పేర్లు తెచ్చిన తంటా!
మనం చదివే విదేశీ పుస్తకాల్లో పేర్లకు అక్షరాలుంటాయిగానీ వుఛ్ఛారణ వుండదు. పైగా అవి మూల భాష పేర్లుకావు; అనువాద భాష పేర్లు. మూడు భాషల్లో పేర్లు మారినపుడు మనకు తెలిసిన భాషలో దాని నియమాల ప్రకారం ఉఛ్ఛరిస్తాము.
మావో సెతుంగ్ అనేవాళ్లం ఇప్పుడు మారిపోయింది. మావో జేడాంగ్ అంటున్నారు. అంతెందుకు మన పక్కన జీవిస్తున్న ముస్లింల పేర్లను మనం ఏమేరకు సరిగ్గా పలుకుతాం. నా పేరును వందమంది వంద రకాలుగా పలుకుతారు. Yazdani అనే పర్షియన్ ఉఛ్ఛారణలో ఎవరూ పిలవరు; నా సమీప బంధువులుతప్ప.
పారిస్ ను ఫ్రెంచ్ వాళ్ళు ‘పారీ’ అంటారు. Paris (French pronunciation: [paʁi]. ఇంగ్లీషులో S వుంది గాబట్టి మనం తెలుగులో S పలుకుతాం. అలాగే వాళ్ళు లండన్ ను లాంద్రె అంటారు. మనం సార్త్రె అంటున్నాయన ఫ్రెంచ్ పేరు [saʁtʁ]. తెలుగు అజంత భాష గాబట్టి ‘ఇ’ చేర్చుకున్నాము. ఫ్రెంచ్ లో ɡi d mopasɑ̃ ఇంగ్లీషులో వాళ్ళ నియమాల ప్రకారం Guy de Maupassant అయ్యాడు. ఏది ప్రామాణికం.
Julius Fučík (Czech: [ˈjulɪjus ˈfutʃiːk]). జెక్ భాషలో F ను ప గా ఉఛ్ఛరిస్తారట. పుసిక్, పుచిక్ అనడం నాకు నచ్చలేదు. పేరులో బరువు పెంచి ఫ్యూజిక్ అని మార్చాను.
కొన్ని భాషల్లో వున్న అక్షరాలను తీసేస్తారు; మరికొన్ని భాషల్లో లేని అక్షరాలను చేరుస్తారు. కొన్ని ప్రాంతాల్లో సూర్యనారాయణను సూనణ అంటారు. అయితే, తెలుగులో స్థూలంగా సైలెంట్ అక్షరాలు లేవు.
FB 20250212
No comments:
Post a Comment