Wednesday, 26 May 2021

రక్తకొండ – Blood Hill Story Line

 

రక్తకొండ – Blood Hill 

1.        పాడేరు మండలంలో ‘గడ్డిబండ’ చాలా చిన్న గ్రామం.  జనాభా కేవలం 24 మంది.

2.        ఈగ్రామానికి ఒక ప్రత్యేకత వుంది. గ్రామదేవత మ్హత్తుగలదనీ ఆమె చలువ వల్లనే వర్షాధారంతోనే గ్రామ భూములు విరగ పండుతాయి అని చెప్పుకుంటారు.

3.        బడిలేకపోయినా ఆ గ్రామంలోవాళ్ళు చదువుకోవడానికి పొరు.  ఒక్కరికీ చదువులేదు గాబట్టి ఉద్యోగాలూలేవు.

4.        అయినప్పటికీ  వున్న దాంట్లోనే  సంతృప్తిగా బతుకుతుంటారు.

5.        సాయంత్రం గుడి దగ్గర రావి చెట్టు నీడ్న కూర్చోని పులి మేక జూదం అడుకుంటూ కబుర్లు చెప్పుకోవడం వారి అలవాటు.

6.        గ్రామంలో రాము తల్లి అనారోగ్యంతో బ్ధపడుతూ వుంటుంది.

7.        రాము వుంటే చేల్లో పొలం  పనిలో వుంటాడు. లేకుంటే ఇంట్లో తల్లి సేవలో వుంటాడు.  అతను రావి చెట్టుకింది రాజకీయాల్ని పట్టించుకోడు.

8.        అతను చాలా తెలివైన వాడు ఎలాంటి సమస్యను అయినా ఇట్టే పరిష్కరించ గలడు.

9.        కొన్నాళ్ళు ఆ గ్రామంలో ముడి అల్యూమినియం (బాక్సైట్ ) తవ్వకాలు జరుగుతాయి.

10.   విదేశాల నుండి దిగిన  యంత్రాలు , భారీ వాహనాలతో  గ్రామంలో భీభత్సం సాగుతుంది.

11.   గ్రామస్తులు బాక్సైట్ తవ్వక్లకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేస్తారు.

12.   ఆ ఉద్యమంలో కూడా రాము పాల్గొనడు. అతనికి తల్లి, చేలుతోనే సరిపోతుంది.

13.   విదేశీ భూగర్భ నిక్షేపాల నిపుణులకు బాక్సైట్ తవ్వకాల సమయంలో ఒక విశ్వ రహాస్యం తెలుస్తుంది.

14.   ఆ గ్రామంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉల్కాశకలం వచ్చి పడుతుంది.

15.   మొదట్లో అది  చాలా వేడిగానూ, విష వాయువులతో వున్నప్పటికీ వేల సంవత్సరాలలో అది చల్లబడి గ్రామానికి వరంగా మాపోయింది.

16.   ఉల్కశకలం ప్రభావంతోనే ఆ పరిసరాల్లో పంటలు గొప్పగా పండుతుంటాయి. ఆ ఊరి పండ్ల  రుచి కూడా గొప్పగా  వుంటుంది.

17.   ఉల్కాశకలం రహాస్యాన్ని తెలుసుకున్న భూగర్భ నిక్షేపాల నిపుణులు ఆ విషయాన్ని విదేశాలకు చేర వేస్తారు.

18.   ఎలాగయినా సరే  శకలాన్ని తీసుకు పోవడానికి రంగం సిధ్ధం అవుతుంది.

19.   గ్రామస్తుల ఉద్యమం ఫలిస్తుంది.

20.   కొత్త ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది.

21.   బాక్సైట్ తవ్వకాలు ఆగిపోయిన తరువాత గ్రామానికి అంతకన్నా పెద్ద ముప్పు వస్తుంది.  

22.   ఎలాగయిన ఆ  శకలాన్ని తీసుకుపోవాలని విదేశీ శక్తులు కుట్రలు పన్నుతుంటాయి.  

23.   ఈ విదేశీ వ్యాపారులు  స్వదేశీ ఏజేంట్లు  గ్రామంలో ఒక జులాయి వెధవను కోవర్టుగా మారుస్తారు.

24.   ఒక రాత్రి పొలంలో మంచె మీదున్న రాము ఈ జులాయి కదలికల్ని అనుమానించి వెంబడిస్తాడు.

25.   వారం రోజుల్లో తమ గ్రామం అంతంకానున్నదని అతనికి తెలుస్తుంది.

26.   గ్రామస్తులు అడ్డుకుంటే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపేయాలనీ, గ్లోబ్ మీద ఆ గ్రామం చాయలు కూడ కనిపీంచరాదని  క్ర్పొరేట్లు స్థిర నిర్ణయానికీ  వస్తారు.

27.   దానికి అవసరమైన సన్నాహాలు విశాఖ్పట్నంలో జ్రిగిపోతుంటాయి.

28.   అమావాస్యను ముహూర్తంగా నిర్ణయిస్తారు.  

29.   దానికి ఇక వారం రోజులే సమయం వుంది. శత్రువు సిధ్ధంగా వున్నాడు. గ్రామస్తులకు కనీస సమాచారం కూడ లేదు.

30.   రాము గుడి ముందు రావి చెట్టు కిందిని చేరుతాడు.

31.   తమ మీద జరుగుతున్న కుట్ర గురించి వివరిస్తాడు.

32.   వాళ్ళు మన  గ్రామాన్ని భూమీమీద లేకుండా చేయాలను కుంటున్నారు. మనం మన శత్రువుల్ని భూమిమీద లేకుండ చేయాలి అంటాడు.

33.   వారం రోజుల్లో ఆ 24 మంది మహా యుధ్ధానికి సిధ్ధం అయిపోత్రు.

34.   యుధంలో గెలుపును ఆయుధాలు నిర్ణయించవు. మన హృదయాలు నిర్ణయిస్తాయి అని అరుస్తాడు.

35.   యుధ్ధ సన్నాహాలు మొదలయిపొతాయి.

36.   జులాయికి తెలియకుండ జాగ్రత్త పడతారు.

37.   అమావాస్య రోజూ పక్క గ్రామంలో గుడిలో ప్రత్యేక పూజలు చేయడానికి వెళుతున్నట్టు జులాయి ద్వార ఒక తప్పుడు సమాచారాన్ని విదేశీయులకు అందిస్తాడు.

38.   అమావాస్య రాత్రి అందరూ కొండ పైకి ఎక్కి  నిశ్శబ్దంగా నక్కి కూర్చుంటారు.

39.   కార్పొరేట్లు, పోలీసు అధికారులు, విశాఖపట్నం గూండాలు, నాలుగు భారీ వాహనాలతో గడ్డి బండ గ్రామానికి వస్తారు.

40.   రాము సమయం చూసి కొన్ని  వాహనాలను పేల్చి వేస్తాడు.

41.   24 మంది అరవీర భయంకరుల్లా ప్రత్యర్ధులమీద విరుచుకు పడతారు.

42.   భీకర పోరు జరుగుతుంది.

43.   వచ్చిన వారిని ఒక యిల్ ట్యాంకూలో కుక్కి కొండ మీది నుండి లోయలోనికి నెట్టి వేస్తారు.

44.   జులాయిని చంపాకుండ వదిలేయాలనుకుంటారు గానీ ప్రమాదావశాత్తు అతను చనిపోతాడు.

45.   ప్రశాంతంగా తెల్లవారు తుంది.

46.   ఆ రాత్రి ఏమి జరిగిందో ఎవరికి తెలీదు.

No comments:

Post a Comment