గోదావరిజిల్లా వాళ్లతో తెగ ఇబ్బందేనండి!
శ్వాసవున్న ప్రతి మనిషికీ ఒక యాస వుంటుంది. గొదావరి మండలం యాసలో ఒక వెటకారం కూడా వుంటుంది. ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు వెటకారం వాడరు. అది వాళ్లకు అసంకల్పిత చర్య.
మేము మా యాసలో మాట్లాడుతుంటే ఇతర జిల్లాలవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. దేనికైనా మినహాయింపులు వుంటాయి.. కొందరికి మా వెటకారంలో కారం కనిపిస్తుంది. అందుకు మేము బాధ్యులంకాము.
నేను సీ-టీవీలో on-air personaగా వున్న రోజులో ఓ సంఘటన జరిగింది.
ఆరోజు సాయంత్రం 6 గంటలకు నేను అప్పటి సాంకేతికవిద్యాశాఖా మంత్రి నాయని నరసింహారెడ్డితో ఫేస్ టూ ఫేస్ లైవ్ పోగ్రాం చేయాలి.
మా బ్యూరో ఫస్ట్ ఫ్లోర్ లోనూ, స్టూడియో సెకండ్ ఫ్లోర్ లోనూ వుండేది. స్టూడియో మేనేజర్ - కమ్- గెస్ట్ సర్విసెస్ గా ప్రకాశం జిల్లాకు చెందిన ఒకామె వుండేది.
నరసింహారెడ్డి రావలసిన సమయంకన్నా ఒక గంట ముందుగా వచ్చేశారు.
నేనూ, మా బిజినెస్ ప్రోగ్రాం ఇన్ చార్జి నరేందర్ రేవల్లి అప్పుడు బ్యూరో రూమ్ లో ఇంకో ప్రోగ్రాం షూట్ చేస్తున్నాం.
మినిస్టర్ గారు త్వరగా వచ్చేయడంతో స్టూడియో మేనేజర్ కంగారు పడిపోయింది.
ఇంటర్ కామ్ లో నాకు ఫోన్ చేసి "డానీగారూ! మీరు రావాలి. మినిస్టర్ గారిని ఎంగేజ్ చేయాలీ" అంది.
"ఈలోపు మీరు ఎంగేజ్ చేస్తూ వుండండి" అన్నాను.
"మీరు త్వరగా పైకి రండి ప్లీజ్" అంది.
"మీరుండగ నేను పైకి దేనికి మేడం?" అన్నాను.
ఇదంతా తక్షణ స్పందన తప్ప అందులో నాకు ఇతర వుద్దేశాలు, తెలివి ప్రదర్శించడాలు వంటివి ఏమీ లేవు.
"మీ గోదావరజిల్లా వాళ్లతో తెగ ఇబ్బందేనండి" అన్నాడు నరేందర్.
"ఏమయిందీ?" అనడిగాను నేను నిజంగానే అమాయికంగా.
"అదే మీతో ఇబ్బంది. పాపం ఆమెకు అర్ధం కాలేదుగానీ లేకపోతే ఈపాటికి సెకండ్ ఫ్లోర్ నుండి దూకేసేది" అన్నాడు.
హైదరాబాద్ కు మారేక నాకు అత్యంత ఆప్తులుగా మారినవాళ్లలో నరేందర్ రేవల్లి ఒకడు. నరేందర్ తో నేను సీ-బిజినెస్ లోనేకాక, అప్పట్లో రాష్ట్రప్రభుత్వం HIV/AIDS పై జర్నలిస్టుల కోసం నిర్వహించిన అవేర్ నెస్ క్యాంపెయిన్ లో కూడా రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్నాను. అలా మేము రాష్ట్రమంతటా తిరిగాము.
ఈరోజు FBలో Usha Turaga-Revelli గారి పోస్ట్ చూశాక నరేందర్ గుర్తుకు వస్తే ఒక రకం ఉద్వేగానికి లోనయ్యాను. చాలా మంచివాడు. చాలా సున్నిత మనస్కుడు. నరేంద్రతో నా ఫొటోలు కనిపించలేదుగానీ మేమిద్దరం చేసిన అప్పటి ప్రోగ్రాం వీడియో ఒకటి కనిపించింది. అదే పోస్ట్ ఇక్కడ చేస్తున్నా.

inspirational quotes
ReplyDelete