Danny
Notes
27 May
2013
చేసిన పాపము ఊరకపోదు
ఛత్తీస్ గడ్ లో తను చేసిన ’కర్మ’ లకు ఒకడు చనిపోయాడు. దానితో దేశంలోని అధికార పక్షాలు, ప్రతిపక్షాలు ముక్త
కంఠంతో, అహింసామార్గం గురించీ, భారత రాజ్యాంగం
గురించీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి,
వాళ్లకే తెలియని ఆదర్శాలు వల్లె వేస్తున్నాయి. కొందరైతే, బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన
రాజ్యాంగం అని మరీ గుర్తుచేస్తున్నారు. కానీ, ఆ చనిపోయినవాడు జీవితంలో ఒక్కసారైనా అహింసా సూత్రాల్ని ఆచరించాడా? భారత రాజ్యాంగాన్ని
గుర్తించాడా? కనీసం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలనైనా పాటించాడా? అనే అనుమానం మాత్రం
ఒక్కరికీ వచ్చినట్టులేదు.Danny Notes
27 May
2013
ఎమర్జెన్సీకి వారసుడొచ్చాడు
"మా అమ్మ సోనియా గాంధీకి సహనం ఎక్కువ. నేను మా నాయనమ్మ ఇందిరాగాంధి ఒళ్ళో పెరిగినవాడిని" - రాహుల్ గాంధి.
("మా అమ్మ సోనియా గాంధీకి సహనం ఎక్కువ. మంత్రుల అవినీతి బయటపడిపోతే రాజీనామాలతో
సరిపెట్టింది. అదే మా నాయనమ్మ ఇందిరాగాంధి అయితే విపక్షాలు విమర్శలకు దిగినప్పుడు ఏకంగా
ఎమర్జెన్సీ పెట్టేది. నాది ఇందిరాగాంధి తత్వం")
Danny Notes
27 May 2013
ఉద్యమం - లాబీయింగ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి.
ఒకటి ఉద్యమమార్గం; రెండు లాబియింగ్ మార్గం.
Danny Notes
27 May 2013
భిన్నత్వంలో ఏకత్వం
కల్వకుంట చంద్రశేఖర రావు, లగడపాటి రాజగోపాల్ ఇద్దరూ రాజకీయాల్లో బద్ద శత్రువులుగా
కనిపిస్తారు. నిజానికి ఇద్దరి రాజకీయ విధానాలూ ఒక్కటే. కెసిఆర్ ఢిల్లీలో లాబీయింగ్
చేసి, తెలంగాణ తెద్దామనుకుంటారు. మరోవైపు లగడపాటి కూడా ఢిల్లీలో లాబీయింగ్ చేసి తెలంగాణను
అడ్డుకోవాలనుకుంటారు.
Danny Notes
27 May 2013
Danny Quotes
26 May 2013
పాఠకుల్ని రెచ్చగొట్టడంకన్నా రచయిత చేసే గొప్ప పని మరొకటి ఏమైనా వుంటుందా?
No comments:
Post a Comment