Keep
Sangh Parivar dictatorship out of power
సంఘపరివార
నియంతృత్వాన్ని నిలవరించడమే నేటి కర్తవ్యం!
Muslim Intellectual’s Meet
Organised
by Integrated Forum for Muslim Rights
Guntur,
14th Novamber 2018
సదస్సు చివర్లో
నేను చాలా క్లుప్తంగా మాట్లాడాను.
నా ప్రసంగ
పాఠం ఇది.
అస్సలాం అలైకుమ్
!
చట్ట
సభల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలనేది ఒక అందమైన కల. ఇప్పుడు
మనం చూస్తున్నవి విధానపరమైన (policy) ఎన్నికలు కావు; ఆర్థికపరమైన( finance )ఎన్నికలు.
పెద్ద
పార్టీలు టిక్కెట్లు ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యేకు అయ్యే ఎన్నికల ఖర్చు సగటున పదిహేను కోట్ల
రూపాయలు వుంటుంది. టిక్కెట్టు పొందినవాళ్ళు ఓ ఐదారు కోట్ల రూపాయలు అయినా స్వంతంగా ఖర్చుపెట్ట
గలిగి వుండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలకు ఇవన్నీ neither economically viable
nor politically feasible. ముస్లింలలో ఎవరో నలుగురికో ఐదుగురికో మాత్రమే అలాంటి సామర్థ్యం వుంటుంది. వాళ్లు ఎలాగూ టెక్కెట్లు
తెచ్చుకుంటారు. ఎన్నికల్లో గెలుస్తారు.
130
కోట్ల మన దేశ జనాభాలో ఈరోజు ఒక్క ఐదు శాతం తప్ప 95 శాతం మంది సమస్యల్లో వున్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ
నూట ఒక్క సమస్యలు వున్నాయి. ముస్లింలకు రెండు వందల ఒక్క సమస్యలున్నాయి. ముస్లింల సమస్యలకూ,
ఇతర ప్రజా సమూహాల సమస్యలకూ కారణం ఒక్కటే; మూలం ఒక్కటే. పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వం. దీనినే ఇంగ్లీషులో Capitalist
Communal Dictatorship అంటారు. సులభ భాషలో ఫాసిజం
అంటున్నారు. భారత దేశంలో సంఘపరివార
నియంతృత్వం అనవచ్చు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ పరిపాలనని గద్దె దించే రాజకీయ వ్యూహాలను
ఈ సదస్సు చర్చించకపోవడం విచారకరం.
ముందు
మనం ఆలోచించాల్సింది సంఘపరివార నియంతృత్వాన్ని ఎలా అంతం చేయాలి అనేది. ఇది ముస్లింలు ఒక్కరి సమస్యేకాదు; దేశ ప్రజలందరి
సమస్య. ఈ సమస్య మీద అనేక రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక సంస్థలు పోరాడుతున్నాయి. వాళ్లతో కలవకుండ, అసలు సమస్యను వదిలేస్తే మిగిలిందంతా
ఎన్నటికీ సాకారంకాని ఒక అందమైన కల గానే వుండిపోతుంది.
సంఘపరివార
నియంతృత్వాన్ని ఎదురించే క్రమంలో సాటి బాధిత ప్రజల సంఘీభావాన్నీ, నమ్మకాన్నీ, సౌభాతృత్వాన్నీ పొందగలిగితే సహజంగానే ముస్లిం అభ్యర్ర్థులకు
ఓట్లు, సీట్లు, ప్రాతినిథ్యం అన్నీ పెరుగుతాయి.
అల్ హందు
లిల్హా !
No comments:
Post a Comment