Sunday 25 June 2017

Am a non practicing Muslim - SKY BABA

Yousuf Baba Shaik
7 hrs, 2 a.m. 25  జూన్ 2017
Am a non practicing muslim!
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
plz don't tag & don't send Eid greetings!
దోస్తులారా! కొన్ని నిజాలు ఎక్కువ మందికి కష్టంగా తోచినా మాట్లాడాలి. ఎన్నాళ్ళు మౌనం నటిస్తాం! ఎన్నాళ్ళు అబద్ధం చెప్తామ్! నేను మత విధులేవీ పాటించను. మత సంబంధిత పండుగలు నాకు పండుగలేం కావు. నా పండుగలు వేరే ఉన్నాయి.

ఏ సమూహపు ప్రతినిధులకు లేని సమస్యలు ముస్లిం ప్రతినిధులుగా పని చేస్తున్నవారికి ఉన్నాయి. ఒక దళిత ప్రతినిధి, బహుజన ప్రతినిధి, మహిళా ప్రతినిధి మత నియమాలు పాటిస్తున్నారా లేదా అని వారి వారి సమూహాలు చూడవు. ముస్లింల ప్రతినిధుల్ని మాత్రం అలా చూసి చూసే ఎంతో చైతన్యవంతులైన ఎందరో ముస్లిం విద్యావంతుల్ని, మేధావుల్ని ముస్లిం సమాజం దూరం చేసుకుంది.

నేను ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఒక విషయం స్పష్టం చేసి ముఖ్యంగా నా ముస్లిం మిత్రులకు, ముస్లిం శ్రేయోభిలాషులకు ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను- ముస్లింలలోనూ నాన్ ప్రాక్టీసింగ్ ముస్లింలు ఉంటారు.. నాస్తికులుంటారు.. మత విధులు నిర్వర్తించలేని ముస్లింలుంటారు.. వాళ్ళని, వాళ్ళ మనోభావాలను గౌరవించండి. వారికి ఇష్టం లేకున్నా నటించాలని బలవంతం చేయకండి.

నేను ఇంతగా ముస్లింల గురించి పని చేస్తున్నా కూడా నేనొక నాన్ ప్రాక్టీసింగ్ ముస్లింను. మరెందుకు ముస్లింల గురించి పని చేస్తున్నావని ఎవరైనా చెత్త ప్రశ్న వేసేవాళ్లకు జవాబు: నేను పుట్టిన కమ్యూనిటీ అత్యంత వెనుకబడి ఉంది కాబట్టి ఆ కమ్యూనిటీ గురించి పని చేయడం సామాజిక బాధ్యత social responcibility గా భావిస్తున్నాను కాబట్టి పని చేస్తున్నాను..
ఈ విషయాల్ని లోతుగా అర్ధం చేసుకుని నన్ను ఈ రంజాన్ పండుగకు సంబంధించిన పోస్టులకు ట్యాగ్ చేయడం గానీ, నాకు రంజాన్ ముబారక్ లు చెప్పడం గానీ చేయొద్దని మనవి.
Note: పుట్టినరోజులు, డే లు, రాఖీ పండుగ లాంటివి మాత్రం నాకు ఇష్టమే!
So don't tag & don't send Eid greetings please!
Thank you friends!

AM Khan Yazdani Danny
Dear SKY!
1. ముస్లీంలు అంటే ఇస్లాం మీద విశ్వాసం వుండి, ఆ మతాచారాలను పాటించేవారు.
2. నాన్ ప్రాక్టీసింగ్ ముస్లింలు అంటే ఇస్లాం మీద విశ్వాసం (ఇమాన్) వుండి. నమాజ్, రోజా ఆచరించడం లేనివారు.
3. నాన్ ముస్లింలు అంటే ముస్లిం పండుగల్ని ఆచరించకుండా ఇతర మత పండుగల్ని ఆచరించేవారు.
4. నాస్తుకులు అంటే ఏ మత విశ్వాసాలూ లేనివారు.

ఇందులో మొదటి ఇద్దరే ముస్లింలు. మిగిలిన వారు ముస్లీం సమాజాన్ని వదిలేసినవారు.  ఈ నాలుగింటిలో మీరు ఎవరో ఓ మాట చేప్పేస్తే మీ గురించి ఈ ప్రపంచానికీ ఒక స్పష్టత వచ్చేస్తుంది.

మిత్రులారా! కొన్ని ధార్మిక పనుల్లో వున్నాను. మంగళవారం నేను పరిస్థితిని సమీక్షిస్తాను.  ఈలోగా మీరంత స్కైబాబా పెట్టిన
"Am a non practicing muslim!" పోస్టింగ్ మీద మీ అభిప్రాయాలని నిర్మొహమాటంగా ప్రకటించండి.

ముస్లింలు - మిత్రులు- వ్యతిరేకులు

1. ఇస్లాంను విశ్వసించి, ఆచరించేవారు ముస్లింలు.
2. ఇస్లాంను విశ్వసించి, ఆచరిస్తూ ఆధునిక సమాజ అవసరాలకు  అనుగుణంగా కొన్ని ఆచారాలను సరిదిద్దేవారు సంస్కరణవాద ముస్లింలు.
3. ముస్లింల సంతతి అయ్యుండి, ఇస్లాం మీద విశ్వాసం వుండి, నమాజ్, రోజా పాటించడానికి బద్దకిస్తున్న వాళ్ళు ఆచరణలేని  ముస్లీంలు. ( Non-practicing Muslims)
4. ముస్లింల సంతతి  అయ్యుండి, ఇస్లాం మతాచారాలను పాటిస్తూ, ఇతర సమూహాల మతాచారాలను సహితం గౌరవించేవారు మతసామరస్య ముస్లింలు.
5.  ముస్లింల సంతతి అయ్యుండి, ఇస్లాం మతాచారాలను పాటించకుండా ఇతర మతాచారాలను పాటించేవారు  అన్యముస్లింలు.
6. ముస్లింల సంతతి అయ్యుండి, ఇస్లాంను ఆమోదించకుండా ఇస్లాం మతాచారాలను  విమర్శించేవాళ్ళు  ముస్లిం వ్యతిరేకులు.
7. ఏ దేవుడ్నీ, ఏ మతాన్నీ విశ్వసించనివారు నాస్తికులు.
8. అన్యమతస్తులు అయినప్పటికీ ముస్లింల రాజకీయార్ధిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణ కోసం కృషిచేవారు ముస్లిం సానుభూతిపరులు.
9.  సమాజంపై మెజారిటీ మత ఆధిపత్యాన్ని వ్యతిరేకించే మానవతావాదులు ముస్లీం మిత్రులు.
10.  అన్య తాత్విక సిధ్ధాంతాలను విశ్వశిస్తున్నప్పటికీ సమస్త అణగారిన వర్గాల విముక్తి కోసం పోరాడేవాళ్ళు ముస్లింలకు సహజ మిత్రులు.

No comments:

Post a Comment