Tuesday 28 November 2023

Minugurulu - Book Review

పులుల్ని తరిమిన మేకల్ని చూశారా?

Have you seen the goats that drove away the tigers?

 

చల్లపల్లి స్వరూపరాణి

'మిణుగురులు' 

పుస్తక పరిచయ సభ  విజయవాడ

 

26 నవంబరు 2023 ఆదివారం,

టాగూర్ గ్రంధాలయం,  గవర్నర్ పేట, విజయవాడ

 

ఉషా ఎస్ డానీ

Speech Duration

20 - 25 minutes

 

INTRO

ఈ రోజు రాజ్యాంగ వతరణ దినోత్సవం

వేదిక మీదున్న మిత్రులకు, వేదిక ముందున్న మిత్రులకు

రాజ్యాంగ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

 

చల్లపల్లి స్వరూపరాణి రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకునే తన ‘మిణుగులు పుస్తక పరిచయ సభను ఈ రోజు పెట్టుకున్నట్టున్నారు. నేనూ అంబేడ్కర్ ను స్మరిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను.

 

అంబేడ్కర్ – ఆధునిక విద్య – సాంఘీక సంస్కరణ

సమాజంలోని అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఆధునిక విద్య ఒక ముఖ్యమైన సాధనంగా బిఆర్ అంబేడ్కర్ చాలా బలంగా భావించాడు. ఆధునిక విద్య ద్వార అబ్బే విమర్శనాత్మక ఆలోచనలతో సామాజిక సంస్కరణను కూడ సాధించవచ్చని నొక్కి చెప్పారు.

 

"Education should be used as a tool to bring about intellectual independence in the people.

They must learn to think for themselves. They must not be taught to imitate any authority, however great."

 

"అణగారిన ప్రజలలో మేధో స్వాతంత్ర్యం తీసుకురావడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించాలి. వారు తమ గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. ఎంత గొప్ప అధికార పీఠాన్ని అయినా అనుకరించకూడదని వారికి బోధించాలి"

 

చల్లపల్లి స్వరూప రాణిగారిని ... ఈ సందర్భంలో వారిని ఆధునిక విద్య రీత్యా   ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూప రాణి అనాలి. వారిని  చూసినపుడు అంబేడ్కర్ కలని సాకారం చేస్తున్నారు అనిపిస్తుంది.

 

ఎండ్లూరి సుధాకర్, గుంటూరు లక్ష్మీనరసయ్య, జీలుకర శ్రీనివాస్, పసునూరి రవీందర్ తదితరులు కూడ ఈ కోవలోనికి వస్తారు.

 

ఆధునిక విద్య – సామాజిక పెట్టుబడి.

ఆధునిక విద్యవల్ల జ్ఞాన విజ్ఞానాలు పెరగడం మాత్రమేగాక ఆధునిక సంస్కారం కూడా పెరుగుతుంది. తద్వార  సామాజిక పెట్టుబడి కూడ పెరుగుతుంది. అప్పుడు ఇతర సామాజికవర్గాలతో సంపర్కం కూడ విస్తరిస్తుంది. అప్పుడు అత్యంత సహజంగానే వారి మధ్య కులాంతర వివాహాలూ జరుగుతాయి. కులాంతర వివాహాలు విస్తృతంగా జరిగేకొద్దీ కులం బలహీనపడడం మొదలవుతుంది. ఈ సూత్రాన్ని మతాంతర వివాహాలకు కూడ అన్వయించవచ్చు.

 

సయ్యద్ అహ్మద్ ఖాన్ – ఆంగ్ల విద్య

Syed Ahmad Khan (17 October 1817 – 27 March 1898)

 ముస్లిం సమాజ ఆధునిక  సంస్కర్తగా భావించే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడ “ఆంగ్ల విద్యను నేర్చుకోకుంటే భారత ముస్లింలు మట్టికొట్టుకుపోతారు అని హెచ్చరించాడు.  ఆయనే ఆలిగడ్ ముస్లిం యూనివర్శిటీని ఆరంభించారు.

 

మహాత్మా ఫూలే

Jyotirao Govindrao Phule (11 April 1827 – 28 November 1890)

సయ్యద్ అహ్మద్ ఖాన్ సమకాలీనుడయిన జోతిబా ఫూలేకు కూడ ఇంగ్లీషు భాష మీద ఒక నమ్మకం వుండేది.

ఇంగ్లీషు చదువులవల్ల కుల వివక్షను తగ్గించవచ్చు, అధిగ మించనూ వచ్చు అని ఆయన గుర్తించాడు.

 

*చరిత్రను తిరగరాసిన బలహీనవర్గాల మహిళలు*

 

1.            బలహీనవర్గాల మహిళల జీవితాలను పరిచయం చేస్తూ  స్వరూప రాణి రాసిన వ్యాసాల సంకలనం ఇది.

2.            గడిచిన మూడేళ్ళలో వారు రాసిన 26 వ్యాసాలు ఇందులో వున్నాయి. 

3.            తామూ మనుషులమేనని వ్యక్తం చేసుకోవడానికి వాళ్లు పడ్డ కష్టాలని చూస్తుంటే కళ్ళు చెమర్చుతాయి. వాళ్ళ సాహసాన్ని చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వాళ్ళ విజయాలను వింటుంటే ఒళ్ళు పులకరించి పోతుంది. 

 

బలహీనవర్గాల చరిత్ర రచన ఎంతకష్టం

1.     మనదేశంలో పెత్తందారీ కులాల చరిత్రను రాయడం సులభం. వాళ్ళ చరిత్రే మన పాఠ్య పుస్తకాల్లో వుంటుంది. ఎందుకంటే వాళ్ళ చరిత్రే మనకు అందుబాటులో వుంటుంది.

 

2.     బలహీనవర్గాల చరిత్రను రాయడం చాలా కష్టం. వాళ్ల చరిత్ర మనకు అందుబాటులో వుండదు.

 

3.     అందులోనూ బలహీనవర్గాల మహిళల చరిత్రను రాయడం మరీ మరీ కష్టం.

 

4.                               “ఈ దేశంలో మనుషులేకాదు మనుషుల చరిత్ర కూడ అంటకుండా పోయింది అనే వాక్యంతో అరుణాంక్ లత ముందు మాట ఆరంభించాడు. అది నిజం.

 

*మా నాయనమ్మ వితంతు పునర్వివాహం – కందుకూరి వీరేశలింగం*. 

1.     మా కుటుంబంలో జరిగిన ఒక ముఖ్య ఘటనను ఇప్పుడు మీతో పంచుకోవాల్సిన అవసరం వుంది.

2.     మా తాతగారికి ముందు పెళ్ళయింది. మా నాయనమ్మకు కూడ ముందు పెళ్ళయింది.

3.     మా తాతగారికి పిల్లలున్నారూ; మా నాయనమ్మకూ పిలల్లున్నారు.

4.     కలరా వచ్చి మా తాతగారి మొదటి భార్యా, మా నాయనమ్మ మొదటి భర్త చనిపోయారు.

5.     ఇద్దరూ సమీపబంధువులు. ఓ ఆరు నెలలు పోయాక పెద్దలు ఇద్దరికీ కలిపి పెళ్లి చేశారు. ఇది 1920లలో జరిగింది.

6.     అలా మా పెదనాన్న, మా నాన్న, మా బాబాయి పుట్టారు.

7.     మా తాతగారి మొదటి భార్య పిల్లలు, మా నాయనమ్మ మొదటి భర్త కొడుకు, వాళ్లిద్దరికి పుట్టిన సంతానం అంతా కలిసే వున్నారు. ఇది మా కుటుంబ కథ. మా ఇంట్లో  సాంప్రదాయం.

8.     అయినా కందుకూరి వీరేశలింగం పంతులుగారు వితంతవు పునర్ వివాహాలు జరిపించారని క్లాసులో మాస్టారు చెపుతుంటే అదో ఒక మహత్తర విషయంగా మైమరచి వినేవాళ్లం.

9.     దీనికి రెండు అర్ధాలున్నాయి. 

10.   మా సంస్కరణల గురించి మాకే తెలియనివ్వలేదు.

11.   అగ్రవర్ణాల సంస్కరణలే సంఘ సంస్కరణలుగా మాకు బోధించారు.

12.   ‘ఆంధ్రదేశంలో  సంఘ సంస్కరణోద్యమాలు అని 1986లో  వకుళాభరణం  రామకృష్ణ ఒక పరిశోధన గ్రంధాన్ని ప్రచురించారు. అందులో శూద్రుల సంస్కరణల గురించి వుండదు.  ముస్లింల సంస్కరణల గురించి వుండదు.

13.   మీకు తెలిసిందే రాయండి; తెలియనివి తెలియనట్టు ప్రకటించండి. అంతేకానీ, ఆంధ్రదేశం, భారత దేశం అంటూ మీ శక్తికి మించిన శీర్షికల్ని మీ  పుస్తకాలకు పెట్టకండి.

14.   మీకు తెలియని ప్రపంచం కూడ ఒకటి వుందనే స్పృహతో మెలగండి.

 

*మిణుగురులు ఒక చెంప దెబ్బ*

1. ఎస్టీ, ఎస్సీ, బిసి,   మత మైనారిటీ సమూహాల్లో సాగిన సాంఘీక సంస్కరణల్ని గుర్తించనివారికి మిణుగురులు ఒక చెంప దెబ్బ. 

 

*సాహిత్య ప్రయోజనం*

 

కళ్ళు వుండడం వేరు; ప్రపంచాన్ని చూడడంవేరు.  

కళ్ళు వున్నంత మాత్రాన మనుషులు ప్రపంచాన్ని చూస్తున్నారని అనుకోకూడదు.

మనుషులు అనేక పరిమితులతో ప్రపంచాన్ని చూస్తుంటారు.

ఈ సంకుచితత్వానికి కారణాలు వాళ్ళకు తెలిసి వుండవచ్చు; తెలియకనూ వుండవచ్చు.

ఆర్ధిక పునాది మాత్రమేగాక, కులం, మతం, లింగం, భాష, ప్రాంతం,  రాష్ట్రం, దేశం, ప్రాపంచిక దృక్పథం తదితర అనేక భౌతిక, సాంస్కృతిక అంశాలు మన చూపు పరిధిని పరిమితం చేస్తుంటాయి.

మనకు వారసత్వంగా వచ్చిన భావజాలాలూ, మనం ఇష్టంగా ఎంచుకున్న భావజాలాలు మనం అభిమానించే రాజకీయ పార్టీల విధానాలు సహితం మన చూపును నియంత్రిస్తుంటాయి.

మెదడుకు ఇన్ని పరిమితులు, ఆలోచనలకు ఇన్ని కళ్ళద్దాలు వుండబట్టి  కళ్ళ ముందున్న వాటిని కూడా తరచూ మనం చూడలేం.

అలాంటి అనేక అంశాలను సాహిత్యం భూతద్దం పెట్టి,  ఒక్కోసారి సూక్ష్మదర్శినిలో పెట్టి మనకు చూపిస్తుంది.

సాహిత్యంవల్ల మనకు వర్తమానం, గతమేగాక కొంచె తరచి చూస్తే భవిష్యత్తు కూడ కనిపిస్తుంది.

 

 * మనం గమనించని ఒక కొత్త సమాజాన్నిమిణుగురులుతో ప్రపంచానికి చూపెట్టారు స్వరూపరాణి *. 

 

ప్రత్యామ్నాయ చరిత్ర పరిశోధనలు (Subaltern Studies)

1.            మేకలు తమ చరిత్రను తామే రాసుకోనంత వరకు లోకంలో పులుల చరిత్రే చెలామణిలో వుంటుంది.

2.            సాంప్రదాయ చరిత్ర రచన (Historiography)  మీద 1980లలో ఒక పెను మార్పు వచ్చింది.

3.            నాణేనికి మరోపక్క కూడ వుంటుందని రంజిత్ గుహ, దీపేష్  చక్రవర్తి, సుమిత్ సర్కార్ తదితరులు ప్రత్యామ్నాయ చరిత్ర పరిశోధన (Subaltern Studies) ఉద్యమానికి నాందీపలికారు.

4.            దీనితో చరిత్రను పునర్ నిర్వచించాల్సి వచ్చింది.

 

మేము సహితం చరిత్రను నిర్మించాం

అల్లూరి శ్రీరామరాజుతో మన్యం పొరాటాలు మొదలు కాలేదనీ, ఆయనకు వందేళ్ళ ముందు నుండే అక్కడ కోయ, కొండరెడ్లు పోరాడుతున్నారనీ,

కమ్యూనిస్టు పార్టీల నుండి మైనారిటీ వాదం పుట్టుకురాలేదనీ దానికీ అంతకు ముందే పునాదులున్నాయని కొత్త చరిత్ర ముందుకు వచ్చింది.

స్త్రీవాదమూ అంతే.  ఇరవయ్యవ శతాబ్దం తొలినాళ్ళలోనే మేము సహితం చరిత్రను నిర్మించాం (We also made history) అని తన ముందుమాటలో గుర్తు చేశారు చల్లపల్లి స్వరూపరాణి. 

 

నంగేళీతో ఆరంభం

దక్షణ మధ్య కేరళలో స్త్రీ ఉద్యమానికి తొలి నాయకి నంగేళి.

ఆమె తన రొమ్ములు కోసుకుని ధిక్కార వాచకం పలికింది.

దానికి ఇప్పుడు అధికారిక ఆధారాలు దొరుకుతాయా? అప్పుడు చరిత్రను రాసినవారు దీన్ని నమోదు చేస్తారా? అలాంటప్పుడు చరిత్ర పరిశోధన ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సి వుంటుంది.  

 

* సయ్యద్ అహ్మద్ ఖాన్ – కార్ల్ మార్క్స్ - ఫూలే - ఫాతిమా షేక్ *

 

ఇటీవలి కాలం వరకు ముస్లిం సమాజం మీద ఒక అపవాదు వుండేది. 

ముస్లింలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనరూ అని.

CAA, NRC, NPA లకు వ్యతిరేకంగా ముస్లిం స్త్రీలు షాహీన్ బాగ్ ఉద్యమాన్ని చేపట్టి రాజధాని నగరాన్ని  దిగ్బంధించి  ఆచరణాత్మకంగా ఈ అపవాదును తిప్పికొట్టారు. 

ఆ తరువాత సాగిన రైతు ఉద్యమం “తమకు స్పూర్తి నిచ్చిన తల్లి షాహీన్ బాగ్ ఉద్యమం” అని కొనియాడింది.

 

*భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాటం మొదలు ఇప్పటి వరకు

ముస్లింల భాగస్వామ్యంలేని పోరాటాలు ఉద్యమాలు వున్నాయా?*

 

కార్ల్ మార్క్స్ (5 May 1818 – 14 March 1883) లండన్ లో నిలబడి 1848లో కార్మికులకు రాజ్యాధికారం కావాలన్నాడు.

అదే సమయంలో జోతిబా ఫూలే పశ్చిమ ఇండియాలో నిలబడి శూద్రులకు రాజ్యాధికారం కావాలన్నాడు.

అప్పటికి అంటరానివారిగా భావిస్తున్న శూద్రులకు విద్య నేర్పించడానికి జోతిబా ఫూలే పక్కన నిలబడింది ముస్లిం మహిళ ఫాతిమా షేక్.

సరిగ్గా అప్పుడే ఉత్తర భారత దేశంలో సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలను మళ్ళీ ప్రధాన స్రవంతి లోనికి తేవడానికి కృషి చేస్తున్నాడు.

 

ఎక్కడి నుండి ఎక్కడికి ఎంత పెద్ద కాన్వాస్ వుందో చూడండి.

ప్రపంచ గమనంలో భాగం కావడం అంటే ఇదే.

 

కత్తి చల్లమ్మ  (1915-1980)

 

ఇంకా చాలా మంది గురించి మాట్లాడాలి. సమయం లేదు. అయినా  కత్తి చల్లమ్మ గురించి మాట్లాడకుండ ముగించలేను.

 

ముస్లిం సమాజాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం వుమ్మడి పౌర స్మృతిని (యూసిసి) చట్టంగా  చేస్తున్నట్టు ప్రకటించింది. దీనిని ముస్లింలకన్నా అటవీ ప్రాంతాల్లోని తెగలు ఎక్కువగా వ్యతిరేకించాయి. ఝార్ఖండ్ కేంద్రంగా మొదలయిన ఉద్యమం అటు మిజోరం, మణిపూర్, నాగాలాండ్ లకు ఇటు ఒరిస్సా ఛత్తీస్ గడ్ లకు విస్తరించింది.

 

మనకు గుర్తుంటే, 1857 సంగ్రామానికి ముందే బ్రిటీష్ పాలన మీద తిరుగబడింది ఇప్ప్పటి బీహార్, జార్ఖండ్, బెంగాల్ ప్రాంతపు సంతాలీలు. సిధ్ధు, కానూ, చాంద్, భైరవ్  దానికి నాయకత్వం వహించారు.

 

ముస్లింలు ఆదివాసుల్ని తార్గెట్ చేసుకున్న బ్రిటీష్ పాలకులు అప్పటి నుండి బ్రిటీష్ పాలకులు ముస్లింలు ఆదివాసుల్ని టార్గెగా పెట్టుకున్నారు. కొన్ని తెగలనయితే The Habitual Offenders (Habitual Criminals) Act of 1871 కింద చేర్చారు. అలాంటి వాటిల్లో యానాదులు ఒకరు.

 

యానాది సమాజం నుండి వచ్చి న్యాయవాదిగా మారి వెన్నెలకంటి రాఘవయ్యతో కలిసి   Offenders (Habitual Criminals) Act of 1871 రద్దు కోసం పోరాడడం అంత సామాన్యమైన విషయం కాదు. కత్తి చల్లమ్మ ఒక చరిత్రను సృష్టించింది.

 

నాకు యానాది సమూహాలతో ఒక అనుబంధం వుంది. ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్య అధ్యక్షునిగా వున్న కాలంలో ‘యానాది సంఘాల సమాఖ్యను ప్రారంభించి నెల్లూరులో మహాసభ నిర్వహించాను. అదొక రికార్డు అని అప్పుడు నాకు తెలీదు. ఓ ఐదేళ్ళ క్రితం హైదరాబాద్ లో సంచార జాతుల సభ జరిగింది. దానికి నన్నూ స్పీకర్ గా పిలిచారు. నన్ను పరిచయం చేస్తూ యానాదులకు తొలి సమాఖ్యను పెట్టిన వారు అన్నారు నిర్వాహకులు. చాలా ఆనందం వేసింది.

 

*Sign Off / ముగింపు*

ప్రసంగానికి సమయాభావం కూడ వుంటుంది కనుక సకాలంలో ముగించాలి.

 

అణగారిన సమూహాలకు చెందిన మహిళలు చాలామంది వున్నారు.

ఈ పుస్తకంలో 26 మంది గురించే వుంది.

మిగతావారి గురించి కూడ స్వరూపరాణి రాయాలి.

వారు తన పరిశోధనలు కొనసాగిస్తారని నమ్ముతాను.

 

*మినుగురులు అనడం అండర్ స్టేట్మెంట్*

 

చరిత్రను తిరగరాసిన  మహిళల్ని ‘మిణుగురులుఅనడం అండర్ స్టేట్మెంట్.

వాళ్లు అగ్ని జ్వాలలు.

 

వారిని వెలుగు లోనికి తెచ్చిన చల్లపల్లి  స్వరూపరాణికి అభినందనలు.

నా ప్రసంగాన్ని ఓపిగ్గా విన్న మీ అందరికీ ధన్యవాదాలు

 

//EOM//

పుస్తకం పేరు : మిణుగురులు, వ్యాససంకలనం

రచయిత్రిచల్లపల్లి స్వరూపరాణి,

ప్రచురణకర్తలు : పర్ స్పెక్టివ్  - ప్రచురణ :   అక్టోబరు 2023  

ముందుమాట : అరుణాంక్ లత

No comments:

Post a Comment