం మనలోంచే ప్రారంభం కావాలి! అలాగే ఇటీవల కరోనా లాక్డౌన్సమయంలో వలస కార్మికులకు రవాణా సౌకర్యరం కల్పించి, స్వంత ఖర్చుతో వారిని వారి వారి గమ్యాలకు చేర్చిన ఘనత నటుడు సోనూ సూద్కు చెందుతుంది. వెండితెర మీద విలన్లుగా నటించినా, నిజ జీవితంలో గొప్ప హీరోలుగా నిలిచారు.

''ప్రయత్నిస్తూ ఉండే వారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు'' అన్నాడు అలెగ్జాండర్ గ్రేట్‌.''జీత్తొ పతా నహీు లేకిన్యె చరాగ్

కం సె కం రాత్ నుక్సాన్బహుత్కర్తాహై'' ఉరుదూ కవి ఇర్ఫాన్సిద్దీఖి. విజయం సంగతి తెలియదు కానీ, దీపం రాత్రికి చాలా నష్టం కలిగిస్తుంది - అని అర్థం. ఇందులో రాత్అంటే రాత్రి. అమానవీయత - రాత్రిగాక మరేమిటీ? ఆశ అనే దీపం - ప్రయత్నమనే దీపం పట్టుకుని పోతూ ఉంటే చీకట్లు వాటికవే తొలగిపోతుంటాయన్న ఆశావాద దృక్పథం చరణాలలో ఉంది. సమకాలీనంలో జరుగుతున్న ఘోరాల్ని చూసి బెంబేలెత్తిపోవడం కాదు, ప్రయత్నించి ఎదుర్కొంటూ పోతేనే విజయం వరిస్తుంది.

          కేరళ కోజికోడ్జిల్లాకు చెందిన శశి తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. కొన్నేళ్ల క్రితం బ్యాగుల పరిశ్రమ పెట్టేందుకు స్టేట్బ్యాంక్ఆఫ్ఇండియా నుండి యాభై వేలు లోన్‌ (అప్పు) తీసుకున్నాడు. అసలూ, వడ్డీ ఏదీ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు వెళ్ళారు. శశి నిస్సహాయత, కూలిపోయే అతని పాత ఇంటిని చూసి చలించిపోయారు. తొమ్మిది మంది ఉద్యోగులు కలిసికట్టుగా తమ స్వంత డబ్బుతో అతడి ఇల్లు బాగు చేయించి ఇచ్చారు. అంతే కాదు, బ్యాంకు ఉద్యోగులే తమ స్వంత డబ్బుతో అతడి బ్యాంకులోన్చెల్లించారు. దేశంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నవాడు రెండుసార్లు ప్రధానిగా వెలిగిపోయాడు గానీ, ఇలాంటి చిన్న పాటి సహాయమూ దేశంలో ఎవరికీ చెయ్యలేదు. ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. రైతు తీసుకున్న అప్పు సకాలంలో బ్యాంకుకు తిరిగి చెల్లించలేదని ఒక బ్యాంకర్కోర్టులో పిటిషన్వేశాడు. పిటిషన్ను జస్టిస్చంద్రచూడ్కొట్టేశారు. ''రైతు అప్పు చెల్లించలేదని అతన్ని కోర్టుకు లాగుతారా? ముందు అప్పు ఎగ్గొట్టి పారిపోయిన ''పెద్ద దొంగలను''... పట్టుకోండి!'' అంటూ ఆయన తన తీర్పులో సూచించారు. ప్రకృతి పరిరక్షణ కార్యకర్త డాక్టర్వందనా శివ అంటారు-''భూమి హక్కులను రక్షించుకోవడమన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఇదే మన కాలంలో మనం జరిపే అతి పెద్ద శాంతి ఉద్యమం. సామాజిక న్యాయాన్ని, మానవ హక్కులను రక్షించడం అందులో భాగమే!'' ఒక స్థాయికి ఎదిగి ఆలోచించే వారికి మాత్రమే ఆమె మాటలు అర్థమవుతాయి. భూమిలో రైతుకు మాత్రమే కాదు, మనుషులందరికీ ఉన్న సంబంధం గూర్చి అవలోకించగలగాలి. అది మానవతావాదులైతే గాని చేయలేరు! ఇండోనేషియాలో ముస్లింలు తొంభైయి శాతం. హిందువులు రెండు శాతం. మిగతా ఎనిమిది శాతం ఇతర మతస్థులు. అలాగే అమెరికాలో డెబ్బయి శాతం క్రైస్తవులు, ముప్పయి శాతం ఇతర మతస్థులు. అయినా, అక్కడ మతాన్ని అడ్డుపెట్టుకుని ఎవరూ రాజకీయాలు చేయడంలేదు. అల్లర్లు లేవు. మెజారిటీలదే రాజ్యం అని కూడా అనడం లేదు. మన దేశంలో ఆరెస్సెస్‌, బీజేపీలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశం హిందువులదేనని అంటున్నారు. మిగతా మతస్థులపై దాడులు చేస్తున్నారు. ఇక్కడ మరొక విచిత్రం జరుగుతూ ఉంది. ఆవు పాలు నేల పాలు చేస్తారు. ఆవు నెయ్యి నిప్పులో తగలేస్తారు. ఆవు మూత్రం మాత్రం తాగుతారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోని దేశంలోనూ లేదు. కొందరికి-ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తుంది. మరి కొందరికి-హిందువులు ప్రమాదంలో ఉన్నారని తోస్తుంది. అసలు విషయమేమంటే... దేశమే ప్రమాదంలో ఉందన్నది అందరూ గ్రహించాల్సి ఉంది. దీనికి ఒక్కటే పరిష్కారం - జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాల్ని పక్కకు నెట్టి కలిసి మెలసి జీవించడమే! మానవతావాదులన్న వారు కుల మతాల్ని తప్పనిసరిగా త్యజించాలి. ఆర్థిక స్థోమతల్ని పట్టించుకోగూడదు. మానవాభ్యుదయమే ధ్యేయంగా ఆధునిక స్త్రీ పురుషులందరూ కలసికట్టుగా ఒక మానవతావాద ప్రపంచాన్ని సృష్టించుకోవాలి !

వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త/

డా|| దేవరాజు మహారాజు