Saturday, 13 February 2016

Chandrababu Duel Roll

చంద్రబాబునాయుడు సమ్మతిలేఖ ఇచ్చినందువల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ తెలుగుదేశం నాయకులు గొప్పగా చెప్పుకుంటుంటారు.  రాష్ట్రాన్ని విభజించినవాళ్ళు తలదించుకునేలా కొత్త  రాష్ట్రాన్ని అభివృధ్ధిచేసే సామర్ధ్యం చంద్రబాబునాయుడుకే వుందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నాయకులు అంతకన్నా గొప్పగా చెప్పుకుంటుంటారు. ఇలా ఒకే వ్యక్తి గురించి రెండు రాష్ట్రాల్లో పరస్పరవిరుధ్ధ అపోహలు వుండడం అన్యాయం. ఈ అపోహలు ఇంకా కొనసాగడం ఇంకా అన్యాయం.


"విభజన తొలి బాధితుడిని నేనే. విభజన చేసినవారు తలదించుకునేలా రాష్ట్రాభివృద్ధి చేస్తా "
అని శ్రీకాళంలో జరిగిన ఏపీ ఎన్జీవోల రాష్ట్ర మహాసభల్లో  ముఖ్యమంత్రి  చంద్రబాబు శపథం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ను విభజన చేసిందే చంద్రబాబు. విభజనకు తొలి లబ్దిదారుడు చంద్రబాబు. 

No comments:

Post a Comment