Monday, 29 July 2024

Notes on man and women relations.

 స్త్రీ పురుష సంబంధాల మీద  ఇప్పుడు అనేక  దృక్పథాలున్నాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒక జీవితకాల బంధం అనేది సాంప్రదాయ  భూస్వామ్య వివాహ వ్యవస్థ నిర్వచనం. దీనిని జన్మజన్మల బంధంగా కొన్ని మత శాస్త్రాల్లో చిత్రించారు.

ఆధునిక కాలంలో భూస్వామిక బంధాలు ఏమాత్రం నిలబడవు.  పాతివ్రత్యానికీ, ఏకపత్నీవ్రతానికీ పునాదులు బలహీనపడిపోతున్నాయి. 

ఫలితంగా సమాజంలో నాలుగు రకాల పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. 

మొదటిది; విడాకులు తీసుకునేవారు క్రమంగా  పెరిగిపోతున్నారు.

రెండోది; చట్ట ప్రకారం విడాకులు తీసుకోవడం కుదరనివాళ్ళు పేరుకు భార్యా భర్తలుగా వుంటూ విడివిడిగా జీవిస్తున్నారు.    

మూడోది; పెళ్ళి బంధం- బాధ్యతలు లేని సహజీవనాలు పెరుగుతున్నాయి.   

నాలుగోది; కొత్త తరాలకు వివాహ వ్యవస్థ మీద  ఆసక్తి తగ్గిపోతున్నది. 

పెళ్ళీ కావల్సిన వయస్సుల్లో వివాహబంధంలో లేనివారు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 35- 40 శాతం మంది వున్నారు. ప్రతి ఏటా ఈ శాతం చాలా వేగంగా పెరుగుతోంది.

కమ్యూనిస్టు సిధ్ధాంతం భూస్వామ్య వివాహ బంధానికి వ్యతిరేకం. ఈ విషయాన్ని కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టోలోనే చెప్పాడు. స్వేఛ్ఛాయుత ప్రేమను ఆయన ప్రతిపాదించాడు.

నేను బాల్యం నుండీ వివాహేతర సంబంధాలను చాలా విరివిగా చూస్తున్నాను. కేవలం కామం /సెక్స్  కోసం మాత్రమే వివాహేతర సంబంధాలు ఏర్పడతాయనే అభిప్రాయం నాకు ఎప్పుడూ లేదు. వివాహేతర సంబంధాలను అచ్చంగా అనైతిక వ్యవహారంగా నేనేమీ అనుకోను. 

కొన్ని సందర్భాలలో కొందరికి కొందరి సమక్షంలో సన్నిహితంగా వుండడం చాలా బాగుంటుంది. ఆ ఇష్టం ఆ తరువాత సంభోగ బంధంగానూ మారవచ్చు. 

వివాహేతర సంబంధీకులకు ఆశ్రయం కల్పించడం, షెల్టర్ ఇవ్వడం మంచి పని అని భావించేవాళ్ళ సంఖ్య కూడ ఇప్పుడు సమాజంలో  పెరుగుతున్నది.  ఇదొక కొత్త వాల్యూ సిస్టం. ఇది మన పరిసరాల్లోనూ వచ్చేసింది.  భర్త వుండగానే మరో వ్యక్తితో బాహాటంగా వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నవారు కొందరు మనకు సన్నిహితులుగానూ వుంటున్నారు. 

No comments:

Post a Comment