Amaravati Capital – 10 Points
అమరావతి రాజధాని – 10 అంశాలు
1.
రాయలసీమ,
ఉత్తరాంధ్రా మనోభావాలను పరిగణన లోనికి తీసుకోకుండ రాజధానికి చెందిన మూడు విభాగాలనూ
అమరావతిలోనే నెలకొల్పొడం అంటే మరోసారి రాష్ట్ర విభజనకు బీజాలు వేయడమే.
2.
అమరావతిలో
రాజధాని నిర్మాణానికి అనుసరించిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంగానీ, ల్యాండ్ పూలింగ్
స్కీం గానీ ఫక్తు రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్స్.
3.
ఎకరం
వ్యవసాయ భూమి ఇస్తే, దాన్ని నగరీకరించి, ఇప్పుడు
ఇచ్చిన ఎకరం భూమి విలువకు పది
రెట్లు ఎక్కువ ఖరీదు చేసే పావు ఎకరం భూమి ఇస్తానని భూ యజమానులను బిల్డర్ ఊరించాడు.
హైదరాబాద్ లో కూడ అలాంటి వెంచర్ వేసి సంపదను పెంచినట్టు బిల్డర్ చెప్పుకున్నాడు.
4.
“సంపద
పెంచుతాను” అనడం ఆ బిల్డర్ కంపెనీ క్యాప్షన్.
5.
సంపద
పెరుగుతుందంటే ఎవరికయినా సరే మనసు లాగుతుంది.
6.
గ్రామంలో
వ్యవసాయ భూమితో సరిపెట్టుకోవడంకన్నా రాజధాని నగరంలో కమ్మర్షియల్ ల్యాండ్ ను పొందడం
లాభదాయకం అనే ఆశతో భూ యజమానులు తమ భూముల్ని బిల్డర్ కు అప్పచెప్పారు.
7.
కాంపిటీటర్
వస్తే తన ప్రాజెక్టును అటక ఎక్కిస్తాడని తెలిసినా
పాత బిల్డర్ చట్ట బధ్ధంగా కనీస ప్రమాద నివారణ చర్యలు తీసుకోలేదు.
8.
బిల్డర్
సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయలేదు.
9.
బిల్డర్
చేతిలో భూయజమానులు నష్టపోయారు. వాళ్ళ మీద సానుభూతిని చూపాల్సిందే.
10.
విచిత్రం
ఏమంటే అమరావతి భూ యజమానులు ఇప్పటికీ పాత బిల్డర్ నే నమ్ముతున్నారు.
No comments:
Post a Comment