సుప్రీం కోర్టు రెండు స్థలాలనూ సొసైటికి అప్పచెప్పమని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సొసైటీకి ఒక స్థలాన్ని మాత్రమే అప్పగింగించి రెండో స్థలాన్ని ఇవ్వకుండ ఆపినప్ప్పుడే ఎవరికయినా 'దాల్ మే కుచ్ కాలా హై' అనే అనుమామానం రావాలి.
సుప్రీం కోర్టు అంతిమ తీర్పు వచ్చాక కూడ రెండో స్థలం గురించి ప్రభుత్వం మౌనంగా వుండిపోయిందంటే నా అనుమానం నిజమవుతున్నదన్న భయం పెరిగింది.
పేట్ బషీరాబాద్ స్థలాన్ని సాధించడానికి మనలో కొందరు విపక్ష రాజకీయ పార్టీలను తీసుకునివచ్చి సమస్యను జటిలం చేశారు. ఇది ప్రభుత్వమే మారాలనే వాదన వరకు వెళ్ళింది. ఇప్పుడు ఇళ్ళ స్థలాల కోసం ఏకంగా ప్రభుత్వాన్ని మార్చాలని కూడ కొందరంటున్నారు.
అది ఏ ప్రభుత్వం అయినా సరే దాని ముందు జర్నలిస్టులు అల్పజీవులు అనే ఎరుక ఎవరికీ లేకుండా పోయింది.
కొందరు ఆరోపిస్తున్నట్టుగా సొసైటీకి ప్రస్తుతమున్న పాలకవర్గం సరిగ్గా పనిచేయడం లేదనే అకుందాము. దానిని విమర్శించే వారు తాముగా ఇప్పటి వరకు సాధించింది ఏదైనా వుందా? వారి దగ్గర ఒక్కటంటే ఒక్క సృజనాత్మక ఆలోచన ఎవరికయినా కనిపించిందా?
అసైన్డ్ భూముల్లో ఒక కాల పరిమితి లోపు నిర్మాణాలు చేపట్టకపోతే అవార్డును రద్దు చేసే ఒక ఆప్షన్ ప్రభుత్వానికి వుంటుందనే కనీసపు ఎరుక కూడ లేకుండ కొందరు రెచ్చిపోతున్నారు.
తెలివైన వారెవరయినా ముందు చేతిలోవున్నదాన్ని భద్రపరచుకుంటారు. ఆ తరువాత రెండో దానికోసం ప్రయత్నిస్తారు.
రెండు యుధ్ధాలను ఒకేసారి గెలవాలనుకోవడం మంచి వ్యూహం కాదు. చేతికి కొత్తగా రావలసింది రాకపోగా చేతిలోవున్నది కూడ పోవచ్చు.
ఇప్పుడయినా నిజాంపేట్ లో హైరైజ్ అప్పార్ట్ మెంట్ల నిర్మాణానికి బిల్డర్ ని వెతకడం కామన్ మినిమమ్ ప్రోగ్రాం.
- డానీ
No comments:
Post a Comment