Saturday, 2 March 2019

ఇండియా టుడే కాంక్లేవ్‌ – 2019లో జగన్ (Facebook Posts)

ఇండియా టుడే కాంక్లేవ్‌ – 2019లో జగన్  (Facebook  Posts) 

BIG QUESTION
మోదీ మళ్ళీ ప్రధాని అయ్యి ప్రత్యేక హోదా ఫైలు మీద  సంతకం పెట్టాక జగన్ మద్దతు ఇస్తారా?
లేకుంటే,
తన మద్దతుతో నరేంద్ర మోదీని మళ్ళీ ప్రధానిని చేసి ప్రత్యేక హోదా ఫైలు మీద జగన్ సంతకం పెట్టించుకుంటారా? 

రేపు నరేంద్ర మోదీకి కష్టాలు వస్తే మద్దతిచ్చి ఆదుకుంటా; ప్రత్యేక హోదా ఇస్తానని మళ్ళీ హామీ ఇస్తే చాలు!
- జగన్


ఇండియా టుడే కాంక్లేవ్‌ – 2019లో జగన్ సమాధానాలు చాలా బాగున్నాయి. అయితే, నరేంద్ర మోదీ మీద వారికి  వ్యామోహం మాత్రం తగ్గలేదు. 

జగన్ ఇంటర్వ్యూలో రెండు మంచి పదాలు
Inside Trading, catch-22 situation
జగన్ తెలుగుకన్నా ఇంగ్లీషు బాగుంది.

రాజధానిని మార్చము
తాము అధికారంలోనికి వస్తే రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి "తరలించలేము"  అనే జగన్ చెప్పారు. (catch-22 situation)

catch-22 situation ఉదాహరణ :
దేవుని విగ్రహం మీద తేలుంది. చేతితో తీసేయలేము. చెప్పుతో కొట్టలేము.
వైయస్సార్ సిపి 25 పార్లమెంటు నియోజకవర్గాల జిల్లా కమిటీలకు ఎన్నికల పరిశీలకులుగా నియమించినవారిలో  ఒక్కరూ ముస్లిం లేరు.

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ పోలీసు అధికారి ఎంఏ ఇక్బాల్ గారి పేరు వుండేది. ఇప్పుడు దాన్ని తీసేశారు.

రాజధాని స్థల ఎంపికలో, నిర్మాణంలో అక్రమాలు, అవినీతి, ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగాయి. అయినప్పటికీ దాన్ని అక్కడి నుండి తరలించలేమని జగన్ అభిప్రాయం.

మొన్న మోదీ రాష్ట్రానికి వచ్చినపుడు చంద్రబాబు గ్రాఫ్ పెరిగింది.
నిన్న  ఇండియా టుడే కాంక్లేవ్‌ సమాధానాలతో జగన్ గ్రాఫ్ పెరిగింది. 

నేను ఈ భూమి మీద ఎవరినయినా విశ్వసిస్తానుగానీ నరేంద్ర మోదీ-అమిత్ షా  అనే అబద్దాలకోరు ద్వయం  చెప్పే మాటల్ని ఎప్పుడూ మాత్రం నమ్మను.

అబధ్ధాల ద్వయం
ఆధునిక 'నాన్నా! పులి' కథకు సజీవ ఉదాహరణ మోదీ-అమిత్ షా. ఈ అబధ్ధాల ద్వయం ఎప్పుడయినా నిజం చెప్పినా జనం నమ్మేలా లేరు.   

No comments:

Post a Comment