జీవితాన్ని చిన్నది చేయకండి
జీవితంలో దెబ్బతిన్నంత మాత్రానో
జబ్బు పడినంత మాత్రానో
జీవితం అయిపోయినట్టుకాదు.
జీవితాన్ని మళ్ళీ చిగురింపచేయడానికి
ఒక క్రమశిక్షణ కావాలి.
అంతకన్నా మరేదీ అఖ్ఖరలేదు.
అది మనకు మనంగా
అలవరచుకో గలిగితే మరీ మంచిది.
అంత వరకూ సరదాగా గడిపేసి,
ఒక్కసారిగా క్రమశిక్షణ అలవర్చుకోవాలంటే చాలా కష్టం.
అప్పుడు క్రమశిక్షణగా వుంటున్నవాళ్లని ఎంచుకుని
వాళ్ళని అనుసరించాలి.
అనుకరించినా తప్పుకాదు.
మీరు మారడానికి ఇప్పుడున్న వాతావరణం అనుకూలంగాలేకపోతే,
పాత సమూహాల్లో బతకడం మీకు అవమానకరంగావుంటె, వెంటనే
పాత సమూహాన్ని వదిలిపెట్టి కొత్త సమూహంలోనికి ప్రవేశించండి.
బాధల్లో ఉన్నపుడు ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.
నిజానికి ప్రపంచం చాలా విశాలమైనది.
కొత్తచోట జీవితాన్ని జీరోతో మొదలేట్టండి.
అలా జీరోతో మొదలేట్టడానికి సిగ్గుపడవద్దు.
అతి తక్కువ సమయంలోనే మీరు కొత్తచోట అద్భుతాలు సృష్టించగలరు.
ఇది ఉపదేశం కాదు. అనుభవం.
నేను 1975లో జీవితాన్ని నాకు దక్కాల్సిన వాటాకన్నా ఎక్కువగా అనుభవించేశాను.
దాని నష్టాలను కూడా భారీగా చవిచూశాను.
అడుగడుగున అవమానాలు. నైరాశ్యం. దాన్నే ఇప్పుడు డిప్రెషన్ అంటున్నారు.
నేను మా వూరు వదిలి విజయవాడ వచ్చాను.
అప్పటికి నాకు ఏ మాత్రం తెలీని కొత్త సమూహాంలొ చేరిపొయాను.
అంతకుముందు వాళ్ళకు నేను తెలీదు. నాకువాళ్ళూ తెలీదు.
జీవితంలో దెబ్బతిన్నవాళ్ళ దగ్గర ఒక గొప్ప పెట్టుబడి వుంటుంది.
అదే అనుభవం!
పాత అనుభవం కొత్త సమూహంలో గొప్పగా పనిచేస్తుంది.
చనిపోతేనే మంచిదనిపించిన ఆ దశనుండి ఒక్కసారిగా చాలా మార్పులు వచ్చాయి.
అంతకు ముందు నేను ఊహించడానికి కూడా సాధ్యం కాని అనేక విజయాలు సాధించాను.
ఈ గొప్పతనం నాదికాదు నేను ఎంచుకున్న కొత్త సమాజానిది.
జీవితాన్ని ప్రదర్శనగా మార్చేవాళ్లకు నేను దూరంగావున్నాను.
నిరాడంబరంగా బతికేవాళ్ళను, తమబతుకు తాము బతుకుతూ కొంచెం సమాజం కోసం కూడా ఆలొచించేవాళ్లతో సహవాసం చేషాను.
ఉద్యమాల్లో పనిచేయడం ఒక త్యాగం అని చాలామంది అనుకుంటూవుంటారు.
నేను స్వ్వార్ధం అంటాను.
ఉద్యమాల్లో పాల్గోనడంవల్ల నాకు ఆత్మస్థైర్యం పేరిగింది. మునుపటి ఆత్మవిశ్వాసం తిరిగివచ్చింది.
సోషల్ ప్రివిలేజెస్ కూడా పెరిగాయి.
మరోవైపు, వృత్తి నైపుణ్యం కూడా పేరిగి ఆ మేరకు అడ్వాంటేజెస్ కూడా పెరిగాయి.
జీవితం మహత్తరమైనది దాన్ని చిన్నది చెయకండి.
డిప్రెషన్ జీవితానికి శతృవు. దాన్ని తరిమి కొట్టండి.
ఈ విషయంలో నా సలహాలు ఏమైనా పనికివస్తే ఆనందిస్తాను.
నా సెల్ నెంబరు 90102 34336 కు ఎస్.ఎం.ఎస్ పంపవచ్చు.
(నాకు తేలియని నెంబరు నుండి ఫోన్ వస్తే సాధారణంగా నేను రిసీవ్ చేసుకోను)
సర్, జీవించడానికి మీరిచ్చిన సందేశం చిన్నది కాదు,
ReplyDeleteకానీ దెబ్బతిన్న వ్యక్తి తిరిగి మామూలుగా జీవించటమూ వెంటనే సాద్యమూ కాదు, అందుకే మీ వంటివారి శుభోదయాలు అవసరం.