ఈశ్వర్ అల్లా తేరే నామ్ !
సౌదా అరుణ ఏదైనా రాసారంటే దానికి ఒక పరమార్ధం వుంటుంది. సౌదా రచనా శైలి కూడా నాకు నచ్చుతుంది. ‘నల్లగుర్రపు నాడా’ కథ చాలాసార్లు చదివించింది.
ఈరోజు సౌదాఅరుణల ‘150 సంవత్సరాల కస్తూర్బాగాంధీ’ చదివాను. అమెరికాలో కార్ల్ మార్క్స్ ను, భారత దేశంలో మోహన్ దాస్ గాంధీనీ అధ్యయనం చేయడం వర్తమాన చారిత్రక సామాజిక అవసరం. మర్రిచెట్టు వంటి గాంధీ నీడలో కస్తూర్బా వెలుగు ప్రపంచానికి ప్రస్రించలేదు. కస్తూర్బాకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు ఈ చిన్నపుస్తకంలో వున్నాయి.
Communal Harmony Volunteer గా మతసామరస్యం మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని ఓ ఏడాది కాలంగా అనుకుంటున్నాను. ఇటీవల రాజస్థాన్ బికనీర్ లో, మధ్యప్రదేశ్ భోపాల్ లో,ఉత్తర ప్రదేశ్ లో వివాదం రేపిన లవ్ జిహాద్ కేసుల్ని గమనిస్తున్నాను. ‘150 సంవత్సరాల కస్తూర్బాగాంధీ’ పుస్తకం చదివాక గాంధీజీ తల్లి పుత్లిబాయి ‘ప్రణామీ’ సాంప్రదాయానికి చెందిన వారని తెలిసింది. నా అధ్యయనం ఇంకో మెట్టు ఎక్కడానికి ఈ పుస్తకం తోడ్పడింది.
సింధ్ సంస్థానానికి చెందిన శ్రీ దేవ్
చంద్రజీ మహరాజ్ 17వ శతాబ్దం ఆరంభంలో ‘ప్రణామీ’ మతసామరస్య సాంప్రదాయాన్ని ఆరంభించారు.
జామ్ నగర్ కు చెందిన మహామతి శ్రీ ప్రాణ్ నాథ్ జీ ఆ తరువాతి కాలంలో ‘ప్రణామీ’ సాంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
గాంధీజీ ప్రచారం చేసిన “ఈశ్వర్ అల్లా తేరే నామ్ – సబ్ కో సమ్మతి దే భగవాన్” కు మూలం
ఇప్పుడు స్పష్టమయింది.
సౌదాఅరుణలకు ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని
మీరు తప్పక చదవండి. ఆసక్తిగలవారు 92471 50243 లో సంప్రదించవచ్చు.
No comments:
Post a Comment