కరోనా వైద్యం ఒక బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది
రైతుల ఆందోళన సందర్భంగా ఢిల్లీ వెళ్ళినపుడు అక్కడ కరోనా వుధృతంగా వుంది; వెళ్ళాల్సిందేనా? తప్పదా? అని అజిత అడిగింది. వెళితే నేను ఓ రెండు వారాల తరువాత చనిపోవచ్చు; వెళ్ళకపొతే రేపే ఇంటి వెనక చనిపోతాను అన్నాను. చావు మీద నా అవగాహన అది.
“మనుషులు తాము బతకాలనుకున్న విధంగా ఎలాగూ బతకలేరు; కనీసం
చావాలనుకున్న చోటైనా చనిపోయే అవకాశం వుండాలికదా!” అనే అర్థం వచ్చేలా వైల్డ్ గ్రాస్
సీరీస్ లో లూసన్ అన్నాడు. అది నాకు బాగా నచ్చేసి
రెండు
కథల్లో రెండు భిన్నన కోణాల్లో వాడాను. చావుకు నేను కోరుకునే స్పాట్ గురించి కూడ ఒక సందర్భంలో
రాశాను. ఆ క్రమంలోనే ఈ రోజు పోస్టు పెట్టాను. ఫ్రెడెరిక్ ఏంగిల్స్ కూడ death wish గురించి మాట్లాడి
వున్నాడు. మన మార్కిస్టు పెద్దలు అన్నీ చదువుతారు గానీ మార్క్స్, ఏంగిల్స్ ను మాత్రం
చదవరు. మనుషుల భావ సంచయనంలో Reification అనేది ఒకటుంటుందని కూడ వీళ్ళకు తెలీదు. సమయం సందర్భంలేక హేతువాదం మాట్లాడుతారు. నేను హేతువాదినని ఎన్నడు చెప్పుకోలేదు.
పైగా సందర్భ శుధ్ధిలేని హేతువాదుల్ని అసహ్యించుకుంటాను.
ఉద్యమ కాలంలో కొందరు సన్నిహితులతో కొన్ని సందర్భాలలో మృత్యుముఖంలో వున్నాను. వాళ్ళకేకాదు
నాకూ చావంటే భయమేకానీ అనివార్యం అయినపుడు
దాన్ని హుందాగా స్వీకరించాలి అనేది నా అవగాహన. వాళ్ళను ఓదార్చేవాడిని. మాభూమి సినిమాలో “కళ్ళుతెరిచే చనిపోయాడా?” అని తన కొడుకు గురించి
ఒక మహిళా గెరిల్లా అడుగుతుంది. That
should be the spirit.
సోషల్ మీడియాలో కొందరు
ఒక తప్పుడు సంస్కృతిని ప్రమోట్ చేస్తుంటారు.
వాళ్ళు మనకుగానీ సమాజానికిగానీ చేయగలిగింది ఏమీ వుండదు. ఆ శక్తి సామర్థ్యాలూ వాళ్ళకు వుండవు. కానీ, ప్రతి పోస్టులో ఒక నైతిక
తప్పును వెతికే ప్రయత్నం చేస్తుంటారు. నా మీద,
అజిత మీద అభిమానంతో కష్ట కాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచినవారున్నారు. వాళ్ళు సోషల్
మీడియాలో ఇలాంటి పిల్ల చేష్టలు ఎన్నడూ చేయరు. నేను వాళ్ళను ప్రేమిస్తాను. మనం కొందరిని
ప్రేమించాము అంటే కొందరిని ద్వేషిస్తున్నాము అనేకదా అర్థం.
కరోనా
వైద్యం గురించి వైద్యరంగానికి చెందినవారూ, చెందనివారూ అనేక సలహాలు సూచనలు ఇస్తున్నారు.
వాళ్ళందరూ చివర్లో ఒక మాట అంటున్నారు; “50-50 ఛాన్సెస్ వుంటాయి” అట. కరోనా వైద్యం ఒక
బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది. To be or not to be. అలా జరగవచ్చు జరగకపోనూ వచ్చు అట.
దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదూ?
దేశంలోనికి కరోనా వచ్చాక నేను అనేక వూర్లు తిరిగాను. అనేక
ప్రయాణాలు చేశాను. అజిత ఇంట్లోనే వుంది. నేనే బలవంతంగా వ్యాక్సిన్ కు తీసుకుని వెళ్ళాను, RT-PCR టెస్టుకూ నేనే తీసుకుని
వెళ్ళాను. చాలా పెద్ద రద్దీ. తోసుకుని వెళ్ళాల్సి వచ్చింది. తనకు అక్కడే సోకి వుంటుంది.
నేను 1951లో పుట్టాను. అప్పుడు ఇండియాలో life expectancy
40 యేళ్ళ కన్నా తక్కువ. అంటే నేను life
expectancy కన్నా 80 శాతం ఎక్కువగా బతికేశాను.
ఇంతటి వయసులో ఒక్కరోజు కూడ హాస్పిటల్ లో ఇన్
పేషంట్ గా లేను. నేను ఆరోగ్యానికి అంతటి ప్రాధాన్యం ఇస్తాను. కరోనా నేపథ్యంలో ఇప్పుడు
చాలా మంది బ్రీథింగ్ ఎక్సర్ సైజులు చేయమంటున్నారు. నేను రోజూ సూర్యోదయానికి ముందు
45 నిమిషాలు బ్రీథింగ్ ఎక్సర్ సైజులు చేస్తాను. బ్రీథింగ్ ఎక్సర్ సైజు చేసిన తరువాత ఒక సెల్ఫీ తీసుకోవడం
ఒక అలవాటు. చెస్ట్ మజిల్స్ ఫార్మేషన్ లో లోపాలు
తెలుస్తాయి. మజిల్స్ ఫార్మేషన్ బాగుంటే కాన్ఫిడెన్స్ లెవల్స్ కొంచెం
పెరుగుతాయి. (ఇక్కడ పెట్టిన ఫొటో ఏప్రిల్ 25న తీసింది)
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే బ్రీథింగ్ ఎక్సర్ సైజులు ఆక్సిజన్ పుష్కలంగా స్వీకరించడానికి
పనికి వస్తాయి. వైరస్ ను మందులతోనే ఎదుర్కోవాలి. ఏ మందుతో అన్నదీ ఇంకో బ్రహ్మపదార్ధం.
ఒకరోజు Remdesivir దివ్యౌషధం అంటున్నారు. నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి Remdesivir వాడావంటే నేరుగా వెంటి లేటర్ కు పోవడమే అని హెచ్చరించాడు. అది ఆయన
అనుభవం. RT-PCR టెస్టు రిపోర్టుల్లో 50 శాతం తప్పుల తడక అట. దేన్ని నమ్మాలీ?
ఎదైనా అనివార్యం అయినపుడు ఏం చేయాలీ? అనే విషయంలో మనిషికి
ఒక విధానం వుండాలి. ఆ కోణం లోనే నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. నేను బై ఛాన్స్ పఠాన్ గా వుట్టాను. బై ఛాయిస్ పఠాన్ గా చనిపోతాను.
ఈ మాట కూడ ఇవ్వాళ కొత్తగా అనలేదు. గతంలోనూ ఒకటిరెండుసార్లు అన్నాను. ఫేస్ బుక్ చిల్లర
మిత్రులకు ఒక మనవి ఈ పఠాన్ కామెంట్ ను ఇంకో నైతిక చర్చగా మార్చవద్దు.
రచన : 29 ఏప్రిల్ 2021