మాట్లాడితేనే మహాపరాధమా? - కె. శ్రీనివాస్ 24-7-2014 సంపాదకీయం పై స్పందన
మాట్లాడాల్సిన సందర్భమే ఇది
బ్రిటిష్ ఇండియాలో
రెండు రకాల పాలన సాగేది. బ్రిటీష్
ప్రత్యక్ష పాలనలో వున్న భాగం, పరోక్ష పాలనలో వున్న భాగం. పరోక్ష పాలన కింద 635 సంస్థానాలుండేవి. వీటిల్లో అతిపెద్దది నిజాం సంస్థానం. భారత
స్వాతంత్ర చట్టం-1947 లో ఈ సంస్థానాలకు రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది 1. వాళ్ళు స్వతంత్ర దేశంగా వుండవచ్చు. 2.
ఇండియన్ యూనియన్ లో గానీ పాకిస్తాలోగానీ విలీనం కావచ్చు.
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్
అలీ ఖాన్ తన సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా కొనసాగించాలనుకున్నాడు. ఆమేరకు
ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందాలనీ, బ్రిటీష్ కామన్
వెల్త్ లో సభ్యుడిగా కొనసాగాలనీ ప్రయత్నించాడు. ఇండియన్ యూనియన్ తో నిర్యుధ్ధ సంధి
(Standstill
Agreement) కూడా చేసుకున్నాడు. స్వాతంత్రానంతరం కూడా భారత వైశ్రాయిగా
కొనసాగిన లార్డ్ మౌంట్ బాటెన్ కొలువులో నిజాం రాయబారి లాయక్ అలీ, భారత రాయబారి కేయం మున్షీ నెలల తరబడి త్రైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, విదేశీ వ్యవహారాలుతప్ప మిగిలిన స్వర్వ హక్కులతో భారత దేశంలో నిజాం
స్వతంత్ర (Autonomous Dominion Nation) దేశంగా వుండడానికి ఇండియన్ యూనియన్
అంగీకరించింది. అయితే ఆ ప్రతిపాదనను కూడా నిజాం తిరస్కరించాడు. చివరిదశలో
పాకిస్తాన్ నుండి రక్షణ పరికరాలు కొనాలనుకున్నాడుగానీ ఆ దేశంలో విలీనం కావాలని
అనుకోలేదు.
త్రైపాక్షిక
చర్చలు విఫలం అయ్యాక అంతిమంగా, నిజాంపై 1948 సెప్టెంబరు నెలలో జరిపిన ఆపరేషన్ పోలో యుధ్ధంలో ఇండియన్ యూనియన్
గెలిచింది. బ్రిటీష్ పరోక్ష పాలనలో వున్న కారణంగా
1947లో స్వతంత్రం వచ్చేవరకు నిజాంకు
స్వంతంగా స్థాయీ సైన్యాన్ని సమకూర్చుకునే అవకాశంలేదు. స్వతంత్రం వచ్చాక కేవలం
ఏడాది కాలంలో భారీగా స్థాయీ సైన్యాన్ని
సమకూర్చుకోవడం సాధ్యం కానూలేదు. నిజాంలో వున్నదల్లా రజాకార్లు అనే ఒక అల్లరిమూక. ఆ యుధ్ధంలో నిజాం ఓటమి అనివార్యం.
చరిత్రలో విడిపోయింది
కలవకూడదనీ,
కలిసింది విడిపోకూడదనీ నియమం ఏమీలేదు. వాటిని అసాధ్యము
అనడానికీ లేదు. కలిసిన ఆంధ్రా, తెలంగాణ విడిపోవడాన్ని కళ్లముందు చూస్తున్నాము. వాటిని
మళ్ళీ కలుపుతామంటున్నవాళ్ళూ వున్నారు.
ఉషా యస్ డానీ
9010757776
No comments:
Post a Comment