డానీ నోట్స్
4 ఫిబ్రవరి 2014
ఎన్టీవి అనుబంధం
N-TV
లో గత ఐదున్నరేళ్ల
కొలువును అద్భుతంగా ఆస్వాదించా. ’మధురవాణి ముచ్చట్లు”, ’లల్లూ బ్రదర్స్”, ’నా వార్తలు నా ఇష్టం’ మూడూ కలిపి రెండు వేల ఎపిసోడ్ల వరకు రాశాను. మనకు రాసే
నైపుణ్యం వున్నా, రాసే ఆవకాశం రావడం మహత్తర విషయం. ఆ అవకాశం కల్పించిన NTV యాజమాన్యానికి ధన్యవాదాలు.
నన్ను ఎంతగానో ప్రోత్సహించిన
డైరెక్టర్ రమాదేవి మేడంగారికీ, ఛైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరీ గారికి, దివంగత బీఎల్
రావుగారికీ కృతజ్ఞతలు. నన్ను రచనా టెలివిజన్ లో అవకాశం ఇచ్చిన ఓల్గా గారికి
ప్రత్యేక ధన్యవాదాలు!
NTV లో నా విజయాలన్నీ సంపూర్ణంగా నావికావు; మా బృందానివి. మా క్రియేటివ్ హెడ్ అడవి శ్రీనివాస్, క్యారికేచరిస్టు
స్యూర్య, యానిమేటర్ శివ, వీడియో ఎడిటర్లు శ్రీనివాసరెడ్డి, రవి, మిమిక్రీ
ఆర్టిస్టులు భవిరి రవి, అయ్యంగారి వసంతలక్ష్మి తదితరులకూ, నా మూడు కార్యక్రమాల్ని ఇన్నాళ్ళూ పర్యవేక్షించిన ఎడిటర్ వీఎస్ ఆర్ శాస్త్రి గారికీ bbb కృతజ్ఞతలు.
నేను బయటికి రావడానికి
ప్రత్యేక కారణాలు ఏమీలేవు. ఈ మధ్య నాలోని రచయిత తీవ్ర అసంతృప్తితో వున్నాడు; వాడికి
కొన్ని రచనలు చేయడం ఇష్టంలేదు. కొన్ని వాతావరణాలు పడడంలేదు. నాలాగ వాడికీ శ్వాసనాళవ్యాధి
వుంది. వాడిని సంతృప్తిపరచడం కూడా నా బాధ్యత కదా! అంతే. అంతకు మించి మరేమీలేదు!
O great sir miru.
ReplyDelete