Danny
Speech
at T-Mass Forum Inauguration
4
July 2017
మిత్రులారా!
వివిధ
ప్రజా సంఘాలతో టీ-మాస్ వేదిక నిర్మాణానికి కృషి చేస్తున్నందుకు తమ్మినేని వీరభద్రంగారికి
అభినందనలు.
ఇక్కడున్న
ప్రముఖులు అనేక ప్రజాసమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మన
దేశంలో అణగారినవర్గాలు ఏవీ ప్రశాంతంగా, సంతృప్తిగా లేవు.
ప్రతి
ఒక్కరి జీవితాల్లోనూ ఏదో ఒక లోటు.
ఒకరికి
విద్య కావాలి.
ఇంకొకరికి
వైద్యం కావాలి.
మరొకరికి
నివాసం కావాలి.
మరికొందరికి
ఉపాధికావాలి.
కొన్ని
సమూహాలకు ఆత్మగౌరం కావాలి.
ముస్లింలకు
కూడా ఇవన్నీ కావాలి.
కానీ,
అంతకన్నా ముందు వారికి ఆత్మరక్షణ కావాలి.
బయటికి
వెళ్ళినవాళ్ళు ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం లేని ఒక అభద్ర వాతావరణంలో ముస్లింలు బతుకుతున్నారు.
మొన్న
ఝార్ఖండ్ లో, నిన్న అస్సామ్ లో రోడ్డు మీద అడ్డగించి చంపేశారు.
ఈరోజు
కూడా దేశంలో ఇలాంటిది ఎక్కడా జరగలేదని చెప్పలేని పరిస్థితి.
స్కూటర్
మీదో, కారు మీదో, రైల్లో ప్రయాణం చేస్తుంటేనో నలుగురు హఠాత్తుగా దాడి చేస్తున్నారు.
నీ దగ్గర గొడ్డు మాసం వుందంటున్నారు. లేదని డిక్కీ విప్పి చూపినా నమ్మడంలేదు.
ఇవ్వాళ
లేకపోతే నిన్న తిని వుంటావుగా? అని నిందిస్తున్నారు.
ఆరోపణ
వారిదే తీర్పూ వారిదే తీర్పును అమలు చేసేపనీ వారిదే.
విచారణలేదు,
నిజ నిర్ధారణలేదు. అడిగేవాడూ లేడు.
కేంద్ర
ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది.
మహాత్మా
గాంధీజీ సబర్మతీ ఆశ్రమంలో ప్రధాని మోదీ ఈ గోగ్రవాదులకు హెచ్చరికలు చేస్తారు.
ఆయన
పార్టీ మనుషులే ముస్లీంల మీద దాడులు చేస్తారు.
కోర్టుల్లో
న్యాయమూర్తులూ వాళ్ళే, పబ్లిక్ ప్రాసిక్యూటర్లూ
వారే, న్యాయవాదులూ వాళ్ళే, పోలీసులూ వాళ్ళే.
దాడులు
చేసినవాళ్ళు దర్జాగా బయటికి వచ్చేస్తున్నారు.
ఇలాంటి
స్థితిలో మాకోసం మీరుండండి; మీకోసం మేము వుంటాం.
ఎవరికీ
వారే అనుకుంటే మేము వుండము. మీరూ వుండరు.
ఆలోచించండి.
No comments:
Post a Comment