శివసాగరునికి జోహార్లు
ఉషా యస్ డానీ
స్వార్ధం శిరస్సును కసితో, గండ్రగొడ్దలితో నరక గలిగినవాడే నేటి హీరో
ప్రజను సాయుధంచేస్తున్న రివల్యూషనరీ నేటి కవి
సత్యముర్తి చనిపోయారు.
నక్సలైట్ ఉద్యమ పితామహుడు ఆయన. 1960వ దశకం చివర్లో, ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన చారూ మజుందార్ ను గుత్తికొండ బిలంలో కలుసుకున్న ప్రతినిధి బృందానికి ఆయన నాయకుడు. అప్పటికి కొండపల్లి సీతారామయ్య ఇంకా (అధికారికంగా) నక్సలైట్ ఉద్యమం లొనికి రాలేదు అనుకుంటాను.
సత్యమూర్తి విప్లవ భావకవి. వర్తమాన పాలిమిక్స్ ను కవిత్వీకరించడంలో ఆయనకన్నా సమర్ధుడు తెలుగు సాహిత్యంలో ఇంతవరకు పుట్టలేదు.
1978 నుండి 1985 వరకు సత్యమూర్తి నాకు రాజకీయ ప్రేరణ.
ఆ సంవత్సరమే ఆయన పీపుల్స్ వార్ నుండి విడిపొయారు. ఆ సంవత్సరమే తెలంగాణ నల్సలైట్చ్ ఉద్యమంపై నిర్భంధం పెరిగింది. ఆ సంవత్సరమే కారంచేడు ఘోరం జరిగింది. ఆ సంవత్సరమే దళితమహాసభ పుట్టింది. వర్గపొరాటాల పక్కన వర్గేతర అస్థిత్వవాద ఉద్యమాలకు నాంది కూడా ఆ సంవత్సరమే. ఆ విధంగా సత్యమూర్తి గుర్తుండిపొతారు.
సత్యమూర్తి చివరి రోజులు, జంగల్ సంతాల్ లా, చాలా బాధాకరంగా గడిచాయి. ఆయన పెద్ద కొడుకు, పెద్ద కోడలే ఆయన ఆలనా పాలనా చూశారు.
చివరి వరకూ సత్యమూర్తితో అనుబంధాన్ని కొనసాగించిన గన్నవరం మిత్రులు కాకాని సాంబశివరావు, ప్రసాద్ ఈ సందర్భంగా అభినందనీయులు.
నా ప్రేరణకు విప్లవ జోహార్ర్లు.
ఏప్రిల్17, 2012
(ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 18 సంచికలో ప్రచురితం)
No comments:
Post a Comment