My Mission
కష్టాల్లోవున్న సమూహాలకు ఒక సామాజిక కార్యకర్తగా సంఘీభావాన్ని తెలుపుతూ, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా సామాజిక సమస్యల మీద ప్రింట్ మీడియాలో వ్యాసాలు -కథలు రాస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతూ, అవసరమైన అంశాల మీద ఉపన్యాసాలు ఇస్తూ వుంటే సరిపోతుందనే భావంతోనే ఇన్నాళ్ళూ వున్నాను.
కానీ, 2024 ఎన్నికల్ని ఎదుర్కోవడానికి ఇవి సరిపోవనిపిస్తోంది.
1990లో పీపుల్స్ వార్ నుండి పూర్తిగా తప్పుకున్నాక ఇతర రాజకీయ పార్టీలు ఎందులోనూ చేరలేదు.
2024 లోక్ సభ ఎన్నికల్లో ఏదో ఒక పార్లమెంటరీ రాజకీయ పార్టిలో యాక్టివ్ గా పని చేయాలనుకుంటున్నాను.
ఏ పార్టీ బెటరో మీరు సూచించండి.
A. సిపిఐ B. సిపియం C. వైసిపి D. టిడిపి E. కాంగ్రెస్
F. ఫలానా పార్టికి బయటి నుండి మద్దతు ఇవ్వండి
నాకు అన్ని విధాలా నచ్చిన రాజకీయ పార్టి అంటూ ఏదీలేదు. బయటా లేదు; లోపలా లేదు. ఒక ఉపద్రవం ముంచుకుని వస్తున్నప్పుడు ప్రేక్షకునిగా చూస్తూ వుండిపోవాలా? లేక దాన్ని అడ్డుకోవడానికి ఏదైనా చేయాలా? అనే ప్రశ్న నన్ను వెంటాడుతోంది.
ఇందుమూలముగా మిత్రులు అందరికీ తెలియజేయునది ఏమనగా ఇప్పుడేకాదు; భవిష్యత్తులోనూ నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరను. రాజకీయ పార్టీల్లో చేరి పనిచేయడానికి అవసరమైన నైపుణ్యం, లౌక్యం, వనరులు మూడూ నాకు లేవు. నిన్న ఒక ప్రతిపాదన వచ్చింది. అందుకే మిత్రుల సూచనలు అడిగాను. మంచి సూచనలు ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
నాలుగు లక్ష్యాలు
1. కష్టాల్లోవున్న సమూహాలకు ఒక సామాజిక కార్యకర్తగా సంఘీభావాన్ని తెలపడం.
2. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, రచయితగా సామాజిక సమస్యల మీద ప్రింట్ మీడియాలో వ్యాసాలు -కథలు రాయడం.
3. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడం.
4. సమాజానికి అవసరమైన అంశాల మీద ఉపన్యాసాలు ఇవ్వడం.
No comments:
Post a Comment