Saturday 25 June 2016

Danny Notes 25-6-2016

 మారుతున్న వివాహ వ్యవస్థ

ఈకాలపు రచయితలందరూ చదువుకున్న మధ్యతరగతికి వుండే కాలం చెల్లిన నైతిక విలువలను సంతృప్తి పరిచే కథలే రాసున్నారు.  సమాజ వాస్తవం అందుకు చాలా భిన్నంగా వుంది. అంటే, మన కాలపు రచయితలు వర్తమాన వివాహ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాల్ని చిత్రించడంలేదు. 


మ్యారేజ్ ఫోబియో

కొత్త తరం అన్నింటికన్నా ఎక్కువగా భయపడుతున్నది పెళ్ళికేనట!. 

విలువలు లేని సమాజం అంటూ ఏదీ వుండదు

ప్రతి చారిత్రక దశలోనూ సమాజానికి తనవైన విలువలు వుంటాయి. ప్రతి దశలోనూ పాత విలువల్ని పాటించాలనుకునేవాళ్ళు కొత్త తరాలకు విలువలు లేవంటుంటారు. నిజానికి వాళ్ళు కొత్తవిలువల్ని ఆమోదించలేరు; పాతవిలువల్ని పాటించలేరు. తద్విరుధ్ధంగా కొత్త విలువల్ని పాటించలేరు; పాత విలువల్ని ఆమోదించలేరు.


యుద్ధవాతావరణాన్ని సృష్టించిన తరువాత ఫలితాలు సానుకూలంగానే కాదు ప్రతికూలంగానూ వుంటాయి.

No comments:

Post a Comment