Wednesday, 15 July 2020

Ambedkarists and Marxists Tussle – Ten points



Ambedkarists and Marxists Tussle – Ten points    
మార్స్కిస్టు అంబేడ్కరిస్టు విబేధాలు -పది అంశాలు
17 జులై 2020

1
కమ్యూనిజం అవసరంవున్న వారి ద్వార కాకుండ కమ్యూనిజం అవసరంలేనివారి ద్వార భారత దేశంలోనికి కమ్యూనిజం వచ్చింది.

2.
శ్రామిక కులాల ప్రత్యేక భావోద్వేగాలను యజమాని కులాలకు చెందిన కమ్యూనిస్టు నాయకులు సానుకూలంగా అర్థం చేసుకోలేకపోయారు. 

3.
సమాజంలో దోపిడి, అణిచివేతల్ని అంతం చేయడానికి ఆవిర్భవించిన   మార్క్సిస్టు సిధ్ధాంతాన్ని సృజనాత్మకంగా భారతదేశంలోని  కుల మత దోపిడి అణిచివేతలకు వ్యతిరేకంగా అన్వయించడానికి యజమాని కులాలకు చెందిన కమ్యూనిస్టు నాయకులు భయపడ్డారు.

4.
అస్తిత్వవాద సమూహాలకు ఒకే సమయంలో రెండు లక్ష్యాలు వుండాలి. మొదటిది; తమ సమూహపు విముక్తి లక్ష్యం. రెండోది; సామ్యవాద సమాజ నిర్మాణ లక్ష్యం.

5.
ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్య ఒక మహత్తర ప్రయోగం. ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనార్టీలు, శ్రామికులు, మహిళలు మాత్రమేగాక ఓసీలను కూడ కలుపుకుని ఏర్పడిన సంస్థ అది. Diversity, Equity, Inclusion ఆదర్శాలతో నడిచిన సంస్థ.

6.
పునాది ఉపరితలం విడిగా ఎన్నడూ వుండవు. వాటి మధ్య అన్యోన్య సంబంధం వుంటుంది. ఉపరితలం కూడ పునాదిని ప్రభావితం చేస్తుంది.

7.
కమ్యూనిస్టు పార్టి ఆఫీసుల్లో కూర్చొని మాకు కులమతాలు లేవు అని ఎవరయినా అంటే వాళ్ళు పచ్చి అబధ్ధాలు చెపుతున్నారని అర్థం.  

8.
వర్గం పేరుతో కుల మత తెగ లింగ వైరుధ్యాలని కప్పిపుచ్చే ప్రయత్నాలను  ఛాందస కమ్యూనిస్టులు మానుకోవాలి.

9.
ఉపరితలం అంటే సాంస్కృతిక రంగం. ఆసియాఖండంలో సాంస్కృతికరంగ ప్రాబల్యం ఎక్కువ. ప్రపంచంలోని మతాలన్నీ ఆసియాఖండంలోనే పుట్టాయి. 

10.
మార్క్సిజం, అంబేడ్కరిజం రెండూ  దోపిడీ, అణిచివేతలు లేని సమసమాజాన్నీ ప్రతిపాదిస్తాయి. సిధ్ధాంత రీత్యా వాటి మధ్య ఐక్యత వుంది. మార్స్కిస్టు, అంబేడ్కరిస్టు శిబిరాల మధ్య  ఇప్పుడు కొనసాగుతున్న విబేధాలు చాలా వరకు వ్యక్తిగతమైనవి.   అవి త్వరలోనే సమసిపోతాయి.

No comments:

Post a Comment