Saturday, 29 November 2025

మూడో కూటమి వద్దే వద్దు!

 మూడో కూటమి వద్దే వద్దు!


బిజెపి నాయకత్వంలోని ఎన్డీ కూటమిని లోక్ సభ ఎన్నికల్లో ఒడించాలనే లక్ష్యంతో  జాతీయ స్థాయిలో 'ఇండియా బ్లాక్' పని చేస్తున్నది. 

ఎన్నికల పంథాగల కమ్యూనిస్టు పార్టీలు  అన్నీ కూడ ప్రస్తుతం ఇండియా బ్లాక్ లో వున్నాయి. బిసిల పార్టీలుగా భావించే ఆర్జేడి,   సమాజ్ వాదీ పార్టి కూడ అందులోనే వున్నాయి. 

మనకు అంబేడ్కరిస్టు సంఘాలు అనేకం వున్నాయి. అయితే,  అంబేడ్కరిస్టు రాజకీయ పార్టీలు ఏవీ ఎన్డీ కూటమి బయటలేవు; ఒక్క VCK పార్టి తప్ప. అది ఇండియా బ్లాక్ లో వుంది. 

ఈ వాట్సప్ గ్రూపు  ప్రధాన లక్ష్యం కూడ ఎన్డీ కూటమిని ఓడించాలనేదే. అలాంటప్పుడు ఇది ఇప్పటి నుండే ఇండియా బ్లాక్ ను సమర్ధించమే మంచిది. 

అలా కాకుండా మూడో కూటమిని ఏర్పాటు చేస్తే అది ఎన్డీ కూటమికి పరోక్షంగా మేలు చేస్తుంది. 

డానీ, కన్వీనర్ MTF 

29-11-2025


మిత్రులారా!

*2029 లోక్ సభ ఎన్నికల్లో ఏపీ వ్యూహం ఏమిటీ?* 

మన లక్ష్యాలను, దాన్ని సాధించే మార్గాలనూ మన వనరులు, శక్తి సామర్ధ్యాల పరిధి పరిమితుల్లో ఒక రోడ్ మ్యాప్ గీసుకోవడం అవసరం.

అంతిమ లక్ష్యం, మధ్యంతర లక్ష్యం, ప్రస్తుత లక్ష్యం అంటూ వర్గీకరణ చేసుకోవాలి. 

కులవర్గమత తదితర పీడనలు ఏవీ లేని సమాజాన్ని నిర్మించడం మన అంతిమ లక్ష్యం. ఆ విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. 

కానీ, దీన్ని సాధించడానికి ఇంకో వందేళ్ళు సులువుగా పడతాయి. మనకు ఆ స్పష్టత సహనం వుండాలి. 

కార్పొరేట్ మతతత్త్వ వ్యవస్థను కూల్చడం మన మధ్యంతర లక్ష్యం. 

దానికీ చాలాకాలం పడుతుంది. 

ఈ రెండు  దశలు కాకుండా మరికొన్ని దశల్ని కూడ మనం ఎంచుకోవచ్చు.  

ఈలోగా మనకో తక్షణ సవాలు ఒకటుంది. అది; 2029 లోక్ సభ ఎన్నికలు. 

ఆ ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని ఎన్డీ కూటమిని ఓడించడం మన తక్షణ లక్ష్యం. 

దానికి అవసరమైన వ్యూహాలు, ఎత్తుగడలు రూపొందించుకోవాలి. 

అది ఎప్పుడో కాదు. ఇప్పుడే, ఈరోజే! ఈరోజే కుదరకపోతే ఈ వారంలో!

ఈ వాట్సప్ గ్రూపులో ఆరెస్సెస్ - బిజెపి, కమ్యూనిస్టు పార్టీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారేగానీ ఇతర పార్టీల గురించి మాట్లాడడంలేదు. 

ప్రతి రాజకీయ పార్టీని పరిశీలనకు స్వీకరించి దాని మీద మన వైఖరిని  స్పష్టం చేయాలి. 

మన కార్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్. మనం అంతకు మించి  ప్రభావితం చేయలేము. ఆ వినయం కూడ మనకు వుండాలి.   

ఆంధ్రప్రదేశ్ లో  టిడిపి, జనసేన, బిజేపి అధికార కూటమిగా వున్నాయి. వైసిపి ప్రతిపక్షంగా వుంది. 

కమ్యూనిస్టు, కాంగ్రెస్  పార్టీలు, బిఎస్పీ, ఏఐ బిఎస్పీ, ఎంఎల్  తదితర పార్టీలు కూడ  ఎన్నికల బరిలో వుంటాయి. 

2029 అసెంబ్లీ-లోక్ సభ ఎన్నికల్లోనూ వీటి మధ్యనే ప్రధాన పోటీ వుంటుంది. 

వీళ్ళలో మనం ఎవరితో కలుస్తాం? ఎవరితో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తాం? ఎవరిని శత్రువుగా ప్రకటిస్తాం? 

ఎన్నికల  గణాంకాలు మన శిబిరాన్ని బలపరుస్తున్నాయా? ఐక్య సంఘటనలు అవసరం అంటున్నాయా? చూసుకోవాలి. 

ఈ పనిని ఈ గ్రూపులో ఎవరయినా ఆరంభించారో లేదో తెలీదు. 

ఆ కసరత్తు పూర్తిచేసి 2029 ఎన్నికల వ్యూహాలు-ఎత్తుగడల్ని రూపొందించుకోవాలి. 

మరోమాట, సిపిఐ, సిపియం, ఫార్వార్డ్ బ్లాక్, ఎంఎల్ లిబరేషన్ లను ఇండియా బ్లాక్ నుండి బయటకు రప్పించి కొత్తగా మూడో  ఫ్రంట్ కట్టగలమనే అభిప్రాయం కొందరికి వున్నట్టుంది. దాన్ని నేను ఏమాత్రం నమ్మలేను. 

అవి రాజకీయ పార్టీలు; మనది ప్రజాసంఘం. ఇప్పటికి  ఇది ఒక ప్రజాసంఘం కూడ కాదు. ఒక వాట్సప్ గ్రూపు.  మహా ఉద్యమం ఒకటి సాగితేతప్ప, మహానాయకుడు ఒకడు ఆవిర్భవించితేతప్ప  రాజకీయ పార్టీలు ప్రజాసంఘల మాట వినవు. ఎన్నికల సమయంలో అస్సలు వినవు. 

ప్రస్తుతం వున్న రెండు రాజకీయ కూటముల్లో మెరుగైనదాన్ని ఎంచుకోవడం మినహా మరోమార్గం లేదు. 

2029 లోక్ సభ ప్లాన్ ను ఈ గ్రూపు నిర్వాహకులు ఇంతవరకు ఎందుకు రూపొందించలేదో ఆశ్చర్యకరంగా వుంది.  

ఈగ్రూపులో చాలామంది ఇతర విషయాల గురించి చాలా పోస్టులు పెడుతున్నారు. 2029 ఎన్నికల వ్యూహ రచన మాత్రం చేయడం లేదు. 

ఇప్పుడు అదే ముఖ్యం. 

- డానీ 

కన్వీనర్ , MTF 

29-11-2025



స్థూలంగా డానీ గారి ప్రతిపాదన తో నాకు అంగీకారం ఉంది. సూటిగా నాకు తెలిసిన సమాచారం, నా అభిప్రాయాలు/ప్రతిపాదనలు,.

 

i. సమాచారం :

 

1). 2023 జులొ 18 ను INDIA కూటమి ఎర్పడగా భారత్ బచావో ఆంధ్రప్రదేశ్ కమిటీ జులై నెలలనే ఆ కూటమి కి మద్దతు ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ప్రచారం చేసింది.

 

2). సిపిఐ(ఎం) INDIA లో లేదు. రాష్ట్రాల వారీగా అవగాహన లోకి వస్తున్నది.

 

3). అఖిల భారత స్థాయిలో  ప్రజాసమస్యలపై కృషి చేస్తూ, ఆర్ ఎస్ ఎస్ -బీజేపీ కార్పోరేట్ హిందూత్వ ఫాసిజంను ఎన్నికల రంగంలో ఓడించటం కోసం సూత్రబద్ధమైన విశాలమైన ప్రంట్ ఏర్పాటు కోసం సంవత్సరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి

 

4). మన రాష్ట్రంలో  ' సామాజిక న్యాయం కోసం మార్క్సిస్ట్ ఆలోచనాపరులు వేదిక (Marxist Thinkers Forum for Social Justice)'  అనే వేదిక ఈ కృషిని ఆంధ్రప్రదేశ్ లో చేస్తూ ఉంది.

 

 ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న ఇతర సమూహాలు,, వ్యక్తులు అందరూ కలసి ఒక mega పౌర వేదిక గా ఏర్పడ వలసిన అవసరం ఉంది.

 

ii. అభిప్రాయాలు:

 

 INDIA లోని పార్టీలు అధికార కాంక్ష తో ఒక గుంపు అయ్యాయి గానీ కనీసం సెక్యులరిజం పట్ల కూడా నిబద్ధత లేదని రెండున్నర సంవత్సరాల వారి వ్యవహారాలు పరిశీలిస్తే అర్థమవుతుంది.

 

కనుక సూత్రబద్ధమైన మూడవ ఫ్రంట్ ('సమతా శక్తుల కూటమి ' లాంటి పేరుతో) అవసరమని, అది మాత్రమే ఆర్ ఎస్ ఎస్-బీజేపీ ఫాసిస్టు భావజాలం ను, బీజేపీ/ఎన్డీఏ పరభ నిరంకుశ పాలనను ఓడించ గల నిలకడైన శక్తి అని నా అభిప్రాయం. ఇలాంటి కూటమి త్వరగా ఏర్పడి ప్రజల సమస్యలు కృషి చేస్తూ 2029 ఎన్నికల్లో పాల్గొనాలి.

 

iii. ప్రతిపాదనలు:

 

1). బిజెపి భావజాలంతో సహా బీజేపీ ని వ్యతిరేకించే పార్టీలు , సంఘాలతో  ఒక స్థిరమైన రాజకీయ కూటమి (ఉదా: సమతా శక్తుల కూటమి) త్వరగా ఏర్పడాలి.  యింకా, స్పష్టంగా చెప్పాలంటే ఆ కూటమి సీపీఐ ,సిపిఎం , వివిధ 'ఎంఎల్' పార్టీులు, MCPI(U), MCPI, SUCI(C), FB, RSP, వీసీకే , ఏఐబీఎస్పీ  WPI లాంటి పార్టీలు, దళిత బహుజన మైనారిటీల సంఘాలు ఒక కూటమిగా ఏర్పడాలి. అందుకోసం ఉత్ప్రేరకంగా పనిచేసే పెద్ద 'పౌర సమాజ అసోసియేషన్' కావాలి. 

 

2). ఈ మూడవ కూటమి లోకకి  బీజేపీతో అంట కాగిన/ అంటకాగుతున్న పార్టీలు, సంఘాల్ని . అంటే, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ను తీసుకుంటే - టీడీపీ ,జనసేనలతో పాటు వైసీఆర్ సీపీ ,బీఎస్పీ లను కూడా వద్దని అనుకోవాలి

 

3). 2029 సాధారణ ఎన్నికల్లో గెలుపుకు అవసరమైన  గెలుపును సాధించటం లేదా బీజేపీ/ ఎన్డీఏ ను ఓడించడం కోసం, అప్పటికి ఉన్న  నాన్-ఎన్డియ్యే పార్టీ లలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే దాన్ని 'సమతా శక్తుల కూటమి' (3వ కూటమి) చూసుకుంటుంది .

 

       ఈ ఆలోచనలకు నిర్దిష్ట ఆచరణాత్మక రూపం ఇవ్వడానికి రెండు రోజుల భౌతిక సమావేశం డిసెంబర్ చివరి వారంలో జరుపుకుందాం.

  మీ అభిప్రాయాలు సంసిద్ధత తెలియ జేయ వలసిందిగా  విజ్ఞప్తి చేస్తున్నాను.

 

          అభివందనాలు

       సిబిఆర్, 8639195989

         తేదీ. 30- 11 - 2025,

 

మిత్రులు డానీ గార్కి,

సూచనలు, మీ స్పష్టత — రెండూ చాలా సమయోచితంగా ఉన్నాయి. ఉద్యమాలకు అంతిమ – మధ్యంతర – తక్షణ లక్ష్యాల వర్గీకరణ ఎంత ముఖ్యమో, రాజకీయ వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని వ్యూహరచన చేయాల్సిన అవసరాన్ని మీరు బలంగా చెప్పారు. 2029 ఎన్నికలు కేవలం పార్టీలు గెలుపు-ఓటముల విషయం కాదు; మనకు ఎదురుగా వున్న కార్పొరేట్-కమ్యూనల్ హేగెమనీని అడ్డుకునే తక్షణ పోరాటం. దీనిపై గ్రూపులో సమగ్ర చర్చ లేకపోవడంపై మీరు చూపిన ఆందోళన సహేతుకంగానే  ఉంది.

 

మీ సూచనలకు నా స్పందన

 

1. ప్రతి పార్టీని పరిశీలించాలి — ఇది తప్పనిసరి. ఓటర్లలో ప్రభావం, పూర్వపు వైఖరి, ప్రజా-పాలసీలపై నిర్దిష్టంగా ఏం చేశారన్నదానిపై నిర్దిష్ట విశ్లేషణ లేకుండా వ్యూహం అసాధ్యం.

 

 

2. కూటములు నిర్మించాలా — ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయాలా — శత్రు కూటమిని ఎవరు నిర్దిష్టం చేయాలా అనే విషయాలు వెంటనే నిర్ణయించాలి.

 

 

3. కార్య క్షేత్రం  ఒక రాజకీయ పార్టీ కాదు — ఇది చాలా కీలకమైన నిజం. ఉద్యమ శక్తులు ఎన్నికల్లో “ప్రత్యామ్నాయం సృష్టించడం” కాదు; “ప్రమాదాన్ని తగ్గించడం” మాత్రమే చేయగలవు.

 

 

4. రెండు కూటముల్లో “ఎవరు తక్కువ హాని చేస్తారు?” అనే దాని ఆధారంగా టాక్టికల్ పొజిషనింగ్ నిర్ణయించడం తప్ప మరే మార్గమూ లేదు కదా సార్ — ఇదే ప్రస్తుత రాజకీయ సత్యం.

 

          నమస్తే 🙏

మార్పు శరత్

 

 

భౌతిక సమావేశం

ఒకటి జరగవలసిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది

 

 నిర్దిష్ట అంశాల తో

ఆలోచనల మథనం ఒకటి అక్కడ జరగాలి!

 

ఆ మథనం ఇచ్చే

తుది ఫలితాల ఆధారంగానే

ఏం చేయాలి అనే

నిర్దిష్ట కార్యాచరణ ను తయారు చేసుకోగలం!

 

అందుకోసం నిర్దిష్ట ఎజండా తో

ఆ సమావేశం జరగాలి!

 

వాట్సప్ చర్చలతో సమగ్రత, స్పష్టత రాదు

ముఖతా మాట్లాడు కోవడమే సరైన చర్య!

 

అటువంటి సమాలోచనల కోసం 3-5 గురితో ఒక ఎజెండా కమిటీ ఏర్పడి ఇప్పటినుంచే పనిలోకి దిగడం మంచిది!

 

ఈ కమిటీ నే ఆ సమావేశం యొక్క నిర్వణా కమిటీ గా కొనసాగి, సదరు సమావేశ ఎజెండా యొక్క కట్టు దాటకుండా చర్చలు సాగించే విధంగా నియంత్రణ చేయడం ఇంకా మంచిది!

 

అలా కుదరని పక్షంలో నిపుణులు, అనుభవజ్ఞులైన 3 గ్గురి పెద్దలతో సమావేశ నిర్వహణ కమిటీ నొకదాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది!

 

                       రత్నారావు

 

Rekha Chandrasekhar

ఎన్నికల మూడవ కూటమి ఏర్పడితే అది బీజేపీ కూటమికే మేలు చేస్తుంది అన్న డ్యానీ గారి మాట చాలా వాస్తవం.

 

మరి మూడవ కూటమి

“ వామపక్ష సామాజిక ప్రజాస్వామిక లౌకిక శక్తుల కూటమి” ఏమి చేయాలి!

 

పార్లమెంటు ఎన్నికలకు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి, భారత్ బచావో , మేలుకో ఆంధ్ర ప్రదేశ్ వంటి సంస్తలు పార్లమెంటు ఎన్నికలు సంవత్సరం లోపు ఉన్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాల వంటి నిర్ణయాలు

ఇప్పుడు  మనకు అవసరమా!

 

ఈ కాలమంతా మన ప్రజా కూటమి శక్తులు ప్రజలలో ప్రజా ఉద్యమాలను నిర్మించాలి.

 

1.) రాజ్యాంగ హక్కుల

పరి రక్షణ కోసం

2.) అక్రమ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా

3.) EC ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా

4.) రిజర్వేషన్లు రద్దుకు వ్యతిరేకంగా

5.) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా

6.) అడవి సంపదను అంబానీ, అద్వానీలకు దోచి పెట్టడానికి వ్యతిరేకంగా

7.) సమాఖ్య స్ఫూర్తి కి భంగం కలిగించే చర్యలకు వ్యతిరేకంగా 

 

ఇంకా ప్రజా సమస్యల కోసం, రాజకీయ సమస్యల కోసం, ప్రజాస్వామిక హక్కుల రక్షణ కోసం  తదితర సమస్యల కోసం ప్రజలలో బలమైన ఉద్యమాలను మన కూటమి శక్తులు నిర్వహించ వలసి ఉంది.

 

మన ఉద్యమాల పోరాట మొన మనువాద, కార్పోరేట్ , ఫాసిస్టు శక్తుల పైన ఉండాలి.

మన శక్తులు బలాన్ని సమీకరించు కోవాలి , ఎన్నికల సమయానికి ఫాసిస్టు శక్తులను బలహీన పరచడం, ఓడించడం మన లక్ష్యంగా ఉండాలి.

 

— రేకా చంద్ర శేఖర రావు.

తేది. 30.11.2025.

 

 

 

మిత్రులారా !

 

ఖాన్ యజ్దాని గారి విశ్లేషణాత్మక విషయ సూచనలు నూటికి నూరు పాళ్ళు నిజం. గత 14 సంవత్సరాల నుండి పాలనలో ఉన్న అధికార పార్టీ ఇలాంటి " టక్కు టమార ఎన్నికల విద్యల్లో వందలాది PhD లు " కల్గి ఉందన్న విషయం కలలో కూడా విస్మరించరానిది.

 

ఈ అధికార పార్టీ నానా విధాల సాంఘిక ,సామాజిక ఆర్ధిక , రాజకీయ, వేర్పాటువాద , అబద్దాలు, అసత్యాలు , అర్థ సత్యాలు, వికృత, విశృంఖల నానా విధ ఉన్మాదాలు , వేర్పాటువాద ప్రణాళికలతో భారతీయ ఓటర్లను ఏమార్చటంలో తన గోదీ మీడియాతో ఇప్పటికే ఓ గొప్ప స్థాయిలో విజయం సాధించింది. అధికారంలో ఉంది. ఈ సత్యాన్ని విస్మరించటం అంటే మనం ఎక్కడో మన అంతరంగాల్లో ఆ ఉన్మాదమే జనోన్మాదం కావాలని కోరుకోవటమే! దీనిని ఈ రోజు భారతీయ రాజకీయ చిత్రపటంలో చూస్తూనే ఉన్నాం.

 

అంగట్లో అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉన్నట్లు " మనకూ అన్నీ ఉండి కూడా, " తప్పక ఉండాల్సినవి కొన్ని లేకపోవటం వల్ల సంపూర్ణంగా చేష్ఠలుడిగి " చెట్టుకొకరం పుట్టకొకరం గా వెదజల్లబడి, చల్లబడి, చతికలబడి , వెనుకబడి జనహితం ఉండి కూడా తడబడి జనానికి దూరంగా దఖలుబడి , దిగలుబడి దిక్కుతోచక ఉండిపోయి " ఇంకా గొంగట్లో వేటినో ఏరుకుంటూనే ఉన్నాము. స్థితిగత ఔన్నత్యాన్ని మరచి " ఏవో మెతుకుల కోసం వెంపర్లాటలోనే సేద తీరుతున్నామేమో ??!'

 

ఒక్క మాటలో చెప్పాలంటే " మనమందరం గత కాలపు సైద్ధాంతిక వైపరీత్యాల పైత్యాన్ని తాత్కాలికంగానైనా కనీస ప్రాప్త కాలజ్ఞతతో  " మూడు చేపల కథలోని " దీర్ఘదర్శి లా " ఆలోచించి ఓ సమగ్ర సమిష్టి ఆచరణాత్మక  కార్యాచరణ  ప్రణాళికని బేషరతుగా రచించుకుని  " దేశ సంరక్షణావసర ఏకీకరణ / పునరేకీకరణ " కార్యాన్ని ప్రారంభించి " మన నిష్ఠాగరిష్ఠా ఆచరణతో "  అటు ప్రజల ఇటు విడిపోయి దిగాలుగా చిక్కబడి, చిక్కుబడి, దిక్కులు చూస్తున్న  " భావసారూప్య ఇండియాలోని "ఇండియా పార్టీలను కలుపుకుని " నూతన ఉత్తేజ భరిత ఆక్సిజన్ " ఇవ్వాల్సి ఉంటుంది. దేశ నేలకు రాజ్యాంగబద్ధ కళాత్మక జీవనాన్ని ఇచ్చి రక్షించుకోవాల్సి ఉంది.

 

మరో మూడవ లేదా నాల్గవ విభాగంఅంటూ " క్రొత్త వాటిని జననం చేస్తే " భాగాహారంలో మన ఉమ్మడి శతృవు యొక్క భాగ ఫలం పెద్దదై " మళ్ళీ మనం " అల్ప శేషం " గానే తరిగి, మిగిలి " తెలివైన గానుగ ఎద్దులం" గానే తరతరాల బౌద్ధిక బానిసత్వం లోనే ఉండిపోతాము. క్రమంగా మనకు మనమే నిర్మాలించబడతాం'

 

" విశాల సర్వామోద సామాజిక పద్దతిలో  కన్నెత్వం కోల్పోతేనే  ఏ స్త్రీ అయినా గౌరవ అమ్మత్వం " పొందగలదన్నది నేడు మనకు కావలసిన " తక్షణ , లక్షణ , లక్ష్య సాధనకు దీర్ఘకాలిక విజేత పథనిర్దేశనం అని భావిస్తాను.

 

అంతిమంగా " మన ఉమ్మడి రాజకీయ శతృవు " సర్వకాల, సర్వ రకాల సకల అవలక్షణ సమేత గండర గండడు " అని ఒక్క క్షణం కూడా మరచిపోరాదు.

 

ప్రస్తుతం చేయవలసిన పని ఓ రకంగా అసాధ్యమే. కానీ దానిని సాధించటంలో " తొలి అడుగు మలి అడుగై జన పద అడుగుల చప్పుడుగా ఓ ప్రభంజనం కావాలని ఆశిద్దాం! పునరంకితమౌదాం.

 

జనంతో కలసి మెలసి కలియ బడదాం .....

 

మళ్లీ నిజ ప్రజాస్వామ్య భారతాన్ని నిర్మిద్దాం.....

 

అల్ కమర్ , నిజాంపట్నం '

 

 

CBR సర్,

 

2029 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలో INDIA Block  వుంటుంది. కొన్ని షరతులతో కమ్యూనిస్టు పార్టీలన్నీ అందులో వుంటాయి.

 

కమ్యూనిస్టు, అంబేడ్కరిస్టు  పార్టీలు ఎవరితో జతకట్టాలనే విషయాన్ని ఏ ప్రజాసంఘమూ నిర్ణయించజాలదు; ఒక మహాఉద్యమం చెలరేగితేతప్ప. అలాంటి పరిస్థితులు కనిపించడంలేదు.

 

NDA, INDIA Block  లకు భిన్నంగా కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులు కలిసి మూడవ కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు తక్కువ. ఒకవేళ మూడో కూటమి ఏర్పడినా అది INDIA Block గెలుపు అవకాశాలను దెబ్బతీసి NDA కు అనుకూలంగా మారుతుంది. అదొక అదనపు అప్రదిష్ట.

 

అందుచేత, INDIA Blockను బలపరచడం తప్ప మరో మార్గం నాకు కనిపించడం లేదు.

 

ఎన్నికల్లో ఒక కూటమికి అనుకూలంగా ప్రచారం చేయడం సమయం, శ్రమ, డబ్బుతో కూడిన పని. ఆ వనరుల గురించి కూడ ఒక ప్రణాళిక వుండాలి.

 

ఆ పనిని ఎన్నికల ముందు మొదలెట్టకుండా ఇప్పుడే మొదలు పెడితే మంచిదని భావిస్తున్నాను.

 

ఏపిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మరికొన్ని పార్టీల కూటమి ఎలాగూ ఏర్పడుతుంది. దానికి మద్దతు ఇవ్వడమే సబబు.

 

-        డానీ

-        కన్వీనర్, MTF

No comments:

Post a Comment