Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Tuesday, 14 May 2019
మార్క్సిస్టు, అంబేడ్కరిస్టుల ఐక్యతే నేటి చారిత్రక అవసరం
మార్క్సిస్టు, అంబేడ్కరిస్టుల ఐక్యతే నేటి
చారిత్రక అవసరం
నిన్న ఆంధ్రజ్యోతి వివిధ పేజీలో వచ్చిన 'ప్రచారంవల్ల ఎవరూ
గొప్ప కవులుకారు!' వ్యాసానికి చాలా గొప్ప స్పందన వచ్చింది. వందకు పైగా ఫోన్లు వచ్చాయి,
ఓ రెండు డజన్లు SMSలు, Whatsapp మెసేజులు వచ్చాయి. ఈ రోజు కూడా కాల్స్ వస్తూనే వున్నాయి.
ఫేస్ బుక్ లో కూడా చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మార్క్సిస్టు,
అంబేడ్కరిస్టు శిబిరాలు రెండింటికీ నా వ్యాసం నచ్చడం నాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది.
నా వ్యాసం సాధించిన ప్రధాన విజయం ఇది.
కొందరితో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన missed
calls ను నేను అందుకోలేకపోయాను. నిన్న సాయంత్రం
ఒక టివీ కార్యక్రమంలో పాల్గోనాల్సి రావడంతో రెండు గంటలు అలా పోయాయి. దానికి నోట్సు
సిధ్ధం చేసుకోవడానికి ఇంకో గంట వెచ్చించాల్సి వచ్చించి. అలా మరి కొందరి కాల్స్ ను అందుకోలేక పోయాను. సమయాభావంవల్ల
కొందరి కాల్స్ ను అయిష్టంగానే మధ్యలోనే కట్
చేయాల్సి వచ్చింది. ఇందుకు నన్ను మన్నించాల్సిందిగా
వినయంగా కోరుతున్నాను.
ఏప్రిల్ 17న శివసాగర్
వర్ధంతి రోజున సామాజిక మాధ్యమాల్లో మొదలయిన అనారోగ్యకర చర్చ ఏప్రిల్ 30న శ్రీశ్రీ పుట్టిన
రోజుతో పరాకాష్టకు చేరింది. ఎదుటి శిబిరం మీద నిందలేయాలనే ఉత్సాహం తప్ప చాలామందిలో
సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలనే ఆసక్తి కనిపించలేదు.
ఈ చర్చల్లో చాలా భాగాన్ని నేను చదవలేదు. అందులో జోక్యం
చేసుకోలేదు. ఫేస్ బుక్ లో ఒకటి రెండు వ్యాఖ్యలకు కామెంట్లు పెట్టానుగానీ ఆ తరువాత పట్టించుకోలేదు. అలా తప్పుకోవడంవల్ల కూడా కొన్ని కీలక అంశాలు నా
దృష్టికి వచ్చివుండకపోవచ్చు. అలా ఒక అంశాన్ని గుర్రం శ్రీరాములు నా దృష్టికి తెచ్చాడు.
ఈ వ్యాసానికి కొనసాగింపు రాసినపుడు దాన్ని
కూడ పరిగణన లోనికి తీసుకుంటాను. నిన్న బియస్ రాములుతో సంభాషణ, ఈరోజు ఎండ్లూరి సుధాకర్ తో ఆత్మీయతల్ని పంచుకోవడం గొప్ప ఆనందాన్ని
ఇచ్చింది.
ఒక పుస్తకంగా వేయాల్సినంత పెద్ద అంశాన్ని వ్యాసంగా రాశారు అని ఎక్కువ మంది అన్నారు. పుస్తకం అనేది పెద్ద ప్రాజెక్టు.
శ్రమ సమయం డబ్బు కావాలి. పైగా ఈ మధ్య సతీష్
చందర్ ఒక హెచ్చరిక చేశారు. " పంచితేనో,
పంపితేనో కాని కవిత్వాన్ని చదవని తరమొచ్చేసింది" అన్నారు. పంపినా చదవడం లేదనేది
నా చేర్పు.
నిన్న ఈరోజు సోషల్ మీడియా, ఫోన్ ల ద్వార దాదాపు 250 మంది
ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. వీళ్ళు కాక సాధారణ పాఠకులు
దీనికి కనీసం మూడు నాలుగు రెట్లకన్నా ఎక్కువే
వుంటారు. మనం పుస్తకం వేసినా అంతకన్నా ఎక్కువ మంది చదవరు. ఇదే బాగుంది.
వివిధకు, ఆ పేజీ బాధ్యులకు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కు ధన్యవాదాలు. సాహిత్య పేజీని నడుపుతున్నందుకు ఆర్కే
గారికి కృతజ్ఞతలు.
అయితే., వ్యాసానికి
ఒక పరిమితి వుంటుంది. ఎడిట్ పేజీ వ్యాసానికి 700 పదాలకు మించరాదు. సాహిత్య పేజీ వ్యాసానికి
900 పదాలు మించరాదు. ఈ పరిధిలోనే ఒక ఆదియు
అంతమునూ మధ్యమునూ కూర్చు కోవాలి. అందులోనే మన శైలిని ఇరికించాలి. పైగా ఏ వ్యాసమూ పరిపూర్ణము,
పరాకాష్ట కాదు. చెప్పాల్సింది వివరించాల్సింది చాలా వుంటుంది. నడుస్తున్న వివాదం మీద
వ్యాసాన్ని రాస్తున్నపుడు అనుక్షణం సన్నివేశాలు మారిపోతుంటాయి. వ్యాసంలో దానికి అనుగుణమైన
మార్పులు అవసరం అవుతుంటాయి. వ్యాసాన్ని రాసి
పత్రిక్కి పంపించాక కూడా కొన్ని చేర్పులో తీసివేతలో అవసరం అవుతాయి.
వ్యాసాన్ని ప్రతికవాళ్ళు ఏమైనా కత్తిరించారా అని కొందరు
సందేహాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళేమీ ఎడిట్ చేయలేదు. వ్యాసం అచ్చుకావడానికి రెండు రోజులు ముందు ఇంకో పేరాను చేర్చమని కోరాను.
దానికీ కూడ వాళ్ళు అంగీకరించారు. ఆ మరునాడు ఇంకో పేరాను కూడా రాశాను గానీ బాగుండదని
పంపించలేదు. రెండు చోట్ల రెండు వాక్యాలను మాత్రం వాళ్లు తీసేశారు. అది పాలసీ వ్యహహారం
ఏమీకాదు; స్థలా భావం వల్ల అనుకుంటాను. మాదిగ సామాజిక వర్గం కింద బైండ్ల సామాజికవర్గం
వుందనే అభిప్రాయంతో చివరి వాక్యం రాశాను. రెల్లి మెహతర్ సామాజిక వర్గాలను చేరిస్తే
బాగుంటుందని కొందరు మిత్రులు ఈరోజు అన్నారు. ఆ సూచన నాకు కూడా నచ్చింది. ఆ రెండు వాక్యాలనూ,
అదనపు పేరానూ కలిపి నా బ్లాగ్ లో పెడుతున్నాను ఆసక్తి వున్నవారు చదువుకోవచ్చు.
మొత్తానికి వ్యాసాన్ని రాస్తున్నపుడూ నేను గొప్పగా ఆస్వాదించాను.
అచ్చయిన తరువాత వచ్చిన స్పందనల్ని చూసీ ఇంకా
గొప్పగా ఆస్వాదించాను.
ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున
ధన్యవాదాలు.
మీ
ఉషా యస్ డానీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment