Thursday, 14 March 2024

Gurujada Apparao

 *గురజాడ గురించి మరికొంత* 


 గురజాడ  అప్పారావు బ్రాహ్మణ సమాజం గురించి మాత్రమే  రాశాడు అని పెదవి విరిచేవాళ్ళూ, అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళూ వున్నారు. ఒక రచనను సామాజిక కోణంలో చూసే విధానం అది కాదు.  


నవలలో  ఒక్క కార్మిక పాత్ర కూడ లేకుండ మొత్తం కథనాన్ని ముంబాయి కంబల్లా హిల్స్  ఆల్టా మౌంట్ రోడ్ లోని 27 అంతస్తుల ముఖేశ్ అంబానీ నివాస గృహం 'అంటీలియా'లోనే నడపవచ్చు. అంతమాత్రాన దాన్ని కార్పొరేట్ కథ అనలేం. అనకూడదు. ఒక్క కార్మిక పాత్ర కూడ లేకుండ కార్మిక దృక్పథంతో రచన చేయవచ్చు. అలాగే, మొత్తం కార్మిక పాత్రలతోనే కార్మిక వ్యతిరేక రచన చేయవచ్చు. 


కథను రచయిత ఏ దృక్పథం తో రాశాడు అన్నది ముఖ్యం. స్థలం, కాలం, సందర్భం, పాత్రలు అనేవి కథాంశానికి (టాపిక్) సంబంధించిన అంశాలు. వాటి మీద రచయిత దృక్పథం ఏమిటీ అనేదే వస్తువు.


గురజాడ అప్పారావు ప్రధానంగా బ్రాహ్మణ పాత్రలతో, నాటి బ్రాహ్మణ కుటుంబ వాతావరణంలో రచనలు చేశాడు. కానీ, కన్యాశుల్కాన్నీ, బాల్యవివాహాలని విమర్శించాడు; వితంతు పునర్వివాహాలను సమర్ధించాడు.  అది అతని దృక్పథం. సాంప్రదాయ విద్య నేర్చినవారు చేసే మోసాలగురించి అప్పటికే సమాజంలో ఒక అవగాహన వుంది. ఆధునిక ఆంగ్ల విద్య నేర్చుకున్న గిరీశం వంటివారు చేయబోయే మోసాలనూ గురజాడ పసికట్టాడు. అందుకే ఆ కాలానికి ఆధునికుడు అయ్యాడు. 


 ఆహారం నిద్ర లానే సంభోగం కూడ ఒక కీలక శరీరధర్మం.  ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాల భాగస్వాములుగా మారి, దాంపత్య వ్యవస్థలో ప్రవేశించి, ఇనుప తలుపుల్ని శాశ్వితంగా మూసివేసిన  తరువాత   మాత్రమే సంభోగ అవసరాలు తీర్చుకోవాలనే కఠిన నిబంధన వున్నప్పుడు సమాజంలో  సరుకు సంభోగాన్నీ సరఫరా చేయడానికి వాణిజ్య వేశ్య (public prostitution) వ్యవస్థ పుట్టుకు వస్తుంది.    ఇదొక అనివార్య ఏర్పాటు. 


 కార్ల్ మార్క్స్ - ఫ్రెడరిక్ ఏంగిల్స్  ఇద్దరూ ఇంచుమించు  ఇలాంటి అభిప్రాయాన్నే కమ్యూనిస్టు ప్రణాళికలోని 'శ్రామికులు - కమ్యూనిస్టులు'   అనే అధ్యాయంలో  చెప్పారు. గురజాడ కూడ ఈ హేతువునే పాటించాడనిపిస్తోంది.  


బాల్య వివాహాలు, బాల్య వితంతువులు, వితంతు పునర్వివాహాలు, కన్యాశుల్కం వగయిరా అంశాల మీద  ఒక నాటకాన్ని రాస్తున్నప్పుడు ఒక వేశ్యపాత్ర కేంద్రబిందువుగా వుండాలని గురజాడ  భావించాడు. ‘కన్యాశుల్కం నాటకంలో స్త్రీపురుష సంబంధాలు’ అనే అంశం మీద ఒక విస్తృత పరిశోధనా గ్రంధం రాయవచ్చు. 


 ఇటువైపు పాతివ్రత్యం, ఏకపత్నీవ్రతం వున్నంత వరకు అటువైపు వాణిజ్య వేశ్యావ్యవస్థ వుంటుంది. గురజాడ ఒక్కడేకాదు; కుటుంబ వ్యవస్థలోని లోపాలను  చిత్రించాలనుకున్న అంతర్జాతీయ స్థాయి  రచయితలు  అనేకులు వేశ్య పాత్రల్ని కేంద్ర బిందువుగా మార్చుకున్నారు. వేశ్య పాత్రలు ముసుగులు, తొడుగులు పెట్టుకోవు. సూటిగా స్పష్టంగా మాట్లాడుతాయి. సమాజం మీద ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల మీద వాళ్ళు చేసే వ్యాఖ్యానాలే ప్రామాణికమైనవి. 

Wednesday, 13 March 2024

Leon Trotsky, Vladimir Lenin, and Joseph Stalin

 Leon Trotsky, Vladimir Lenin, and Joseph Stalin were three prominent figures in the history of the Soviet Union, each playing significant roles in shaping its trajectory. While they were all Bolshevik leaders and played crucial roles in the Russian Revolution and the establishment of the Soviet state, they had different ideologies, leadership styles, and approaches to governance. Here are some major differences between them:

Ideological Differences:

Trotsky: Trotsky was an advocate of "permanent revolution," which argued for the spread of socialist revolutions beyond national borders. He believed that the success of socialism in Russia depended on the success of revolutions in advanced capitalist countries.

Lenin: Lenin's ideology, as encapsulated in his theory of Marxism-Leninism, emphasized the need for a vanguard party to lead the proletariat in seizing power. He believed in the possibility of building socialism in a single country, even if it was relatively backward economically.

Stalin: Stalin's ideology, known as "Stalinism," focused on the concept of "socialism in one country," which prioritized the development of socialism within the borders of the Soviet Union. This approach emphasized centralized state control and rapid industrialization.

Leadership Styles:


Trotsky: Trotsky was known for his charismatic leadership style and oratorical skills. He was a dynamic and persuasive speaker who could inspire crowds and mobilize support for his ideas.

Lenin: Lenin was a strategic thinker and a skilled organizer. He was known for his pragmatism and his ability to adapt Marxist theory to the specific conditions of Russia.

Stalin: Stalin was characterized by his ruthless and authoritarian leadership style. He consolidated power through purges and the elimination of rivals within the party, creating a cult of personality around himself.

Role in the Revolution:


Trotsky: Trotsky played a crucial role in organizing and leading the Red Army during the Russian Civil War, which secured the Bolshevik victory and established Soviet power. He also played a key role in the October Revolution.

Lenin: Lenin was the founder and leader of the Bolshevik Party, and he played a central role in orchestrating the October Revolution. His leadership during the Civil War and in the early years of Soviet rule was instrumental in shaping the course of the new regime.

Stalin: Stalin initially played a more behind-the-scenes role in the Revolution, but he rose to prominence in the party hierarchy after Lenin's death. He outmaneuvered his rivals, including Trotsky, to become the undisputed leader of the Soviet Union.

Attitudes Toward Internationalism:


Trotsky: Trotsky believed in the international spread of socialist revolution and advocated for a global proletarian uprising against capitalism.

Lenin: Lenin also supported internationalism and provided support to communist movements in other countries. However, he also believed in the importance of consolidating socialism within the Soviet Union.

Stalin: Stalin's policies were more focused on building socialism within the Soviet Union and maintaining control over Eastern European countries through the establishment of satellite states.

These are some of the key differences between Trotsky, Lenin, and Stalin. While they were all instrumental in the establishment of the Soviet Union, their differing ideologies and leadership styles ultimately led to significant conflicts and power struggles within the Bolshevik Party and the broader Soviet state.


Tuesday, 5 March 2024

Outcry of a Donkey – Intro

Outcry of a Donkey  – Intro

గాడిద ఆత్మఘోష  - పరిచయం 




          జంతువులను  పాత్రలుగా చేసి ప్రతీకాత్మకంగా  కథలు రాయడం కొత్తేమీకాదు. నీతి చంద్రిక నుండే మనకు ఈ సాంప్రదాయం వుంది. మన జానపద సాహిత్యంలోనూ ఈ శైలి వుంది.  అరేబియన్ నైట్స్ లో ఇది మరోదశకు చేరుకుంది.  వీటిని మొదట  ‘అలీఫ్ లైలా’ ధారావాహికంగా మా అమ్మమ్మ ఫాతిమున్నీసా ద్వార విన్నాను. తరువాత సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ (1821-1890)  పుస్తకాలు "One Thousand and One Nights." ద్వార చదివాను. ఇందులో నాకు నచ్చిన అంశం ఏమంటే కథానాయకి   షెహరాజాదే (Scheherazade) ప్రతిరోజూ ప్రతి కథనూ ఆసక్తికరంగా చెప్పి తీరాలి. లేకుంటే మరునాడు  రాజు షహర్యార్ (Shahryār) ఆమెను నిర్దాక్షిణ్యాంగా చంపించేస్తాడు. చావోబతుకో తేల్చుకోవాల్సిన సందర్భం వస్తేనే ఇంత మంచి కథలు పుడతాయేమో అనే ఒక వైల్డ్ ఆలోచన వచ్చేస్తుంది. 

సాంఘీక, రాజకీయ, నైతిక  అంశాల మీద విమర్శలు, వాఖ్యానాలు చేయడం  కోసం మార్మికతను వాడే ప్రక్రియను లాటిన్ అమెరికన్ సాహితీవేత్తలు గొప్పగా అభివృధ్ధి చేశారు.  జార్జ్ బోర్జెస్ (Jorge Francisco Isidoro Luis Borges Acevedo 1899 –1986), గేబ్రియల్ గార్షియా మార్క్వెజ్ (Gabriel José de la Concordia García Márquez 1927 –2014) వీరిలో ప్రసిధ్ధులు. వీరి శిష్యుడిగా ముందుకొచ్చిన పౌలో కొయెల్హో  (Paulo Coelho de Souza ) మీద కూడ అరేబిమన్ నైట్స్ ప్రభావం కనిపిస్తుంది. 

          సామాజిక వాస్తవికత, పోరాట వాస్తవికత, విప్లవ వాస్తవికతలు ఒక దశలో గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చాయి. మరోవైపు, అవి మాత్రమే ఏకైక వస్తుశిల్పాలు  అనుకునే అతివ్యాప్తి దోషంవల్ల సాహిత్య సృజనకు బోలెడు నష్టం కూడ జరిగింది. సాహిత్యంలో వైవిధ్యం లేకుండాపోయింది. వైవిధ్యంలేని సాహిత్యం చప్పబడిపోతుంది. చప్పబడిపోయిన సాహిత్యం ఫెయిల్ అయిన సినిమా లాంటిది. ఫెయిల్ అయిన సినిమాను ఓటిటిలో ఉచితంగా వేసినా  ఎవరూ చూడరు. 

          జాక్ లండన్  రచనా శైలి మాత్రమేగాక అతను జీవించిన విధానం  కూడ నాకు చాలా ఇష్టం.  జాక్   'ఐరన్ హీల్' గొప్ప డెస్టోపియన్ నవల. అందులో అణువణువునా అతని మేధస్సు కనిపిస్తుంది. అయితే, దానికన్నా అతని  'కాల్ ఆఫ్ ద వైల్డ్', ‘వైట్ ఫాంగ్’  నాకు మరీ ఇష్టం. కుక్కను, తోడేళ్లను పెట్టి కథను నడిపించిన తీరు, అనుక్షణం కొనసాగించిన సామాజిక, రాజకీయ వ్యాఖ్యానాలు అద్భుతం అనిపిస్తాయి. అన్నింటికి మించి జాక్ లండన్ కాల్పానిక సృజనాత్మకత సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.   

పందులు, కుక్కలు, గుర్రాలు, గాడిదల్ని  ప్రధాన పాత్రలుగా  పెట్టి జార్జ్ ఆర్వెల్ 'యానిమల్ ఫార్మ్' రాశాడు. జేవీ స్టాలిన్ భక్తులకు ఇది నచ్చకపోవచ్చు. శిల్పపరంగా ప్రపంచ సాహిత్యంలో ఇంతగొప్ప పొలిటికల్ సెటైర్ మరెవ్వరయినా రాశారేమో నాకు తెలీదు. నేను ప్రపంచ సాహిత్యం మొత్తం చదివినవాడిని కానని ఇందుమూలముగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. 

          పదిహేను వందల కిలో మీటర్లు ప్రవహించే గోదావరినది వశిష్టా గోదావరిగా చీలి సముద్రంలో కలిసే చోట పుట్టాను. రోజూ గోదావరిని చూస్తూ పెరిగాను.  హాస్యం, వెటకారం, ఎద్దేవ, అధిక్షేపణ, వ్యంగ్యం నరసాపురోళ్ళ జన్మహక్కు. 

ఐదేళ్ల క్రితం తోడేళ్ళు, మేక పిల్లల్ని పెట్టి నేను  'మదరసా మేక పిల్ల' పేరుతో ఒక డెస్టోపియన్ కథ రాశాను. డెస్టోపియన్ అంటే మనం కోరుకోని సమాజం, మనం వద్దనుకునే సమాజం, మనం భరించలేని సమాజం, మనం నడుం బిగించి నాశనం చెయ్యాల్సిన సమాజం. 

ఈసారి వ్యంగ్య నవల రాయాలనుకుంటున్నాను. అందులో నేను చెప్పదలచిన  అనేక అంశాలకు గాడిద పాత్రయే  సరైనది అనిపిస్తున్నది. అలనాటి కిషన్ చందర్ గాడిదను నాయుకగా పెట్టి ఏకంగా మూడు నవలలు (ట్రయాలజీ) రాశాడు. గోగోల్, మపాసా, లూసన్ వంటి ముగ్గురు ప్రపంచ ప్రసిధ్ధ రచయితలు ‘పిచ్చివాని డైరీ ‘ అనే  ఒకే శీర్షికతో మూడు కథలు రాశారు. గాడిద ఆత్మకథ శీర్షికతో ఇతర భాషల్లోనూ కొన్ని నవలలు వచ్చాయి. మొరాకో రచయిత హసన్ ఔరిద్ (Hasan Aourid) రాసిన నవల అందులో ఒకటి. 

 ఇప్పుడు నేను మళ్ళీ  గాడిదను ప్రధాన పాత్రను చేసి రాస్తే ఎవరికయినా తప్పకుండా కిషన్ చందర్ గుర్తుకు వస్తాడు. నా నవల చదువుతున్నప్పుడు అంతటి పెద్దవాడు గుర్తుకు వస్తే అది నాకు గౌరవమేగానీ నామోషీ ఏమీ కాదు. ఒక విధంగా ఇది కిషన్ చందర్ కు నా నివాళి. అంచేత, గాడిదే నా హీరో. 

రాతలో పురుషాల గురించి చెపుతూ "వాడు ప్రధముండ, నువ్వు మధ్యముండ, నేను ఉత్తముండ" అన్నారుగా పరవస్తు చిన్నయ సూరిగారూ. నేను ఉత్తముండగా రాయదలిచాను. అనగా నేనే ఆ గాడిద కాదలిచాను!. ఇది ఫిక్స్. ఇంకొకళ్ళు మనల్ని గాడిద అనడానికి ముందే మనల్ని మనం గాడిద అనుకోవడం గొప్ప వివేకం కదా!.   

          ఈ నవల స్ట్రక్చరులో 15 అధ్యాయాలుంటాయి. 200 ప్లస్ పేజీల నవల మొత్తంగా రాసి పుస్తకంగా తేవాలా? ఎప్పటికప్పుడు ఏ పేజీకి ఆ పేజీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టేయాలా? అనే రెండు ఆలోచనలున్నాయి. సోషల్ మీడియాలో రెండు తొలి అధ్యాయాలు  పెట్టి తరువాత పుస్తకంగా ప్రచురించడం మంచిదనిపిస్తోంది. టీజర్లు అన్నమాట. 

          ఇప్పుడు జరుగుతున్న జమిలీ ఎన్నికల హడావిడిలో దీన్ని మొదలుపెట్టవచ్చా అనే సందేహమూ ఒకటి వున్నది. కుల పోరాటాలు, మత యుధ్ధాలుగా ఎన్నికలు  జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఏవో విప్లవాత్మక మార్పులు  వస్తాయని  నమ్మడం కష్టం. ఎవరు గెలుస్తారూ? ఎవరు ఓడుతారు అనే దానితో  పనిలేకుండానే సామాన్య గాడిదలకు గుప్పెడు గడ్డి కూడ దొరకనంత గడ్డు రోజులు రానున్నాయి. 

          కొన్ని నెలల క్రితం ఓ రైటర్స్ మీట్ లో ఓ రాత్రి మిత్రులతో పిచ్చాపాటిగా ఏవో  పాత విషయాలు చెపుతుంటే వేల్పూరి  సుజాత  ఆసక్తిగా విని నా ఆత్మకథ రాయాలని చెప్పింది. దానికి ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్ అన్నీ తనే చేస్తానంది. మా మధయ ఈ ఒప్పందం ఇలా వుండగా నా జీవితంలోనికి ఓ గాడిద ప్రవేశించింది. దీనికి కూడ సంపాదకురాలిగా వుంటానని తనే స్వఛ్ఛందంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. పుస్తకాలు వేసే ఆర్ధిక స్తోమత లేదు కనుక ప్రచురణకర్తలు కూడ త్వరలో ముందుకు వస్తారని నమ్ముతున్నాను. 

ఉష యస్ డానీ