Friday, 26 June 2020

కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం గురించి ఐదు అంశాలు


కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం గురించి ఐదు అంశాలు
27  జూన్ 2010
సాయి కుమార్ అనిశెట్టి !
ఈ సందర్భంగా ఐదు అంశాలను క్లుప్తంగా చెప్పాల్సివుంది.
మొదటిది; మీరు పైన పేర్కొన్నవాళ్లందరూ 1970వ దశకంలో కమ్యూనిస్టులుగా మొదలయ్యారు. ఆ తరువాత మాలాంటి ఇంకో తరం రాలేదని మీ పోస్టు చెపుతోంది.

రెండోది; నేను ఇంతవరకు రచనల మూలంగా ఏ ప్రభుత్వం నుండి కూడ ఎలాంటి రాయితీను పొందలేదు; ఏ అవార్డునూ స్వీకరించలేదు.

మూడోది; నాకు ఇప్పటికీ మార్క్సిజం, సోషలిజం అంటే చాలా ఇష్టం, ఇప్పటి కమ్యూనిస్టు పార్టీల మీద వాటికి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నవాళ్ళ మీద కొద్దిపాటి నమ్మకం కూడ లేదు.

నాలుగు; కులవ్యవస్థలోనూ శ్రామిక కులాలుంటాయి; మత వ్యవస్థలోనూ శ్రామిక మతాలుంటాయి. ఈ స్పృహ భారత కమ్యూనిస్టు పార్టీలకు ఇప్పటి వరకు లేదు.

ఐదు; భారత కమ్యూనిస్టు పార్టిలు వర్గ అణిచివేతను మాత్రమే గుర్తించి వర్గేతర అణిచివేతను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ఇప్పుడు మేము వర్గేతర అణిచివేతను పట్టించుకుంటున్నాము. కమ్యూనిస్టు పార్టీల నాయకులు  వందేళ్ళుగా వర్గ దోపిడినీ నిర్మూలించలేకపోయారు. వర్గేతర అణిచివేతనూ నిలవరించలేకపోయారు.

(Saye Kumar Anisetty
27 June 2020

4 hrs ·
విప్లవకర సోషలిస్ట్ భావాలున్నవనుకున్నవారు ,విప్లవ నిమగ్నత, నిభద్ధతఉండిన ,ప్రజానీకాన్ని ప్రభావితం చేసిన మేధావులు చాలామంది కుల బావన, మతభవాన, ప్రాంతీయత వంటి అస్తిత్వ వాదంలోకివెళ్లి దాన్ని అభ్యుదయం వైపు మళ్ళించడంపోయి, తామే అందులో నిలువునా కూరుకు పోతున్నారు. ఎంతో ఆరాధించే విప్లవ గాయని చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ అని చిందేయడం చూస్తే బాధ కలుగుతుంది. విప్లవ బోధకులు ఉ.సా, కాలువమల్లయ్య, అల్లం నారాయణ, మొన్ననే గద్దర్, అమరుడైన గూడ అంజయ్య,డానీ, బి.ఎస్ రాములు,….చాంతాడంత జాబితాఉంది. అనేకులు పాలక వర్గాలకు వత్తాసుగా వ్రాయటం కూడా జరుగుతోంది. …
వారు తమ సంపాదన పెంచుకోవచ్చు. తాము ప్రభావితం చేసిన వార్ని తము అప్పటిదాకా చెప్పిన మాటలన్నీ తప్పు అని చెప్పి వాళ్ళను బాధ పెట్టకుండా calm గా ఉండొచ్చు. కానీ ఇక్కడ భావజాలం ప్రధానం. వాళ్ళను అనుసరించే వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమనో, కులం లేదా మతమే ప్రధానమని చెప్పడం పై మాత్రమే అభ్యంతరం.

ఈ విషయమై తెలుగు సమాజంలో జరగాల్సినంత చర్చ జరగడంలేదు.)

Monday, 22 June 2020

Scarf is the Women's Protector


మహిళలకు రక్షణ స్కార్ఫ్
-       డానీ



          కరోనా వచ్చి షాహీన్ బాగ్ ఉద్యమం ఆగింది. ఇప్పుడు దాని నిర్వాహకుల మీద తీవ్ర నిర్భంధం కొనసాగుతోంది. హైదరాబాద్ కు చెందిన షాహీన్ ఎడ్యుకేషనల్ అకాడమీ విడుదల చేసిన ఒక వాణిజ్య ప్రకటన ఇప్పుడు వివాదంగా మారింది. ఇంటర్ లో తమ విద్యార్ధులు సాధించిన ర్యాంకుల గురించి ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటన అది. అందులో అమ్మాయిల ఫొటోలు వేయకుండ హిజబ్ బిట్ మ్యాపులు వేశారు. అమ్మాయిల ముఖాలను దాయడం కొత్త వివాదంగా మారింది. 

            దీన్ని ఒక కోణంలో చాదస్తం అనవచ్చు. కానీ, అకాడమీ వాళ్ళ ఉద్దేశ్యం వేరు. అమ్మాయిలు, అందులోనూ ముస్లిం అమ్మాయిలు. వాళ్ళ భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలు అంటారు అకాడమీ వాళ్ళు. ఇదేమీ కొట్టిపడేయదగ్గ వివరణ కాదు.

            ముస్లింలకు సంబంధించి ఏది జరిగినా ఒక వివాదాన్ని రేపేందుకు కొందరు సిధ్ధంగా వుంటారు.  లుకేమియాలా కొందరికి స్కార్ఫేమియా అనే వ్యాధి వుండును.  వారు బుర్ఖాలను భరించలేరు.  హిజబ్ బిట్ మ్యాపుల్ని చూడగానే వారికి ఎలర్జీ కలిగి సోషల్ మీడియా వీధుల్లో పరుగులు తీస్తుందురు.  

            భారతదేశంలో ముస్లిం మహిళల్ని ఉధ్ధరిస్తున్నామని అంతర్జాతీయ వేదికల మీద చాటుకునేందుకు ఉవ్విళ్ళూరే వ్యక్తులు కొందరుంటారు. అలా లోపలి నుండే  ముస్లిం సమాజాన్ని విమర్శిస్తే  ముస్లిమేతర సమూహాలు తమను ఆధునికులనీ, హేతువాదులనీ గౌరవిస్తారనే భ్రమల్లో వీరుంటారు.   సాంప్రదాయ ముస్లిం సమాజం వీరిని దగ్గరకు కూడా రానివ్వదు. మరోవైపు ఇతర సమాజాలు కూడ వీరిని ముస్లీం ప్రతినిధులుగా చూడవు. వీరు ఒక విధంగా రెంటికీ చెడ్డ రేవళ్లు. వాస్తవం ఏమంటే విద్యారంగంలో ముస్లిం మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్నది  సాంప్రదాయ ముస్లిం సంస్థలే. ఈ సోకాల్డ్ ఆధునికులు విద్యారంగంలో చేసే కృషి ఏమీ వుండదు.

            సాంస్కృతిక సాంప్రదాయాలు ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు ఒక భౌతిక అవసరంగానే ఆవిర్భవిస్తాయి. మొదట్లో అవి ఆరోగ్య సూత్రాలుగానే వుంటాయి.  వాటికి ప్రత్యామ్నాయాలు వచ్చాక కూడా అవి కొనసాగుతుంటే వాటిని సాంస్కృతిక  సాంప్రదాయం అంటారు. ఇళ్ళ ముందు ముగ్గులేయడం, కళ్ళాపి జల్లడం ఇవన్నీ ఒకప్పుడు క్రిమికీటకాదుల నుండి రక్షణ కోసం  ఏర్పడిన ఆరోగ్య సూత్రాలు.  ఫినాయిల్, డీడీటీలు అందుబాటులోనికి వచ్చాక వీటి అవసరం తీరిపోతుంది. అయినప్పటికీ అవి ఒక సాంస్కృతిక  సాంప్రదాయంగా కొనసాగుతుంటాయి.

            కరోనా వచ్చాక షేక్ హ్యాండ్లు వద్దు నమస్తే ముద్దు అని హిందువులు అంటున్నారు.  మాకు కూడా మాస్క్, పిపిఇ వంటి హిజబ్, బుర్ఖా సాంప్రదాయం ఆనాదిగా వుంది అని ముస్లింలు అంటున్నారు.  ముస్లింలలో సాంప్రదాయ పురుషులు సహితం ఒకరకం హిజాబ్ ధరిస్తారు. అది ఎడారి ప్రాంతంలో ఒక అవసరంగా వచ్చింది. ఇప్పుడు ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. రాజస్తాన్, గుజరాత్ ఎడారి ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడ వాళ్ళ పధ్ధతుల్లో పర్దా వేస్తారు. వాళ్ళు ఎడారిని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినా పర్దా సాంప్రదాయాన్ని మాత్రం  కొనసాగిస్తుంటారు.
మహిళలకు రక్షణ స్కార్ఫ్- 2
-       డానీ


            షాహీన్ కాలేజీ యాడ్ మీద అభ్యంతరానికి ఇంకో కారణం కూడ వుంది. అందులో అమ్మాయిల బొమ్మల్లో మాస్క్ లేదు. కరోనా కాలంలో దేశమంతా స్ త్రీలకేకాదు పురుషులకు కూడ ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు వచ్చాయి. అందరూ గంటకోసారి  హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. పూటకోసారి శానిటైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫుల్ ఫేస్ మాస్కులు కూడా వచ్చేశాయి. ఇప్పటికయితే డాక్టర్లు, నర్సులు మాత్రమే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ వాదుతున్నారు. రేపు సామాన్యులు సహితం  పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ పెట్టుకుని తిరగాల్సి రావచ్చు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే ఇది మన సాంప్రదాయ కాస్ట్యుమ్ అయిపోవచ్చు!.

            అంతెందుకూ హైదరాబాదీలు ఇష్టంగా తినే పానీపూరీలు, గప్ చుప్ లు ఒక ఆరోగ్య జాగ్రత్తగానే మొదలయ్యాయి. కలరాకు విరుగుడుగా నిజాం నవాబు వాటిని ప్రవేశపెట్టాడు. పుదీనా రసం, చింతపండు, మిరియాలు వగయిరా దినుసుల ద్రావణాన్ని తాగితే కలరా అదుపులోనికి వస్తుందని వైద్యులు చెప్పారట. ఆ ద్రావణాన్ని తాగడానికి వీలుగా పూరీలను జత చేశారు. కలరా తగ్గింది గానీ పానీ పూరీలు ఇష్టమైన స్నాక్స్ గా కొనసాగుతున్నాయి.

            ఒక ఇరవై ఏళ్లుగా హైదరాబాద్ ను గమనిస్తే ముస్లిమేతర స్త్రీలలో హిజాబ్ వేసే సాంప్రదాయం రోజురోజుకూ పెరుగుతోంది. దాన్ని వాళ్లు ఒక భద్రత ఏర్పాటుగా  భావిస్తున్నారు. ఆఫీసులు, కాలేజీలు వదలగానే ప్రతి మహిళా రోడ్డు మీద రావడానికి ముందు స్కార్ఫ్ / హిజాబ్ వేసుకుంటున్నారు. ఇది నిత్యం రోడ్ల మీద కళ్ళకు కనిపిస్తున్న దృశ్యం. ఇప్పుడు అసంఖ్యాక రంగుల్లో అసంఖ్యాక డిజైన్లలో స్కార్ఫులు మార్కెట్లో వున్నాయి. భారత మహిళలు విపరీతంగా ఆసక్తిని చూపుతుండడంతో ఆసియా ఖండపు కార్పొరేట్ దిగ్గజం ఆలీబాబా  సంస్థ భారిగా స్కార్ఫుల  ఉత్పత్తి మొదలెట్టి  షిప్పులతో ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏ మహిళలను అడిగినా చెప్పేది ఒక్కటే; మహిళల రక్షణ స్కార్ఫ్.  హిజాబ్ ఇప్పుడు ఎంతమాత్రం ముస్లిం మహిళలకు మాత్రమే పరికితమైన వ్యవహారం కాదు.
 
            ప్రతిదానికీ మరో కోణం వుంటుంది. సాంప్రదాయాన్ని సవరించాల్సిన సందర్భం కూడా ఒకటి వస్తుంది. సమాజ పురోగతికి సాంప్రదాయం అడ్డంకిగా వున్నప్పుడు తప్పనిసరిగా సంస్కరించాలి. అది సామాజిక అవసరం. దీనికి రెండు కండీషన్లు వుండాలి. హిజాబ్ వల్ల ముస్లిం స్త్రీలు వెనుకబడిపోతున్నట్టు చెప్పడానికి గణాంకాల ఆధారాలుండాలి. హిజాబ్ వల్ల తాము అణిచివేతకు గురవుతున్నట్టు ముస్లిం స్త్రీలు ఆందోళన వ్యక్తం చేస్తుండాలి.  

            ఒక ఔత్సాహిక (ఇంగ్లీషులో అమెచ్యూర్  అంటారు ) సంఘ సంస్కరణ సంస్థ ఆ మధ్య హైదరాబాద్ లో బుర్ఖాలు వేసుకునే స్త్రీల మీద ఒక సర్వే జరిపింది. అప్పుడు ముస్లిం అమ్మాయిలు ఇచ్చిన సమాధానాలు విని ఆ సర్వేరాయుళ్ళ పెద్ద మెదడు పగిలిపోయింది. “ఇతరులు మమ్మల్ని చూడలేరు; మేము మాత్రం మొత్తం ప్రపంచాన్ని చూస్తుంటాము. ఇదో థ్రిల్. ఇదో అడ్వాంటేజ్” అన్నారు వాళ్ళు. చాలామందికి తెలియని విషయం ఏమంటే ఆ బుర్ఖాల లోపల కాలేజీ అమ్మాయిలు, సాఫ్ట్ వేర్ అమ్మాయిలు చాలా మోడ్రన్ డ్రెస్సుల్లో కూడ వుంటారు. 

మహిళలకు రక్షణ స్కార్ఫ్- 3
-       డానీ

            రాజకీయ రంగంలో హిజబ్ కు ఒక గుర్తింపు వుంది. ఓ మూడేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును నియమించడానికి సన్నాహాలు మొదలెట్టింది. అందులో ఒక మహిళకు కూడా స్థానం కల్పించాలనుకున్నారు. ప్రభుత్వంలో ముస్లిం ప్రతినిధిగా వున్నాయన నన్ను విద్యాధికురాలయిన ఓ మహిళ పేరు చెప్పమన్నారు. అయితే దానికాయన ఓ కండీషన్ పెట్టారు.”హిజబ్ వుండాలిసుమా” అన్నారు. పురుషులకు స్కల్ క్యాప్ లేకపోయినా, మహిళలకు, హిజబ్ లేకపోయినా రాజకీయాల్లో ముస్లిం అనే గుర్తింపు వుండదు. ఒక ముస్లింగా ప్రభుత్వ సౌకర్యాలు పొందాలనుకునేవారు తాము ముస్లిం అని నిరూపించుకోవాల్సి వుంటుంది. ఇదొక చట్టపరమైన ఆబ్లిగేషన్. ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఇతర సామాజికవర్గాలకు కూడ వుంటాయి. ఎస్సీ రిజర్వేషన్లు పొందాలనుకునేవారు తాము హిందూ ఎస్సీలని ధృవపరచాల్సి వుంటుంది.

            బుర్ఖా హిజబ్ లు ముస్లింలకు ఐడెంటిటీగా మాత్రడమేగాక సోషల్ కేపిటల్ గానూ మారాయి. హిజబ్ వేసే మహిళలకు ముస్లిం సమాజంలో అదనపు గౌరవం లభిస్తున్నది. బుర్ఖాలు వేసుకుని ముస్లిం మహిళలు అనేక దేశాలను ఏలారు. ఆ రికార్డు ఇంతవరకు మరో సామాజికవర్గాలకు లేదు. ఇప్పుడు బుర్ఖా వేసుకుని బోయింగ్ విమానం నడుపుతున్న అమ్మాయి హైదరాబాదీయే!

            ముస్లిం ఆలోచనాపరులు హిజబ్ వివాదంలో వున్న సమయంలో ముస్లిమేతర ఆలోచనాపరులు ఇంకో కొత్త వివాదానికి తెర లేపారు. దేశంలోని శ్రామిక కులాలు, శ్రామిక మతాల మధ్య ఐక్యత ఏర్పడాలని మనం తరచుగా నినదిస్తుంటాము. అలాంటి ఐక్యత ఏర్పడితే ఎప్పుడో ఒకప్పుడు సమిష్టిగా రాజ్యాధికారం వస్తుందని నమ్మకం. సందర్భం వచ్చినప్పుడెల్లా ఎవరో ఒకరు ఈ ఐక్యతకు పుల్ల పెడుతూనే వున్నారు. ఒకటిమాత్రం నిజం ఈ ఐక్యతకు భంగం కలిగిస్తున్నది ముస్లిం ఆలోచనాపరులు మాత్రం కాదు. 

            జయధీర్ తిరుమలరావుగారు  తెలంగాణ రచయితల వేదిక నాయకులు. విద్యాధికులు.  పురాతత్వశాస్త్రంలో ప్రముఖులు. వారు హఠాత్తుగా “ముస్లింలలో చైతన్యం తక్కువ, అవగాహన తక్కువ, ముస్లిం ఆలోచనాపరుల్లో ఐక్యత లేదు” అంటూ ఈ హిజాబ్ మీద  చర్చ సందర్భంగా సోషల్ మీడియాలో బోల్డు కామెంట్స్ పెట్టారు.  

            ముస్లింలు వెనుకబడిన సమాజం; ముస్లిం మహిళలు ఇంకా వెనుకబడిన సమాజం అనేది ప్రచారంలోవున్న నేరేటివ్. అది వాస్తవంకాదు. ముస్లిం మహిళల నాయకత్వంలో సాగిన ఒక జాతీయ స్థాయి ఉద్యమం; షాహీన్ బాగ్. భారత ముస్లిం మహిళల చైతన్యానికి ఇది నిదర్శనం.  దేశవ్యాప్తంగా బుర్ఖాలతోనే ముస్లిం స్త్రీలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సఫూరా జర్గర్ వంటివాళ్ళు హిజబ్ తోనే తీహార్ జైల్లో వున్నారు.  షాహీన్ బాగ్ ఉద్యమంతో పోల్చదగ్గ జాతీయ స్థాయి మహిళా చైతన్య ఉద్యమం స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరొకటి వుందేమో చెప్పాలని నేను జయధీర్ తిరుమలరావుగారిని వినయంగా అడిగాను. వారు సమాధానం చెప్పలేదు.  పురాతన చరిత్రను తవ్వి తీసే ప్రొఫెసర్ కు మూడు నెలల క్రితపు ఒక చైతన్యయుత ఉద్యమం గురించి తెలీదా? లేక దాన్ని వారు దాచ దలిచారా? పైగా ‘ప్రగతిశీల హిందూ వాదులు’ ముస్లింల మీద  చేస్తున్న విమర్శల్ని పరిగణనలోనికి తీసుకోవాలంటూ వారు ఇంకో విచిత్ర వాదనను ముందుకు తెచ్చారు. 

            చైతన్యం స్థాయి తేలిపోయింది. ఇక ఐక్యత స్థాయి గురించి మాట్లాడుకుందాం. లోహియైట్ గా, అంబేడ్కరిస్టులుగా వీరావేశంతో ఊగిపోయిన రామ్ విలాస్ పాశ్వాన్, రామ్ దాస్ అధవాలే, ఉదిత్ రాజ్ వగయిరాలు ఇప్పుడు ఎక్కడున్నారూ వారి అభిప్రాయాలతో ప్రొఫెసర్ ఏకీభవిస్తున్నారా? నరేంద్ర మోదీజీ ప్రధాని అయ్యాక ఇతర శ్రామిక కులాలు, మతాలకు బిసి సమూహాలు దూరంగా జరుగుతున్న అంశాన్ని ఈ పురాతత్వ పరిశోధకులు గమనించారా? అది బలహీనవర్గాల ఐక్యతకు భంగకరమనీ,  చారిత్రక తప్పిదమని స్వీయ సమాజానికి పిలుపిచ్చారా?



మహిళలకు రక్షణ స్కార్ఫ్- 4
-       డానీ

            చర్చ జాతీయస్థాయిలో వద్దనుకుంటే ప్రాంతీయంగా తెలంగాణకే పరిమితమవుదాం. బ్రాహ్మణ వగయిరా పాలక సామాజికవర్గాలను కూడా మినహాయిద్దాము. జయధీర్ తిరుమలరావు ప్రాతినిధ్యం వహిస్తున్న  బిసి సామాజికవర్గాల ఆలోచనాపరుల వరకే పరిమితమై మాట్లాడుకుందాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరు మీద ఇతర బిసీ ఆలోచనాపరులతో అయినా  జయధీర్ కు ఏకాభిప్రాయం వుందా? సమాధానం బిగ్ నో.

            అన్ని సామాజికవర్గాల్లోనూ బేధాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు వుంటాయి. ఐక్యత అనైక్యతలు అన్ని సమూహాల్లోనూ వున్నాయి. వుంటాయి. వుండాలి. లేకుంటే మేధోమధనం, భావసంచయనం సాగదు. ఈ లాజిక్ ను మన ప్రొఫెసర్ మిస్సవుతున్నారు.

            షాహీన్ అకాడెమీ విడుదల చేసిన ఆ ప్రకటనను సరిగ్గా చూస్తే కొన్ని అందులో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఆ సంస్థలో మొత్తం 27 మంది విద్యార్దులు టాప్  ర్యాంకులు సాధించారు. వాళ్ళల్లో అబ్బాయిలు 12 మంది అమ్మాయిలు 15 మంది. ఫస్ట్ ర్యాంకు ఒక అబ్బాయికి వచ్చింది; ఒక అమ్మాయికీ వచ్చింది. ఆ యాడ్ లో ముగ్గురు అబ్బాయిల ఫొటోలకు కూడ బిట్ మ్యాపులే వేశారు. విద్యారంగంలో ముస్లిం అబ్బాయిలకన్నా అమ్మాయిలే గొప్ప మార్కులు సాధిస్తున్నారని ఈ యాడ్ చెప్పకనే చెపుతోంది. ఈ సంఘ సంస్కర్తలు దానిని గుర్తించదలచలేదు.

            ఇటీవల వెలుగులోనికి వచ్చిన రెండు విశేషాలను గుర్తు పెట్టుకోవాలి. మొదటిది; ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న కుటుంబాలు తమ పిల్లలకు హిజబ్, బుర్ఖాలను ప్రోత్సహిస్తున్నాయి. రెండోది; స్కార్ఫ్ సాంప్రదాయం లేని కుటుంబాలకన్నా స్కార్ఫ్ సాంప్రదాయంవున్న కుటుంబాల అమ్మాయిలు విద్యారంగంలో ముందంజలో వుంటున్నారు.  షాహీన్ అకాడెమీ విడుదల చేసిన ఆ ప్రకటన కూడ తాజాగా ఆ విషయాన్నే నిరూపిస్తున్నది.

            లోకంలో ఏదీ అనవసరంగా వుండదు. ప్రయోజనం వున్నవే వునికిలో వుంటాయి. ప్రయోజనం లేనివి అంతరించిపోతాయి. ఇది బేసిక్ సైన్స్. ఈ స్కార్ఫేమియా పీడితుల దగ్గర ప్రత్యామ్నాయ డ్రెస్ కోడ్ లేదు. వీళ్ళకు ముస్లిం అమ్మాయిల పురోగతి ముఖ్యం కాదు; స్కార్ఫ్ తీయించడం ముఖ్యం. ప్రపంచంలో ప్రతి మతానికీ ఒక డ్రెస్ కోడ్ వుంటుంది. అలాగే ప్రతి డ్రెస్ కోడ్ వెనక ఒక మతం వుంటుంది. ముస్లిం అమ్మాయిలు స్కార్ఫులు బుర్ఖాలు తీసేసి ఏ డ్రెస్సు కోడ్ ను స్వీకరించాలీ?  అయినా ఎవరూ ఏ డ్రెస్సు వేయాలో, ఏ తిండి తినాలో ఇతరులు నిర్ణయిస్తారా? ఇదేనా హేతువాదం? ఇదేనా ప్రగతిశీలత?

రచన  : 20 జూన్ 2020
ప్రచురణ : డానీ తెలుగు టీవీ, 22 జూన్ 2020

Friday, 19 June 2020

Now the Hash Tag is Social Capital

ఇప్పుడు హ్యాష్ ట్యాగ్  #సోషల్ క్యాపిటల్

Building Goodwill
Creating Social Capital
         
రచన నచ్చినపుడు
రచయిత నచ్చుతాడు   
రచయిత నచ్చినపుడు
అతని సామాజికవర్గం మీద సదభిప్రాయం కలుగుతుంది.

గుర్రం జాషువా
శివసాగర్
పద్యాలు, కవితలు చదివినపుడు
వాళ్ల మీద అభిమానం కలుగుతుంది.
అది వాళ్ళ  స్వీయసామాజికవర్గాలైన
దళితుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.
అలా ఆ సామాజిక వర్గాల మీద ఒక సానుకూల భావన ఏర్పడడానికి భూమిక సిధ్ధం అవుతుంది.  

లేకపోతే ఎస్సీ  సామాజికవర్గాల్ని అనాదిగా తక్కువ చేసి చూస్తున్న నేరేటివ్స్  మనలో స్థిరపడి కొనసాగుతుంటాయి.   

గురజాడ అప్పారావు శ్రీశ్రీ , కాళిపట్నం
ముందు వాళ్ళ రచనల్ని ప్రేమిస్తాం
తరువాత వాళ్ళను అభిమానిస్తాం.
ఆ పైన బ్రాహ్మణ సామాజికవర్గం  మీద ఒక సానుకూల దృక్పధాన్ని కూడ ఏర్పరచుకుంటాం.

అలా
తాపి ధర్మారావు వంటివారి
రచనల ద్వార
కాపు సామాజికవర్గం మీద

కట్టమంచి రామలింగారెడ్డి, కేవి రమణా రెడ్డి వంటివారి రచనల ద్వార
రెడ్డి  సామాజికవర్గం మీద

త్రిపురనేని రామస్వామి చౌదరి
నార్ల వేంకటేశ్వరరావు  వంటివారి రచనల ద్వార
కమ్మ  సామాజికవర్గం మీద

ఒక సానుకూల  భావన ఏర్పడుతుంది.

ముస్లిం ఆలోచనాపరులు ఇప్పటి అసహన వాతావరణంలో
అలాంటి సానుకూల భావనను
సృష్టించడానికి కృషిచేయాలి. 

1984 ఊచకోత తరువాత శిక్కులు
ప్రతీకార దాడులు చేయలేదు.
తమ మీద దాడిచేయాలన్నంత ద్వేషం ఇతరుల్లో ఎందుకు కలిగిందని ఆలోచించారు.

శిక్కేతరుల్లో శిక్కు సానుకూల భావనను కలిగించడానికి
ఒక ప్రణాళిక బధ్ధంగా ప్రయత్నించారు.

1986లో ఢిల్లీ వెళ్ళినపుడు ఒక విషయాన్ని గమనించాను.
అప్పటికి శిక్కుల మీద దాడులు సాగి ఏడాదిన్నర అయింది.
తిరిగి వచ్చే రోజు సాధారణంగా షాపింగ్ కు వెళతాం.
నేను మా ఆఫీసులో ఒకతన్ని తోడు రమ్మన్నాను.
అప్పట్లో ఢిల్లీ ఆటోరిక్షాలవాళ్ళు చాలా మోసకారులుగా వుండేవారు.
నాలుగు వీధులు తిప్పి వందరూపాయలు అయ్యిందనేవారు.
నా ఆఫీసు మిత్రుడు ఒక సలహా ఇచ్చాడు.
“నువ్వు సర్దార్జీ ఆటో ఎక్కు. నిన్ను కరెక్టుగా దింపుతాడు. కరెక్టు చార్జీ తీసుకుంటాడు. ఏదైనా రిపైర్ పని వున్నా సర్దార్జీ దగ్గరకు పో. ఏదైనా కొనాలన్నా సర్దార్జీ షాపుకు పో. మోసం వుండదు. క్వాలిటీకి తగ్గ కరెక్టు రేటు వుంటుంది” ఆ తరువాత చాలా తక్కువ సమయంలోనే ఢిల్లీలో శిక్కులు అన్ని రంగాల్లోనూ పుంజుకున్నారు.

ఇప్పుడు ముస్లింలు ఆ మార్గంలో నడవాలి. లేకుంటే వాళ్లు వ్యాపారాలు వాణిజ్య కార్యకలాపాలు చేసుకోలేరు.  

భారత దేశం ఎవ్వరూ ఎవ్వరితోను కులం మతం తెలియకుండ ఐదు నిముషాలకు మించి మాట్లాడలేరు.

వాళ్ళ కులం మతం గురించి తెలియగానే  మనకు ఆ సామాజికవర్గంలో పుట్టిన ఒక గొప్ప ఆలోచనాపరుడు గుర్తుకు వస్తాడు.
ఆ మహానుభావుని మీద వుండే గౌరవంతో అతనితో సంభాషిస్తాము.

ఓ శిక్కు  పరిచయం కాగానే మనకు భగత్ సింగ్, ఉధ్ధాం సింగ్, గుర్తుకు వస్తారు. వాళ్ళ మీదున్న అభిమానాన్ని ఎంతో కొంత కొత్తగా పరిచయ అయిన వారి మీద కూడ చూపిస్తాం.

Intellectuals are goodwill ambasidors of their own communities.

సరస్వతివున్న చోట లక్ష్మీ వుండదంటారు.  
అది నిజమే కావచ్చుగానీ
ఆలోచనాపరుడు ఒక సామాజిక పెట్టుబడిని సృష్టిస్తాడు.
అది కొన్ని చోట్ల ఆర్ధిక పెట్టుబడీకన్నా గొప్పగా పనిచేస్తుంది.

ఇదొక సామాజిక సూత్రం.

సామాజిక సూత్రాలు గణితశాస్త్ర సూత్రాలంత కఛ్ఛితంగా వుండవన్న మాట నిజమే. 
అయినా సమాజానికి,
మనుషుల ప్రవర్తనకు
కూడ కొన్ని సూత్రాలుంటాయి.

వెనుకబడిన సమూహాలకు
సామాజిక పెట్టుబడి,
సామాజిక ఆమోదాంశాన్ని
నిర్మించడం తెలీదు.

ఒక సామాజికవర్గం వెనుకబడి వున్నదని తేల్చడానికి
ఒక కొలమానం వుంది.
ఆ సమూహానికి తమ  ఆలోచనాపరుడు ఎవరో తెలియకపోయి అయినా వుండాలి. .
ఒకవేళ  ఆలోచనాపరుడు లేకుంటే
అలాంటి వాడ్ని  తామే సృష్టించుకోవాలని
తెలియకపోయి అయినా వుండాలి.

అభివృధ్ధి చెందిన సమూహాలు
ఒక ప్రణాళిక బధ్ధంగా
Goodwill building మీద
Social capital మీద దృష్టిపెడతాయి.
దానికోసం కొంత బడ్జెట్ ను కేటాయిస్తాయి.  


దీనికి ఇంగ్లీషి సాహిత్యంలో ఒక గొప్ప ఉదాహరణ వుంది.

19వ శతాబ్దపు బ్రిటీష్ మహారచయిత ఛార్లెస్ డికెన్స్
సోషలిస్టు భావాలు కలవాడు.
పెట్టుబడీదారీ వ్యవస్థకు
బధ్ధ  వ్యతిరేకి.

నెలకోసారి డికెన్స్ తాను రాసిన నవలా భాగాలను ఒక ఆడిటోరియంలో స్వయంగా చదివి వినిపించేవాడు.
దానికి డబ్బున్నోళ్ళు టిక్కెట్లు కొని  మరీ వచ్చేవారు.
‘ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్’ లో లేడీ గెరిల్లా   మేడం డిఫార్జ్ పాత్ర గుర్తుందిగా. ధనవంతుల తెగిపడ్డ తలకాయల్ని లెఖ్ఖబెడుతుంటుంది.
నవల్లోని అలాంటి  సంఘటనల్ని డికెన్స్ చదువుతున్నప్పుడు కొందరు ధనిక స్త్రీలు భయపడిపోయి వెర్రి కేకలు వేసేవారు. మూర్చపోయేవారట.
డికెన్స్ ను అంతగా ద్వేషించేవారు డికెన్స్ షోకు అంతగా ఎందుకు వెళ్ళేవారూ?
దీనికి ఒక లాజిక్కు వుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో “మీరు భలే లంజకొడుకండీ బాబూ’ అని మర్యాదగా తిట్టుకున్నట్టు; డికెన్స్ పాత్రలు చాలా మర్యాదగా మాట్లాడుకుంటాయి.

‘గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్’ లో కథానాయకుడు పిప్ తన గ్రామాన్ని వదిలి మొదటిసారి లండన్ కు వస్తాడు.
అతను లండన్ చేరే సమయానికి చీకటి పడిపోతుంది.
ఒక జట్కావాడు వచ్చి ఎక్కడికి పోవాలి అని అడుగుతాడు.
ఫలానా లాయర్ గారి ఇంటికి పోవాలి.
“లాయర్ గారి ఇల్లు నాకు తెలుసండి. ఆయన చాలా మంచోరు” అంటాడు జట్కావాడు.
బేరం ఆడకుండ జట్కా ఎక్కుతాడు పిప్.
లాయర్ ఇంటికి చేరుతారు.
“లైటు వెలుగుతోంది. లాయర్ గారు అఫీసులోనే వున్నారు. మీ పని వెంతనే అయిపోతుంది” అంటాడు జట్కావాడు.
తనే పిప్  సామాన్లు లోపల పెడతాడు.
దబ్బులు ఇవ్వాల్సి వచ్చినపుడు “నేను నీకు ఎంత రుణపడ్డానూ?’ అని అడుగుతాడు హీరో.
“అబ్బే ఎంతో కాదండి. మామూలుగా అయితే పది పెన్నీలు. అంతకన్నా ఎక్కువ ఇవ్వాలనుకుంటే మీ దయ అండి” అంటాడు.

ప్రపంచంలో ఎక్కడా జట్కావాడు, ప్రయాణీకుడు ఇంత మర్యాదగా మాట్లాడుకోరు. డికెన్స్ అలా రాస్తాడు.
డికెన్స్ వాళ్లకు వ్యతిరేకే కావచ్చు. అయినా అతని రచనల్ని  ప్రమోట్ చేయడంలో బ్రిటీష్ పెట్టుబడీదారులకు మూడు దశల్లో మూడు ప్రయోజనాలున్నాయి.

మొదటిది, డికెన్స్ రచనలవల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు మీద ఆసక్తి పెరుగుతుంది.
రెండు; బ్రిటీష్ వాళ్ళు ఇంతటి మర్యాదస్తులు అని ప్రపంచం నమ్ముతుంది.
మూడు; అలా ఏర్పడిన సానుకూల వాతావరణం బ్రిటీష్ ఉత్పత్తులకు మార్కెట్ గా మారి తమకు లాభాలను తెచ్చి పెడుతుంది.  

అభివృధ్ధి చెందిన సామాజికవర్గాల్లో సాంస్కృతిక ప్రోత్సాహం ఒక ప్రస్పుట లక్షణంగా వుంటుంది.

ఈ సాంప్రదాయాన్ని బలహీనవర్గాలు అనుసరించాలి.















ముగింపు

ఎస్టీలు, ఎస్సీలు, బిసిలు, మైనారిటీలు తదితర అణగారినవర్గాలు తరచూ రాజ్యాధికారం గురించి మాట్లాడుతుంటారు.

అదేమీ పిల్లల ఆటబొమ్మ కాదు ఎవరో తెచ్చిఇవ్వడానికి.
“రాజ్యాధికారం” నినాదం రాజ్యాంగం వచ్చిననాటి వున్నది.
కొత్తగా వచ్చిన హక్కులకన్నా పోతున్న హక్కులే ఎక్కువ.

రాజ్యాధికారాన్ని సాధించడానికి అనేకం కావాలి.

వాటిల్లో మొదటిది సోషల్ కేపిటల్.
ఆ తరువాత ఎకనామికల్ కేపిటల్
ఆ తరువాత పొలిటికల్ కేపిటల్.

మొదటి రెండు లాంఛనాలను పూర్తి చేయకుండ  రాజ్యాధికారం ఎన్నటికీ రాదు.

ఇప్పుడు హ్యాష్ ట్యాగ్
#సోషల్ క్యాపిటల్.

రచన : 17 జూన్ 2020
ప్రసారం : 18 జూన్ 2020
(హర్యాలీ ఆన్ లైన్ వీక్లీ ప్రోగ్రాం

The Birth of Modern Muslim Minoritism

ఆధునిక
ముస్లిం మైనారిటీవాదం

ఆవిర్భావం 
డానీ

20200618 PUTTUMACHCHA
Key Words and Tags
Topic : Muslim Intellectuals :
Building Goodwill and
Creating Social Capital          

Haryali Programme
18th June 2020 Thursday
8 p.m. to 9 p.m.

1. Formal Intro
5 Mnts       

Good Evening
నమస్కారం
అస్సలాము అలైలుమ్

హర్యాలి
స్కైబాబా,
షాజహానాలకు
ధన్యవాదాలు.      

కరోనా లాక్ డౌన్
ఆరోగ్య సమస్య గా మొదలు
సామాజిక సమస్యగా మార్పు

క్లినికల్ డిస్టాన్స్ - ఫిజికల్ డిస్టాన్స్     
ఫిజికల్ డిస్టాన్స్  - సోషల్ డిస్టాన్స్
సోషల్ డిస్టాన్స్  - సోషల్ బోయ్ కాట్         

సంపన్నులు
ఎగువ మధ్యతరగతికి
ఇది లాంగ్ లీవ్ / LTA

దిగువ మధ్యతరగతి
పేదలు శ్రామికుల బతుకు 
కష్టాల కడలి         

Migrant labourers 
Mass displaced labourers
వలస కూలీలు నరకం

ఇంత ఘోరం జరుగుతుంటే
పౌరసమాజం నిరసన తెలపాలి

సభలు సమావేశాలు బంద్
సామాజిక వాతావరం
సెల్ఫ్ ఎమర్జెన్సీలా మారింది

ఇలాంటి సమయంలో
సోషల్ మీడియాను
సంపూర్ణంగా వాడుకోవాలి.       

మాదాసు  వినోదిని సంతకం,
షాజహానా- స్కైబాబా హర్యాలి
అపర్ణ తోట ఇష్టమైన పుస్తకం
అందరికీ అభినందనలు

పది రోజుల క్రితం
స్కైబాబ
పుట్టుమచ్చ పరామర్శ
ప్రతి పాదన           

సామాజిక రాజకీయార్థిక రంగాల మీద
నాకు కొంత అధ్యయనం వుంది

కవిత్వం నా subject  కాదు.
పెద్దగా కవిత్వాన్ని చదవలేదు

టాపిక్ -‘పుట్టుమచ్చకనుక
కవి ఖాదర్ కనుక
ఒప్పుకున్నాను.

       
2. పుట్టుమచ్చ పుట్టుక
5 Mnts.      

ఖాదర్ మొహియుద్దీన్
1991 ఫిబ్రవరిలో  పూర్తి చేశాడు

పుట్టుమచ్చ పుట్టి  ఇది 30 సంవత్సరం   
ఇది పరిచయం కాదు పరామర్శ.

2016 లో పాతికేళ్ళ  పుట్టుమచ్చ
సంబరం జరిగింది. 
2016 మే 8 ప్రజ్వలిత సంస్థ  తెనాలి
ఖాదర్ కు సాహితీ సేవామూర్తి
అవార్డు ప్రదానం.

సభలో నేను కూడ ఒక వక్త
ఆంధ్రజ్యోతిలో ప్రసంగ పాఠం  


నేను పుట్టక ముందే
దేశద్రోహుల జాబితాలో
నమోదైవుంది నా పేరు 

పుట్టుమచ్చ  పుట్టక ముందే
శ్రోతల జాబితాలో
నమోదైవుంది నా పేరు  

‘పుట్టుమచ్చ ‘ను రాస్తున్న కాలంలోనే
చాలాసార్లు  చదివి వినిపించేవాడు.

అంతకు ముందు ఖాదర్ వేరు.
తరువాత ఖాదర్ వేరు.

కవిగా సౌమ్యుడు
మనిషిగా మర్యాదస్తుడు

కవిత్వంలో కొంచెం
శృంగార దృష్టి కూడ వుండేది. 

వేళ్ళ కాళ్ళని నగ్నంగా బారజాపి
తపస్సు చేస్తున్న చెట్లు” -  సంధ్య    

తొడల్ని ఎడం చేసుసుకుని
నగ్నంగా పడుకున్న ఆడదిలా వుంటుందినది - పుంస్త్రీలింగం

సాంప్రదాయం నుండి
ఒక్కసారిగా అస్తిత్వవాదం వైపుకు మళ్ళడం కష్టం        

సమాజంలో
నేను అందరి వాడిని
అనడం చాలా సులువు

నేను కొందరివాడిని
అనడం చాలా కష్టం.     

నేను మెజారిటీ వాడిని
అనడం సులువు.
నేను మైనారిటీ వాడిని       
చాలా అనడం కష్టం.
         
అలా అనడం ఇప్పటికన్నా
1990లో ఇంకా కష్టం.
















3. సాహిత్యకారులపై
సన్నిహిత సమాజం ప్రభావం
5 mnts       

కవులు, రచయితల  చుట్టూ సన్నిహితులు, మిత్రులు
సహోద్యోగులు బంధువులు

అది రచయితకు
సన్నిహిత సమాజం,
ఒక సామాజిక నిర్మాణం.

సమాజం నిర్మాణం
సాహిత్యకారుల రచనల్ని ప్ర్తభావితం చేస్తాయి.

చుట్టూ వున్నవాళ్ళ
మనోభావాలు దెబ్బతింటే.      
రచయితల  సామాజిక నిర్మాణం మొత్తంగా కూలిపోతుంది

అస్తిత్వవాద రచన అంటే కాగితం మీద పెన్ను పెట్టుకుని
రాయడం కాదు    

It is not mere typing an article through keyboard on the computer; it is a major shift from the old social base for a new one.

అప్పట్లో ఖాదర్ చుట్టూవున్న సమాజం దాని నిర్మాణం
కమ్యూనిజం.        

మన సమాజంలో కులం మతం లేనివాడు ఎవరూ వుండరు.

కొందరు ఒప్పుకుంటారు.
కొందరు ఒప్పుకోరు
తమకు కులం మతం వుందని కమ్యూనిస్టులకు కూడ తెలుసు
బాహాటంగా ఒప్పుకోరు.

కులమతాలను
ప్రత్యక్ష్యంగా  కాకపోయినా
ప్రఛ్ఛన్నంగా కొనసాగిస్తుంటారు.
ఇదొక హిప్పోక్రసీ / బూటకం

ఇందులో అక్కడక్కడ అతి స్వల్ప మినహాయింపులు వుండవచ్చు.
మత విశ్వాసానికీ, మత తత్వానికీ తేడాని వివరించలేని కాలం  అది.

సమర్ధిస్తున్నవాళ్లని వదులుకోవాలి. సమర్ధించే వాళ్లని వెతుక్కోవాలి.

కవి ఖాదర్ మొహిద్దీన్
సాహసం చేశాడు.
స్వీయ సమాజం మీద తపన కారణంగానే సాహసం చేయగలిగాడు.      

ఇతర భారతీయ భాషల్లో ముస్లిం కవులు ఏం చేశారో నాకు తెలీదు.
 
తెలుగు కవిత్వం వరకు అయితే ఖాదర్ చాలా సాహసోపేతంగా        
ఆ పనిచేశాడు.

He bell the cat. 








4. పుట్టుమచ్చ
రాజకీయ నేపథ్యం
10 Mnts.    

భావ కవిత్వం
ఆత్మాశ్రయ  కవిత్వం
కొలిచే ప్రమాణాలు వేరు
అస్తిత్వవాద కవిత్వాన్ని కొలిచే ప్రమాణాలు వేరు.

ఇతర కవిత్వాన్ని భాష  పటిమ
వ్యక్తీకరణ నైపుణ్యంతో
కొలిస్తే సరిపొతుంది.     

అస్తిత్వవాద సాహిత్యాన్ని కొలవడానికి కూడా భాష  పటిమ
వ్యక్తీకరణ నైపుణ్యం  కావాలి.
కానీ అవి మాత్రమే సరిపోవు
రాజకీయ, ఆర్థిక సామాజిక
సాంస్కృతిక కొలమానాలూ కావాలి.

నిజానికి రెండవదే ముఖ్యం.  

1990 నాటి రాజకీయ సన్నివేశం అర్థం కాకుండ పుట్టుమచ్చ అర్థం కాదు.          

1990 సెప్టెంబరులో బిజెపి అధ్యక్షులు
ఎల్ కే అడ్వాణి రామ్ రథయాత్ర
టొయోటా వ్యాను ఆధునిక అశ్వమేధయాగం        
ప్రధాని విపి సింగ్  
ముస్లిం సంతుష్టీకరణ
Muslim Appeasement
 
ముస్లింలకు సర్కారు బడుల్లో చదువు
సర్కారుదవాఖానాలో వైద్యం
అంతకు మించి హక్కులు లేవు.
నో రిజర్వేషన్స్- ప్రమోషన్స్
చట్ట సభల్లో స్థానం వుండకూడదు
ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి

మరి ముస్లింల స్థానం ఏమిటీ?
హిందీ హిందూ హిందూస్తాన్
ముస్లిం జావో పాకిస్తాన్”
“ముసల్మాన్ కే దోహిస్తాన్
పాకిస్తాన్ యా ఖబరస్తాన్”

1990 అక్టోబరు నెలలో
అద్వాణీ  యాగాశ్వం
ఆంధ్ర ప్రదేశ్ కూ,  కృష్ణాజిల్లాకూ

అప్పుడు నేను
డెక్కన్ క్రానికల్ స్టాఫ్ రిపోర్టర్
జగ్గయ్యపేట నుండి
హనుమాన్ జంక్షన్ వరకు  
విజయవాడలో ఓ రాత్రి బస
ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్

“All are equal Muslims are more equal”   

అడ్వాణీ రథయాత్ర సాగిన దారెంటా ముస్లీంల మీద హింసాత్మక
దాడులు  అల్లర్లు,
మరణాలు, లూటీలు,   

బాధను మౌనంగా దిగమింగడమేతప్ప  తప్ప నోరు తెరిచే అవకాశం లేదు. భారత ముస్లీం సమాజం
నోట్లో గుడ్డ కుక్కుకుని
తనలోతాను కుమిలిపోతున్నదశ 

Religion is the sigh of the oppressed creature -  Karl Marx 
అణగారిన జీవులకు మతం
ఒక నిట్టూర్పు వంటిది 
“Feed the hungry and visit a sick person, and free the captive, if he be unjustly confined. Assist any person oppressed, whether Muslim or non-Muslim.”
- Prophet Muhammad

విషాద సన్నివేశంలో
ముస్లీం సమాజానికి ఒక నిట్టూర్పు అవకాశాన్ని ఖాదర్ ఇచ్చాడు. బాధాతప్త భారత ముస్లిం సమాజపు
కవితాత్మక నిట్టూర్పుపుట్టుమచ్చ’
         
         
         
         
         
         






















4.       దేశవిభజన శిలువ
5 mnts       

1947 దేశ విభజన

ముస్లిం నాయకులు
మాత్రమేనా కారకులు

హిందూ నాయకులకు
బాధ్యత లేదా?
మహాత్ముడ్ని గాడ్సే
ఎందుకు హత్య చేసినట్టూ?

పంజాబ్ రెండు ముక్కలు
బెంగాల్ రెండుముక్కలు
రెండు రాష్ట్రాల్లోనే
ఇటువాళ్ళు అటు వెళ్ళారు
అటువాళ్ళు ఇటు వచ్చారు     

మిగిలిన రాష్ట్రాల్లో
పాకిస్తాన్ మీద ఆసక్తి చూపిన ముస్లింలు చాలా చాలా తక్కువ

కొత్తగా ఏర్పడిన భారత దేశాన్నే
మాతృభూమిగా నమ్ముకుని  
ఇక్కడే వుండిపోయిన
ముస్లింలు అత్యధికులు

అయినా ఆనాటి ముస్లింల మీద
దేశవిభజన నిందను మోపారు.
సరే ఆ తరం ఆలా వెళ్ళిపోయింది.

“1947 ఆగస్టు 10 నా పుట్టిన తేదీ
అంటుంది పుట్టుమచ్చ
ప్రారంభ వాక్యాల్లోనే     

తాను స్వాతంత్ర్యానంతర
తరానికి చెందిన ముస్లింనని చెప్పడం కవి లక్ష్యం
స్వతంత్ర భారత దేశంలో పుట్టిన ముస్లింలకూ నిందలు తప్పలే ..

“నాయింట కన్ను తెరచిన
నవజాత శిశువు తెగ్గోసుకున్న
తల్లిపేగు చివర     తడియారని నెత్తుటిబొట్టులో 1947ని దర్శిస్తుంది వర్తమానం
         
                   

































5. విశిష్టతత్వం నుండి విశ్వగతత్వం  వరకు
10 mnts.
                   
 కృష్ణాజిల్లాలో ఒక మారు మూల కుగ్రామం మావూరుఅంటూ
మొదలయ్యే పుట్టుమచ్చ కావ్యం
నడక ముందుకు సాగాక
         
ఖండఖండాలుగా నరికి
నిలువునా నన్ను నిర్మూలించి          
అఖండ భారతంనిర్మించాలని కలలు గనడం కుట్రకాదు’’
అంటుంది వెటకారంగా.          

పుట్టిన ఊరు నుండి
అఖండ భారతం వరకు
ఆఫ్ఘనిస్తాన్ నుండి మయన్మార్  వరకు
వ్యక్తి నుండి సమాజం వరకు
విశిష్టగతం నుండి విశ్వగతం వరకు

Individual to society
Specific to general
Particularity universality
సమకాలీనత నుండి సర్వకాలీనత

ఈ క్రమాన్ని, ఈ ప్రయాణాన్నీ
పరిణామాన్ని సాధించినపుడే
కవితకు విశ్వజనీనత లభిస్తుంది.
నా అనుభవం నుండి ఒక ఉదాహరణ
సుప్రసిధ్ద నాటక రచయిత
ఎర్రమట్టి ఫేం యం జి రామారావు నాకు గురువుగారు
1972లో మాక్సిం గోర్కిఅమ్మ’ నవల
తెచ్చి ఇచ్చి “ఇది చదువు అన్నారు”
వారు అంతటితో ఊరుకోలేదు.   
“ఇది చదవని వాడు మనిషే కాడు” ప్రకటించారు.         

ఆ మాస్కో నగరం ఆ ఫ్యాక్టరీ గొట్టం బూడిద రంగు పొగ  
దట్టమైన మంచు
వణుకుతూ నడుస్తున్న మనుషులు

మనది నరసాపురం
సముద్రపు గట్టు.
మహా వేడి  చెమట
గాలిలో ఉప్పు తేమ
ఒళ్ళంతా జిడ్డు జిడ్డు
చెమట ఆరితే బట్టల
మీద ఉప్పు అట్టలు కట్టేది

నరసాపురానికీ మాస్కోకో
సీన్ మ్యాచ్ అయ్యేది కాదు.
ఊహకు కూడా అందేది కాదు.

ఎన్నిసార్లు ప్రయత్నించినా
 20 పేజీలను దాటగలిగేవాడిని కాదు.
గురువుగారు తిట్లు

ఒకరోజు దీక్షగా
30 పేజీలు వరకు వెళ్ళాను.
పావెల్ చర్చిలో గ్రిటార్ వాయించి అర్థరాత్రి మిత్రులతో మద్య సేవించి ఇంటికి వస్తాడు
అమ్మ ఏమీ అనదు
కొడుకును మంచం మీద పడుకోబెట్టి
తలుపు చాటున నిలబడి
రాత్రంతా మౌనంగా ఏడుస్తూ వుంటుంది.

అది మా ఇంట్లో సంఘటన
మా అమ్మ కోపిష్టి.
ప్రతి చిన్న తప్పుకూ నన్నూ కొట్టేది.
నేను మొదటిసారి మందుకొట్టి ఇంటికి వచ్చినపుడు విచిత్రంగా
మా అమ్మ నన్ను కొట్టలేదు.
మంచం మీద పడుకోబెట్టి
దుప్పటి కప్పింది.

నవలలో సన్నివేశం
మా అమ్మను గుర్తు చేసింది.
రాత్రి మా అమ్మ కూడా
మౌనంగా ఏడ్చి వుంటుందని పించింది.

సాహిత్యం మన చుట్టూ వున్నవాళ్ళను
లోతుగా అర్థం చేసుకోవడానికి
గొప్పగా తోడ్పడుతుంది.
సాహిత్య ప్రయోజనమే అది

  
ఇక కనెక్ట్ అయిపోయా.
Pelageya Nilovna Vlasova
సుఫియా బేగం అయిపోయింది.
Pavel Vlasov డానీ అయిపోయాడు.
నాన్ స్టాప్ గా గోర్కి అమ్మ చదివేశా.

రచన ఒకసారి 
Particularity universality
ప్రయాణాన్ని పూర్తి చేసేస్తే
రచయిత కూడ ఊహింవ్చని
అనేక అద్భుతాలుజరుగుతాయి.










6. ‘పుట్టుమచ్చ’ లో  సర్వకాలీనతత
5 mnts.
ఈరోజు పరామర్శించడం కోసం నిన్న రాత్రి ‘పుట్టుమచ్చ’ను
ఇంకోసారి చదివా.

“పోతపోసుకుంటున్న నా వ్యక్తిత్వం మీదికి వింత వింత భయాల్ని
ఉసిగొల్పి    నిర్ధాక్షిణ్యాంగా నన్ను చిత్రవధ చేసి సుడిగాలుల
పాల్జేసింది చరిత్ర”

“పవిత్రమైన పరాచికం నా పౌరసత్వం”

ఈ కవితా పంక్తులు గతం కాదు. వర్తమానం.
CAA NPR NRC  చట్టాలు ఇప్పుడు చేస్తున్నది అదేకదా?

“హిందీ హిందూ హిందుస్తాన్
(ముస్లిం భాగో పాకిస్తాన్) ఇప్పుడు రాజ్యాంగ సవరణకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
“రాజ్యాంగం నా భుజం తట్టదు”

రాజ్యాంగం అప్పుడు కొంచెమయినా
ముస్లింల భుజం తట్టిందేమోగానీ
ఇప్పుడు ముస్లింలను
మనుషులుగానే గుర్తించడంలేదు.

నేను పెళ్ళాడడం కుట్ర
పిల్లల్ని కనడం కుట్ర”

స్త్రీ పురుషుల మధ్య ఒక అనుబంధం ఏర్పడడానికి
మతం ప్రాతిపదిక కావాలా?
లేకుంటే Love Jihad అంటారా?
ఇదేం అమానవీయం?

“అసహనానికి ప్రతీకగా నాగురించి జరిగే ప్రచారాల్ని విని నవ్వుకుంటాను

అసహనం అనేమాట అప్పట్లో అంతగా ప్రాచూర్యంలో లేదు.

అఖ్లాఖ్, జునైద్, గౌరీ లంకేష్, కల్బుర్గీ, పన్సారేల హత్య తరువాత
అసహన వాతావరణం
ఒక ఆందోళనగా మారింది.


బాబ్రీ మసీదు కూల్చివేత
ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి అప్పుడు ఎజెండాలొ చేరాయి.  
ఇప్పుడు కార్యరూపం  దాల్చేశాయి.


అప్పుడు అడ్వాణీ ఒక major factor.
వాస్తవం మీద పుట్టుమచ్చ పుట్టింది.
ఇప్పుడు వాస్తవం లేదు.
ఇవ్వాళున్న అడ్వాణీ
అడ్వాణీ కాదు.
ఆయన వున్నా లేనట్టే.

వాస్తవం మారినా అందులోనుండి పుట్టిన సత్యం మిగులుతుంది.

వాస్తవం- సత్యం  
Fact and Truth

పుట్టుమచ్చ అలాంటి
అనేక సత్యాలను చెప్పింది.  
“పార్లమెంటు భవనంలో వాలేందుకు నా నెత్తురు పాదలేపనం అవుతుంది”.

మక్కా మసీదు పేలుళ్ళు
ఆసిఫా హత్యాచారం
ఇటీవలి ఢిల్లీ అల్లర్లు
వీటి నిందితులు ఇప్పుడు ఎక్కడున్నారూ?

వాస్తవం మారిపోయింది.
సత్యం మిగిలి వుంటుంది.
ఇదే సాహిత్య ప్రయోజనం
  
ఖాదర్ యుగకవా? మహాకవా?  
వంటి వాదనల్లోనికి నేను వెళ్ళను.    

వర్తమాన తెలుగు
ముస్లిం సమాజానికి
పుట్టుమచ్చమహాకావ్యం
ఖాదర్ ఆదికవి.
ఇందులో ఎవరికీ  సందేహాలు అభ్యంతరాలు వుండాల్సిన పనిలేదు.

















7. ‘పుట్టుమచ్చ’  పరంపర   
5 mnts.
పుట్టుమచ్చ తరువాత మళ్ళి రాయలేదు అనే
అసమ్మతో, అసంతృప్తో
విమర్శో ఖాదర్ మీద వుంది.

Magnum Opus Master Piece
స్థాయి రచన చేశాక
రచయితలను ఒకరకం భయం
మళ్ళీ ఆ స్థాయి రచనలు చేయగలమా?  
నాసిరకం రచన చేస్తే పాత పరువు పోతుందా?
అనే సందేహాలు వెంటాడుతాయి.
అలాంటి సమయాల్లో కొంత విరామం అనివార్యం అవుతుంది.

ఖాదర్ మరీ ఎక్కువ విరామం తీసుకున్నాడు.

ఒక ఎలుక పిల్లి మెడలో గంట కట్టాక
ఎలుక జాతికి ఒక మార్గం ఏర్పడుతుంది.
ఉత్సాహం ధైర్యం వస్తుంది.

‘పుట్టుమచ్చ’  ఆవిర్భవించాక
మార్గంలో ముస్లిం కవులు
అనేకులు విజృంభించారు.

అందరి పేర్లు చెప్పడం సాధ్యం కాదు.  నాకు గుర్తున్న కొందరు ప్రముఖుల పేర్ల వరకు ప్రస్తావిస్తాను.
ఖాజా, స్కైబాబా, షాజహానా, కరీముల్లా, అఫ్సర్, వాహెద్, యాకూబ్, ఇక్బాల్ చంద్,
వేంపల్లె షరీఫ్ ఇంకా అనేకులు.
“మేమంతా గోగోల్ ఓవర్ కోట్ నుండి ఊడపడ్డ వాళ్ళమే”

“నాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఒకవేళ వుంటే అతను టాల్ స్టాయ్ లా వుంటాడనుకుంటాను”  అన్నాడు మాక్సిం గోర్కి .

మాటల్ని కుర్ర రచయితగా వున్నప్పుడు చెప్పలేదు. అందరూ చనిపోయి తాను ప్రపంచ మహారచయితగా ఒక ఉజ్వల జీవితాన్ని ఆస్వాదిస్తున్న కాలంలో 
తన గురువుల్ని తలుచుకున్నాడు.

గోర్కి సాహిత్య సంస్కారం ప్రభావం
నామీద బలంగా వుంది.
వీలున్న చోటెల్లా  నా గురువుల్ని తలుచుకుంటాను.
అనేకమంది దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నాను.

సంస్కారం లేనివాళ్లు
సాంస్కృతిక రంగంలో
గొప్ప విలువల్ని ప్రవేశపెట్టలేరు.

ఎందుకో తరం తనకు గురువు ఎవరూ లేరని చెప్పుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతోంది.

గురువు లేనివారికి
శిష్యులు కూడా వుండరు.  
అదీ అసలు ప్రమాదం!






8. ముస్లింవాదానికి మాతృక ఏదీ?
10 mnts.
పుట్టుమచ్చకు వారసులున్నప్పుడు
దానికి మాతృక ఏదీ? అనేది ఎవరికైనా సరే రావలసిన సందేహం.

మరో విధంగా చెప్పాలంటే;
తెలుగులో ముస్లింవాదానికి  ప్రేరణ ఎక్కడి నుండి వచ్చిందీ? అనేది.

తెలుగు కవులు, రచయితలు, విమర్శకులకు ఎప్పుడో ఒకసారి ఈ సందేహం వచ్చే వుంటుంది.

కానీ ఎవ్వరూ దాన్ని నిర్ధారించేపని ఎప్పుడూ నిర్ధిష్టంగా చేయలేదు.

అయితే సాహిత్య సభల ప్రసంగాల్లో అనేకసార్లు
Passing statements వచ్చాయి.

దళితవాదం నుండి ముస్లింవాదం
పుట్టిందనేది వాటి narrative.  ఒకటికి నాలుగుసార్లు చెప్పడం వల్ల ది నిజమనే భావన కూడ మన సమాజంలో కొనసాగుతోంది.

డాక్టర్ సమీవుల్లా 2005 నవంబరులో ‘మైనార్టీ కవిత్వం తాత్విక నేపథ్యం’
పరిశోధనా వ్యాసం.

“దళితకవిత్వంలో అంతర్భాగంగా మొదలైన ముస్లిం కవిత్వం …” అని సిధ్ధాంతీ కరించాడు.  

ఈ ప్రకటన చాలా అస్పష్టంగా,  
గందరగోళంగా వుంది.
అంతర్భాగంగా మొదలవ్వడం ఏమిటీ?

ముస్లిం కవులు దళితకవుల్ని అనుసరించారన్నది సమీవుల్లా భావం.

ముస్లిం కవిత్వం వేరు; ముస్లింవాద కవిత్వం వేరు.

ముస్లిం కవిత్వానికి 13వ శతాబ్దపు అమీర్ ఖుస్రో మొదలు ఏడు వందల ఏళ్ళ సాంస్కృతిక వారసత్వం వుంది.

ముస్లింల అభ్యున్నది కోసం రాజకీయ చర్యను ప్రతిపాదించేది ముస్లిం వాదం.

వాదం అంటేనే రాజకీయ చర్య.

మనం ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగు సాహిత్యంలో ముస్లిం వాదం గురించి.

“మైనార్టీ కవిత్వానికి మ్యానిఫెస్టో అనదగ్గ కవిత తెలుగులో ఖాదర్ మొహియుద్దీన్ ‘పుట్టుమచ్చ’ – అని తనే ఆ గ్రంధంలో  రాశాడు.

అది దళిత కవిత్వంలో అంతర్భాగం అని నిరూపించాలిగా? ఆ పని చేయలేదు.

తెలుగులో ‘పుట్టుమచ్చ’కు దారి చూపిన దళిత  కవిత ఏదీ? ఆ కవి ఎవరూ?

ఈ వివరణ ఇచ్చే బాధ్యతను నిర్వహించలేదు.

గాల్లో వున్న అపోహల్ని విశ్వవిద్యాలయాల్లో స్థిరపరిచాడు సమీవుల్లా. ఇదొక మేధో నేరం.


సమీవుల్లా  పరిశోధన గ్రంధం మీద  నేను 2006 ఆరంభంలో ఆంధ్రజ్యోతిలో   సమీక్ష రాశాను. అప్పుడు ప్రశ్నలు లేవనెత్తాను         
ఇప్పటి వరకూ ఎవరూ సంతృప్తికరంగా సమాధానం చెప్పలేదు.

యూనివర్శిటీల్లో పరిశోధకులకు
గైడ్లు, రీడర్లు వుంటారు.  
గైడ్లకు కొన్ని ఆసక్తులు,
కొన్ని అభిప్రాయాలు,
కొన్ని అవసరాలు వుంటాయి.  
గైడ్ల అభిప్రాయాలే పరిశోధనల్లో ప్రతిబింబిస్తాయి.
రీసెర్చ్ స్కాలర్లు కూడ ఏమాత్రం క్రాస్ చెక్ చేసుకోరు.
గైడ్ మాటను జవదాటలేరు.
ధోరణిలో కొట్టుకు పోతుంటారు. 
అందుకే యూనివర్శిటీ పరిశోధనలు గాలికబుర్లుగా మారిపోతుంటాయి.     

ఇంతకీ తెలుగులో ముస్లింవాదానికి ప్రేరణ ఎక్కడి నుండి లభించింది అనేది కీలక మైన ప్రశ్న.

‘పుట్టుమచ్చ’ వరకు అయితే
అడ్వాణీ రామ్ రథ యాత్ర
దేశంలో సృష్టించిన
అసహన వాతావరణం
తక్షణ ప్రేరణ.

ఇంకొంచెం వెనక్కు వెళితే
1986లో రాజీవ్ గాంధీ  అయోధ్యలో రామమందిరం తలుపులు తెరవడంతో
బాబ్రీ మసీదు కూల్చివేత అంశం తెర మీదకు వచ్చింది.
అడ్వాణి రథయాత్రకు ప్రేరణే ఇది.

సరిగ్గా కాలంలోనే షాబానో మనోవర్తి కేసు దేశాన్ని కుదిపేసింది.
ఉమ్మడి పౌర స్మృతి అంశం అజెండాలోనికి వచ్చింది.

ముస్లిం రాజవంశాలు కొన్ని
భారత దేశాన్ని
అనేక ఏళ్ళు పాలించాయి.

కింది నుండి పై వరకు ముస్లింలదే రాజ్యం అని మనువాదులు అనవచ్చు.

రోజుల్లో కూడా
సామాన్య ముస్లింలు
సంతోషంగా లేరు; మావాడే చక్రవర్తి అనే వెర్రి ఆనందంతప్ప.

నిజాం నవాబు పాలనలో పేద ముస్లింల వైభోగం ఏమిటీ?
రైతాంగ తిరుగుబాటులో తొలి అమరుడు ముస్లిం బందగీ ఎందుకయ్యాడు?

అంతెందుకూ
దేశంలో ఇప్పుడు మనువాదుల పాలనే సాగుతోంది.
లాక్ డౌన్ కాలంలో వలస కార్మికుల పరిస్థితి ఏమిటీ?
వాళ్ళది పాలక మతం కాదా?
ముస్లిం రాజుల పాలనా  కాలంలోనూ సామాన్య ముస్లింలది అదే పరిస్థితి. 

ఘట్టం 1857తో ముగిసిపోయింది.
తరువాత భారత ముస్లింల సామాజిక చరిత్రంతా ‘పరాజితుల ఆక్రందన’.

తరువాతి ప్రధాన ఘట్టం
1947  దేశ విభజన.

పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు
కొందరు ముస్లింలు
సంతోషంగానే అక్కడికి పోయారు.

వాళ్లు అక్కడికి పోవడంవల్ల
ఇక్కడి వాళ్ళు ఇప్పటికీ
నిందలు మోస్తున్నారు.   

పోనీ అక్కడికి వెళ్ళీన వాళ్లయినా
సంతోషంగా వున్నారా? అంటే
అదీ లేదు.

వెళ్ళి వాళ్ళూ కష్టాల పాలయ్యారు.
వెళ్ళకుండ వీళ్ళూ ఇబ్బందుల పాలయ్యారు.

దేశ విభజన ఎవరికి లాభం?
అది రెండు విధాలా విషాదమే.
         
ఇప్పుడు పాకిస్తాన్
ఒక దేశం గానూ,
సమాజంగానూ
ఏ విధంగానూ
ఆదర్శం కాదు.     

ఒక వర్తమాన ముస్లిం ఆలోచనాపరునిగా
భారత ముస్లింవాదానికి మూలాలు
1984 నాటి శిక్కుల ఊచకోతలో వున్నాయి అనుకుంటాను.

అప్పట్లో నేను స్టీల్ బర్డ్ ఇంటర్నేషనల్      అనే ఆటోమోబైల్ సంస్థలో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాల ప్రతినిధిగా పని చేసేవాడిని
ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ.
తరచుగా ఢిల్లి వెళ్ళాల్సివచ్చేది.  

అలా నాకు

పంజాబ్ లో తిరుగుబాటు

Insurgency in Punjabను

ఢిల్లీ అల్లర్లను

పరిశీలించే అవకాశం దక్కింది.

శిక్కుల తరువాత మనువాదుల టార్గెట్ ముస్లీంలే అని నాకు 1984లో అర్థం అయింది.
ఆ ఏడాది అక్టోబరు మొదట్లో  ‘కృపాణ్’ కథ రాయడానికి నా ప్రేరణ అదే. ఇది ఢిల్లీ అల్లర్లకు ముందు రాసిన కథ.

సాహిత్య పరిశోధకులు
ఎక్కువగా కవిత్వాన్ని ఎంచుకుంటారు.
కవితల సైజు చిన్నది కనుక పరిశోధన సులువుగా వుంటుంది.

సమీవుల్లాకు ఒక మన్నింపు వుంది. ఆయన పరిశోధన కవిత్వానికే పరిమితం.
మేధోమధనం, వాదాల గురించి పరిశోధించేవారు కథలు, నవలలు, వ్యాసాల్నే కాదు ఉపన్యాసాల్ని కూడ పట్టించుకోవాలి.

షాబానో కేసు సందర్భంగా 1986 మే నెలలో‘స్త్రీ విముక్తి -ఉమ్మడి పౌరస్మృతి’ వ్యాసం రాశాను.    
1987లో నేను రాసిన ‘సాహిత్యంలో మతతత్వం’ సిధ్ధాంత వ్యాసాన్ని
ఉదయం దినపత్రిక ధ్వని పేజీలో 1988 ఫిబ్రవరి 8న
చాలా ప్రముఖంగా ప్రచురించింది.

ఈ వివరాలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నానంటే
దస్తరాలను సరిచేయడానికి.
అపోహలను తొలగించడానికి.

‘పుట్టుమచ్చ’ ప్రచురణలోనే మతసామరస్యం వుంది. దాన్ని రాసింది ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఖాదర్‌, ప్రచురించినవాళ్ళు హిందూ సామాజికవర్గానికి చెందిన త్రిపురనేని శ్రీనివాస్‌, రావి రాంప్రసాద్‌. ముస్లిం అస్తిత్వ వాదాన్ని చర్చకు పెట్టిన ‘పుట్టుమచ్చ’ కవితను అంకితం చేసింది రావి శేషయ్యగారికి.

ఇదీ మనం కోరుకునే భారత సమాజం.
మత సామరస్యం ముస్లింలకు ప్రాణవాయువు.
రచన : 17 జూన్ 2020
ప్రసారం : 18 జూన్ 2020
(హర్యాలీ ఆన్ లైన్ వీక్లీ ప్రోగ్రాం)