లోపలున్నప్పుడు అతను బిగ్ బ్రదర్; బయటికి వచ్చినపుడు హల్లో బ్రదర్.
ఆ రాష్ట్ర కమిటీ సభ్యుడ్ని పట్టించిన Judas మీద మొదటి నుండీ లోకల్ యూనిట్లలో అనేక విమర్శలు, అనుమానాలు వున్నాయి. అయినప్పటికీ ఆ రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రతి సందర్భంలోనూ Judasను అడ్డంగా సమర్ధిస్తూ పార్టీలో ప్రమోట్ చేస్తూ వచ్చాడు.
బయటి ప్రపంచం లోనికి రావడానికే తను ఈ అరెస్టు డ్రామాను రచించాడని నాకో అనుమానం కూడ వుంది. పోలీసులు అతన్ని అరెస్టు చేయాలనుకున్నారు; అతను అరెస్టు అవ్వాలనుకున్నాడు.
కేంద్ర మంత్రి కొడుకుని కిడ్నాప్ చేసి విడుదల చేసుకున్న ఏడాది దాటంగానే సదరు రాష్ట్ర కమిటీ సభ్యుడు లొంగిపోయి ప్రభుత్వ రివార్డును అందుకున్నాడు. ఆ డబ్బుతో నరసారావు పేటలో ‘హల్లో బ్రదర్’ అనే బట్టల దుకాణం నడిపాడు.
లోపలున్నప్పుడు అతను బిగ్ బ్రదర్; బయటికి వచ్చినపుడు హల్లో బ్రదర్. తెలంగాణ, రాయలసీమల గురించి నాకు లోతైన సమాచారం లేదుగానీ, కోస్తా ఆంధ్రా ప్రాంతంలో పీపుల్స్ వార్ వినాశనానికి కారకుడు ఇతనే. మహాలిటిగెంట్. వీర విప్లవకారునిగా కవితలు రాసి నిస్సిగ్గుగా లొంగిపోయిన కపటి.
భరద్వాజ ఎందుకో ఈ భాగాన్ని వదిలేశాడు.
No comments:
Post a Comment