Monday 4 August 2014

Danny Notes 2014 August

Danny Notes
5 August 2014

ప్రభుత్వం పనిచేయడంలేదు?
ప్రభుత్వం బాగా  పని చేస్తోంది.
బాగా పనిచేయడం అంటే?
పూటకో కమిటీ వేయడం.

కమిటీలు పనిచేయడంలేదు.
కమిటీలు బాగా  పని చేస్తున్నాయి
కమిటీలు బాగా పనిచేయడం అంటే?
నివేదికను ఎప్పటికీ ఇవ్వకపోవడం

Danny Notes
5 August 2014

వారెప్పుడూ నిద్రపోరు
నిద్రలో  ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంటుతో
లోను గురించి  మాట్లాడుతుంటారు
సింగపూరు, న్యూయార్కు నగరాలకు
ఆధునీకీకరణ పథకాలు తయారు చేస్తుంటారు

వారెవర్నీ నిద్రపోనివ్వరు
రైతులు ఆకాశంలోనికి చూస్తుంటారు
విద్యార్ధులు కౌన్సిలింగ్ కోసం చూస్తుంటారు
ప్రజలు రాజధాని ఎక్కడని చర్చిస్తుంటారు


Danny Notes
5 August 2014

చంద్రబాబుగారికి భద్రత అవసరంలేదు

ఎటువైపు నుండి చూసినా వారు ప్రజలకు
మూడు వందల కిలో మీటర్ల దూరంలో వుంటారు.

Danny Notes
5 August 2014

షారోన్ ప్రియాంక
'యువతి ర్యాష్ డ్రైవింగ్, ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి' కేసు నిందితురాలు 
 షారోన్ ప్రియాంక వివరాలు  నెల్లూరు మిత్రులు ఎవరయినా  చెప్పగలరా?

పరిశోధన కోసం ఆమె జీవన శైలి కావాలి.








Danny Notes
15 August 2014

జిన్నా, ఇక్బాల్ 

భారత ముస్లిం స్వాతంత్ర సమరయోధుల్లో శిఖరాయమానమైనవాళ్ళు ముహమ్మదాలీ జిన్నా, 

అల్లమా ఇక్బాల్. వీళ్లిద్దరూ ఎందువల్లలో ఈ డాక్యుమెంటరీలోలేరు.  పాకిస్తాన్ లో స్థిరపడిన అనేక రాజకీయ ప్రముఖులు సహితం (కనీసం 1947 ఆగస్టు 14 వరకైనా) భారత ముస్లిం స్వాతంత్ర సమరయోధులనే అవగాహన ఈ డాక్యుమెంటరీలో లోపించింది. లాల్ కిషన్ అద్వానీ పాకిస్తాన్‍ వెళ్ళి జిన్నా సమాధి దగ్గర నిలబడి ఆయన్ని మహత్తర దేశభక్తునిగా కొనియాడారు. జిన్నాను కీర్తిస్తూ జస్వంత్ సింగ్ భారీ పుస్తకమే రాశారు. సంఘ్ పరివారికులు చూపిన చొరవ కూడా భారత ముస్లిం రచయితలు చూపలేకపోతున్నారు. ఇది విషాదం! 



No comments:

Post a Comment