VISWAWAGURU
విశ్వగురు
డానీ
అధ్యాయం - 1
కరోనా
ఫంగస్ లా నల్లగా వుంది రోడ్డు.
వేసవి
ఎండ తెల్లటి వెండిలా మెరుస్తోంది.
లాక్
డౌన్ యుగం గాబట్టి రోడ్డు మీద నరసంచారం లేదు.
కనుచూపు
మేర దట్టంగా పెరిగిన చెట్లు అడవిని తలపిస్తున్నాయి.
కొన్ని
యుగాల పూర్వం అడవుల్ని నరికి నాగరీకతను నిర్మించారట.
నాగరీకత
అంతరించిపోవడంతో ఈ యుగంలో నేలంతా అడవులు పెరిగిపోయాయి.
నగరాల్లోనూ
పగలు రాత్రి పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి.
రోడ్డుకు
ఇరువైపులా రెండు భారీ సైనికుల ఉక్కు విగ్రహాలున్నాయి.
కొలమానాలన్నీ
మారిపోయాయి కనుక ఆవిగ్రహాల ఎత్తు ఎంతో చెప్పడం కష్టం.
వాటి
పాదాలకున్న ఇనప బూట్లు మనిషి ఎత్తుకు రెట్టింపు
వున్నాయి.
నల్లగా
తారుపూసినట్టున్న ఆ విగ్రహాల నీడ మూడు నాలుగు
తాడి చెట్ల పొడవున నేల మీద పరచుకున్నాయి.
రోడ్డుకు
దక్షణ దిక్కున వున్న అడవి నుండి ఒక తొండ బయటికి
వచ్చింది. తలను అటూ ఇటూ ఆడించి పరుగున రోడ్డు
దాటి ఉత్తర దిక్కున వున్న పొదల్లోనికి జారుకుంది.
అంత
చిన్న జీవి చేసిన టపటప చప్పుడు కూడ ఆ ప్రాంతపు గాలిలో కాస్సేపు ప్రకంపనలు సృష్టించింది.
మళ్ళీ
నిశ్శబ్దం.
ఈసారి
ఒక జింక పిల్ల దక్షణ అడవి నుండి బయటికి వచ్చింది. దాన్ని వెంబడిస్తూ ఒక పులి వచ్చింది.
జింక పిల్ల పులి ఆ రోడ్డు మీద కాస్సేపు తలబడి ఉత్తర అడవి లోనికి దొర్లుకుంటూ పోయాయి.
ఆ
పెనుగులాట చప్పుడు గాల్లో కాస్సేపు ప్రకంపనలు సృష్టించింది.
ఆ
చప్పుడు ముగిశాక ఓ పిల్లాడు దక్షణ అడవి నుండి పరుగున బయటికి వచ్చాడు. పదిపన్నెండేళ్ళు
వుంటాయి వాడికి. ఒంటి మీద చొక్కాలేదు. కాళ్ళకు చెప్పులు లేవు. నడుముకు ఓ చిరిగిన నిక్కరు
లాంటిది వుంది.
సైనికుల విగ్రహాలను చూసి ఆ పిల్లాడు ఒక్కసారిగా
ఆగిపోయాడు. కాస్సేపు చేతులు కట్టుకుని మౌనంగా
నిలబడ్డాడు. నిదానంగా తలఎత్తి ఆ విగ్రహాల వైపు అనుమానంగా చూశాడు. లేత తాటి ముంజల్లా
వున్నాయి వాడి కళ్ళు. సైనికుల విగ్రహాలను చూస్తున్న భయం ఆ కళ్ళళ్ళో చాలా ప్రస్పుటంగా కనిపిస్తున్నది.
భయం ఈ యుగ లక్షణం. మనుషులు భయంలో పుట్టాలి.
భయంలో బతకాలి. మనిషిని చూసి మనిషి భయపడాలి. చివరకు భయంతో చనిపోవాలి.
అలా
స్థంభించిపోయిన ఆ పిల్లాడు తరువాత ఏమనుకున్నాడో
ఏమో ఒక్క ఉదుటున రోడ్డు దాటి అవతలకి పోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండ పులి దూరిన పొద లోనికి పరుగు తీశాడు.
పులి
గాండ్రింపు ఆ అడవిలో చాలా సేపు ప్రతిధ్వనించించి.
కొన్ని
నిముషాల నిశ్శబ్దం తరువాత పులికన్నా భీకరంగా శబ్దం చేస్తూ కొన్ని సైనిక వాహనాలు ఆ రోడ్డు
మీదుగా వెళ్ళాయి.
వాటిల్లో
వున్న సైనికుల ముఖాలు చాలా భయంకరంగా వున్నాయి.
వాళ్ళను
మనుషులంటే నమ్మడం కష్టం.
23
మే 2021, ఆదివారం.
No comments:
Post a Comment