*విశ్వగురు (ట్యాగ్ లైన్
- సినిమా ఇలా మొదలైంది*
అతి
ఉత్సాహవంతుడైన ఓ రచయిత–దర్శకుడు రంపా
తిరుగుబాటును ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా సినిమా తీశాడు.
ఆ
చారిత్రక తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ పోలీసు యంత్రాంగం తిరుగుబాటుదారులపై అమానుష
హింసను సాగించింది. ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది గిరిజనులు తమ ప్రాణాలు
కోల్పోయారు. మరోవైపు, ఆ పోరాటంలో తెల్లవాళ్ళయిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ థామస్ హైటర్,
సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆల్ఫ్రెడ్ స్కాట్, మరో అధికారి జార్జ్ ఇండికేట్ కూడా హతమయ్యారు.
ఆ
కాలపు వలసవాద వ్యతిరేక పోరాటాన్ని ఇలాంటి దృశ్యాలతో దర్శకుడు భారీ వీఎఫ్‌ఎక్స్ తో ఉత్కంఠభరితంగా
చిత్రీకరించాడు. ప్రతిఫ్రేమ్ లోనూ దేశభక్తి ఉత్సాహం జలధారలా పొంగిపొర్లేలా
చూపించాడు. సినిమాకు ‘అల్లూరి’ అనే పేరు పెట్టి, “ఇప్పటికీ స్ఫూర్తి” అనే ట్యాగ్‌లైన్
జతచేశాడు.
తన
పాన్‌ఇండియా దేశభక్తి చిత్రాన్ని అన్ని భాషల ప్రజలు విరగబడి చూస్తారని,
బాక్సాఫీసులు బద్దలైపోతాయని అతను గట్టిగా నమ్మేడు. ప్రభుత్వం తనను మెచ్చుకొని,
ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడు పురస్కారం కూడా ఇస్తుందని
ఐమాక్స్ స్థాయిలో కలలు కూడా కన్నాడు.
పోస్ట్–ప్రొడక్షన్
పూర్తయి సరిగ్గా సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న క్షణంలోనే సెన్సార్ బోర్డు కాలు
అడ్డం పెట్టింది. సినిమాలో అనేక అభ్యంతరకర,
ఆక్షేపణీయ దృశ్యాలు ఉన్నాయనేది వారి ఆరోపణ.
దేశంలో
ఆపరేషన్ కగర్ నడుస్తున్న సమయంలో గిరిజన తిరుగుబాటును సమర్థిస్తూ సినిమా తీయడం
తప్పని బోర్డు సభ్యులు తేల్చిచెప్పారు. గిరిజనులు పోలీస్ అధికారులను హతమార్చే
దృశ్యాలు చూపించడం మరింత పెద్ద నేరమని పేర్కొన్నారు. సినిమాల్లో ప్రభుత్వ వ్యతిరేక
కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వడం తీవ్రమైన నేరమని వారు ముక్తకంఠంతో ప్రకటించారు.
మన
నిర్మాత ఖంగుతిన్నాడు. అప్పర్ సీలేరులో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్తు
ఒక్కసారిగా అతన్ని తాకింది. అదేమీ కల్పితగాధ కాదనీ, వందేళ్ల క్రితం నాటి బ్రిటిష్
వలసపాలన క్రూరత్వం గురించే సినిమా తీశానని, అందులో మరణించినవారు కూడా బ్రిటిష్
పోలీసులేనని, తనది ఫక్తు దేశభక్తి సినిమా అని రచయిత–దర్శకుడు అధికారులకు విన్నవించుకున్నాడు.
“ఆదివాసులు
పోలీసుల్ని చంపిన దృశ్యాలు పెట్టి మీరు దాన్ని ‘అప్పటిది’ అంటున్నారు,” అన్నాడు
సీనియర్ అధికారి, “మాకు మాత్రం అది ‘ఇప్పుటిది’గా కనిపిస్తోంది”.
దర్శకుడికి
అధికారి మాటలు అర్థం కాలేదు.
“మీరు
అంటున్నట్టు అది గత పోరాటం కావచ్చు. ప్రేక్షకులు అలా చూడరు. వాళ్లకు అది ఈరోజు
జరుగుతున్న పోరాటంలానే కనిపిస్తుంది. వాళ్ళు అక్కడితో ఆగరు. ఇది జెన్–జీ కాలం కదా!
వీధుల్లోకి వస్తారు. ప్రదర్శనలు చేస్తారు. ఇప్పుడీ హడావుడి అంతా మనకు అవసరమా?” అని
అధికారి ప్రశ్నించాడు.
“ఇప్పుడు
నేను ఏం చేయాలో నాకేమీ తెలియడం లేదు సార్,” అని దర్శకుడు అన్నాడు.
“మీరు
ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మేమే మీకోసం అన్నీ చేశాం. ఆక్షేపణీయ దృశ్యాలన్నీ
తొలగించాం,” అని సెన్సార్ అధికారి ప్రశాంతంగా అసలు విషయం శెలవిచ్చాడు.
జరిగిందేమిటో
దర్శకుడికి ఇప్పుడు అర్ధం అయింది. ఒళ్ళంతా వణుకుతుంటే తడబడుతున్న గొంతుతో నెమ్మదిగా
అడిగాడు, “అయితే సార్… ఏమైనా మిగిలిందా?”
“మీరు
అంత కష్టపడి సినిమా తీశారు కదా—ఏమీ మిగల్చకుండా తగలెయ్యడం న్యాయం కాదనిపించింది. లంబసింగి
కొండల్లో అందమైన ల్యాండ్‌స్కేప్ షాట్లు కొన్ని తీశారు కదా? అవి మాత్రం తాకకుండా
వదిలేశాం,” అని అధికారి అపారమైన కరుణతో చెప్పాడు.
ఒక
నిమిషం మాత్రమే మిగిలిన ఆ భాగాన్ని పవిత్ర ప్రసాదంలా కళ్లకు అద్దుకుని,
రచయిత–దర్శకుడు బయటకు నడిచాడు.
కానీ,
కథ అక్కడితో ముగియలేదు.
తలవంచుకుని
బయటికి పోతున్న ఆ దర్శకుడ్ని ఆ అధికారి వెనక్కు పిలిచాడు. “చూడండీ మీరు యువకులు. మంచి
టాలెంట్ వుంది. చెప్పకూడదు అనుకుంటూనే ఒక మాట చెపుతున్నాను. అల్లూరి, భగత్ సింగ్ లను
మించిన దేశభక్తులు ఇప్పుడూ వున్నారు. మీరు
చూడడంలేదు” అన్నాడు.
మరుసటి
రోజే, మన రచయిత–దర్శకుడు మీడియాను పిలిచి ‘విశ్వగురు’ అనే కొత్త సినిమా
తీయబోతున్నట్టు ప్రకటించాడు.
==//==
21-12-2025

No comments:
Post a Comment