Thursday 29 August 2024

Mao Zedong's Proposal of the New Democratic Revolution

 Mao Zedong's Proposal of the New Democratic Revolution

Mao Zedong proposed the concept of the New Democratic Revolution (NDR) in China during the late 1930s and early 1940s. The idea was formally outlined in his work "On New Democracy," written in January 1940. Mao's New Democratic Revolution was a strategic stage in the Chinese Communist Party's (CCP) path to socialism. It was designed to address the semi-feudal, semi-colonial nature of Chinese society by uniting various social classes, including the proletariat, peasantry, petty bourgeoisie, and national bourgeoisie, against imperialism and feudalism.

Key Aspects of the New Democratic Revolution:

  1. Anti-Imperialism and Anti-Feudalism:

    • The primary targets of the New Democratic Revolution were imperialism and feudalism. Mao saw these as the main obstacles to China's progress and national independence.
    • The revolution aimed to liberate China from foreign domination and dismantle the feudal structures that kept the majority of the population, particularly the peasantry, in poverty.
  2. Class Alliance:

    • Mao emphasized the importance of a broad alliance of classes, including the proletariat, peasantry, petty bourgeoisie, and national bourgeoisie, to achieve the goals of the New Democratic Revolution.
    • This alliance was seen as necessary to overthrow the ruling classes that were aligned with imperialist powers and feudal interests.
  3. Establishment of a New Democratic State:

    • Mao envisioned the creation of a New Democratic State that would be a coalition government of the revolutionary classes. This state would pave the way for socialism by implementing land reforms, promoting industrialization, and improving the living conditions of the people.
  4. Transition to Socialism:

    • The New Democratic Revolution was seen as a precursor to the socialist stage. After the successful completion of the NDR, the revolution would move towards socialism by gradually expropriating capitalist elements and establishing a socialist economy.

Applicability in Present-Day India:

The question of whether Mao's concept of the New Democratic Revolution is applicable to present-day India is complex and depends on various factors, including the socio-political context and the nature of the Indian state.

  1. Socio-Economic Context:

    • Unlike China in the 1930s and 1940s, India today is a democratic republic with a mixed economy. While India still faces issues of inequality, poverty, and regional disparities, the context is significantly different from the semi-feudal, semi-colonial conditions that Mao described.
    • India has undergone significant industrialization and urbanization, and while there are still remnants of feudal structures, they do not dominate the socio-political landscape as they did in pre-revolutionary China.
  2. Democratic Framework:

    • India operates within a democratic framework, with a constitution that guarantees rights and freedoms to its citizens. The political system, though imperfect, allows for change through electoral processes rather than revolutionary means.
    • In this context, a Maoist-style revolution may not be applicable or desirable, as it would undermine the democratic institutions that have been established.
  3. Revolutionary Movements in India:

    • However, there are still revolutionary movements in India, such as the Maoist insurgency (often referred to as Naxalism), which seeks to apply Maoist principles to the Indian context. These movements argue that India remains semi-feudal and that the state primarily serves the interests of the ruling classes.
    • These movements, however, have limited popular support and are largely confined to specific regions with severe socio-economic disparities, such as parts of central and eastern India.
  4. Alternative Approaches:

    • In the contemporary Indian context, addressing issues of inequality, poverty, and social justice might be more effectively pursued through reforms, social movements, and democratic processes rather than through a New Democratic Revolution.
    • Strategies could include land reforms, strengthening labor rights, improving access to education and healthcare, and ensuring that marginalized communities have a voice in the political process.

Conclusion

Mao Zedong's concept of the New Democratic Revolution was a response to the specific conditions of China in the early 20th century. While some aspects of his analysis may resonate with certain socio-economic issues in India today, the context is vastly different. India's democratic framework and mixed economy suggest that solutions to contemporary challenges might be better pursued through reformist and democratic means rather than revolutionary upheaval. The applicability of Maoist principles in modern India is a subject of debate, but it is clear that any such application would need to be carefully adapted to the unique conditions of the Indian state and society.

Sunday 25 August 2024

Godavari Water Hijack

 Godavari Water Hijack

అనుసంధానమా? అపహరణమా?

కావేరికి గోదావరి వాటర్ హైజాక్ 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు 

గోదావరి - కావేరి నదుల అనుసంధానం  ప్రాజెక్టు ఫైళ్ళు ఢిల్లీలో వేగంగా కదులుతున్నాయి. అప్పట్లో కేంద్ర జలవనరులశాఖా మంత్రిగా వున్న నితిన్ గడ్కరి 2017లో తొలిసారిగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.  2019 జనవరిలో స్వయంగా అమరావతి వచ్చి  60 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపడుతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన డిటేయిల్ ప్రాజెక్టు రిపోర్టు (DPR) కూడా సిధ్ధమైందన్నారు. 

నిజంగా వున్నాయోలేవో స్పష్టంగా తెలియని గోదావరి అదనపు జలాలే కావేరి అనుసంధానం ప్రాజెక్టు రూపకల్పనకు  ఆధారం.   ప్రతిఏటా 11 వందల టిఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రం పాలవుతున్నదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. చెన్నై సభలో నితిన్ గడ్కరి ఏకంగా ఏటా 3 వేల టిఎంసిల గోదావరి నీరు సముద్రం పాలవుతున్నదని ప్రకటించేశారు. 

జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాల్లో 90 శాతం నిధుల్ని అందించాల్సిన   బాధ్యత కేంద్రానిదే కనుక అప్పటి రాష్ట్ర (చంద్రబాబు) ప్రభుత్వం ఆనందించిందేగానీ, దీని వెనుక నున్న వాటర్ హైజాక్ కుట్రను గమనించలేదు. ఈ ప్రాజెక్టువల్ల తమిళనాడు, కర్ణాటక, పాండుచెర్రి రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే మాట నిజం. ఇందులో బిజెపికి రాజకీయ ప్రయోజనాలు కూడ వున్నాయి. అప్పట్లో కర్ణాటకలో బిజెపి  అధికారంలో వుంది. దక్షణాదిలో ఆ ఒక్క రాష్ట్రాన్ని అయినా కాపాడుకోకుంటే బిజెపికి ‘ఉత్తరాది హిందీ పార్టి’ అనే నింద తప్పదు. అలాగే గోదావరి నీటిని ఎరగా చూపి తమిళనాడులోనూ కాలు మోపాలనే ఆశ బిజెపిలో చాలా కాలంగా వుంది.    

ఈ ప్రాజెక్టువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాలకు సహితం మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడమే విచిత్రం. రెండు తెలుగు రాష్ట్రాలకు జరిగే మేలేమిటో ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే జల వివాదాలు నడుస్తున్నాయి. కావేరి అనుసంధానం  ప్రాజెక్టు ఈ వివాదాల్ని పరిష్కరిస్తుందా? మరింతగా పెంచుతుందా? అనేది ఈ సందర్భంగా ఎవరికయినా రావలసిన ప్రశ్న, 

1980 నాటి బచావత్ ట్రిబ్యూనల్ గోదావరి నదిలో 3,565 టిఎంసిల నికర జలాలున్నట్టు తేల్చింది. అప్పట్లొ గోదావరి నది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,  ఒరిస్సాల మీదుగా ప్రవహించేది.  ఇప్పుడు అదనంగా ఛత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. గోదావరి నది నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 1495 టిఎంసిలు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 సెక్షన్ 85లో  ఈ నీటిని జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ కు 64 శాతం, తెలంగాణకు 36 శాతం చొప్పున పంపిణి చేశారు. 

నదీజలాల పంపకాల్లో అంతర్జాతీయంగా పరివాహక ప్రాంతాన్ని (catchment area) బట్టి దేశాలు, రాష్ట్రాల వాటాల్ని నిర్ణయిస్తారు. ఏ ప్రాంతంవల్ల నదికి ఎంత నీరు వచ్చి చేరుతుందో ఆ ప్రాంతానికి అంత వాటా దక్కుతుంది. నదుల దిగువ ప్రాంతాలు వరదల్ని తట్టుకోవాల్సి వుంటుంది కనుక వాటికి కొన్ని హక్కులుంటాయి (lower riparian rights). అలాగే, నదుల మీద ముందుగా కట్టిన ప్రాజెక్టులకు ప్రత్యేక హక్కులుంటాయి. 

కృష్ణానది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తక్కువ. అయినప్పటికీ, బచావత్ ట్రిబ్యూనల్  కృష్ణానది నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ వాటా ఇచ్చింది. దానికి రెండు హేతువులు చెప్పింది. మొదటిది, కృష్ణానది మీద తొలి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడ్డాయి. రెండోది, నిర్మాణం పూర్తయి ఆయకట్టు కలిగున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపును ఇచ్చి తీరాలి. అయితే, దీనికో పరిష్కారం కూడ బచావత్ ట్రిబ్యూనల్  సూచించింది. భవిష్యత్తులో గోదావరిబేసిన్ నుండి కృష్ణాబేసిన్ కు నీటిని మళ్ళిస్తే, అందులో 18 శాతం మహారాష్ట్రకు, 27 శాతం కర్ణాటకకు కృష్ణా నికర జలాల నుండి ఇవ్వాలని ఓ నియమం పెట్టింది. 

పోలవరం నుండి 80 టిఎంసీల నీటిని కృష్ణా బేసిన్ కు మళ్ళిస్తే  అందులో 35 టిఎంసిలు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందుతాయి. మిగిలిన 45 టిఎంసీల్లో 36 శాతం అంటే 16  టిఎంసిలు తనకు వస్తుందని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. అంటే, పోలవరం నుండి మళ్ళించే 80 టిఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ కు నికరంగా దక్కేది 29 టిఎంసీలే. కృష్ణా గోదావరి నదుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  కు కేటాయించిన నికర జలాలను జనాభా ప్రాతిపదికన కాకుండా, పరివాహక ప్రాంతం ప్రాతిపదికన పంచాలని తెలంగాణ రాష్ట్రం ఇటీవల కొత్త పంచాయితీ పెట్టింది. 

గోదావరి నదికి ప్రధానంగా ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉపనదుల ద్వార నీరు వచ్చి చేరుతుంది.  తెలంగాణలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, ఇచ్చంపల్లి వద్ద ఇంద్రావతి, ఆంధ్రప్రదేశ్ లోని కూనవరం వద్ద శబరి నదులు కలుస్తాయి. 

గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో ముడు దశలున్నాయి. మొదటి దశలో ఇచ్చంపల్లి - నాగార్జునసాగర్ ల మధ్య  గోదావరి-కృష్ణా నదుల్ని అను సంధానం చేస్తారు. రెండో దశలో నాగార్జునసాగర్  సోమశిల ప్రాజెక్టుల మధ్య కృష్ణా పెన్నా నదుల్ని అనుసంధానం చేస్తారు. మూడవ దశలో సోమశిల నుండి కట్టలాయ్ మధ్య పెన్నా, కావేరి నదుల్ని అనుసంధానం చేస్తారు. పెన్నా- కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు 2022 కేంద్ర బడ్జెట్ లోనే నిధుల్ని కేటాయించారు. 

ఈ నాలుగు నదుల అనుసంధానానికి ముందు, ఆ తరువాత కూడ మరో మూడు నదుల అనుసంధానాలు వున్నాయి. ఉత్తరాన  మహానదిని గోదావరి నదితో అనుసంధానం చేస్తారు. దక్షణాన కావేరి నదిని తమిళనాడులోని వాగాయ్ (Vaigai), గుండార్ (Gundar) నదులతో  అనుసంధానం చేస్తారు. కావేరి-గుండార్ ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అయినప్పటికీ, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టేసింది. 

భారీ నీటి పారుదలా ప్రాజెక్టుల మీద దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పరస్పర విరుధ్ధమైన అభిప్రాయాలున్న్నాయి. పోలవరం ప్రాజెక్టును ‘ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్’ అని ఒక సమూహం అంటున్నది. పోలవరం ముంపు బాధితులయిన ఆదివాసులు దాన్ని ‘డెత్ లైన్’ అంటున్నారు. ముంపు బాధితులకు సంపూర్ణ సహాయ, పునరావాస (ఆర్ ఆర్) ప్యాకేజిని ఇచ్చిన తరువాతే ప్రాజెక్టును పూర్తి చేయాలని అడిగే గొంతుకలు కూడ ఏపి మైదాన ప్రాంతాల్లో లేవు. 

భారీ నీటి పారుదలా ప్రాజెక్టులకన్నా చిన్న తరహా ప్రాజెక్టులే మేలనేది ఇప్పుడు బలపడుతున్న అభిప్రాయం. నీటి పారుదలా ప్రాజెక్టుల్ని అట్టహాసంగా నిర్మిస్తారుగానీ వాటిని సమర్ధంగా నిర్వహిస్తున్న ఉదాహరణ మనకు ఒక్కటీ కనిపించదు. తుంగభద్రా డామ్ గేటు కొట్టుకొని పోవడం దీనికి తాజా ఉదాహరణ. స్టాప్ లాగ్ గేట్లు, కౌంటర్ వెయిట్ వ్యవస్థ, ఇతర పరికరాలు అదనంగా అందుబాటులో వుంచుకోవాలనే ఆలోచన కూడ నీటిపారుదలాశాఖ అధికారులకు రాలేదు. ఆ గేట్లకు కొన్నేళ్ళుగా కనీసం గ్రీజు కూడ పెట్టలేదట. 

నదుల అనుసంధానం వల్ల నాలుగు రకాల నష్టాలు వుంటాయి.  మొదటిది, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. రెండోది, నదులు, నీటి వనరుల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు వుండే హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనికి పోతాయి. మూడోది, జల వనరులపై వాణిజ్య హక్కుల్ని మెగా కార్పొరేట్లకు  అప్పగించడానికి దారులు తెరచుకుంటాయి నాలుగోది; ప్రతిఏటా నది నీళ్ళు సముద్రం లోనికి పారకపోతే సముద్రం నది వైపుకు దూసుకుని వచ్చి డెల్టా భూముల్ని చవిటి పర్రలుగా మార్చేస్తుంది.  

ఏపిలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గోదావరి – కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చింది. జులై నెలలో జరిగిన జాతీయ జలవనరుల అభివృధ్ధి సంస్థ (NWDA) వర్చువల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన చేసింది. గోదావరి- కావేరి అనుసంధానం ప్రాజెక్టును పోలవరం నుండి మొదలెట్టాలని కోరింది.  తెలంగాణలోని ఇచ్చంపల్లి, సమ్మకక-సారక్క ప్రాజెక్టుల నుండికన్నా  ఏపిలోని పోలవరం నుండి మొదలెడితే ఎక్కువ ప్రయోజనాలు వుంటాయని వివరించింది.  నరసారావుపేట సమీపాన బొల్లపల్లె వద్ద 300 టిఎంసిల రిజర్వాయర్ ను నిర్మిస్తే అక్కడి నుండి పెన్నా నదికి చాలా సులువుగా అనుసంధానం చేయవచ్చని సూచించింది.   

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో కొన్ని కొత్త చిక్కులున్నాయి. ఇందులో కీలకమైనది అసలు గోదావరి నదిలో వెయ్యి టిఎంసీల అదనపు జలలున్నాయని ఎలా ఎక్కడ ఎప్పుడు  నిర్ధారిస్తారు? గోదావరినది మీద చివరి ప్రాజెక్టు ధవిళేశ్వరం. అక్కడ తేల్చాలి అదనపు జలాలు వున్నాయో లేవో.  సాధారణంగా గోదావరి నదిలో ఎక్కువ నీళ్ళు ఆగస్టు నెలలో వస్తాయి. ఆగస్టు నెలలో  పోలవరం నుండి కావేరి ప్రాజెక్టుకు వెయ్యి టిఎంసీల నీళ్లు విడుదల చేసేస్తే, ఆ తరువాతి నెలల్లొ నదిలోనికి అనుకున్నంత నీరు రాకపోతే ఏమిటీ పరిస్థితీ? గోదావరి డెల్టా ఆయకట్టుకు 175 సంవత్సరాలుగా వున్న  లోయర్ రైపేరియన్  హక్కులు ఏం కావాలీ?  

జగన్మోహన్ రెడ్డి సర్కారు  గతంలో పోలవరం నుండి కావేరికి నీళ్లు తరలించాలని ప్రతిపాదించినపుడు నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీ రాం తిరస్కరించారు. గోదావరి నుండి తరలించేందుకు నికర జలాల్లో మిగులు ఏమీలేదు.   గోదావరి నికరజలాల్లో ఛత్తీస్ ఘడ్ కు 141 టియంసిల వాటా వుంది. దాన్ని ఆ రాష్ట్రం వాడుకోవడంలేదు. ఆ నీటిని కావేరికి తరలించాలని కొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి. ఛత్తీస్ ఘడ్  లో బిజెపి ప్రభుత్వమే వున్నా ఆ నీళ్ళు వదులుకోవడానికి ఆ రాష్ట్రం సిధ్ధంగా లేదు. గోదావరి- కావేరి ప్రాజెక్టులో ఇప్పటికి మూడు డిపిఆర్ లు వచ్చాయి. 

ఇప్పుడు ఎగువ రాష్ట్రాల నుండి ఇంకో సమస్య కూడా వస్తుంది.  గోదావరి బేసిన్ నుండి  కృష్ణా బేసిన్ కు వెయ్యి టిఎంసిల నీటిని మళ్ళిస్తే ఎగువ రాష్ట్రాలు అందులో వాటా కొరకుండా వుంటాయా? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బిజేపి రాజకీయ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్ని సాగునీటి సంక్షోభంలో నెట్టే పథకం ఇది. అంతేకాదు; ఎగువ రాష్ట్రాల నుండి ఇంకో సమస్య కూడా వస్తుంది.  గోదావరి బేసిన్ నుండి  కృష్ణా బేసిన్ కు వెయ్యి టిఎంసిల నీటిని మళ్ళిస్తే ఎగువ రాష్ట్రాలు అందులో వాటా కొరకుండా వుంటాయా? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బిజేపి రాజకీయ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్ని సాగునీటి సంక్షోభంలో నెట్టే పథకం ఇది. 

//EOM//

28-08-2024

ప్రచురణ : 30-08-2024 

https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=30/08/2024&pgid=454731&device=desktop&view=3


Communists failed to compete with the development of machines

Communists failed to compete with the development of machines

యంత్రాల అభివృద్ధితో పోటీ పడలేకపోయిన కమ్యూనిస్టులు  

కృత్రిమమేధ కాలంలో కమ్యూనిస్టులు

 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు.

 

“రెండుకాళ్ళ జీవులు ప్రమాదకరమైనవి; నాలుగుకాళ్ళ జీవులు  గొప్పవి” అని జార్జ్ ఆర్వెల్ నవల ‘యానిమల్ ఫార్మ్’ లో జంతువులన్నీ కలిసి ఒక తీర్మానం చేస్తాయి.

 

కాళ్ళు రెక్కలు తోకలు మాత్రమే కాదు సృష్టిలో  మనుషులకు ఇతర జీవులకు తేడాలను చూడాలనుకుంటే  అనేకానేక  వైవిధ్యాలు కనిపిస్తాయి. జంతువులు గుంపులుగా సంచరిస్తాయి; మనుషులు సమాజంగా కొనసాగుతారు.  ఇతర జీవులు సంతతిని కని వాటి జీవిక కోసం ఆహారాన్ని సేకరిస్తాయి. మనిషి ఆహార సేకరణతో ఆగిపోడు; అవసరమైనప్పుడు తానే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఉత్పత్తి అవసరాల కోసం పనిముట్లను, యంత్రాలను సృష్టిస్తాడు. ఇతర జీవులకు మనిషికి మధ్య ఇదే అన్నింటికన్నా ప్రధానమైన, గుణాత్మకమైన తేడా. 

 

‘పనిముట్లను తయారు చేసే జీవి మనిషే’ అని బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ (అమెరికా రాజనీతిజ్ఞుడు, రచయిత, శాస్త్రవేత్త 1706–90) అన్నాడు. ఆయన అంతటితో ఆగలేదు. ‘మనిషి సృష్టికర్త’ (Man the Maker), ‘మనిషి ఆలోచనాపరుడు’ (Man the Thinker) అని కూడా అన్నాడు.

 

తొలి పనిముట్ల నుంచి నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాఫ్ట్‌వేర్‌ దాకా యంత్రాల చరిత్రలో అనేక తరాలు సాగిపోయాయి. ప్రతి తరంలోనూ యంత్రాలు సమాజంలో కొత్త ఆలోచనల సంచయానికి కూడ దోహదం చేస్తాయి. పారిశ్రామిక విప్లవం సంభవించి వుండకపోతే డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్నీ, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణను, కార్ల్‌మార్క్స్ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయగలిగేవారు కాదు. యంత్రాల అభివృద్ధి–మనిషి ఆలోచనల విస్తృతి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది.

 

యంత్రాలు మానవ సంబంధాలను కూడ తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముందు అవి సంపద సృష్టికి దోహదపడతాయి. మరోవైపు,  సంపద పంపిణి మనుషుల్ని విభజిస్తుంది. కొన్ని సమూహాలు యజమానులుగా అవతరిస్తే మిగిలిన సమూహాలు సేవకులుగా మారిపోతారు. దీనికి మూలం ఆర్ధికమే కావచ్చుగానీ  యజమాని సేవకుల విభజన సమస్త రంగాల్లోనూ వుంటుంది.

 

యంత్రాలు వాళ్ళ ఆధినంలో వుంటాయి కనుక యజమాని సమూహం సహజంగానే తెలివైనదిగా మారుతుంది. ఏ రంగంలో అయినాసరే తమ ప్రయోజనాల గురించి యజమానులకు వున్నంత స్పృహ సేవకులకు వుండదు.   సకల రంగాల యజమానుల మధ్య  ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక ఐక్యత వుంటుంది. సకల వ్యవస్థల యజమానులు క్రమంగా  ఏకం అవుతుంటారు.

 

అన్ని రంగాలలోని సేవకులు తొలి దశలో తాము కూడ యజమానులయ్యేందుకు కొంత తాపత్రయ పడడం సహజం. సమాజంలో యజమానులయ్యే అవకాశం కొందరికి మాత్రమే వుంటుందనీ అత్యధికులు సేవకులుగానే వుండాల్సి వస్తుందని అర్ధం కావడానికి చాలా కాలం పడుతుంది. అప్పుడు సమాజంలో సమానత్వం, సోదరభావం అనే ఆలోచనలు అపారంగా వికసిస్తాయి. ఇలాంటి నేపథ్యంలోనే కమ్యూనిజం అనే సిధ్ధాంతం పుట్టింది.

 

"ప్రతి ఒక్కరి నుండి అతని సామర్థ్యం మేరకు, ప్రతి ఒక్కరికి అతని అవసరాలకు అనుగుణంగా"  ("From each according to his ability, to each according to his needs") అనేది కమ్యూనిస్టు సమాజానికి ప్రాధమిక కొలమానం. 1875లో రాసిన ‘గోథా కార్యక్రమం మీద విమర్శ’ పుస్తకంలో కార్ల్ మార్క్స్ ఈ వివరణ ఇచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా సేవక సమూహాలన్నింటిలోనూ స్పష్టంగానో అస్పష్టంగానో అంతర్లీనంగా ఇలాంటి భావనలే నిరంతరం బలపడుతుంటాయి. మరోమాటల్లో చెప్పాలంటే సేవక సమూహాలన్నింటి సమిష్టి స్వప్నం సమానత్వం.

 

ప్రపంచంలో ఎక్కడయినా సరే సేవక సమూహాలకు జీవితం దుర్భరంగా మారి సమిష్టి స్వప్నం ముందుకు వచ్చిన ప్రతీసారీ ఆందోళనలు మొదలవుతాయి. ఉద్యమాలు పోరాటాలు ఊపందుకుంటాయి. సేవక సమూహాల ఆందోళనల్ని అణిచివేయడానికి యజమాని సమూహాలకు అంతర్గతంగానే ఒక పటిష్టమైన వ్యవస్థ వుంటుంది. సాయుధ పోలీసులు, తుపాకులు, జైళ్లు, ఉరికొయ్యలు, నిఘా విభాగాలు వగయిరాలు వాళ్ళ ఆధీనంలోనే వుంటాయి.  అంతేకాదు; ఆందోళనల్ని నివారించడానికి ఇంతకన్నా మెరుగైన తెలివైన ప్రత్యామ్నాయాలు కూడ వాళ్ళ దగ్గర వుంటాయి.  అవే సంక్షేమ పథకాలు!.

 

సంక్షేమ పథకాల ద్వార సేవకుల తిరుగుబాట్లను నివారించవచ్చు అని తొలిసారిగా గుర్తించిన ఘనుడు అమెరిక  ఆటోమోబైల్ దిగ్గజం హెన్రీ ఫోర్డ్. రష్యాలో అక్టోబరు విప్లవం జరగడానికి మూడున్నరేళ్ళు ముందే 1914 జనవరి 5న తన కార్మికుల మీద వరాల జల్లు కురిపించాడు. ‘రోజుకు ఐదు డాలర్లు’ వేతనం ప్రకటించాడు ఆరోజుల్లో ఇది చాలా ఆకర్షణీయమైన జీతం.  8 గంటల పనిదినాన్ని అమల్లోని తెచ్చాడు. రోజుకు రెండు షిఫ్టుల పధ్ధతి స్థానంలో మూడు షిఫ్టుల పధ్ధతిని ప్రవేశ పెట్టాడు. సరుకుల తయారీలో శ్రమ విభజన సహజంగానే వుంటుంది. ఫోర్డ్ తన సిబ్బందిని  ఒక ఫ్యాక్టరీ కాంపౌండ్‍ కు పరిమితం చేయకుండా ఒక్కో దేశంలో ఒక్కో రకం యూనిట్ పెట్టాడు. అంటే శ్రమ విభజనతోపాటు శ్రామికుల్ని కూడ విభజించాడు. కార్మికులకు సౌకర్యవంతమైన నివాసం, మెరుగైన విద్యా, వైద్య సేవలు అందించాడు. దానితో ప్రపంచ వ్యాప్తంగా నిపుణులైన కార్మికులు ఫోర్డ్ సంస్థలో చేరడానికి పోటీ పడడం మొదలెట్టారు.  అంతకు మించి వాళ్ళు ఫోర్డుకు పరమ విధేయులుగా మారిపోయారు. ఫోర్డు సంస్థలో ఉత్పత్తి పెరిగింది, సరుకు నాణ్యత పెరిగింది, మార్కెట్లో పోటీ లేకుండా పోయింది,  అంతిమంగా కంపెనీకి లాభాలు పెరిగాయి.

 

     ఫోర్డ్ ఫార్మూలా పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లోనూ ప్రవేశించింది. అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్దీపన చర్యలు (affirmative actions) మొదలయ్యాయి. పైగా, సానుకూల వివక్ష (positive discrimination) అనే కొత్త విలువ కూడ ముందుకు వచ్చింది.

 

మనదేశంలో ఇప్పుడు అమలవుతున్న   ఉచిత బియ్యం, ఉచిత వైద్య ఆరోగ్య సేవలు, విద్యార్ధులకు ఫీజుల రీ-ఎంబర్స్ మెంట్, పేదలకు పక్కా ఇళ్ళు,  వ్యవసాయానికి సబ్సిడీలు, భూపరిమితి చట్టాలు, వ్యవసాయ కూలీలకు భూముల  పంపకాలు మొదలైన సంక్షేమ పథకాలన్నీ గతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్ బరీ ఉద్యమం, శ్రీకాకుళం గిరిజన పోరాటం, కరీంనగర్ ఆదిలాబాద్ నక్సలైట్ల పోరాటాల సందర్భంగా వివిధ కమ్యూనిస్టు పార్టీలు ముందుకు తెచ్చిన డిమాండ్లే. కమ్యూనిస్టుల డిమాండ్లను ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు హైజాక్ చేసి  ఎన్నికల హామీలుగా మార్చేసుకున్నాయి. ఏదో ఒక మేరకు అమలు కూడ చేస్తున్నాయి. దానితో పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం తగ్గి అవి  ‘అంతరించిపోతున్న జాతి’గా మారిపోయాయి. దీని అర్ధం దేశంలో కార్మికులు లేకుండాపోయారనీ, వాళ్ళ మీద పీడన లేదనీ కాదు. కొత్త పధ్ధతుల్లో కొత్త పీడన కొనసాగుతూనే వుంటుంది.

 

శ్రామిక సమూహాలను పునర్ నిర్వచించే చారిత్రక బాధ్యతను కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటి కప్పుడు నిర్వర్తిస్తుండాలి.  అవి ఆ బాధ్యతను మరచిపోయాయి. శ్రామిక సమూహాల బహుళ అస్తిత్వాలు కూడ భారత కమ్యూనిస్టు నాయకులకు అర్ధం కాలేదు. వ్యవసాయ కూలీలుగా వున్నప్పుడు ఎస్టి, ఎస్సీ, బిసి, మైనారిటీలను కమ్యూనిస్టు పార్టీలు గొప్పగా సమీకరించాయి. కాంగ్రెస్ తదితర పార్టీలకన్నా అణగారిన సమూగాలకు మెరుగైన రాజకీయ చైతన్యాన్ని అందించాయి. అయితే, ఆ సమూహాలు తమ సామాజిక ఉనికిని  ప్రదర్శించినపుడు కమ్యూనిస్టు పార్టీల నాయకులు దాన్ని ఒక అనివార్యమైన చారిత్రక పరిణామంగా గుర్తించలేకపోయారు. అసలు ఈ పరిణామాల్ని వాళ్ళు జీర్ణించుకోలేక పోయారు. ఇప్పుడు బహుజనులు వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు అనే అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది.

 

భారత కమ్యూనిస్టు నాయకుల్లో 1940లు, 50లలో ఒక వెలుగు వెలిగిన అగ్రనేతలందరూ వ్యవసాయిక కుటుంబాల నుండి వచ్చిన వారు. సహజంగానే వాళ్ళకు వ్యవసాయం, నీటిపారుదల గురించి  లోతుగా తెలుసు. కానీ అప్పటి ఆధునిక యంత్రాల గురించి వారికి అంతగా తెలీదు. నిజానికి అప్పటికి మన దేశంలో యంత్రాల వుపయోగం కూడ శైశవ దశలో వుంది. కమ్యూనిస్టు పార్టి నాయకుల మేధోశక్తి కూడ ఆ పరిమితుల్లోనే వుండింది. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, రావి నారాయణ రెడ్డి, మగ్ధూం మొహియుద్దీన్, చారుమజుందార్, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వర రావు, కొండపల్లి సీతారామయ్య, చండ్ర పుల్లారెడ్డి వంటి ప్రముఖుల పేర్లను మనం తరచూ వింటుంటాం.  యంత్రాలు విధించిన పరిమితుల కారణంగా వాళ్ళలో ఏ ఒక్కరూ తమకాలం నాటి సమాజాన్ని సమగ్రంగా విశ్లేషించలేపోయారు.

 

విప్లవం వ్యవసాయరంగంలో మొదలై, తొలుత గ్రామీణ ప్రాంతాలను విముక్తం చేసి, ఆ తరువాత పట్టణాలను విముక్తం చేస్తుందని వారంతా గట్టిగా నమ్మేరు. ఇప్పటికీ చాలామంది సీనియర్ కమ్యూనిస్టు అభిమానులు 1950ల నాటి ‘ఆంధ్రా థీసిస్’ను మహత్తర ప్రతిపాదనగా భావిస్తుంటారు. 1940లలో చైనాలో మావో ప్రతిపాదించిన నూతన ప్రజాస్వామిక విప్లవంకు అది ఇండియన్ వెర్షన్ తప్ప అందులో మన కమ్యూనిస్టు నేతలు జోడించిన సృజనాత్మకత పెద్దగా ఏమీ లేదు. దానినే తరువాతి కాలంలో మరికొంత స్థానిక అన్వయంతో కొండపల్లి సీతారామయ్య ‘వ్యవసాయిక విప్లవం’గా అభివృద్ధి చేశారు. అప్పటికే అత్యంత ఆధునిక, సంక్లిష్ట, యంత్రాల ప్రవేశంతో సమాజం సామాన్యులు విశ్లేషించలేనంత వైవిధ్యపూరితంగా మారిపోయింది. తత్కారణంగా కొండపల్లి ఫార్మూలా కూడ పనిచేయలేదు. 1990లలో తూర్పు యూరోప్, రష్యాల పతనాల తరువాత ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో నూతన ఆర్ధిక సంస్కరణలు ప్రవేశించాక కమ్యూనిస్టు నాయకుల నిస్సహాయత మరింత పెరిగింది.

 

 

అణగారిన సమూహాలు పాత పధ్ధతుల్లో జీవించలేని స్థితికి చేరడమేగాక,  ఆధిపత్య సమూహాలు సహితం పాత పధ్ధతుల్ని కొనసాగించలేని స్థితికి చేరుకున్నప్పుడే విప్లవం సంభవిస్తుంది అన్నాడు లెనిన్. విప్లవకర పరిస్థితి, విప్లవకర సిధ్ధాంతం (పార్టి), విప్లవించడానికి సిధ్ధపడిన ప్రజా సమూహాలు లేకుండా విప్లవం సాధ్యంకాదని కూడ ఆయనే అన్నాడు. ఇప్పటికి కూడ ఇదీ భారత సమాజపు సంపూర్ణ  స్వభావం, ఇందులో వీళ్లు వీళ్ళు విప్లవకర శక్తులు,  ఇదీ వీరు చేపట్టాల్సిన విముక్తి కార్యక్రమం అని తేల్చి చెప్పగలిగిన  కమ్యూనిస్టు పార్టి ఒక్కటీ ఈరోజు భారతదేశంలో  లేదు.  ఆత్యాధునిక యంత్రాల గురించీ, అవి సమాజం మీద వేస్తున్న ప్రభావాల గురించిన పరిజ్ఞానం లేనివాళ్ళు విప్లవ కార్యక్రమాన్ని ఎన్నడూ రూపొందించలేరు.

 

11-08-2024

//EOM//

 Published : 25-08-2024 Andhrajyothi 

https://www.andhrajyothy.com/2024/editorial/communists-in-the-age-of-artificial-intelligence-1301276.html

Thursday 1 August 2024

Karamchedu - People's War and Danny

 

కారంచేడు –పీపుల్స్ వార్ – డానీ

ఖమ్మం మిత్రుడు గుర్రం సీతారాములు మూడు రోజుల క్రితం ఫోన్ చేసి కారంచెడు ఉద్యమం గురించి అనేక వివరాలు అడిగాడు. అతను ఈ అంశం మీద ఒక పరిశోధనాత్మక గ్రంధాన్ని రాస్తున్నట్టున్నాడు. ఒక అరగంట తరువాత మా ఫోన్ కు సిగ్నలింగ్ ప్రాబ్లం వచ్చింది.

అప్పటి అనుభవాల్ని నేను తనకు పాయింట్ బై పాయింట్ రాసి పంపించాను.

ఆసక్తి గలవారు చదవవచ్చు.

 

 

డియర్ గుర్రం శ్రీరాములు

మొన్నటి మన ఫోన్ కాల్ మధ్యలో ఆగింది.

కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదని ముఖ్యమైన  విషయాలను రాతపూర్వకంగా స్పష్టం చేస్తున్నాను.

 

1.      1980లో నేను పీపుల్స్ వార్ లో హోల్ టైమర్ గానేగాక కృష్ణాజిల్లా కమిటీకి కార్యదర్శిగా వున్నాను.

2.      అయితే అది పూర్తిస్థాయి కమిటి కాదు. అడహాక్ గా వున్న కమిటి. నేను అడ్ హాక్ కార్యదర్శిని.

3.       ఆ ఏడాది డిసెంబరు నెలలోనే నాకు పీపుల్స్ వార్ కార్యక్రమం మీద, నాయకుల సమర్ధత మీద, వాళ్ళ నిజాయితీ మీద అనుమానాలొచ్చాయి. 

4.      పార్టీలో సైధ్ధాంతిక స్తోమతకన్నా విధేయులకు  పెద్దపీట వేస్తున్నారని అర్ధం అయింది.

5.      నేను ఘర్షణ పడకుండ కుటుంబ కారణాలు చెప్పి  1981 మే 1న హోల్ టైమర్ జీవితం నుండి సాధారణ జీవితం లోనికి వచ్చేశాను. మాలాంటి వాళ్ళను పార్ట్ టైమర్లు అనేవారు.

6.      నాకు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో వంశపారంపర్యంగా కొంత నైపుణ్యంవుంది.

7.      అంతకు ముందు ఉద్యమంలో ఆయుధాల విభాగంతో సహా అనేక విభాగాల్లో నేను కొన్ని టాస్కుల్ని విజయవంతంగా పూర్తిచేశాను.

8.      నేను బయటికి వచ్చే సమయంలో ఒకమాట చెప్పాను. ఛాలెంజింగ్ పని వచ్చినపుడు నాకు   కబురుపెట్టండి తప్పక వచ్చి పూర్తి చేస్తాను అన్నాను.

9.      అలాంటి సందర్భం ఒకటి కారంచేడు సందర్భంగా వారికి వచ్చింది.

10. కారంచెడు గ్రామంలోనే రాడికల్ యూనిట్ వుంది. ఐసాక్, ప్రభాకర్ తదితరులు వుండేవారు.

11. 1985 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా రాడికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్  AIRSF  మహాసభలకు కారంచెడు యూనిట్ కూడ వచ్చింది.

12. కారంచెడు సంఘటన 1985 జులై 16న మొదలై జులై17 ఉదయం దాడి జరిగింది.

13. గాయపడిన వారిని చీరాల ఆసుపత్రికి తరలించారు. బాధితులు చీరాల చర్చిలో ఆశ్రయం పొందారు. చీరాలలో అవి రెండూ దగ్గరలోనే  వుంటాయి.

14. ఈ వ్యవహారాన్ని మీడియా దృష్టికి తీసుకునివెళ్ళే ప్రయత్నం మొదట కారంచెడు-చీరాల రాడికల్సే చేశారు.

15. అనుకోకుండా ఆరోజు ఆ హాస్పిటల్ కూ వచ్చిన  కత్తి పద్మారావు మీడియా పనుల్ని చేపట్టారు.  ఇది రాడికల్స్ కు కూడ మేలు చేసింది.

16. అప్పట్లొ పీపుల్స్ వార్ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది. పౌరహక్కుల నాయకులకు కూడ రక్షణలేని సమయం అది.

17. అప్పట్లొ ప్రకాశం జిల్లాకు గురువయ్య అని ఒక ముసలాయన ఇన్ చార్జీగా వుండేవారు.

18. రీజినల్ కమిటి (RC) కి నిమలూరి భాస్కరరావు ఇన్ చార్జి. కృష్ణాజిల్లాకు సుధాకర్ – చెలం ఇన్ చార్జి.

19. నేను అప్పుడు ఆటోమోబైల్ రంగంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా వుంటున్నాను. టూర్ లో వున్నాను. ఎక్కడికి వెళ్ళినా సుధాకర్ కు కాంటాక్టులో వుండేవాడిని.

20. సంఘటన జరగ్గానే అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు చీరాల చర్చికి వచ్చారు. బాధితులు ముఖ్యమంత్రిని అడ్డుకున్నారు.

21. ఇది చర్చీవారికి నచ్చలేదు. వ్యవహారం రాజకీయంగా మారుతోందని భయపడి వారు బాధితుల్ని బయటికి పొమ్మన్నారు.

22. అప్పుడు ఐక్యనగర్ లో హుటాహుటిన ఒక ఇసకపర్ర కొని కొన్ని తాటాకు పాకలు వేశారు. దానికే విజయనగర్ కాలనీ అని పేరుపెట్టారు.

23. కారంచెడు ఉద్యమంలో ఐదు  సంఘాలున్నాయి. మొదటిది; కారంచెడు నుండి వచ్చిన బాధితులది. దీనికి తేళ్ళ జడ్సన్ నాయకుడు. ఇతనే కేంద్ర బిందువు.  రెండోది; కాంగ్రెస్ నాయకత్వం లోనిది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారంచెడు మాదిగ సామాజికవర్గం కాంగ్రెస్ కు ఓటేశారు.  మూడోది; క్రైస్తవుల నాయకత్వంలోనిది, నాలుగోది; కత్తి పద్మారావు బృందం నాయకత్వంలోనిది. ఐదవది; రాడికల్స్ నాయకత్వం లోనిది.

24. ఐక్య నగర్ లోని బొక్కా పరంజ్యోతి ఇల్లు ఉద్యమ కార్యాలయంగా వుండేది. పరంజ్యోతి ఏయూలో రాడికల్ నాయకుడు.

25.  కారెంచెడు సంఘటన జరగ్గానే పీపుల్స్ వార్  RC ద్రోణవల్లి అనసూయమ్మ, చలసాని ప్రసాద్ లను చీరాల పంపింది. వాళ్ళిద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడాన లోపలికి చొచ్చుకు పోలేకపోయారు. ఆ సమయంలో కమ్మ వ్యతిరేకత చాలా తీవ్రంగావుంది.

26. అప్పుడు RCకి నేను గుర్తుకు వచ్చాను. గతంలో నేను చేసిన వాగ్దానం కూడ గుర్తుకు వచ్చింది. చెలం / సుధాకర్ ద్వార నిమలూరి భాస్కర రావు నాకు కబురు పెట్టారు. దీనికి రెండు కారణాలున్నాయి. నేను లీడ్ తీసుకోగలను అనే నమ్మకం ఒకటి. నేను మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవాడిన కావడం మరొకటి.

27. అలాగే ప్రకాశం జిల్లా ఇన్ చార్జీగా గురువయ్యను తొలగించి బాలయ్య అనే కొత్తాయన్ను నియమించారు. నేను మరోమారు హోల్ టైమర్ కావడానికి నిర్ణయించుకున్నాను. దానికి కొన్నాళ్ళ ముందు ఢిల్లీలో జరిగిన శిక్కుల ఊచకోత నన్ను బాగా ప్రభావితం చేసింది. మైనారిటీల మీద జరుగుతున్న దాడుల మీద నేను ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలనుకున్నాను. కారంచెడు బాధితులు మతపరంగా క్రైస్తవులు.

28. నేను చీరాల చేరిన డేట్ సరిగ్గా చెప్పలేను. విజయనగర్ కాలని ఏర్పడిన రెండు మూడు రోజులకు అక్కడికి చేరాను. బహుశ అది జులై 22, 23 కావచ్చు.

29. కత్తి పద్మారావు, కాంగ్రెస్, చర్చి సంఘాల మధ్య నాయకత్వం కోసం గట్టి పోటీ నడుస్తోంది. చర్చికి అంతటి శక్తి లేదుగానీ కాంగ్రెస్ ఎంపి సలగల బెంజిమన్ కొడుకు సలగల రాజశేఖర్ ఉద్యమాన్ని తమ పార్టీ వైపుకు లాక్కోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కత్తి పద్మారావు మంచి వక్త. కానీ ఆయనకు ఉద్యమ వ్యూహాలు తెలియవు.

30. ఆ నిర్బంధ కాలంలో బహిరంగ  నాయకత్వం తీసుకునే అవకాశం పీపుల్స్ వార్ కు ఏమాత్రం లేదు.

31. మిగిలిన ముగ్గురిలో కత్తి పద్మారావు మెరుగైన ఛాయిస్ అని నేనూ , పరంజ్యోతి భావించాము. ఆ విషయాన్నే  పీపుల్స్ వార్ RCకి తెలియపరిచాము.  వాళ్ళూ సరే అన్నారు.

32. నేను వెళ్ళీన రోజు రాత్రే పరంజ్యోతి చొరవతో కత్తి పద్మారావుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాను.

33. కాంగ్రెస్, క్రైస్తవ సంఘం మనల్ని తట్టుకోలేదు.  రాడికల్స్  మొత్తంగా మీ వెనుక వుంటాము మీరు ముందుండి నడిపించండి. అని కత్తి పద్మారావుతో  ఒక అవగాహనకు వచ్చాం. ఈ సమావేశంలో ఏయూ ప్రొఫెసర్ సుబ్బారావు (అప్పటికి స్టూడెంట్) నాగార్జున యూనివర్శిటీ స్టూడెంట్ విష్ణు (ఇప్పుడు అడ్వకేట్) వున్నారు.

34. చాన్నాళ్ళు కత్తి పద్మారావుతో మా ఐక్యత చాలా బాగా  నడిచింది. ఆయన పోలీసులకు తెగ భయపడేవారు. వరంగల్లులో డాక్టర్ రామ నాధం హత్య తరువాత వారిలో భయం మరీ పెరిగింది. వారి కొసం ఒక సెక్యూరిటీ దళాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మన లాంటి పబ్లిక్ ఫిగర్స్ ను ఎన్ కౌంటర్ చేయరు అన్నా వారు నమ్మే వారు కాదు.

35. వియ్యంకూడు చెంచు రాయయ్య పాత్ర వివాదంగా మారడంతో ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు నైతికంగా ఇరకాటంలో పడ్డారు. పోలీసులు కూడ మమ్మల్ని హెర్రాస్ చేయలేదు. వచ్చేపోయేవారి మీద నిఘావుండేది. పికెట్స్ పెట్టి తనిఖీలు చేసేవారు. దురుసుగా మాత్రం లేరు.

36. ఆగస్టు 15న గడియారం స్థంభం దగ్గర బ్లాక్ డే నిర్వహించాము. కారంచెడు ఉద్యమంలో అదే తొలి బహిరంగ సభ.

37. అంతకు ముందు విజయనగరం శిబిరంలో కొన్ని సమావేశాలు జరిగేవి. అవి బహిరంగ సభలు కావు.

38. సెప్టెంబరు మొదటి వారంలో కత్తి పద్మారావు తారకం కలిసి దళిత మహాసభను నిర్వహించారు. ఇంతకు ముందే దళిత మహాసభ ఒకటి వుండివుండవచ్చు. అదేమీ పెద్ద విషయం కాదు. పీపుల్స్ వార్ రాడికల్స్  సంఘాలు పెట్టడానికి ముందే తిరుపతిలో ఒక రాడికల్ సంఘం వుంది. పెద్దవాళ్ళు చేపట్టినపుడే దేనికైనా పాపులారిటీ వస్తుంది.

39. ఉద్యమ్కాన్ని తీవ్రతరం చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ క్రైస్తవ సంఘాలు బయటికి పోయాయి. సెప్టేంబరు 10న రాస్తారోకో నిర్వహించాము. బస్సుల్ని ఎక్కడికక్కడ నిలిపివేశాము. మద్రాసు-విజయవాడ రూటులో అన్ని రైళ్ళనూ ఆపేశాము. కొన్ని చోట్ల బస్సుల్ని తగలబెట్టారు. కొన్ని చోట్ల రైల్వేస్టేషన్లకు నిప్పు పెట్టారు. అది ఉద్రిక్తంగా మారింది. నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుల పర్వం మొదలుకావడంతో కత్తి పద్మారావు మరీ భయపడిపోయారు.

40. అరెస్టయిన వారిని విడుదల చేయాలని సెప్టెంబరు 11 సాయంత్రం పెద్ద ఊరేగింపు తీశాము.

41. ఆ ఊరేగింపులో పాల్గొనడానికి కత్తి పద్మారావు ఇష్టపడలేదు.  

42. ఊరేగింపు మధ్యలోనే వెనక్కి మళ్ళి గుంటూరు కన్నమ రాజా దగ్గరికి వెళ్ళీపోయారు. వెళ్ళడానికి ముందు ఇకనుండి డానీ లీడ్ చేస్తారని ఒక ప్రకటన చేశారు.

43. ఆ రోజు తరువాత ఉద్యమం ముగిసే వరకు కత్తి పద్మారావు చీరాలలో కాలు మోపలేదు. మొత్తం ఉద్యమం రాడికల్స్ చేతుల్లోనికి వచ్చేసింది.

44. పోలీసు యాక్టీవ్ గా మారాక ఆ ఉద్యమానికి విజయనగరం శిబిరానికి నేనే నాయకునిగా వున్నాను. 

45. 11 సాయంత్రం లాఠీ చార్జి జరిగింది. చాలామంది గాయపడ్డారు.

46. 12వ తేదీ ఉదయం అరెస్టయిన వారిని కోర్టులో  ప్రవేశ పెడితే కోర్టూల్ని బహిష్కరించి బయటికి తీసుకుని వచ్చేశాము. ఇది అప్పట్లో పెద్ద సంచలనం. పోలీసులు రెచ్చిపోయారు.

47. 13వ తేదీ తెల్లవారుజామున నన్నూ, పరంజ్యోతిని మరో ఐదారుగుర్ని అరెస్టు చేశారు. కాస్సేపు ఎన్ కౌంటర్ డ్రామా ఆడారు.

48. పోలీసు వున్నతాధికారి మంచి మనిషి. థర్డ్ డిగ్రీని ఉపయోగించనివ్వలేదు.

49. మీడియా మమ్మల్ని బాగా ఆదుకుంది. హైకోర్టులొ, సుప్రీం కోర్టులొ హెబియస్ కార్పొస్ పిటీషన్లు పడ్డాయి.

50. రైల్వేస్టేషన్లు, బస్సుల్ని తగులబెట్టామని మా మీద కేసులు పెట్టారు

51. మరునాడు చీరాల కోర్టు మాకు ఒంగోలులో 15 రోజులు జుడీషియల్ రిమాండ్ కు పంపింది.

52. ఒంగోలు చేరే సమయానికే మాకు పై కోర్టునుండి కండీషనల్ బెయిల్ వచ్చింది.

53. అప్పటి నుండి విజయనగరం శిబిరం కార్యాలయంలో  నేనొక్కడినే నాయకునిగా వున్నాను.

54. ఆ సమయంలోనే ప్రభుత్వం ఆర్ ఆర్ ప్యాకేజీని ప్రకటించింది. చాలా మంచి ప్యాకేజి అది. మా కోరికలన్నింటినీ తీర్చింది.

55. ఒక ఏడాది పాటు చీరాలలో అడుగు పెట్టరాదనే కండీషన్ మీద నాకు పూర్తి బెయిల్ ఇచ్చారు.

56. బహుశ ఆరోజు అక్టోబరు 5 అనుకుంటాను.

57. మా కేసు 1989 వరకు నడిచింది. ప్రాసిక్యూషన్ వారు మా మీద ఆరోపణల్ని రుజువు చేయలేకపోవడంతో 1989 మే నెలలో మా కేసు కొట్టి వేశారు.

ఈ సందర్భంగా ఇంకో రెండు అంశాలు చెప్పాలనిపించింది.

58. చీరాల నుండి తిరిగి వచ్చాక ఫుల్ టైమర్ పాత్రను వదిలి  మళ్ళీ పార్ట్ టైమర్ గా మారిపోయాను.

59. కారంచెడు ఉద్యమంలో పీపుల్స్ వార్ నాకు ఇచ్చిన టాార్గెట్ ను నేను సంతృప్తిగా పూర్తి చేశాను.

60. అప్పట్లో ఎస్సీ ఆట్రాసిటీస్ చట్టం లేనప్పటికీ మంచి ఆర్ ఆార్ ప్యాకేజీ వచ్చింది.

61. ఆ తరువాత అనుకూల చట్టం వచ్చినప్పటికీ మంచి ఆర్ ఆర్ ప్యాకేజీని సాధించిన ఉద్యమం ఒక్కటీ నాకు తెలీదు.

62. అప్పట్లో నాకో పేరు వుండేది. డానీకి పని అప్పచెపితే అది జరిగిపోయినట్టే అనుకునేవారు. పెర్ఫెక్షనిస్టు అనేవారు.

63. 1990 మే నెలలో పీపుల్స్ వార్ తో నా విబేధాలు పెరిగాయి. ఆ ఏడాది జూన్ నెలతో ఆ పార్టీతో నా సంబంధాలను పూర్తిగా కట్ చేసుకున్నాను.

64. 2000లో విరసం నుండి కూడ బయటికి వచ్చేశాను.

65. 2004లో ప్రభుత్వంతో చర్చలకు వచ్చినపుడు సుధాకర్ ను ఒరిస్సాలో దించాల్సి వచ్చింది. అప్పుడు అతను ఆంధ్రా-ఒరిస్సా బార్డర్ AOB కార్యదర్శిగా వున్నాడు.

66. అప్పుడు వాళ్ళు ఆ టాస్క్ ను నాకే అప్ప చెప్పారు. నేను నా భార్యతోసహా వెళ్ళి సుధాకర్ ను ఒరిస్సాలో సేఫ్ గా దించి వచ్చాను.

67. ఇక్కడ వాళ్ళ గొప్పతనం గురించి కూడ చెప్పాలి.

68. తిరిగి వచ్చాక నా భార్యకు రెండు రకాల మలేరియాలు, డెంగూ సోకి మల్టి ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగింది. ఆ స్థితికి చేరుకున్నవారు అప్పటికి ఇండియాలో ఒక్కరూ బతకలేదు.

69. పీపుల్స్ వార్ అప్పటికి మావోయిస్టు పార్టీగా మారిపోయింది. ఆ పార్టియే నా భార్య వైద్యానికి అవసరమైన ఖర్చులన్నీ పూర్తిగా చాలా బాధ్యతగా భరించింది. నేను ఈ విషయంలో వరవరరావుకు రుణపడి వున్నాను.

70. నక్సలైట్ నాయకుల్లో అత్యధికులు అంకిత భావం కలవారు. మహత్తర త్యాగాలు చేశారు.

71. వారు వర్తమానాన్ని విశ్లేషించగలిగినంతగా భవిష్యత్తు పరిణామాల్ని ప్రమాదాల్ని అంచనా కట్టలేకపోయారు. ఇది వారిలో ప్రధానలోపం.

72. మన దేశ నాయకుల్లో ఏ ఒక్కరూ మార్క్స్, ఏంగిల్స్, లెనిన్ లతో పోల్చదగ్గవారుకాదు.

73. అందరిలో కొండపల్లి సీతారామయ్యను నేను ఎక్కువగా గౌరవిస్తాను. ఆయన కూడ నేను చెప్పిన పరిమితుల్ని అధిగమించలేకపోయారు.

74. ఆ మూడు నెలల కాలంలో చీరాల వచ్చిన వారు చాలామంది వున్నారు. పీపుల్స్ వార్ కు చెందిన  ఆర్ ఎస్ యూ, ఆర్ వైఎల్, జననాట్యమండలి, విరసం, ఏపిసిఎల్ సి సభ్యులు ఆయా సందర్భాలలో వచ్చి రెండు మూడు రోజులు వుండి వెళ్ళేవారు. 

75. తొలి దశలో విరాళాలు కూడ నాగార్జున యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీల రాడికల్ స్టూడెంట్స్ నుండే వచ్చాయి.

76. దళిత మహాసభ ఆరంభం రోజు  గద్దర్ తో పాటు, సభలో వరవరరావు కూడ వున్నారు.

77. దివాకర్, డప్పు రమేష్, కుమారి, కలేకూరి ప్రసాద్ నాలుగయిదు రోజులుండి ఒగ్గు కథ రాశారు.

78. దళితపులులమ్మా పాట గద్దర్ పేరుతో పాపులర్ అయ్యింది గానీ అందులో దివాకర్ చెయ్యి కూడ వున్నట్టు గుర్తు. అంతా ఒక గదిలోనే వున్నారు.

79. చెంచు రామయ్య మీద యాక్షన్ టీమ్ నాయకుడు కమ్మ సామాజికవర్గానికి చెందిన అతనే. యాక్షన్ లో కీలక పాత్ర కూడ అతనిదే అని విన్నాను. ఏసూ, విరపని ఇతర సభ్యులు.

80. అంతిమంగా ఒక విషయం చెప్పాలి. పీపుల్స్ వార్ నన్న్ను ఒక మిషన్ మీద పంపింది. నా పేరు అనేక డాక్యుమెంట్లలో నాయకునిగా నయోదయ్యింది. బయటికి కనిపించేవారు కనిపించనివారు కొన్ని వందలుకాదు కొన్ని వేలమంది అభిమానం చూపితేనే ఒకరు నాయకులు కాగలుగుతారు.

81. సెప్టెంబరు 11 రాత్రి లాఠీచార్జి తరువాత గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్ళాను. అప్పుడు నాకు అర్ధం అయింది నా వెనుక ఎంత మంది వున్నారో.

82. వారిలో పట్టుమని ఓ పదిమంది పేర్లు కూడా నాకు తెలీదు. కానీ వాళ్లంతా నా వెనుక వున్నారు. రిక్షావాళ్ళు, చిన్నచిన్న దుకాణదారులు, పాదచారులు, డాక్టర్లు, నర్సులు.

83. హీరో నేనుకాదు; వాళ్ళు నన్ను హీరోను చేశారు.  

84. అందరి విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. ఒక మంచిపని కోసం గట్టిగా నిలబడినప్పుడే మనకోసం ఎంతమంది నిలబడతారో తెలుస్తుంది.

85. అంతిమంగా కారంచెడు ఉద్యమం విజయవంతం కావడానికి ప్రధాన కారణం సమైక్యత. బాధితులు మాదిగ సామాజికవర్గానికి చెందినవారు. కత్తి పద్మారావు మాల సామాజికవర్గానికి చెందినవారు, బొజ్జా తారకం అమలాపురం మాల. వారిని ఆదిఆంధ్రులు అంటారు. కొంచెం పెద్ద స్థాయి. నేను ముస్లిం పఠాన్. బాలగోపాల్ బ్రాహ్మణుడు, మాకు బెయిల్ తెచ్చిన న్యాయవాది వైకేది బిసి సామాజికవర్గం.   ఇక ప్రాపంచిక దృక్పథాలపరంగా కత్తి పద్మారావు హేతువాది. మరొకరు క్రైస్తవ ధార్మికుడు, ఇంకొకరు జాతీయ కాంగ్రెస్, తారకానిది ఒక ఎంఎల్ పార్టి అభిమానం. నాది ఇంకో ఎంఎల్ పార్టి అభిమానం. ఇంతమంది ఏకమై పనిచేయడం వల్లనే ఆ ఉద్యమం విజయవంతమైంది.