Saturday 27 January 2018

Koregaon War and Subhash Chandra Bose

కోరేగావ్ యుధ్ధం  - సుభాష్  బోస్ 
-      డానీ
          చరిత్ర రచనలో మనుస్మృతి బలంగా పనిచేస్తున్నదంటే అది గత కాలానికి సంబంధించిన విషయం అనుకోవాల్సిన పనిలేదు; వర్తమానంలో నడుస్తున్న చరిత్ర సహితం మనుస్మృతి మార్గంలోనే నమోదు అవుతున్నది.
          శూద్రులు వేదాలు విన్నా, చదివినా కఠినంగా శిక్షించాలని సాంప్రదాయ మనువాదులు అనేవారు. దళితులు  భీమా-కోరేగావ్ యుధ్ధ చరిత్ర చదవకూడదని ఆధునిక మనువాదులు అంటున్నారు. భీమా-కోరేగావ్ యుధ్ధంలో మహర్లు, చమార్లు, మాంగ్లు, మాతంగులు - ఒక్క మాటలో దళితులు / అప్పటి అస్పృశ్యులు -  ఆయుధాలుపట్టి మరాఠా సైన్యాన్ని తరిమి తరిమి కొట్టిన వీరోచిత పోరాటాన్ని గురించి తలచినా, మాట్లాడినా, ఆ యుధ్ధ స్మారక స్థూపం దగ్గర గుమిగూడి విజయోత్సవాలు జరుపుకున్నా జైళ్ళలో పడేస్తామనీ, రాజద్రోహం కేసులు పెడతామని నయా మనువాదులు హెచ్చరిస్తున్నారు. తమ పూర్వికుల చరిత్ర తెలుసుకుంటున్నందుకు అప్పర్ ప్రైమరీ స్కూలు పిల్లలపై సహితం కేసులు పెట్టి జైళ్ళకు పంపిస్తున్నారు.
          మతగ్రంధాలు చదవకూడదు, ఆస్తిని కలిగి వుండకూడదు, స్వంతవ్యక్తిత్వం, ఆత్మగౌరవం వుండకూడదు వంటి అనేకానేక ఆంక్షల బాధితులైన దళితులు ఆయుధాలను పట్టి యుధ్ధం చేయడం అనేది మహత్తర విషయం. దళితులు ఆయుధాలు చేబూనితే జరిగేదేమిటో వాళ్ళకు తెలుసు. అందుకే వాళ్ళు ఆనాడూ భయపడ్డారు. ఈనాడూ భయపడుతున్నారు. రేపూ భయపడతారు.
          కారంచేడు, చుండూరు, వేంపెంట వగయిరా సంఘటనల్లో పెత్తందారీ కులాలు పథకం ప్రకారం ఆయుధాలతో దళితుల మీద దాడులు సాగించాయి. దళితులు ఆత్మరక్షణ కోసం పరుగులు తీశారు. కానీ, ఆయుధాలు పట్టి - గెరిల్లా యుధ్ధం కూడా కాదు- ఏకంగా సాంప్రదాయ యుధ్ధమే చేసిన సాంప్రదాయం తమకు రెండు వందల ఏళ్ళ క్రితమే వుందని ఇప్పుడు దళితులకు తెలిస్తే ఏమవుతుందీ? దళితుల చేతికి  చరిత్రనే ఒక ఆయుధంగా మార్చి ఇచ్చినట్టు అవుతుంది.
          బ్రిటీష్ యుధ్ధ విజయాలను గుర్తుచేసే స్థూపాలు దేశంలో అనేకం వున్నాయి. ఢిల్లీ లోని సుప్రసిధ్ధ ఇండియా గేట్ మొదటి ప్రపంచ యుధ్ధంలో ఇంగ్లండ్ విజయానికి గుర్తుగా నిర్మించిందే.  1897 నాటి సారాఘరీ యుధ్ధ విజయోత్సవాలని  భారత సైన్యంలోని శిక్కు రెజిమెంట్ ఇప్పటికీ ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటుంది. దానికోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 12ను శెలవుదినంగా ప్రకటించింది. శిక్కు బెటాలియన్ ఆ యుధ్ధంలో ఖైబర్ ఫక్తూన్ ఖావాప్రాంతపు ఆఫ్ఘన్ ‘ముస్లిం’లను ఓడించింది కనుక అది ఉత్సవంగా జరుపుకోదగిన సందర్భం!.  కోరేగావ్ లో చివరి హిందూ రాజ్యాన్ని కూల్చేశారు కనుక అది విషాద దినం!. ఇది నయా మనువాదులు చేస్తున్న తర్కం. యుధ్ధంలో ముస్లింలను ఓడిస్తే  అది జాతీయవాదం!. బ్రాహ్మణులనో, రాజపుత్రులనో ఓడిస్తే అది రాజద్రోహం! జాతివ్యతిరేకవాదం!. నిజానికి ఇవి హిందూత్వ బ్రాహ్మణీయ కొలమానాలుతప్ప మరేమీకావు.
          భారత ఉపఖండంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమణ రాబర్ట్ క్లయివ్ నాయకత్వంలో సాగిన 1757 నాటి ప్లాసీ యుధ్ధంతో మొదలయింది.  అది ఫ్రాన్సిస్ రాడన్ హేస్టింగ్స్ (వారెన్ హేస్టింగ్స్  కాదు) నాయకత్వంలో సాగిన 1818 నాటి కోరేగావ్ యుధ్ధంతో పూర్తయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ రాకుండా ‘వుండివుంటే’ పీష్వా రెండవ బాజీరావో, ఆయన దత్త పుత్రుడు ధోందు పంత్ (నానా సాహెబ్) ఢిల్లీ చక్రవర్తిగా మారి భారత దేశాన్ని ఏలి వుండేవారని ఇప్పటికీ బాధపడుతున్నవాళ్ళు లేకపోలేదు.  
          కోరేగావ్ యుధ్ధంలో బాజీరావు యుధ్ధభూమిని వదిలి పారిపోయిన వైనం గురించీ, ఈస్ట్ ఇండియా కంపెనీ కాళ్ళ మీద పడి తన ప్రాణాల్ని కాపాడుకుని భరణానికి రాజీపడిన దైన్యం గురించి ఈతరం వాళ్లకు తెలియకూడదని ఏలినవారి తాపత్రయం. ఒకవైపు, రెండు శతాబ్దాల క్రితం అంతరించిన  హిందూ రాజ్యాన్ని 2014లో నరేంద్ర మోదీ పునరుధ్ధరించారని మనువాదులు ఉత్సవాలు జరుపుకుంటున్నరోజుల్లో పీష్వారాజ్యం కూల్చివేతను దళితులు పండుగ చేసుకుంటామంటే ఏలినవారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది!.
          కోరేగావ్ యుధ్ధం - ఈస్ట్ ఇండియా కంపెనీకికన్నా - దళితులకు గొప్ప విజయమని బీ. ఆర్. అంబేడ్కర్ భావించారు. 1927 జనవరి 1న స్వయంగా ఆయన భీమా-కొరెగావ్ యుధ్ధ విజయస్థూపం దగ్గరికి వెళ్ళి దళిత అమర వీరులకు శ్రధ్ధాంజలి ఘటించారు. అప్పటి నుండి బ్రిటీష్ విజయస్థూపం దళిత విజయస్థూపంగా మారిపోయింది.
           “గొప్ప గమ్యం గమనాన్ని నైతికంగా సమర్ధిస్తుంది” అనే (Consequentialism) నీతిని కోరేగావ్ యుధ్ధం ముందుకు తెచ్చింది. ఇది తరువాతి కాలంలో అంబేడ్కర్ ను చాలా ప్రభావితం చేసింది. ఆయన ప్రతి సందర్భంలోనూ గమనంకన్నా గమ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. “నేనా? దేశమా? అనే సందర్భం వస్తే నేను దేశాన్ని ఎంచుకుంటాను. దేశమా? అస్పృశ్యుల విముక్తా? అనే సందర్భం వస్తే నేను అస్పృశ్యుల విముక్తినే ఎంచుకుంటాను” అని నిర్మొహమాటంగా చెప్పేవారు. భారత దేశానికి స్వాతంత్రంకన్నా అస్పృశ్యుల విముక్తే తనకు ముఖ్యమని నిర్ద్వందంగా ప్రకటించిన సందర్భాలున్నాయి. అస్పృశ్యులు అగ్రకులాల మీద పోరాడాలిగానీ బ్రిటీష్ ప్రభుత్వం మీద కాదనేవారు. ఒకవేళ బ్రిటీష్ ప్రభుత్వం అగ్రకులాల పక్షం వహిస్తే అప్పుడు ఆ ప్రభుత్వం మీద కూడా పోరాడాలి అనేవారు.
          రాజభక్తి, దేశభక్తి అనేది ఫ్యూడల్ భావన, అంటే భూమి యజమానుల భావన. ఆస్తిపరుల భావన, పెట్టుబడీదారుల భావ, కార్పొరేట్ల భావన, ఒక్కమాటలో   భద్రలోకపు భావన. భద్రలోకం తన భద్రత కోసం తన శత్రువులతో యుధ్ధం చేయాల్సిందిగా  రాజభక్తి, దేశభక్తి ముసుగులో అభద్రలోకాన్ని ఆదేశిస్తుంది. బీమా కోరేగావ్ యుధ్ధ విజయ స్తూపంపై చెక్కిన యుధ్ధవీరుల్లో 22 మంది మహర్లు, 16 మంది మరాఠాలు, 8 మంది రాజపుత్రులు, ఇద్దరు ముస్లింలు, ఒకళ్ళిద్దరు యూదులు వున్నారు.  పీష్వాల సైన్యంలోనూ అరబ్బు సంతతికి చెందినవారు పెద్ద సంఖ్యలో వున్నారు.  యుధ్ధానంతరం కోరేగావ్ లో కనిపించిన పీష్వా సైన్యపు శవాల్లో ఎక్కువ భాగం అరబ్బు సంతతివే.
          అప్పటికి దేశం  అనే భావనే పుట్టలేదు. భారత ఉపఖండం అనే భావన కూడా లేదు. రాజ్యాలు వున్నాయి. రాజుల మధ్య వైరాలు, యుధ్ధలు వున్నాయి. కనుక రాజభక్తో రాజద్రోహమో వుండేది. సైన్యం అంతా కిరాయి సైన్యమే. వాళ్లను కిరాయి సైన్యం అనడంకన్నా వ్యవసాయ కూలీల్లా, యుధ్ధ కూలీలు  అనవచ్చు. కులవ్యవస్థలో యుధ్ధం చేయడం కూడా ఒక కులవృత్తి. ఎవరు కూలీ ఇస్తే వాళ్ల పక్షాన యుధ్ధం చేస్తారువాళ్ళు. అప్పటి యుధ్ధాల్లో అటూఇటూ కూడా ముస్లిం (అరబ్బు)లతో సహా అనేక యుధ్ధ కులాలు వుండేవి. అందుకే రాజపుత్రులు, మరాఠాలు, అరబ్బులు ఇటు పీష్వా సైన్యంలోనూ, అటు కంపెనీ సైన్యంలోనూ కనిపిస్తారు.
          భారత దేశం మీదికి ముస్లింలో, క్రైస్తవులో దండెత్తారని చెప్పే యుధ్ధాలన్నింట్లోనూ ఈ అంశ వుంటుంది.  సైనికులు సాధారణంగా స్థానిక అణగారిన కులాలవాళ్ళే వుంటారు. కరువును తట్టుకోలేకో, కూలీ కోసమో మాత్రమేగాక, కులవ్యవస్థ మీద, దాన్ని సమర్ధించే స్థానిక రాజుల మీద వ్యతిరేకతతోనూ వాళ్ళు ప్రత్యర్ధుల సైన్యంలో  చేరేవాళ్ళు.
          భీమా కోరేగావ్ యుధ్ధంలో మహర్ల స్థానం ప్రత్యేకమైనది. మరి ఏ ఇతర రాజ్యాల్లోకన్నా పీష్వాల రాజ్యంలో దళితుల మీద అణిచివేత మరీ క్రూరంగా సాగింది. దళితుల మెడలో ముంత, నడుముకు తాటాకుల సాంప్రదాయాన్ని మరింత కఠినంగా అమలు చేసిన పాలకులు పీష్వాలు. అస్పృశ్యులు అనే నెపంతో వాళ్ళకు సైన్యంలో కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ ఆక్రోశంతోనే మహార్లు ఈస్ట్ ఇండియా సైన్యంలో స్వచ్చందంగా చేరి కసికొద్దీ పీష్వాల సైన్యంతో భీకరంగా పోరాడారు. వాళ్ళు కిరాయి కోసం పోరాడలేదు పీష్వా రాజ్యాన్ని అంతం చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే  భీమా-కోరేగావ్ యుధ్ధ దళపతులు, విజేతలు దళితులే.
          అయితే 1857 నాటి సిపాయిల తిరుగుబాటు తరువాత స్థానిక సైన్యం మీద బ్రిటీష్ పాలకులకు నమ్మకం పోయింది. దళితుల్ని సహితం పక్కన పెట్టేవారు. అంబేడ్కర్ తండ్రి రాంజీ మలోజీ సక్పాల్ కు కూడా సైనిక నేపథ్యం వుంది. అంచేత తండ్రీకొడుకులిద్దరూ కలిసి దళితుల్ని మరలా సైన్యంలో చేర్చుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వానికి అనేక  విజ్ఞప్తులు చేశారు. వాళ్ల కృషి ఫలితంగానే  రెండవ ప్రపంచ యుధ్ద కాలంలో  బ్రిటీష్ సైన్యంలో మహర్ రెజిమెంట్ ఏర్పడింది. 
          ఆక్రమణదారులకు సహకరించినవాళ్ళను రాజద్రోహులు అనాలిగానీ అదేదో మహత్తరకార్యం అయినట్టు భుజాలకు ఎక్కించుకుని ఊరేగడం ఏమిటీ? అని ప్రశ్నించేవారు ఇప్పుడు బ్రాహ్మణీయవాదుల నుండి మార్క్సిస్టుల వరకు  చాలా మంది వున్నారు. ఇలాంటి విమర్శకులకు అంబేడ్కర్ చాలాకాలం క్రితమే సమాధానం ఇచ్చివున్నారు. 
          బ్రిటీష్ వాళ్ళు భారతదేశంలో అగ్రకులాలతో యుధ్ధం చేస్తున్నపుడు అస్పృశ్యులు బ్రిటీష్ పక్షం వహించడమే సరైనదని అంబేడ్కర్ అభిప్రాయం. “రాజద్రోహమా కాదా? అనే విషయాన్ని పక్కన పెడదాం. అస్పృశ్యులు అలా వ్యవహరించడం అత్యంత సహజం. స్వదేశీయులు తమపై సాగిస్తున్న తీవ్ర అణిచివేత నుండి విముక్తి లభిస్తుందనే ఆశతో కొన్ని సమూహాలు ఆక్రమణదారులకు మద్దతు పలికిన సందర్భాలు భారతదేశ చరిత్ర నిండా అనేకం వున్నాయి” అనేవారు. బ్రిటీష్ పరిపాలన వచ్చిన తరువాతనే భారత ఉపఖండంలో దళితుల విముక్తికి బీజాలు పడ్డాయని ఆయన భావించేవారు. బ్రిటీష్ ప్రభుత్వానికి అస్పృశ్యుల మద్దతును ఆయన ఎప్పుడూ కప్పిపుచ్చాలనుకోలేదు. “తొలి యుధ్ధం మొదలు చివరి యుధ్ధం వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి విజయాలను సమకూర్చడమేగాక బ్రిటీష్ పాలన నిలదొక్కుకోవడానికి సహకరించింది కూడా  భారత సమాజపు అస్పృశ్యులే” అని 1930ల నాటి రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా బ్రిటన్ ప్రధానికి అంబేడ్కర్ గుర్తుచేశారు.
          చాలా మంది ఇప్పుడు ఉద్దేశ్యపూర్వకంగా  మరచిపోతున్నట్టున్నారుగానీ, రెండవ ప్రపంచ యుధ్ధకాలంలో గాంధీజీ నాయకత్వంలోని కాంగ్రెస్ బ్రిటీష్ పాలకులకు మద్దతు పలకగపోగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆరంభించింది. ఆ సమయంలో వినాయక్ దామోదర సావర్కర్, శ్యామా ప్రసాద ముఖర్జీల నాయకత్వంలోని  హిందూమహాసభ క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించడమేగాక బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు పలికింది. బ్రిటీష్ సైన్యంలో చేరవలసిందిగా హిందూ సమాజానికి పిలుపునిచ్చింది. హిందూ మహాసభ అంటే ఇప్పటి భారతీయ జనతా పార్టీకి తల్లి అయిన భారతీయ జనసంఘ్ కు మాతృసంస్థ.
          భీమా-కోరేగావ్ యుధ్ధపు ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా చెలరేగిన వివాదం, అల్లర్లు, చావులు, కేసుల పర్వం ముగియక ముందే సుభాష్ చంద్ర బోస్ రెండవ ప్రపంచ యుధ్ధంలో నిర్వర్తించిన పాత్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పుట్టిన రోజైన జనవరి 23ను జాతీయ శెలవు దినంగా ప్రకటించాలని ప్రధానిని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనవరి 20న ట్వీట్ చేశారు. 
          బోస్ ను చాలా మంది మిలిటేంట్ మహానాయకునిగా భావించి నేతాజీగా పేర్కొంటుంటారు. గాంధీజీతో విబేధాల కారణంగా  బోస్ 1940లో భారతదేశం వదిలి  జర్మనీ వెళ్ళారు. ప్రపంచ నియంత హిట్లర్ ను కలవడానికి 1942 మే  వరకు పడిగాపులు పడి ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకున్నారు. కలిసినప్పుడు కూడా ఆ నియంత బోస్ మీద ఏ మాత్రం ఆసక్తిని చూపెట్టలేదు. రెండవ ప్రపంచ యుధ్ధంలో అక్షరాజ్యాల ఆసియా భాగస్వామి అయిన జపాను కలవమన్నారు. జపాన్ సహాయంతో జర్మనీ, ఇటలీల ఆశిస్సులతో  జపాన్ ఆక్రమిత అండమాన్, నికోబర్, సింగపూర్ దీవుల్లో భారత జాతీయ సైన్యం(ఐఎన్ ఏ)ను నిర్మించారు బోస్. భారత జాతీయ సైన్యం ఆగ్నేయాసియాలో  బ్రిటీష్ సేనల పేరుతోవున్న భారత సైనికులతోనే పోరాడింది. అప్పటి ఫీల్డ్ మార్షల్ సర్  క్లాడ్ ఆషిన్ లెక్ అంచనా ప్రకారం ఇప్పటి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లకు చెందిన 87 వేల మంది భారత సైనికులు రెండవ ప్రపంచ యుధ్ధంలో చనిపోయారు. బర్మా కాంపెయిన్ లో తలపడిన ఇరుపక్షాల్లోనూ చనిపోయింది భారతీయ సైనికులే.
          బోస్ చేసిన వరుస చారిత్రక తప్పిదాలతో ఆయన అంచనాలన్నీ తప్పి వైఫల్యాల పరంపర కొనసాగింది. ఇటలీ, జర్మనీ ఓడిపోయి, ముస్సోలినీ, హిట్లర్ చనిపోయారు. జపాన్ ఓటమి అంచుకు చేరుకుంది. అమెరికా హిరోషీమా నాగసాకీలపై అణుబాంబులు వేసింది. మిత్రరాజ్యాలతోపాటూ బ్రిటన్ ఆ యుధ్ధంలో గెలిచింది. అప్పుడాయన రష్యా సహాయం కోరడానికి మంచూరియా బయలుదేరి  విమాన ప్రమాదానికి గురయ్యారు.  
          రెండవ ప్రపంచ యుధ్ధంలో బోస్ “దారితప్పి” నిర్వర్తించిన గందరగోళ  పాత్రకన్నా భీమా-కోరేగావ్ లో అస్పృశ్యులు నిర్వర్తించిన పాత్ర అనేక విధాలా మహత్తరమైననది. వాళ్ళు మనువాద పీష్వా రాజ్యాన్ని కూల్చేయడంలో తమ చారిత్రక బాధ్యతను నిర్వర్తించారు.
          చరిత్రకారులు సాధారణంగా తాము మహత్తరమైనవని భావించిన సంఘటనల్నే తమ రచనల్లో నమోదు చేస్తుంటారు. వాళ్లకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు పరవశంతో రాసే ఆ సంఘటనలన్నీ సాధారణంగా వాళ్ల వర్ణ/కుల ఔన్నత్యాన్ని చాటేవే అయ్యుంటాయి. ఫలితంగా చరిత్రకారుల స్వీయ వర్ణ/కుల ఔన్నత్యమే మొత్తం దేశ ప్రజల ఔన్నత్యంగా మన మెదళ్లలో స్థిరపడిపోతుంది.  ఇప్పటి వరకు మనకు తెలిసిన లిఖిత చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే  అని కార్ల్ మార్క్స్ అన్నాడు. భారతదేశంలో దానికి చిన్న సవరణ చేయాలి. లిఖిత చరిత్ర అంతా అగ్రవర్ణాల/కులాల ఔన్నత్యాన్ని చాటిచెప్పే చరిత్రే అనాలి! అంచేత చరిత్ర పాఠాలు చదివే సమయంలో ఏం రాశారు? అనేదానికన్నా ఎవరు రాశారు? అనేది కూడా చాలా ముఖ్యమైన పార్శ్వం.
          జాతియోద్యమంలో మహాత్మా గాంధీజీ ఏ తేదీన ఏ కార్యక్రమాన్ని నిర్వహించారో దాదాపు అందరికీ కంఠతా వుంటుంది. కానీ, మహాత్మా ఫూలే, అంబేడ్కర్, ఈవీ రామస్వామి నాయకర్, సయ్యద్ అహ్మద్ ఖాన్, మూడవ ఆగా ఖాన్ ఏ రోజున ఏ సంఘ సంస్కరణ కార్యక్రమాన్ని చేపట్టారో ఎవరికీ తెలియకుండా పోతుంది. ఇటీవలి కాలం వరకు వీళ్లలో అనేక మంది పేర్లు సహితం జనసామాన్యానికి తెలీవు అంటే   అతిశయోక్తికాదు. అయితే ఈ అపచారం ఎక్కువ కాలం సాగదు. తరతరాలుగా అణగారినవర్గాలుగా వుంటున్న సమూహాలు తిరగబడి సమాజానికి కొత్త చరిత్రను రాయడం మొదలెట్టినపుడు వాళ్ళు గత చరిత్రనూ సరిదిద్దుతారు.

మమ్మల్ని ఎక్కడెక్కడ అణిచివేశారో మీరు చెప్పుకునేవారు!
మిమ్మల్ని ఎక్కడెక్కడ ఓడించామో ఇప్పుడు మేము చెపుతాం!

(రచయిత సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776
హైదరాబాద్, జనవరి 25, 2018
ప్రచురణ  : మన తెలంగాణ,  జనవరి 28, 2018

http://epaper.manatelangana.news/1521070/Mana-Telangana-City-Main/28-01-2018#page/4/2

Koregaon War and Subhash Chandra Bose

కోరేగావ్ యుధ్ధం  - సుభాష్  బోస్ 
-      - డానీ