I hate TROLL Culture 25 May 2021
“ఇళ్ళకు ఐసోలేషన్ మందులు పంపిస్తే సరిపోదు. కమ్యూనిటీ కిచెన్ సెంటర్లు
పెట్టాలి. ఆరోగ్యకరమైన భోజనాన్ని అందరికీ పంపిణీ
చేయాలి”. –AM Khan Yadani Danny
“డానీలో ఇంకా బాల్య అమాయకత్వం పోలేదు.
కమ్యూనిటీ కిచెన్? హతోస్మి” - JIH Nellore
నా బాల్య అమాయికత్వాన్నీ, మీ వృధ్ధాప్య జ్ఞానాన్ని బేరీజూ వేయడానికి
ఇది సందర్భంకాదు.
బయటికి వెళ్ళలేక, ఒకవేళ మూడు నాలుగు గంటలు వెళ్ళే అవకాశం వున్నా
నిత్యావసర సరుకులు కొనేందుకు ఆర్థిక వనరులు
లేక ఇళ్ళళ్ళో మగ్గిపోతున్నవారి సమాచారం నా దగ్గరకు చాలా వచ్చింది. కరోన సోకినవారు
ప్రొటీన్ ఫుడ్ తీసుకోకపోతే అది మరీ రెచ్చిపోతుంది. పరిష్కారంగా నేను కమ్యూనిటీ కిచెన్ ను సూచించాను. అంతకన్నా మెరుగైన
ప్రత్యామ్నాయాలు మీ దగ్గరుంటే సూచించాల్సింది.
నేను సాధారణంగా సంవాదం ద్వార సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం
చేస్తాను. సంవాదంలో నా ప్రతిపాదన వీగిపోయినా
నేనేమీ కొద్దిగా కూడ బాధపడను. నాకన్నా మంచి ప్రతిపాదన ముందుకు వచ్చిందని ఆనందిస్తాను.
మేము సామాజిక కార్యకర్తలం. ముందుకు వచ్చిన సమస్యలకు ఏదో ఒక పరిష్కారాన్ని
కనుగొనడం మాకు రోజువారీ సవాళ్ళు. సంవాదం మా దినచర్య. దాని ద్వార పరిష్కారాల్ని మెరుగు పరచుకుంటూ వుంటాము.
మాకు అంతిమ తీర్పులు అంటూ వుండవు. నిన్నటికన్నా మెరుగైనదేదీ? అని నిరంతరం ఆలోచిస్తుంటాం.
మీరు మాకన్నా సంయమనాన్ని
పాటించే ధార్మిక రంగంలో వున్నారు. మీ స్థాయివాళ్ళు ఈ ట్రోల్ కల్చర్ ను ఆశ్రయించడం ఏమీ బాగోలేదు. ట్రోల్
భాష నాకు కూడ వచ్చు. కానీ ఎన్నడూ వాడలేదు. సంవాదం వేరు; ట్రోల్ వేరు. ట్రోల్ భాష మాట్లాడేవారిని
ఒక మనిషిగా గుర్తించడానికి కూడ నేను ఇష్టపడను. వాళ్ళతో ఒక్క అక్షరం మాట్లాడడం కూడ నాకు
ఇష్టంగా వుండదు. వెంటనే బ్లాక్ చేసేస్తాను.
అలా ఇప్పటికి ఒక వంద మందిని బ్లాక్ చేసి వుంటాను. ట్రోల్స్ నాకు స్నేహితులుగా వుండడానికి
తగరు.
ఇటీవల నా మీద మీ ట్రోల్ కామెంట్స్ రెండు చూశాను. ఇంత వివరణ ఇవ్వకుండానే
మీకు చెప్పకుండానే మిమ్మల్ని నేను బ్లాక్ చేసే అవకాశం ఫేస్ బుక్ లో వుంది. మనిద్దరి
అనుబంధం సుదీర్ఘమైనది. విభిన్న రంగాల్లో మనం కలిసి పనిచేశాం. వాటిని పరిగణన లోనికి
తీసుకుని ఈ వివరణ ఇస్తున్నాను.
మీకు ఒక మనవి JIH Nellore అనే పేరుతో కామెంట్
చేసే సమయంలో మరింత సంయమనాన్ని పాటించండి.
నేను JIH మీద వ్యంగాన్ని విసిరితే structural conflict వస్తుంది. అందుకే నేను MTF పేరుతో వ్యాఖ్యానం
చేసే సందర్భాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను; MTF నా ఒక్కడిది కాదు.
దీనిని కూడా మీరు ట్రోల్ చేయవచ్చు. అది మీ చివరి ఆయుధం.
No comments:
Post a Comment