Tuesday, 10 October 2023

Jagan Reddy - 1948 Police Action

 *కొందరు తమ అజ్ఞానాన్ని కూడ ధైర్యంగా ప్రకటించగలరు*

 

నేను ఒక వ్యాసం రాశాక ఒక ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటాను. అయినప్పటికీ అరుదుగా అయినా  కొన్ని అచ్చుతప్పులు వచ్చేస్తుంటాయి.  1948 పోలీస్ యాక్షన్ – మరో కోణం’లో సుందర్ లాల్ అని రాయాల్సిన చోట సుందర్ లాల్ బహుగుణ అని రాసేశాను. అది పొరపాటు. వెంటనే నా ఫేస్ బుక్ వాల్ మీద సవరణ ఇచ్చి నా పొరపాటును ప్రకటించాను. మేధోరంగంలో వున్నవారికి ఈ క్రమశిక్షణ, ఆత్మవిమర్శ  రెండూ వుండాలి.  

 

1948 పోలీస్ యాక్షన్ మీద నేను పాఠకుల్ని తప్పుదోవ పట్టించాననీ అరోపిస్తూ తాను కొన్ని వాస్తవాలను పాఠకుల ముందు పెట్టదలిచినట్టు ప్రకటించి ఇప్పుడు జగన్ రెడ్డి అనే ఒకాయన ముందుకు వచ్చారు.

 

స్వాగతం సారూ!

 

వారు నా వ్యాసంలో మూడు తప్పులు పట్టుకున్నారు.  

 

1.    మొదటి   ఆరోపణ :

సుందర్ లాల్ కమిటీ 30 వేల నుండి 40 వేల మంది పోలీస్ యాక్షన్ లో చనిపోయారని  చెప్పింది.  కానీ డానీ ఈ అంకెల్ని బాగా పెంచి చెప్పారు.  Exaggerate చేశారు అనేది వారి ఆరోపణ.

 

జే.ఎన్. చౌధరి నాయకత్వంలోనిపోలీసు యాక్షన్కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలకు చేరుకోవడానికి ముందే నిజాం సంస్థానంలో 3 వేలకు పది రెట్లకు పైగా ముస్లింలను అతి క్రూరంగా చంపేశారు”. అని నేను రాశాను.

 

“ ….. we can say at a conservative estimate that in the whole state  at least 27 thousand to 40 thousand people lost their life during and after the Police Actionఅని సుందర్ లాల్ కమిటి రాసింది.

 

 3 వేలకు పది రెట్లు అంటే 30 వేలు. 40 వేలను తగ్గించి 30 వేలు అని నేను రాయడం exaggerate చేయడం అని జగన్ రెడ్డి రాశారు.

 

ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు కూడ 40 వేల కన్నా 30 వేలు చిన్న సంఖ్య అని తెలుస్తుంది. మేధావి అయిన జగన్ రెడ్డిగారికి అది అతిశయోక్తిగా కనిపిస్తుంది!. లోకంలో కొందరు సాహస వీరులు వుంటారు. వాళ్లు తమ అజ్ఞానాన్ని కూడ చాలా ధైర్యంగా ప్రకటించగలరు. మీ ధైర్య సాహసాలని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాను జగన్ రెడ్డిగారూ!

 

2.    రెండవ  ఆరోపణ :

 

“తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముస్లింలు లేరు”

 

ఈ మేధావికి తెలియాల్సింది ఏమంటే తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు బందగి; ఒక ముస్లిం. చివరి అమరుడు; షోయబుల్లా ఖాన్. అతనూ ముస్లిమే. అతన్ని రజాకార్లు 1948 ఆగస్టు 22న హత్య చేశారు. దానితో, బూర్గుల రామకృష్ణారావు, కేవి రంగారెడ్డి ఢిల్లీ వెళ్ళి సైనిక చర్య తీసుకోవాలని నెహ్రూ-పటేల్ లను కోరారు. అప్పటికి పాకిస్తాన్ లో జిన్నా ఆరోగ్య పరిస్థితి బాగో లేదు. జిన్నా సెప్టెంబరు 11న చనిపోయాడు. అంత్యంక్రియలు జరిగిన రెండు రోజుల తరువాత  నెహ్రు సైనిక చర్యకు ఆదేశాలిచ్చాడు.

 

తొలి చివరి అమరులు ముస్లింలు అయినప్పుడు మధ్యలో ఎంతమంది వున్నారో లెఖ్ఖలు తీయాలి. ఆ పోరాటానికి మేధోసరోవరంగా పనిచేసిన కామ్రేడ్స్ అసోసియేషన్ లో అత్యధికులు ముస్లింలే; వేళ్ళ మీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ముస్లిమేతరులు వున్నారు. మన మేధావికి ఆ వివరాలు తెలిసినట్టు లేదు. కమ్యూనిస్టు పార్టి రాష్ట్ర కార్యాలయానికి మగ్ధుం మొహియుద్దీన్ పేరు ఎందుకు పెట్టారన్న చిన్న సందేహం వచ్చినా వీరికి చాలా విషయాలు తెలిసి వుండేవి.

 

 

3.    మూడవ ఆరోపణ

మరాఠా-నిజాం లాతూర్ ప్రాంతంలోనే ముస్లింలు పోలీస్ యాక్షన్ లో చనిపోయారు అనేది వీరి ఇంకో ఆరోపణ.

 

“కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలకు చేరుకోవడానికి ముందే నిజాం సంస్థానంలో జాతి హననం జరిగిందని నేను రాశాను. అప్పటి హైదరాబాద్ నగరం కూడ కమ్యూనిస్టుల పోరాటం లేని ప్రాంతమే. ఓసారి చార్మినార్ దగ్గరికి వెళితే  1948 Hyderabad Massacre వివరాలు ఇప్పటికీ తెలుస్తాయి.

 

ఇందులో ఈ మేధావి కొత్తగా చెప్పిందేమీటీ? నేను చెప్పిందే చెపుతారేమీటీ?  వీరికి తెలుగు అర్ధంకాదా?  

 

-      డానీ.

No comments:

Post a Comment