అందరికీ ధన్యవాదాలు
ఇష్ట దైవానికీ
జన్మనిచ్చిన నేలకు
పుట్టించిన తల్లిదండ్రులకు
జ్ఞానబోధచేసిన గురువులకు
దారి చూపిన మార్గదర్శులకు
కలిసినడిచిన మిత్రులకు
ఉద్యమ సహచరులకూ
రాటుతేల్చిన ప్రత్యర్ధులకు
అవకాశాలిచ్చిన యజమానులకు
ఊతమిచ్చిన శ్రేయోభిలాషులకు
రచనల్ని ఇష్టపడ్డ పాఠకులకూ
అభిమానించిన స్నేహితురాళ్ళకు
తోడుగా నిలిచిన జీవితభాగస్వామికీ
సంతృప్తినిచ్చిన సంతానానికీ
అపార్థం చేసుకున్నవారికీ
అర్థం చేసుకున్నవారికీ
ద్వేషించినవారికీ
ప్రేమించినవారికీ
No comments:
Post a Comment