మత సమూహాలకు గీటురాయి ఏమిటీ?
మతవ్యవస్థలో మెజారిటీ సమూహం మైనారిటీ సమూహాలతో ఎలా వ్యవహరిస్తున్నాయి అన్నదే మతాలకు గీటురాయి కావాలి.
ప్రతి మతానికీ వాటి ప్రత్యేకతలు వాటికి వుంటాయి.
అయితే అవన్నీ గత కాలానికి సంబంధించినవి మాత్రమే. వర్తమానంలో ఒక మతం గొప్పది మరో మతం
చెడ్దది అని తీర్మానించడం చారిత్రక అపచారం.
మతాల పనితీరును పరిశీలించడానికి ఒక విధానం వుంది.
అవి ఆనాడు ప్రభోధించింది ఏమిటీ? అని తెలుసుకుంటే చాలదు. ఆ మత విశ్వాసులు మెజారిటీగా
వున్న దేశాల్లో మైనారిటీల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారన్నదే గీటురాయి.
బౌధ్ధాన్ని మనం పరిశీలించాల్సింది అది ఆనాడు ఏం
బోధించిందని కాదు; ఇప్పుడు మయన్మార్, శ్రీలంకల్లో బౌధ్ధ మెజారిటీ సమూహాలు అక్కడి మైనారిటీలతో
ఎలా వ్యవహరిస్తున్నాయన్నది ముఖ్యం.
అలా పరిశీలించినపుడు బౌధ్ధం ఏ విధంగానూ నాకు ప్రత్యేకంగా
గానీ, గొప్పగా గానీ అనిపించదు.
మతవ్యవస్థలో మెజారిటీ సమూహం మైనారిటీ సమూహాలతో ఎలా
వ్యవహరిస్తున్నాయి అన్నదే మతాలకు గీటురాయి కావాలి.
No comments:
Post a Comment