Monday, 28 September 2020

Indian Muslim Calendar

 

Indian Muslim Calendar

27 Sept 2020

1.            మిత్రులారా!  ముస్లింల ప్రత్యేక సమస్య గురించి మాట్లాడడానికి ముందు సోదర సామాజికవర్గాల గురించి స్థూలంగా అయినా  మాట్లాడాల్సిన అవసరంవుంది.

 

2.            ఈశాన్య రాష్ట్రాల ప్రజలు 1980ల ఆరంభంలోనే మెయిన్ ల్యాండ్ ఇండియా ప్రజలు తమను శ్రామిక జాతిగా ప్రిగణిస్తున్నారని గుర్తించారు. అది మొదట్లో అస్సాం విద్యార్ధి ఉద్యమంగా వ్యక్తం అయింది. ఆ తరువాత అనేక మలుపులు తిరిగింది.

 

3.            శిక్కుల మీద 1984 చివర్లో ఢిల్లీతోపాటు  పరిసర రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో  ఊచకోత సాగింది.  మనదేశంలో మెజారిటీ మతం, మైనారిటీల మీద ఏ స్థాయిలో  నరమేధాన్ని సాగించగలదో అర్ధం అయిపోయింది.

 

4.            మన ఆలోచనాపరులు ఆనాడే అప్రమత్తమై వుంటే 2002లో గుజరాత్ నరమేధాన్ని ఆపగలిగే ఆవకాశాలుండేవి.

 

5.            1985లో  కారంచెడులో శ్రామిక కులాల మీద యజమాని కులాలు సాగించిన హత్యాకాండ దళితులకు ఒక కనువిప్పు. దానితో కొత్త దారుల్ని వెతకాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తించారు.  

 

6.            జాతులు, శిక్కు మైనారిటీలు, దళితుల తరువాతి వంతు ముస్లింలది. 1990 నాటి అద్వానీ రథ యాత్రతో  తాము కొత్త దారుల్ని వెతకాల్సిన అవసరాన్ని ముస్లిం సమాజం గుర్తించింది.

 

7.             ఆస్ట్రేలియ మిషనరీ గ్రాంహాం స్టూవార్ట్ స్టేయిన్స్ ను ఓడిశా రాష్ట్రం ఖేంజోర్ జిల్లాలో 1999లో సంఘీయులు ఇద్దరు పిల్లలతో సహా సజీవంగా దహనం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడయిన దారాసింగ్ మయూర్ భంజ్ జిల్లాలో ఓ ముస్లీం వ్యాపారినీ హత్య చేశాడు.  క్రీస్టియన్ ముస్లిం మైనారిటీలకు పొంచివున్న ముప్పుకు ఇది సంకేతం.  

 

8.            భారత ముస్లింల విషాద చరిత్రను స్థూలంగా అయినా అర్ధం చేసుకోవడానికి కొన్ని చారిత్రక సంఘటనల్ని గుర్తు చేసుకోవడం అవసరం. ఇదొక ముస్లీం కేలండర్.

 

9.            1857 సెప్టెంబరు 21. సిపాయిల తిరుగుబాటు పరాజం పాలయ్యింది. ఆ తరువాత భారత ముస్లింల జీవితాలు ‘పరాజితుల ఆక్రందనలుగా మారాయి. 

 

10.       1947 ఆగస్టు 14. దేశవిభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. అత్యధిక ముస్లింలు భారతదేశాన్నే మాతృదేశంగా భావించారు. పాకిస్తాన్ ప్రాంతపు ముస్లీంలు కూడ అనేకమంది ఇండియాకు వచ్చారు. ఇటీవల చనిపోయిన మహానటుడు దిలీప్ కుమార్ అనే మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ అలా వచ్చినవాడే.

 

11.       ఓ రెండున్న రాష్ట్రాల్ని ముస్లింలకు ఇచ్చేస్తే మిగిలిన రాష్ట్రాలన్నీ హిందువులకే వుంటాయనే ఒక పథకం ప్రకారమే బ్రిటీష్ ఇండియాను విభజించారనే వాదన ఒకటుంది.  ఇది కొట్టిపడేయాల్సింది ఏమీకాదు.   అయినా విభజన శిలువను ముస్లీంల భుజాల మీద మోపారు.

 

12.       1992 డిసెంబరు 6. మధ్యయుగాల్లో ఒక జాతిని బానిసగా మార్చుకోవడానికి వాళ్ళ చిహ్నాల (టోటెమ్స్)ను ధ్వంసం చేసేవారు. సరిగ్గా అదే పధ్ధతిలో బాబ్రీ మసీదును కూల్చివేసి మీరిక బానిసలు అని ఒక అనధికార ప్రకటన చేశారు.

 

13.       భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేడ్కర్ వర్ధంతి నాడు ఈ కార్యాన్ని తలపెట్టడంలోనూ ఒక మతలబు వుంది.  రాజ్యాంగం పరిరక్షించే మతసామరస్యాన్ని తుంగలో తొక్కుతున్నట్టు ఒక బలమైన హెచ్చరిక చేశారు.

 

14.       2002 ఫిబ్రవరి 27. గుజరాత్ లో ముస్లిం నరమేధం ఆరంభం. 8 వందల మంది ముస్లీంలు చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. అనధికార నివేదికలు రెండు వేలమందికి పైగా చనిపోయారని లెఖ్ఖలు వేశాయి.

 

15.       గుజరాత్ నరమేధంలో హిందూ సమాజంలోని శ్రామిక కులాల్లో ఒక భాగం కాల్బలంగా పనిచేసింది.  ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్డ్ వంటి అంబేడ్కరిస్టులు దీనిని సమర్ధించారు.

 

16.       గుజరాత్ నరమేధం శవాల మీదనే దేశంలో పీష్వాల రాజ్య పునరుధ్ధరణకు బీజాలుపడ్డాయి.

 

17.       2014 మే 26. దేశంలో నయా పీష్వాల పాలన ఆరంభమయింది. సమాజంలో అసహన వాతావరణం నెలకొంది. ముస్లింల మీద మూకోన్మాద దాడులు (Lynching) పెరిగాయి.

 

18.       2019 మే 30. బలహీనవర్గాల హక్కుల రద్దుల పర్వం ఆరంభం. దాన్ని ముస్లింలతోనే మొదలెట్టారు.

 

19.       1.     31 జులై 2019. ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ చట్టం చేశారు. భారత దేశంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం యుక్త వయస్సు దాటిన స్త్రీపురుషులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు. అది నేరం కాదు;  పౌర తప్పిదం మాత్రమే.  అది నచ్చనివాళ్ళు పౌర పరిష్కారంగా విడాకులు తీసుకోవచ్చు. కానీ, ముస్లిం పురుషులు విడాకులిస్తే మూడేళ్ళు కఠిన క్రాగార శిక్ష విధిస్తారు. ఏమిటీ దీని అర్ధం?  ముస్లింలకు పౌరహక్కులు చెల్లవు అని వారు చెప్పదలచుకున్నారు.

 

20.       2.     5 ఆగస్టు 2019 – ముస్లింల జనాభా అధికంగా వున్న జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర హోదాను రద్దు చేశారు. ఆనితోపాటూ ఆర్టికల్ 370. 35 Aలనూ రద్దు చేశారు.

 

21.       3. 9 నవంబరు  2019.  అయోధ్యలోని మసీదు వివాదంలో రామమందిరానికి అనుకూలంగా సుప్రీం కోర్టు నుండి తీర్పు తెచ్చుకున్నారు.

 

22.       4.     11 డిసెంబరు 2019 -  మతప్రాతిపదికతో పౌరసత్వాన్ని ఇచ్చే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా NRC  నిర్వహిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

 

23.       5.     12 డిసెంబరు 2019 – ఢిల్లీ షాహీన్ బాగ్ లో “భారత మతసామరస్య రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ఆరంభం అయింది.    

 

24.       పార్లమెంటులో  ఒక పరంపరగా ముస్లిం వ్యతిరేక చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి.


No comments:

Post a Comment